పిజ్జా, బర్గర్‌లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు పదేపదే యువతను హెచ్చరిస్తుంటారు. అదీగాక పిజ్జా, బర్గర్‌లాంటివి ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే సమస్య ఎక్కువ కూడా. కానీ ఈ వ్యక్తికి పిజ్జాలంటే విపరీతమైన పిచ్చి. అతనికి అవంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. రోజంతా పిజ్జా ఉంటే చాలు వాటితోనే లంచ్, డిన్నర్‌లు కానిచ్చేస్తాడు మనోడు. ఇలా ఆరేళ్లుగా లాగించేస్తున్నాడట పిజ్జాలని. మరీ ఇంతలా తింటున్నాడు కదా అతడి ఫిట్‌నెస్ ఎలా ఉంటుందా..? అనే కదా సందేహం. అతడెలా ఉంటాడంటే..?
అమెరికాకు చెందిన కెన్నీ వైల్డ్స్‌కి పిజ్జా అంటే మహా ఇష్టం. ఈ ఇటాలియన్ వంటకం అంటే కెన్నీకి ఎంతగా ఇష్టమంటే కనీసం రోజులో ఒక్కస్లేసు పిజ్జా లేకుండా గడవదు. అంతేగాదు అతడు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో పిజ్జా ఉంటే చాలు హాయిగా దానితోనే గడిపేస్తాడు. అతనికి అది అస్సలు బోరుగా అనిపించందట. ఈ విషయంలో అతడి భార్య కూడా సపోర్ట్ చేయడం విషయం. ఆమె కూడా అతడికి ఇష్టమైన పిజ్జాలు అతడి భోజనంలో ఉండేలా చూస్తుందట.
ఆఖరికి ఆఫీస్‌లో కూడా పిజ్జాలు ఉండాల్సిందేట. చాలామంది తనలా పిజ్జాలు ఇంతలా తినలేరని ఛాలెంజ్ విసురుతున్నాడు కూడా. అంతేగాదు ఇన్‌కేస్ ఏదైనా కారణం చేత కేఫ్‌లు క్లోజ్ అయితే తన ఇంటికి చాలా దూరంలో ఉండే కేఫ్‌లు వద్దకు వెళ్లి మరీ పిజ్జాలు తింటాడట. ఇంతలా పిజ్జాలు లాగించేస్తున్న కెన్నీ చూడటానికి మాత్రం అ స్సలు లావుగా ఉంటాడు.
మంచి స్మార్ట్‌గా ఫిట్‌నెస్‌గా కనిపిస్తాడు. ఇలా అతడు ఆరేళ్ల నుంచి పిజ్జాలను పిచ్చి పిచ్చిగా తినేస్తున్నా.. తాను ఫిట్‌గా హెల్తీగా ఉన్నానని ధీమాగా చెబుతున్నాడు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవట. వినడానికి చాలా ఆశ్చర్యం ఉంది కదూ!. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న నానుడి ఇతడి విషయంలో పనికిరానిదిగా ఉంది కదా..!.
నచ్చిందని అతిగా తింటే శరీరం అంగీకరించక పలు సమస్యలు రావడం జరగుతుంది. ఇతడి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం అనేది నమ్మలేని నిజంలా ఉంది. కొన్ని సర్వేల్లో కూడా మనిషి ఇష్టమైన ఆహారం ఆరోగ్య రీత్యా సరిపడనిది అయినా ఏం చేయదని విన్నాం. బహుశా ఇదే కెన్నీ విషయంలో జరుగుతుందేమో..!.
(చదవండి: వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment