Broccoli
-
సాయంత్రం స్నాక్స్ కోసం బ్రకోలితో మఫిన్స్ ట్రై చేయండి
బ్రకోలి మఫిన్స్ తయారీకి కావల్సినవి: బ్రకోలి తరుగు – కప్పు; ఎర్రక్యాప్సికం – ఒకటి; క్యారట్ – ఒకటి; ఉల్లిపాయ – ఒకటి; గుడ్లు – ఎనిమిది; ఛీజ్ – ముప్పావు కప్పు; ఉప్పు – టీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; తయారీ విధానమిలా: క్యాప్సికం, ఉల్లిపాయ, క్యారట్‌ను సన్నగా తరగాలి ∙పెద్ద గిన్నెలో బ్రకోలి తరుగు, క్యారట్, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలను వేసి చక్కగా కలపాలి. ఈ ముక్కలను మఫిన్ ట్రేలో సమానంగా వేసుకోవాలి ∙ఇప్పుడు గుడ్లసొనను ఒకగిన్నెలో వేసి, ఉప్పు, మిరియాల పొడి పోసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి మఫిన్ ట్రేలో వేసిన బ్రకోలి మిశ్రమంపై గుడ్లసొనను పోసుకోవాలి ∙అన్నింటిలో పోశాక ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే బ్రకోలి మఫిన్స్ రెడీ. -
Health Tips: అలర్జీలు, ఆస్తమాను తగ్గించే ఆహారాలు ఇవే! టొమాటో, బ్రాకలీ ఇంకా
Winter Season: Asthma Diet Tips By Doctor What To Eat In Telugu: చలికాలం వచ్చిందంటే చాలు.. అలర్జీ, ఆస్తమా బెడద ఎక్కువవుతుంది. నిజానికి ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరు కాదు. ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. మనకు ఏదైనా మనకు సరిపడని పదార్థం లోనికి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ! ఈ క్రమంలో ఒక్కోసారి... దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. మరి చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించే ఆహారాలు, వంట ప్రక్రియల గురించి తెలుసుకుందాం! అలర్జీ.... ఆస్తమాగా ఎప్పుడు మారుతుందంటే...? అలర్జీతో తొలుత ఏమవుతుందో అర్థం చేసుకోడానికి కళ్లను ఉదాహరణగా తీసుకుందాం. కళ్లలో దుమ్ముపడితే ఎర్రబారి, నీళ్లుకారినట్టుగా... నులుముకోవాలన్నంత దురదలాంటి ఫీలింగ్ వచ్చినట్లుగానే... సాధారణంగా అలర్జీ కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న అప్పర్ ఎయిర్వేలోనూ అక్కడి సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. స్రావాలు వెలువడతాయి. ముక్కు , కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట పెట్టడం వంటివి కనిపిస్తాయి. ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికి మాత్రమే అలర్జీ పరిమితమైనప్పుడు దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు. అదే అలర్జీ తీవ్రతరమై లోవర్ ఎయిర్‌వేస్‌తో పాటు ఊపిరితిత్తులూ, గాలిగదులు ఎర్రబారడం... గాలి పీల్చుకునే నాళాలు (బ్రాంకై) వాచి, బాగా సన్నబారిపోయి శ్వాసతీసుకోవడం కష్టం అయ్యే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో ఊపిరి అందని ఆయాసపడే స్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే... అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. అప్పుడు ఆస్తమాకు గురైన వారి శరీరం నీలంగా మారిపోయి, వారు స్పృహ కోల్పోయే పరిస్థితి రావచ్చు. అలర్జీ / ఆస్తమా చికిత్స : ►అలర్జీ అయినా, ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కూ, ‘ఇరిటెంట్స్’కు దూరంగా ఉండటం మేలు. అలర్జీకి చికిత్సగా మందులు వాడాల్సి వస్తే... దాని తీవ్రతను తగ్గించేందుకు యాంటీ హిస్టమైన్స్, మాంటెలుకాస్ట్ లాంటి మందులు వాడతారు. ఇక ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని అరికట్టే ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడటం తెలిసిందే. కొందరు ఈ ఇన్హేలర్స్ హానికరం అనుకుంటారుగానీ అవి పూర్తిగా సురక్షితమైనవి. ►ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలూ అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ను తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు. ►అలర్జీల విషయానికి వస్తే ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి తోడు అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలూ విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండకపోవచ్చు. అయితే అవి తీవ్రమైన ఆస్తమాతో బాధపడే కొందరిపైన ప్రభావపూర్వకంగానే పనిచేస్తాయి. అలర్జీలు / ఆస్తమాను తగ్గించే ఆహారాలు ►టొమాటో ►కాలీఫ్లవర్ ►బెల్‌పెప్పర్స్ ►బ్రాకలీ ►కివీ ఫ్రూట్స్, ►స్ట్రాబెర్రీలు ►అయితే నిమ్మజాతి పండ్లు సాధారణ వ్యక్తుల్లో అలర్జీలను తగ్గించి, ఆస్తమా వంటి వాటిని ఎదుర్కొనేలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే కొందరికి నిమ్మజాతి పండ్లలో ఉండే పులుపుతోనే అలర్జీ వస్తుంది. అదే ఆస్తమాను ప్రేరేపిస్తుంది. అలాంటివారు మాత్రం నిమ్మజాతి పండ్లకు దూరంగా ఉండాలి లేదా చాలా పరిమితంగా తీసుకోవాలి. అలర్జీలు / ఆస్తమాను తగ్గించే వంట ప్రక్రియలు ఆయిలీ ఫుడ్స్, నూనెలో బాగా వేయించే వేపుళ్లు (డీప్ ఫ్రైడ్, రోస్టెడ్) పదార్థాలు, మసాలాలు చాలా ఎక్కువగా ఉపయోగించి చేసే ఆహారపదార్థాలు చాలామందిలో అలర్జీ కలిగించడం కంటే ఆస్తమాను నేరుగా ప్రేరేపిస్తాయి. అందుకే ఉప్పు, మసాలాలూ, నూనెలు తక్కువగా ఉండేలాగా... అలాగే వేపుళ్లు కాకుండా ఉడికించి వండేవాటితో అలర్జీలు/ ఆస్తమాను చాలావరకు నివారించవచ్చు. --డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
Delicious Winter Soup Recipes: స్పినాచ్ సూప్, బ్రకోలి ఆల్మండ్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... స్పినాచ్ సూప్ కావల్సిన పదార్ధాలు లేత పాలకూర ఆకులు – రెండు కప్పులు క్యారెట్ – ఒకటి బంగాళదుంప – ఒకటి ఉల్లిపాయ – ఒకటి వెల్లుల్లి రెబ్బలు – నాలుగు మిరియాల పొడి – టీస్పూను ఆయిల్ – రెండు టీస్పూన్లు పంచదార – టీస్పూను వెజిటేబుల్ స్టాక్ – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా క్యారెట్ బంగాళ దుంపలను తొక్కతీసి కడిగి, సన్నగా తరుక్కోవాలి. ►ప్యాన్‌లో రెండు కప్పుల నీళ్లు, క్యారెట్, బంగాళ దుంపల ముక్కలు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. ►ఇవి ఉడికాక ఈ ముక్కలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఈ వేడినీటిలో కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ►పాలకూర ఉడికిన తరువాత చల్లారనిచ్చి, క్యారెట్, దుంపలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో వెజిటేబుల్ స్టాక్ వేసి ప్యూరీలా చేసుకోవాలి. ►ఇప్పుడు ఈ ప్యూరీని వడగట్టి రసం మాత్రమే తీసుకోవాలి. ►ఇప్పుడు బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్కలర్లోకి మారేవరకు వేయించాలి. ►తరువాత పంచదార, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగాక వడగట్టిన పాలకూర రసం, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మరిగించాలి. ►ఈ వేడివేడి సూప్‌లో క్రీమ్ లేదా బటర్ వేసి సర్వ్‌చేసుకోవాలి. బ్రకోలి ఆల్మండ్ సూప్ కావల్సిన పదార్ధాలు బ్రకోలి – ఒకటి ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – ఆరు (సన్నగా తరగాలి) బాదం పప్పులు – పదహారు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు బటర్ – టీ స్పూను పాలు – కప్పు మిరియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా బ్రకోలిని ముక్కలుగా తరుక్కోవాలి. ►పాన్ వేడెక్కిన తరువాత బటర్, ఆయిల్ వేయాలి. ►బటర్ కరిగిన వెంటనే వెల్లుల్లి తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇప్పుడు బాదం పప్పులు, బ్రకోలి వేసి రంగు మారేంత వరకు ఉడికించాలి. ►ఇవన్నీ ఉడికిన తరువాత, చల్లారానిచ్చి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును మరో పాన్‌లో వేసి నీరంతా ఇగిరేంత వరకు మరిగించాలి. ►ఇప్పుడు పాలు పోసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి, మిరియాల పొడితో గార్నిష్‌చేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
నోరూరించే గలౌటీ కబాబ్, కోకోనట్ బ్రకోలి తయారీ ఇలా..
రోటీన్‌కి భిన్నంగా ఈ ప్రత్యేక వంటకాలను కూడా ప్రయత్నించండి. కోకోనట్ బ్రకోలి కావల్సిన పదార్ధాలు బ్రకోలి ముక్కలు – రెండున్నర కప్పులు ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు స్రింగ్ ఆనియన్ – ఒకటి కరివేపాకు – ఒక రెమ్మ పచ్చిమిర్చి – ఒకటి జీలకర్ర – పావు టీస్పూను ఆవాలు – టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను కారం – టీస్పూను గరం మసాలా – టీస్పూను పచ్చికొబ్బరి తురుము – మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, బ్రకోలి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ►బ్రకోలి మగ్గాక పచ్చికొబ్బరి, కారం, గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు వేగనిస్తే కోకోనట్ బ్రకోలి రెడీ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! గలౌటీ కబాబ్ కావల్సిన పదార్ధాలు మటన్ ఖీమా – ఆరకేజీ బొప్పాయి పేస్టు – మూడు టీస్పూన్లు జీలకర్ర పొడి – రెండు టీస్పూన్లు ధనియాల పొడి – టీస్పూను గరం మసాలా పొడి – టీ స్పూను ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి) అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు మిరియాలపొడి – పావు టీస్పూను శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు – అరకప్పు నిమ్మరసం – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా నెయ్యి – టీస్పూను ఆయిల్ – వేయించడానికి సరిపడా తయారీ విధానం ►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని నిమ్మరసం బొప్పాయి పేస్టు, నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పది నిమిషాలపాటు పక్కనబెట్టుకోవాలి. ►మిక్సీజార్లోఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, పుదీనా, ధనియాలపొడి, గరం మసాల, మిరియాలపొడి వేసి గ్రైండ్ చేయాలి. మసాలాలు నలిగిన ►తరువాత మటన్ ఖీమా వేసి మిశ్రమం మెత్తగా మారేవరకు గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►తరువాత మిశ్రమాన్ని కబాబ్‌లా చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి సన్నని మంట మీద రెండువైపులా బ్రౌన్‌కలర్ వచ్చేంతవరకు వేగనిస్తే గలౌటీ కబాబ్ రెడీ. చదవండి: Best Foods For Vitamin C: చిగుళ్లనుంచి రక్తం వస్తుందా? స్ట్రాబెర్రీ పండ్లు, బొప్పాయి.. ఇవి తిన్నారంటే.. -
Health Tips: గుండెలో మంటా.. రాగిరొట్టెలు, క్యాబేజీ, ముల్లంగి తినకండి.. ఇంకా
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గుండెలో మంట. తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి గుండెలో మంటను కలిగిస్తాయి. ఒకోసారి చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్తి ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం. వేపుళ్లు నూనెలో వేయించిన ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు చవకరకం నూనె లేదా బాగా మరిగిన నూనె అనేకమార్లు ఉపయోగిస్తారు. అది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. మసాలా ఆహారాలు పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి. పాలలోని షుగర్ లాక్టోజ్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. సాధారణంగా 70 శాతం మంది పెద్ద వారికి లాక్టోస్ సరిపడదు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది. గింజ ధాన్యాలు పప్పులు, రాజ్మా, బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో శాచురేట్స్ అనే పదార్థం వుంటుంది. సిట్రస్ పండ్ల రసాలు సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బంది పెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. వీటిని ఖాళీ పొట్టతో తీసుకోరాదు. రాగి అంబలి/ రాగి రొట్టెలు వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. అలాగని వాటిని తీసుకోవడం మానరాదు. ఎందుకంటే ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకుండా వాటిని తక్కువ మొత్తాలలో తినాలి. క్యాబేజి, బ్రకోలి, ముల్లంగి వంటివి త్వరగా జీర్ణం కావు. వీటిలో ఆలిగో శాచురైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలను జీర్ణం చేయటానికి అవసరమైన ఎంజైమ్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో కూడి బాక్టీరియా బలపడుతుంది. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... -
వంటల్లో వాడే ఈ పూల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
అరటిపువ్వు, కాలీఫ్లవర్ వంటి వాటిని మనం ఎప్పటి నుంచో వంటల్లో ఉపయోగిస్తున్నాం. కుంకుమపువ్వునూ అనాదిగా పాలతో గర్భిణులచే తాగించడమూ మన సంస్కృతిలో భాగమే. ఇప్పుడు బ్రోకలీ వంటి విదేశీ పూలూ మన వంటల్లో భాగమయ్యాయి. ఇటీవల తామరపూలనూ ఆరోగ్యం కోసం మనం ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. ఇక మందారపూలతో టీ తాగడమూ చూస్తున్నాం. ఆయా పూలతో మనకు సమకూరే పోషకాలూ, ఒనగూరే (ఆరోగ్య) ప్రయోజనాలను తెలుసుకుందాం. కాలీఫ్లవర్ గోబీ పువ్వు అని తెలుగులో, ఫూల్ గోబీ అని హిందీలో పిలిచే ఈ పువ్వును మనం ఎప్పటినుంచో వంటలో కూరగానూ, కాలీఫ్లవర్ పకోడీ రూపంలో శ్నాక్స్గానూ తింటూనే ఉన్నాం. ఇది క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో సల్ఫోరఫేన్ అనే ఫైటో కెమికల్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాలిఫ్లవర్ తినేవారిలో అది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ముందు చెప్పుకున్న సల్ఫోరఫేన్ పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కొంతమేర తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసివచ్చింది. అప్పటినుంచి ఈ విషయమై మరికొన్ని పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అరటిపువ్వు ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఉదాహరణకు... అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్... క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్‌ని నివారిస్తాయి. రక్తంలోని చెక్కెరను నియంత్రించడం ద్వారా డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత అనీమియాను అరికడుతుంది. అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఉదాహరణకు రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగై్జటీ తగ్గి, మంచి మూడ్స్ సమకూరుతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో (బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌లో) పాలు బాగా ఊరేలా తోడ్పడుతుంది. కుంకుమపువ్వు మనమెంతోకాలంగా కుంకుమపువ్వును ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషమయే. జఫ్రానీ బిర్యానీ అంటూ బిర్యానీ తయారీలోనూ, కశ్మీరీ పులావ్ వంటి వంటకాల్లోనూ కుంకుమపువ్వును ఉపయోగిస్తుంటాం. మంచి మేనిఛాయతో పండండి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఆ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే అనాదిగా అదో సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఇందులో బీ–కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే ఇదో నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే చిటికెడంటే చిటికెడే వాడాలి. తామరపువ్వులు(కమలం పువ్వులు) తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే తూర్పు ఆసియా ఖండంలో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్లతో పోరాడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి. గులాబీ మనదేశంలో గులాబీరేకులతో స్వీట్పాన్లోని తీపినిచ్చే గుల్ఖండ్ తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. ఇది మినహా మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయపు మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్‌నూ రిస్క్‌ను తగ్గిస్తుంది. దీన్ని చాలా పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది. బ్రకోలీ / బ్రోకలీ బ్రకోలీ అనేది ఓ ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్లా అంత విస్తృతంగా దొరకకపోయినా... ఇప్పుడు మన భారతీయ నగర మార్కెట్లలోనూ విరివిగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి దృష్టికి ‘విటమిన్–ఏ’ దోహదపడుతుంది. ఇందులోని పోషకాలు దేహంలో పేరుకుపోయిన విషాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. మందారపువ్వు చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. శరీర జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్–సితో పాటు అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు. ఇదే కాదు అన్ని రకాల టీలనూ పరిమితంగా తాగడమే మంచిది. -
బ్రకోలీతో కేన్సర్‌కు చెక్
వాషింగ్టన్: బ్రకోలీని వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా కేన్సర్, హృద్రోగాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి పలు వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫినోలిక్ పదార్థాలు సహా పలు ఫ్లేవనాయిడ్స్‌ను ఆహారంలో అధికంగా తీసుకోవడం ద్వారా పలు ప్రాణాంతక వ్యాధులను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రకోలీ, క్యాబేజ్, కాలే వంటి వాటిలో ఫినోలిక్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తిం చారు. ఫినోలిక్ ఉన్న కూరగాయలు వండినా వాటిలో పోషక విలువలు తగ్గిపోవని అంటున్నారు. -
బ్రకోలీతో లివర్ క్షేమం
పరిపరి శోధన తరచుగా బ్రకోలీ తీసుకుంటే లివర్ పదికాలాల పాటు క్షేమంగా ఉంటుందని అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు నుంచి ఐదుసార్లు బ్రకోలీ తీసుకునేట్లయితే లివర్ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని వారు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి జబ్బులను నివారించడంలోనూ బ్రకోలీ బాగా ఉపయోగపడుతుందని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఎలిజబెత్ జెఫరీ చెబుతున్నారు. బ్రకోలీకి దగ్గరగా ఉండే కాలిఫ్లవర్ వల్ల కూడా దాదాపు ఇలాంటి ఉపయోగాలే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
ఇంటి పంట సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - OrganicKitchen/Terrace Gardening గూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు. -
తోటకూర అని తీసేయొద్దు..
ఆకుకూరలతో లాభాలసాగు తక్కువ సమయంలో పంట దిగుబడి ఏడాదంతా చక్కటి ఆదాయం చౌకగా దొరికే మేలైన పోషకాల మేళవింపు తోటకూర. శరీరానికి అవసరమైన కీలక పోషకపదార్థాలు దీని నుంచి పొందవచ్చు.అన్ని వయస్సుల వారు రోజుకు 50 నుంచి 70 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. అయిదు మొక్కల కట్ట రూ.3లకు ధర పలుకుతోంది. కేవలం 20 రోజుల్లో కోతకు వస్తుంది. రూ. 2వేల పెట్టుబడితో రూ. పదివేల ఆదాయాన్ని జిల్లాలోని రైతులు పొందుతున్నారు. ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. రక్త పుష్టికి ఇనుము,ఎముకుల గట్టితనానికి సున్నం, కండరాల పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన పొటాషియం, జింక్, కంటి ఆరోగ్యానికి విటమిన్-ఎ వంటి అనేక పోషకాలు తోటకూర నుంచి లభిస్తాయి. సాధారణ పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో నామమాత్రపు పెట్టుబడితో ఆకుకూరలు చేతికి అందుతాయి. చక్కటి ఆదాయం సమకూరుతుంది. అన్ని కాలాల్లోనూ పండిస్తారు. జిల్లాలో సుమారు 70 నుంచి 100 హెక్టార్లలో దీనిని సాగు చేస్తున్నారు. చోడవరం మండలం నర్సాపురం, రావికమతం మండలం తోటకూరవానిపాలెంతో పాటు కె. కోటపాడు, అనకాపల్లి, పెందుర్తి, సబ్బవరం, ఆనందపురం కశింకోట మండలాలలో అధికంగా సాగు చేస్తున్నారు. విశాఖకు సమీపంలో ఉన్న పెందుర్తి ప్రాంతంలో అధిక శాతం ఆకుకూరల సేద్యం ఉండడం గమనార్హం. చక్కటి ఆదాయం.. విత్తనం వేసిన నాటి నుంచి నాలుగు సార్లు మాత్రమే నీరు అందించాలి. ఈ దశలో సేంద్రియ ఎరువులతో పాటు యూరియా కూడా వేస్తే పంట తొందరగా చేతికందుతుంది. పంట వేసిన 30 రోజుల్లో తీస్తే ఆరోగ్యకరమైన లేత కూర లభిస్తుంది. దీంతోపాటు గోంగూర కూడ 20 రోజులకే కోసుకోవచ్చు. ఇక పాలకూర, బచ్చలికూర, చుక్కకూర నెల రోజులకు అందుబాటులోకి వస్తుంది. పుదీనా, కొత్తిమీర 40 రోజులకు ఎదుగుతుంది. కేవలం రూ.2వేల పెట్టుబడితో రూ.10 వేలు సంపాదించొచ్చు. ఇదే జీవనాధారం నాది చింతల అగ్రహారం. మాకు తొలినాళ్ల నుంచి ఇదే జీవనాధారం. ఆకుకూరల పెంపకం, వ్యాపారం లాభదాయకంగానే ఉంది. పండించిన తోటకూరను రైతు బజారులకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. రోజుకు కనీసం రూ.3 వందలకు తోటకూర అమ్ముతాను. ప్రతి నెలా రూ.10వేలు ఆదాయం వస్తోంది. నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నాను. - వరహాలమ్మ, రైతు అన్ని నేలలు అనుకూలం తోటకూరను అన్ని నేలల్లోనూ సాగు చేయవచ్చు. ఎకరాకు రెండు నుంచి మూడు కిలోల విత్తనం అవసరముంటుంది. వాస్తవానికి వైట్, రెడ్ అమరాంత్రస్ రకాలు వినియోగంలో ఉన్నా జిల్లాలో తెలుపు రకాన్ని ఎక్కువుగా సాగు చేస్తున్నారు. ఎకరా విత్తనం రూ.150లు. ఉద్యాన శాఖ 50 శాతం రాయితీపై రైతులకు అందిస్తోంది. తోటకూర సాగులో పశువుల గెత్తం అవసరం అధికంగా ఉంటుంది. తోటకూరను అధికంగా ఆకుతినే పురుగు, పేను ఆశిస్తాయి. వీటి నియంత్రణకు రసాయనిక మందులు కాకుండా వేపనూనె వాడాలి. నల్లబజారులో కంటే ప్రభుత్వం వద్దే విత్తనాలు కొనుగోలు చేయడం మంచిది. - కె.శ్యామల,ఉద్యానశాఖ అధికారి 83744 49976 ఆదాయం బాగుంది నాది పినగాడి గ్రామం. పూర్వకాలం నుంచి ఆకుకూరలు పండిస్తున్నాం. వీటికి డిమాండ్ ఎక్కువ. తోటకూరతో పాటు చుక్కకూర, పాలకూర కూడా పండిస్తాం. ఎకరాకు రూ.2 వేలు పెట్టుబడి అవుతోంది. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులనే వాడుతాం. ఒక్కసారి మాత్రమే యూరియా వేస్తాం. 20 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు నీరు పెడతాం. వర్షాలు పడితే ఆ శ్రమ ఉండదు. వారానికి ఒకసారి కలుపు తీయాలి. అప్పుడే నాణ్యమైన కూర వస్తుంది. తాజాగా, లేతగా ఉండాలంటే 30 రోజుల లోపు తీసేయాలి. ఎకరాకు రూ.10 నుంచి రూ.15వేల వరకు ఆదాయం వస్తోంది. - దాడి అప్పలనాయుడు, రైతు(93968 70138) పెట్టుబడి తక్కువ నాది చింతల అగ్రహారం. తక్కువ పెట్టుబడితో ఆకుకూరలు పండించుకోవచ్చు. సేంద్రియ ఎరువులు తగిన మోతాదులో వాడితే ఇతర రసాయన ఎరువులు అక్కరలేదు. పంట ఎదగడానికి కొద్ది మొత్తంలో యూరియా వేస్తే చాలు. మార్కెట్లో తోటకూర, గోంగూరకు అధిక డిమాండ్ ఉంది. అయిదు మొక్కల కట్ట రూ.3లకు అమ్ముడుపోతోంది. మిగతా పంటల కంటే దీని సాగుతో ఆదాయం బాగుంది. విశాఖనగరానికి తీసుకెళ్లడానికి బస్సు సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. - కుమారి, మహిళా రైతు -
మేడిన్ ఫారిన్
తోటకూర, పాలకూర, వంకాయులు, బెండకాయులు, బీరకాయులో.. వున వీధుల్లో వినిపిస్తూనే ఉంటారుు. తోపుడు బళ్ల మీద వచ్చిన కాయుగూరలు లోకలా, హైబ్రీడా అని అడిగి వురీ కొంటాం. హైబ్రీడ్ కూరగాయలు రుచి ఉండవని దేశవాళీకే మొగ్గు చూపిస్తాం. తాజాగా విదేశీ కూరగాయులు వీధుల్లోకి వచ్చి చేరాయి థాయ్ మిర్చి తింటే కారం నషాలానికి ఎక్కుతుంది. లెవున్ గ్రాస్ టేస్ట్ చేస్తే వున నివ్ముకాయు రుచిని వురిపిస్తుంది. ఇవే కాదు రంగు రంగుల క్యాప్సికమ్, క్యాబేజీ రకరకాల వెరైటీ వెజిటబుల్స్ విదేశాల నుంచి లోకల్ వూర్కెట్లోకి వచ్చి చేరుతున్నారుు. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లే కాదు కూరగాయుల్లో కూడా ఫారిన్ సరుకు దేశంలోకి వచ్చేస్తోంది. థాయ్‌లాండ్, చైనా, వులేసియూ తదితర దేశాల నుంచి దిగువుతైన కూరగాయలు సిటీవాసులకు కొత్త రుచులు చూపిస్తున్నారుు. దాదాపు 70 రకాల విదేశీ కూరగాయులు హైదరాబాద్‌లో దొరుకుతున్నాయి. ఆస్పరగస్, అవకొడో, బ్రొకొలీ, క్యాప్సికమ్ రెడ్ అండ్ ఎల్లో, సెలేరీ, చెర్రీ టమాటా, చైనీస్ పాక్చాయ్, చైనీస్ క్యాబేజీ, గలంగల్, లెమన్ గ్రాస్, థాయ్ బ్రింజాల్, లేట్యూస్ లీఫ్, జుకినీ వంటి వెరైటీలు సూపర్ వూర్కెట్లు, బడా వెజ్ వూర్కెట్లలో అందుబాటులో ఉంటున్నారుు. ఇవే కాకుండా పిజ్జా, సాండ్ విచ్లో ఉపయోగించే బేజిల్, ఆర్గెనో, చిల్లీ ఫ్లేక్స్, రోజ్ మేరీలు విదేశాల నుంచే ఇంపోర్ట్ అవుతున్నారుు. దిగువుతి ఇలా.. విదే శాల నుంచి కూరగాయుల దిగువుతికి ఆన్లైన్, ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఆయూ దేశాల నుంచి ఆకాశవూర్గంలో నేరుగా నగరానికి వచ్చి చేరుతున్నారుు. థాయ్‌లాండ్‌తో పాటు ఊటీ, పుణే, బెంగళూరు, న్యూఢిల్లీ నుంచి కూడా విదేశీ కూరగాయలు దిగుమతి అవుతున్నారుు. థాయ్ నుంచి కూరగాయులు ఆర్డర్ చేసిన వుూడు రోజుల్లో నగరానికి చేరుకుంటున్నారుు. ఈ విదేశీ వెజిటేబుల్స్కి ఇక్కడి సూపర్వూర్కెట్లలో వుంచి డివూండే ఉంది. కాంటినెంటల్, థాయ్, చైనీస్ వంటకాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటోంది. - బొప్పిడి మాధవరెడ్డి డిమాండ్ బాగానే ఉంది నాలుగు నెలలుగా మేం విదేశీ కూరగాయులు విక్రరుుస్తున్నాం. డివూండ్ బాగానే ఉంది. సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు వివిధ స్టార్ హోటళ్లు, సూపర్ మార్కెట్లు, పిజ్జా సెంటర్లకు విదేశీ కూరగాయులు సప్లయ్ చేస్తు న్నాం. బల్క్ ఆర్డర్ ఉంటే హోం డెలివరీ సౌకర్యం ఉంది. వీటి ధరలు అందుబాటులోనే ఉంటారుు. - బాలకృష్ణ, తర్కారీ స్టోర్ యజమాని ఫొటోలు: రాజేష్‌రెడ్డి