ప్రతీకాత్మక చిత్రం
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గుండెలో మంట. తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి గుండెలో మంటను కలిగిస్తాయి. ఒకోసారి చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్తి ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం.
వేపుళ్లు
నూనెలో వేయించిన ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు చవకరకం నూనె లేదా బాగా మరిగిన నూనె అనేకమార్లు ఉపయోగిస్తారు. అది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.
మసాలా ఆహారాలు
పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి.
పాలలోని షుగర్
లాక్టోజ్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. సాధారణంగా 70 శాతం మంది పెద్ద వారికి లాక్టోస్ సరిపడదు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది.
గింజ ధాన్యాలు
పప్పులు, రాజ్మా, బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో శాచురేట్స్ అనే పదార్థం వుంటుంది.
సిట్రస్ పండ్ల రసాలు
సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బంది పెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. వీటిని ఖాళీ పొట్టతో తీసుకోరాదు.
రాగి అంబలి/ రాగి రొట్టెలు
వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. అలాగని వాటిని తీసుకోవడం మానరాదు. ఎందుకంటే ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకుండా వాటిని తక్కువ మొత్తాలలో తినాలి.
క్యాబేజి, బ్రకోలి, ముల్లంగి వంటివి త్వరగా జీర్ణం కావు. వీటిలో ఆలిగో శాచురైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలను జీర్ణం చేయటానికి అవసరమైన ఎంజైమ్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో కూడి బాక్టీరియా బలపడుతుంది.
చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్‌మిస్‌లు తరచుగా తింటే...
Comments
Please login to add a commentAdd a comment