గురక సమస్యను చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారుగానీ, నిజానికి ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. గురకపెట్టేవారికి దాని ఇబ్బందులు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ పక్కనున్న వారికి అదో పెద్ద సమస్య. అసలు అంతపెద్దగా గురక పెడుతున్నామనేది కూడావారికి తెలియదు. వినేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది గురక శబ్దం ఎంత బిగ్గరగా ఉందో. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక ఇచ్చే వార్నింగ్ బెల్స్ ఏంటి? తెలుసుకుందాం.
నోటితోగాలి పీల్చుకోవడం, శ్వాసలో ఇబ్బంది ద్వారా నిద్రలో శ్వాస పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్ధం.కొంత మందికి ఈ శబ్దం చిన్నగా గురక వస్తే మరి కొంత మందికి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువగాఅలసిపోయినపుడు, అలర్జీలు, మద్యం సేవించడం, స్థూలకాయం ఉన్నవాళ్లకి గురక వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా గురక పెడతారు. అయితే ఈ గురక రోజూ వస్తోంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. దీర్ఘకాలిక గురక స్లీప్ అప్నియా కు దారి తీస్తుంది. ఈ స్లీప్ అప్నియా రెండు రకాలు
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA): గొంతు కండరాలు రిలాక్స్ అవుతూ ఊపిరితిత్తులలోకి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది పెద్ద వయసువారిలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో చాలా కామన్. అలాగే టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ సమస్య ఉన్న పిల్లలోలనూ , ఊబకాయం, మద్యం, ధూమపానం అలవాటు, మత్తుమందులు లేదా ట్రాంక్విలైజర్లనువాడేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, అధిక రక్తపోటు ,టైప్ 2 మధుమేహం వంటివి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచే కొన్ని పరిస్థితులు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల రుగ్మతలు, ముందస్తు స్ట్రోక్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA), ఇది శ్వాసను నియంత్రించే కండరాలకు మెదడు సరైన సంకేతాలను పంపనప్పుడు సంభవిస్తుంది. పెద్ద,మధ్య వయస్కులు , వృద్ధులకు సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.సెంట్రల్ స్లీప్ అప్నియా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండె లోపాలు. రక్తప్రసరణ గుండె ఆగిపోయేప్రమాదాన్ని పెంచుతుంది.నార్కోటిక్ నొప్పి మందులను, ఓపియాయిడ్ ముఖ్యంగా మెథడోన్ వంటి దీర్ఘం కాలం తీసుకుంటే సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతాయి.
గురక సమస్యలు: సాధారణంగా గురక పెడుతూ నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టడం, వయసు పెరిగే కొద్దీ వారి మెదడు శక్తిని వేగంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. శరీరానికి రాత్రి పూట అందాల్సిన ఆక్సిజన్ అందదు శరీర అవయవాల పనీతిరుకి ఆటంకం కలిగించొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా కణాల నష్టాన్ని కలిగిస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల మెదడులో కణాల పనీతీరును కూడా ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. గురకతో మధ్యలో లేవడం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతోపగటి పూట బద్ధకంగా, నిస్తేజంగా ఉండటమే కాదు, నిద్ర వస్తుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
నోట్. ఇది అవగాహనకు సంబంధించిన సమాచారం మాత్రమే. గురక సమస్యగా ఎక్కువగా బాధిస్తోంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఊబకాయులైతే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ యోగా ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment