ఇరువురు మనుషులు కలుసుకున్నపుడు చక్కని చిరునవ్వు, కరచాలనం, ఆత్మీయం ఆలింగనం ఇది సర్వ సాధారణం. మరికొన్ని చోట్ల ముద్దుగా బుగ్గలమీద చిన్న ముద్దుపెట్టుకోవడం ఒక అలవాటు. చిన్నారులను చూసినపుడు అందరమూ ముద్దు చేస్తాం. ఎదుటివారి పట్ల తమ ప్రేమను తెలియజెప్పేందుకు ఇలా చేస్తుంటాం.
అదే ప్రేమికుల మధ్య ఈ ముద్దుల బంధం ఇంకొంచెం..మధురంగా ఉంటుంది. అయితే సినిమా కల్చర్ అనండీ..పాశ్చాత్య నాగరికత అనండీ.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
లిప్ టూ లిప్ ముద్దుల వల్ల లాభాల మాటేమో గానీ.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిలల్ల్ని ఇలా ముద్దు పెట్టుకోవడం చాలా అనర్థం. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్‌ల బారిన పడిన వారితో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
♦ ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి.
♦ ఈ రకం ముద్దుల వల్ల మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది. మోనో వైరస్ కారణంగా కొందరిలో ఆరు నెలల పాటు విపరీతమైన అలసట వంటి లక్షణాలుంటాయి.
♦ మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధిలు కూడా వ్యాప్తిస్తాయి.
♦ క్లామిడియా గనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు. లైంగిక వ్యాధులు కూడా చాలా తొందరగా వ్యాప్తిస్తాయి.
♦ స్వీడిష్ సర్వే ప్రకారం, అలెర్జీ ఉన్న వారిని ముద్దుపెట్టుకునే 12 శాతం మందికి అలెర్జీ త్వరగా సోకుతుంది. దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండాలి.
♦ పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా? తీవ్ర చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు.
♦ న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చివరిగా మరోమాట ఇలాంటి వేవీ గమనించకుండా తొందరపడితే దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా సంభవించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment