Radish
-
ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి!
తరచూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? ఆలస్యం వద్దు తెల్లముల్లంగితో వండిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే... ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు తేలిగ్గా నివారితమవుతాయి. దీనికి ఓ కారణం ఉంది. రెఫానస్ సెటైవస్ యాంటీఫంగల్ పెటైడ్ డ్–2 (సంక్షిప్తంగా ఆర్ఎస్ఏఎఫ్పీ–2) అనే ఓ ప్రోటీన్ కారణంగా తెల్లముల్లంగి ఫంగల్ వ్యాధుల్ని తేలిగ్గా నివారించగలుగుతుంది. అంతేకాదు... ఇది మంచి డీ–టాక్సిఫైయర్ కావడంతో దేహంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. కామెర్లతో బాధపడిన వాళ్లలో ఎర్రరక్తకణాలు నాశనం కాకుండా కా పాడుతుంది. వాటిని కా పాడటమంటే పోషకాలు, ఆక్సిజన్ అందేలా చూసి ప్రతి కణాన్నీ కా పాడినట్టే. మామూలుగానైతే డయాబెటిస్తో బాధపడేవారు దుంపకూరల్ని తినకూడదంటారు. కానీ ముల్లంగిలోని పీచు చక్కెరను చాలా నెమ్మదిగా వెలువడేలా చేస్తుంది కాబట్టి ఇది డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేసే దుంపగా పేరుతెచ్చుకుంది. -
Health Tips: ఆయాసంతో బాధపడుతున్నారా? ఇలా చేశారంటే..
Health Tips: ఆయాసం ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. ►రెండు చిటికల పసుపు, చిటికడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. ►వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి తాగడం చాలా మంచిది. ►ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది. ►అదే విధంగా లేత ముల్లంగి, వెలగపండు, తేనె వెల్లుల్లి తీసుకోవడం మంచిది. ►అయితే మినుములు, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, చన్నీటి స్నానం, మంచులో లేదా చల్లటి గాలిలో తిరగడం మంచిది కాదు. అయితే, శరీర ధర్మాలను బట్టే వీటిని అనుసరిస్తే మేలు. గురక తగ్గాలంటే.. ►నిమ్మరసం రోజు తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ►ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందుతారు. ►అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది. పాలకూర తరచూ తింటే.. ►పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది. ►పాలకూర తరచు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. ►దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ►జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
Recipe: ముల్లంగి తురుము, రాగి పిండి, గోధుమ పిండితో ముల్లంగి నాచిన్ రోటీ!
నోటికి రుచిగా ఉండే ఆహారం కాకుండా పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. క్యాలరీలు కూడా అవసరమే. అయితే అవసరమైన దానికన్నా ఎక్కువైతే బరువు పెరుగుతారు. అందువల్ల క్యాల్షియం సమృద్ధిగా, క్యాలరీలు తక్కువగా ఉండే వంటకాలు ఎలా వండుకోవచ్చో చూద్దాం... ముల్లంగి నాచిన్ రోటీ కావలసినవి: ►ముల్లంగి తురుము – అరకప్పు ►ముల్లంగి ఆకుల తురుము – అరకప్పు ►రాగి పిండి – అరకప్పు ►గోధుమ పిండి – అరకప్పు ►నువ్వులు – రెండు టీస్పూన్లు ►వేయించిన జీలకర్ర – అరటీస్పూను ►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత ►నూనె – రోటీ వేయించడానికి సరిపడా. తయారీ: ►నూనె తప్పించి మిగతా వాటన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీ పిండిలా కలిపేసి పదినిమిషాలపాటు నానబెట్టుకోవాలి ►నానిన పిండిని ఉండలు చేసుకుని రోటీల్లా వత్తుకోవాలి ►బాగా వేడెక్కిన పెనం మీద పావు టీస్పూను నూనె వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ►లైట్ బ్రౌన్ కలర్లోకి కాలిన తరువాత వెంటనే సర్వ్ చేసుకోవాలి. ►ఇవి వేడిమీదే బావుంటాయి. చల్లారితే గట్టిబడతాయి. బొప్పాయి యాపిల్ స్మూతీ కావలసినవి: ►బొప్పాయి ముక్కలు – రెండు కప్పులు ►గ్రీన్ యాపిల్ ముక్కలు – ఒకటిన్నర కప్పులు ►గింజలు తీసిన ఆరెంజ్ తొనలు – పావు కప్పు ►పెరుగు – కప్పు ►ఐస్ క్యూబ్స్ – ఒకటిన్నర కప్పులు ►వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను. తయారీ: ►పదార్థాలన్నింటిని మిక్సీజార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ►మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ►లేదంటే రిఫ్రిజిరేటర్లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sesame Crusted Chicken: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Beetroot Rice Balls Recipe: బీట్రూట్ రైస్ బాల్స్ ఇలా తయారు చేసుకోండి! -
Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..
Mullangi: ఆలుగడ్డ, చిలగడదుంప, చామగడ్డతో పాటు దుంపకూరల్లో ఒకటైన ముల్లంగి ముక్కలను ఇష్టంగా తినేవారు కూడా చాలా మందే ఉంటారు. ముఖ్యంగా సాంబారులో ఈ ముక్కలు కనిపిస్తే అస్సలు వదలరు. అయితే, ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదండోయ్.. ఇందులో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ►ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, కాల్షియం, పొటాషియం పుష్కలం. ►పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ►ఇక ముల్లంగి తినడం వల్ల ముఖ్యంగా కాలేయానికి ఎంతో మేలు చేకూరుతుంది. ►శరీరంలోని విషపదార్థాలను పంపే గుణం ముల్లంగికి ఉంటుంది. తద్వారా మూత్రవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ►ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. ►ముడుచుకుపోయిన గాలి గొట్టాలను విప్పార్చే గుణం ముల్లంగికి ఉంటుంది. కాబట్టి బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు ముల్లంగి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ►చలికాలంలో ముల్లంగి తినడం వల్ల జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ►బరువు తగ్గాలనుకునే వారు ముల్లంగిని తింటే ఉపయోగకరం. ►హృద్రోగ సమస్యలను దూరం చేయడంలో ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుంది. ►ముల్లంగిలో విటమిన్ ఏ, సీ, ఈ, బీ6, కే పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ►ముల్లంగి రసం రోజూ తాగితే.. ఇందులో ఉన్న సీ విటమిన్ వల్ల చర్మం కాంతిమంతమవుతుంది. మొటిమలు, రాషెస్ ఉంటే ఇట్టే మాయమైపోతాయి. ►ముల్లంగి పేస్టును ముఖానికి రాసుకుంటే క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. మృతకణాలను తొలగిస్తుంది. ►దీనిని తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. కేశాలు కుదుళ్లు బలంగా తయారవుతాయి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
Health Tips: గుండెలో మంటా.. రాగిరొట్టెలు, క్యాబేజీ, ముల్లంగి తినకండి.. ఇంకా
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గుండెలో మంట. తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి గుండెలో మంటను కలిగిస్తాయి. ఒకోసారి చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్తి ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం. వేపుళ్లు నూనెలో వేయించిన ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు చవకరకం నూనె లేదా బాగా మరిగిన నూనె అనేకమార్లు ఉపయోగిస్తారు. అది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. మసాలా ఆహారాలు పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి. పాలలోని షుగర్ లాక్టోజ్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. సాధారణంగా 70 శాతం మంది పెద్ద వారికి లాక్టోస్ సరిపడదు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది. గింజ ధాన్యాలు పప్పులు, రాజ్మా, బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో శాచురేట్స్ అనే పదార్థం వుంటుంది. సిట్రస్ పండ్ల రసాలు సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బంది పెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. వీటిని ఖాళీ పొట్టతో తీసుకోరాదు. రాగి అంబలి/ రాగి రొట్టెలు వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. అలాగని వాటిని తీసుకోవడం మానరాదు. ఎందుకంటే ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకుండా వాటిని తక్కువ మొత్తాలలో తినాలి. క్యాబేజి, బ్రకోలి, ముల్లంగి వంటివి త్వరగా జీర్ణం కావు. వీటిలో ఆలిగో శాచురైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలను జీర్ణం చేయటానికి అవసరమైన ఎంజైమ్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో కూడి బాక్టీరియా బలపడుతుంది. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... -
విషాలను విసర్జించే ముల్లంగి
గుడ్ ఫుడ్ సాంబారులో కూర ముక్కలను వెతుక్కునే అలవాటు ఉన్నవారు ముల్లంగిని బాగా ఇష్టపడతారు. దుంపకూరల్లో ఒకటైన ముల్లంగి ముక్కలను సలాడ్‌గా కూడా తింటారు. ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... ముల్లంగి కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఒంటిలోని విషపదార్థాలను హరిస్తుంది. అలా కాలేయం మీద భారాన్ని తొలగిస్తుంది. కామెర్ల రోగుల్లో జరిగే ఎర్ర రక్త కణాల వినాశనాన్ని నివారిస్తుంది. అందుకే ముల్లంగిని కామెర్లు వచ్చిన రోగులకు సిఫార్సు చేస్తారు. ముల్లంగి జీర్ణవ్యవస్థను కూడా శుద్ధి చేస్తుంది. పేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు పేగుల్లో తగినన్ని నీటిపాళ్లు ఉండేలా చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. తద్వారా మొలల (పైల్స్) సమస్య రాకుండా కాపాడుతుంది. ముల్లంగిలో విషాలను హరించడంతో పాటు, ఆ విషాలను బయటకు పంపించే గుణం వల్ల అది మూత్రవిసర్జక వ్యవస్థ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలను శుభ్రపరచడంతో పాటు మూత్రవ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. ముల్లంగిలో ముడుచుకుపోయిన గాలి గొట్టాలను విప్పార్చే గుణం ఉంది. అందుకే బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు ముల్లంగి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు... అనేక అలర్జీలు, జలుబు లేదా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు స్వాభావికమైన మంచి మందుగా కూడా పనిచేస్తుంది. ముల్లంగిలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఇది అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. రక్తనాళాలపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూస్తుంది. -
రా... డిష్
ముల్లంగిని ఇంగ్లిష్‌లో ‘రాడిష్’ అంటారు. చూడ్డానికి అమాయకంగా కనపడుతుంది గానీ మంచి ఘాటు. ఎవరూ ప్రేమించడానికి రెడీగా ఉండరు. ముల్లంగి కూర చేతిలో పట్టుకొని అమ్మలు కుస్తీలు పట్టాల్సిందే తప్ప పిల్లలు గుటక మింగరు... కానీ, ఈ ఘాటు వైట్ వండర్ని సరిగ్గా వండితే అందరూ .. రా .. రా... రా... డిష్ అంటారు. కూటు కావల్సినవి: ముల్లంగి – 1 (తురమాలి), ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, పెసరపప్పు – అర కప్పు, నూనె – టీ స్పూన్ గ్రైండింగ్‌కి: పచ్చికొబ్బరి తురుము – కప్పు, జీలకర్ర – టీ స్పూన్, ఎండుమిర్చి – 2, బియ్యప్పిండి – టేబుల్‌స్పూన్ పోపుకోసం: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఎండుమిర్చి – 1 (ముక్కలు చేయాలి), ఇంగువ – చిటికెడు తయారీ: ∙పెసరపప్పును కడిగి, నీళ్లు వడకట్టాలి. ∙గ్రైండింగ్ కోసం తీసుకున్న పదార్ధాలన్నీ మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి. ∙పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడికించాలి. దీంట్లో పెసరపప్పు వేసి కలపాలి. పప్పు ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. పోపుకోసం విడిగా మరో కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, పోపు దినుసులు వేసి కలపాలి. ఈ పోపు మిశ్రమాన్ని కూటులో వేసి కలపాలి. శాండ్విచ్ కావల్సినవి: బ్రెడ్ స్లైసులు – 4, ముల్లంగి– 1 (చిన్నది), క్యాప్సికమ్ – సగం ముక్క, నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్‌మసాలా – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి – 1 (తరగాలి), ఛీజ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ: ∙ముల్లంగిని శుభ్రం చేసి, సన్నగా తరగాలి. దీనిని గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, మిరియాలపొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ∙బ్రెడ్ స్లైస్‌లకు బటర్ రాయాలి. దీనిపైన ముల్లంగి మిశ్రమం ఉంచి, ఆ పైన సన్నగా కట్ చేసిన 3–4 క్యాప్సికమ్ ముక్కలను ఉంచాలి. ఆ పైన ఛీజ్ తురుము వేయాలి. పైన మరో బ్రెడ్ స్లైస్ ఉంచాలి. గ్రిల్ లేదా పెనం మీద ఈ బ్రెడ్ స్లైస్ ఉంచి, రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చి తీయాలి. పదునైన కత్తితో త్రికోణాకృతిలో కట్ చేసి, టొమాటో, పుదీనా చట్నీతో వెంటనే సర్వ్ చేయాలి. పరాటా పరాటా కావల్సినవి: గోధుమపిండి – 2 కప్పులు, ముల్లంగి తురుము – కప్పు, ముల్లంగి ఆకుల తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – 1 (తరగాలి), గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాలపొడి – టీ స్పూన్, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నోట్: ముల్లంగి తరుగును గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఈ నీళ్లను పిండి కలపడానికి వాడచ్చు. తయారీ: ∙ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఆరు భాగాలు చేసి, ముద్దలుగా చేసుకోవాలి. ∙ఒకటిన్నర కప్పు పిండిలో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీంట్లో ముల్లంగి నీళ్లతో పాటు మరికొన్ని నీళ్లు కూడా కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దను కవర్ చేసేలా పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మిగతా సగం కప్పు పిండి పరాటా చేయడానికి కోటింగ్‌లా ఉపయోగించాలి. మెత్తగా అయిన ముద్దను 6 భాగాలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ∙ఈ ఉండలను అరచేతి వెడల్పున ఒత్తి, మధ్యన ముల్లంగి ఉండ పెట్టాలి. చుట్టూ పిండితో రోల్ చేయాలి. (ఇది భక్ష్యం ఉండ మాదిరి చేయాలి) తర్వాత రొట్టెల పీట మీద ఒక్కో ఉండ పెట్టి, కాస్త మందం చపాతీ మాదిరి చేయాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధంగా ఉంచిన పరాటాలను వేసి, నూనె వేస్తూ రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చుకోవాలి. స్టఫ్డ్ ముల్లంగి పరాటా సిద్ధం. వీటికి వెన్న రాసి వేడి వేడిగా టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. పెరుగు పచ్చడి కావల్సినవి: ముల్లంగి తరుగు – కప్పు, పెరుగు – కప్పు, ఉప్పు – తగినంత పోపుకోసం: నూనె – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2 (తరగాలి), ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఇంగువ – టీ స్పూన్ తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో పచ్చిమిర్చి, ముల్లంగి తరుగు వేసి వేయించాలి. మంచి గోధుమరంగు వచ్చేవరకు వేయించి దీంట్లో 2–3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. ∙ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. దీంట్లో ముల్లంగి మిశ్రమం వేసి కలపాలి. అన్నం, పరాటాలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. సాంబార్ కావల్సినవి: ముల్లంగి – 2 (పైన తొక్క తీసి, గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి), టొమాటో – 1 (ముక్కలుగా తరగాలి), చింతపండు – నిమ్మకాయంత పరిమాణం, కందిపప్పు – కప్పు (మెత్తగా ఉడికించి, పక్కన ఉంచాలి), సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత పోపుకోసం: నువ్వుల నూనె – టేబుల్ స్పూన్, ఆవాలు – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్ తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేయాలి. తర్వాత దీంట్లో టొమాటో, ముల్లంగి ముక్కలు, పసుపు, ఉప్పు, సాంబార్ పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించాక దీంట్లో చింతపండు రసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా దీంట్లో మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమం వేసి కలపాలి. తర్వాత ఇంగువ వేసి మంట తీసేయాలి. చివరగా కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. తీపిని ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
ముల్లంగిని ముక్కలుగా కోసి నీటిలో నానబెట్టిండి. కాసేపయ్యాక ముక్కలు తీసేసి, ఆ నీటిలో కొంచెం యాలకులపొడి వేసి మరిగించండి. ఈ కషాయాన్ని తాగితే గొంతువాపు తగ్గుతుంది. నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని చల్లార్చి, రోజులో మూడుసార్లు కురుపు ఉన్న కంట్లో రెండు చుక్కలు వేస్తే కురుపు తగ్గిపోతుంది. -
అచ్చం పాదం లాగే ఉందే!
అయాగవా: ఇది అచ్చం భారీ పాదం లాగా ఉందికదా! 30 సెంటీ మీటర్ల పొడవున్న ఈ ముల్లంగి కిలోన్నర బరువుంది. జపాన్‌లోని అయాగవా పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూరగాయల ఎగ్జిబిషన్లో ఇది చూపరులను విశేషంగా ఆకర్శిస్తోంది. యుకిహిరో యుకేచి అనే జపాన్ రైతు పొలంలో ఇది కాచింది. దీన్ని అధిక ధరకు విక్రయించి లాభపడుతామని ముందు భావించిన సదరు రైతు చివరకు మనసు మార్చుకొని పట్టణంలో కొనసాగుతున్న కూరగాయల ప్రదర్శనకు తీసుకొచ్చారు.