Mullangi: ఆలుగడ్డ, చిలగడదుంప, చామగడ్డతో పాటు దుంపకూరల్లో ఒకటైన ముల్లంగి ముక్కలను ఇష్టంగా తినేవారు కూడా చాలా మందే ఉంటారు. ముఖ్యంగా సాంబారులో ఈ ముక్కలు కనిపిస్తే అస్సలు వదలరు. అయితే, ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదండోయ్.. ఇందులో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
►ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, కాల్షియం, పొటాషియం పుష్కలం.
►పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.
►ఇక ముల్లంగి తినడం వల్ల ముఖ్యంగా కాలేయానికి ఎంతో మేలు చేకూరుతుంది.
►శరీరంలోని విషపదార్థాలను పంపే గుణం ముల్లంగికి ఉంటుంది. తద్వారా మూత్రవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
►ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది.
►ముడుచుకుపోయిన గాలి గొట్టాలను విప్పార్చే గుణం ముల్లంగికి ఉంటుంది. కాబట్టి బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు ముల్లంగి మంచి విరుగుడుగా పనిచేస్తుంది.
►చలికాలంలో ముల్లంగి తినడం వల్ల జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
►బరువు తగ్గాలనుకునే వారు ముల్లంగిని తింటే ఉపయోగకరం.
►హృద్రోగ సమస్యలను దూరం చేయడంలో ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుంది.
►ముల్లంగిలో విటమిన్ ఏ, సీ, ఈ, బీ6, కే పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
►ముల్లంగి రసం రోజూ తాగితే.. ఇందులో ఉన్న సీ విటమిన్ వల్ల చర్మం కాంతిమంతమవుతుంది. మొటిమలు, రాషెస్ ఉంటే ఇట్టే మాయమైపోతాయి.
►ముల్లంగి పేస్టును ముఖానికి రాసుకుంటే క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. మృతకణాలను తొలగిస్తుంది.
►దీనిని తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. కేశాలు కుదుళ్లు బలంగా తయారవుతాయి.
చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...
Comments
Please login to add a commentAdd a comment