మనలోని చాలామందికి కళ్ల చుట్టూ నల్లని వలయాలు(డార్క్ సర్కిల్స్) సమస్యగా మారుతుంది. లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఎదరవుతుంది. ఇది మన అందాన్ని పాడుచేసి ఆత్మవిశ్వాసంను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు వయసు మీద పడుతున్న కొద్ది, కంటి చుట్టూ నల్లని వలయాలు అనువంశికత కారణంగా కూడా రావచ్చు. కానీ ఈ వలయాలు ఏర్పడటానకి కారణాలు అనేకం. కొన్నిసార్లు నిద్రలేమి, ఒత్తిడి, అధిక ధూమపానం, మద్యపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి వాటి వలన కూడా కావచ్చు. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది..
ముఖానికి అందం కళ్లు. కానీ, ఆ కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు అందాన్ని తగ్గించమే కాదు, మనల్ని బలహీనులుగానూ చూపిస్తుంది. అయితే సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్‌ను అంతం చేయవచ్చు. ఈ 10 రకాల ఆహారాలను రోజువారీ డైట్‌లో తీసుకుంటే కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను సహజ సిద్ధంగా దూరం చేసుకోవచ్చు. అవేంటో చుద్దాం. అముదం నూనెతో అద్భుత ప్రయోజనాలు
1. టామోటా:
ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు టమోటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్త ప్రసరణు పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతాయి. టామోటాలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ముఖం మీద మచ్చలు పోగొట్టి మేనును మెరిపించేందుకు టమోటాలు మేలు చేస్తాయి. ముఖ్యంగా లైకోపీన్, ఇది రక్త కణాలను రక్షించి కళ్ళకు ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. టొమాటోస్ విటమిన్ సిసి, పొటాషియం,విటమిన్ కే కు గొప్ప మూలం. -ఇవన్నీ మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. నల్లటి వలయాలను తొలగించాలంటే.. ఒక టీ స్పూన్ టమోటా రసం, నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఎఫెక్టివ్ టిప్
2. కీరదోస:
కీరదోస కంటికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయలో చర్మాన్ని రీహైడ్రేట్ చేసే నీటి శాతం అధికంగా ఉంటుంది. దోసకాయను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలోలో విటమిన్లు కే,ఏ,ఈ, సీ అధికంగా ఉంటాయి. కీరదోస ముక్కలను అర గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి నల్లటి వలయాలు ఉన్నచోట పెట్టుకోవాలి. పది నిమిషాలు తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. టొమాటో మాటున ఆరోగ్యం
3. పుచ్చకాయ
పుచ్చకాయలో కంటి ఆరోగ్యానికి తోడ్పడే బీటా కెరోటిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది 92% నీటిని కలిగి ఉంటుంది. కావున శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు బి 1, బి 6, సి అలాగే పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి.
4. బ్లూ బెర్రీస్(నల్ల ద్రాక్షాలు)
వీటిలో ఒమేగా 3, విటమిన్లు క\కె, సితోపాటు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. -ఇవన్నీ కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇది కళ్ళకు ప్రసరణను మెరుగుపరిచి, రక్త కణాలను రక్షించడానికి సహాయపడుతుంది.
5. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహార పదార్థాలు
విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు చర్మ సౌందర్యాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. విటమిన్ ఇ ముడతలు, వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది మచ్చలు, నల్లని వలయాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారాలు విటమిన్ ఇ కి మంచి వనరులు.
6. ఆకుపచ్చ కూరగాయలు
ఆకుపచ్చ కూరగాయలను తినడం వల్ల రక్త ప్రసరణను పెంపుదలకు దోహదపడుదుంది. దీని ద్వారా చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
7. నారింజ
ఆరెంజ్‌లో విటమిన్లు సి, ఎ అధికంగా ఉంటాయి, ఈ రెండూ కొల్లాజెన్‌ను పెంచడానికి, చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి. నారింజ జ్యూస్‌తో కూడా నల్లటి వలయాలను తొలగించొచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి నల్లటి వలయాలు ఉన్న చోట రాసుకోవాలి. ఇలా రోజు చేసినట్లయితే.. చాలా త్వరగా ఫలితం కనిపిస్తుంది.
8. బీట్‌రూట్
బీట్‌రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిని రోజువారీ తినడం వల్ల కంటికి మంచిది. అంతేకాకుండా బీట్‌రూట్‌లో డైలేట్, మెగ్నీషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి, ఇవి చీకటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ రసం, పంచదార మిశ్రమంతో చర్మానికి స్క్రబ్ చేస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఇలా రోజూ బీట్ రూట్ రసాన్ని చర్మానికి పట్టిస్తే.. చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
9. బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మెగ్నీషియం, విటమిన్ సిలను కలిగి ఉంది. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. ఇది నల్లని వృత్తాలను తొలగించి చర్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.
10. నీరు
నీరు తాగటం వల్ల కళ్ళ కింద నల్లని వలయాలు, ఉబ్బినట్లు అవ్వడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు తీయడానికి నీరు సహాయపడుతుంది. అలాగే కంటి ప్రాంతం చుట్టూ ఉన్న చెడు వాటిని తగ్గిస్తుంది. అయితే చాలామంది ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోడానికి సప్లిమెంట్స్, అనేక క్రీముల వాడతారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. వీటిని తగ్గించుకునేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. అందుకే మీ ఆహారంలో పైన పేర్కొన్న ఆహారాన్ని చేర్చండి. తగినన్ని నీరు తాగడం. రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నల్లని వలయాలను తగ్గించడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment