tamoto
-
టమాటాల లారీ బోల్తా.. దొరికిన కాడికి ఎత్తుకెళ్లిన జనం..
సాక్షి, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా టమాటాల రేటు ఆకాశానంటిన విషయం తెలిసిందే. కిలో టమాట పలు చోట్ల ఏకంగా రూ.150 పలుకుతోంది. దీంతో, సామాన్యులు టమాటాలను కొనాలంటేనే జంకుతున్నాయి. అయితే, తాజగా ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే-44పై టమాటాలను తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడింది. దీంతో, టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ క్రమంలో కిందపడిపోయిన టమాటాలను తీసుకువెళ్లేందుకు ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు. ఇక, లారీ బోల్తా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, లారీ.. కర్ణాటకలోని కోలార్ నుంచి టమాటాలను లోడ్‌ను ఢిల్లీ తరలిస్తుండగా బోల్తాపడింది. లారీలో తరలిస్తున్న టమాటాల విలువ దాదాపు రూ.2లక్షలు ఉంటాయని అంచనా. ఇది కూడా చదవండి: ఖమ్మంలో ఉద్రికత్త.. పోలీసుల లాఠీచార్జ్! -
తక్కువ రేటుకే టమాటా...టమోటో ధరలకు ఏపీ ప్రభుత్వం కళ్లెం
-
కొండెక్కిన టమాట
-
కొండెక్కిన టమాటా ధర.. కిలో ఎంతో తెలుసా?
మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): టమాటా ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్లో శనివారం మొదటి రకం టమాటా కిలో రూ.74 పలికింది. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల్లో టమాటా పంట దెబ్బతింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్‌కు కేవలం 157 మెట్రిక్ టన్నుల సరకు మాత్రమే వచ్చింది. సరుకు తక్కువ రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు మరింత పుంజుకుంటున్నాయి. చదవండి: చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే :కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే.. -
ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం..
మనలోని చాలామందికి కళ్ల చుట్టూ నల్లని వలయాలు(డార్క్ సర్కిల్స్) సమస్యగా మారుతుంది. లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఎదరవుతుంది. ఇది మన అందాన్ని పాడుచేసి ఆత్మవిశ్వాసంను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు వయసు మీద పడుతున్న కొద్ది, కంటి చుట్టూ నల్లని వలయాలు అనువంశికత కారణంగా కూడా రావచ్చు. కానీ ఈ వలయాలు ఏర్పడటానకి కారణాలు అనేకం. కొన్నిసార్లు నిద్రలేమి, ఒత్తిడి, అధిక ధూమపానం, మద్యపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి వాటి వలన కూడా కావచ్చు. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.. ముఖానికి అందం కళ్లు. కానీ, ఆ కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు అందాన్ని తగ్గించమే కాదు, మనల్ని బలహీనులుగానూ చూపిస్తుంది. అయితే సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్‌ను అంతం చేయవచ్చు. ఈ 10 రకాల ఆహారాలను రోజువారీ డైట్లో తీసుకుంటే కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను సహజ సిద్ధంగా దూరం చేసుకోవచ్చు. అవేంటో చుద్దాం. అముదం నూనెతో అద్భుత ప్రయోజనాలు 1. టామోటా: ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు టమోటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్త ప్రసరణు పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతాయి. టామోటాలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ముఖం మీద మచ్చలు పోగొట్టి మేనును మెరిపించేందుకు టమోటాలు మేలు చేస్తాయి. ముఖ్యంగా లైకోపీన్, ఇది రక్త కణాలను రక్షించి కళ్ళకు ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. టొమాటోస్ విటమిన్ సిసి, పొటాషియం,విటమిన్ కే కు గొప్ప మూలం. -ఇవన్నీ మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. నల్లటి వలయాలను తొలగించాలంటే.. ఒక టీ స్పూన్ టమోటా రసం, నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఎఫెక్టివ్ టిప్ 2. కీరదోస: కీరదోస కంటికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయలో చర్మాన్ని రీహైడ్రేట్ చేసే నీటి శాతం అధికంగా ఉంటుంది. దోసకాయను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలోలో విటమిన్లు కే,ఏ,ఈ, సీ అధికంగా ఉంటాయి. కీరదోస ముక్కలను అర గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి నల్లటి వలయాలు ఉన్నచోట పెట్టుకోవాలి. పది నిమిషాలు తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. టొమాటో మాటున ఆరోగ్యం 3. పుచ్చకాయ పుచ్చకాయలో కంటి ఆరోగ్యానికి తోడ్పడే బీటా కెరోటిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది 92% నీటిని కలిగి ఉంటుంది. కావున శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు బి 1, బి 6, సి అలాగే పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. 4. బ్లూ బెర్రీస్(నల్ల ద్రాక్షాలు) వీటిలో ఒమేగా 3, విటమిన్లు క\కె, సితోపాటు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. -ఇవన్నీ కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇది కళ్ళకు ప్రసరణను మెరుగుపరిచి, రక్త కణాలను రక్షించడానికి సహాయపడుతుంది. 5. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహార పదార్థాలు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు చర్మ సౌందర్యాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లతో పోరాడటానికి సహాయపడతాయి. విటమిన్ ఇ ముడతలు, వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది మచ్చలు, నల్లని వలయాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారాలు విటమిన్ ఇ కి మంచి వనరులు. 6. ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలను తినడం వల్ల రక్త ప్రసరణను పెంపుదలకు దోహదపడుదుంది. దీని ద్వారా చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 7. నారింజ ఆరెంజ్‌లో విటమిన్లు సి, ఎ అధికంగా ఉంటాయి, ఈ రెండూ కొల్లాజెన్‌ను పెంచడానికి, చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి. నారింజ జ్యూస్‌తో కూడా నల్లటి వలయాలను తొలగించొచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి నల్లటి వలయాలు ఉన్న చోట రాసుకోవాలి. ఇలా రోజు చేసినట్లయితే.. చాలా త్వరగా ఫలితం కనిపిస్తుంది. 8. బీట్రూట్ బీట్రూట్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిని రోజువారీ తినడం వల్ల కంటికి మంచిది. అంతేకాకుండా బీట్రూట్లో డైలేట్, మెగ్నీషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి, ఇవి చీకటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ రసం, పంచదార మిశ్రమంతో చర్మానికి స్క్రబ్ చేస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఇలా రోజూ బీట్ రూట్ రసాన్ని చర్మానికి పట్టిస్తే.. చర్మం కాంతిని సంతరించుకుంటుంది. 9. బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మెగ్నీషియం, విటమిన్ సిలను కలిగి ఉంది. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. ఇది నల్లని వృత్తాలను తొలగించి చర్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. 10. నీరు నీరు తాగటం వల్ల కళ్ళ కింద నల్లని వలయాలు, ఉబ్బినట్లు అవ్వడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు తీయడానికి నీరు సహాయపడుతుంది. అలాగే కంటి ప్రాంతం చుట్టూ ఉన్న చెడు వాటిని తగ్గిస్తుంది. అయితే చాలామంది ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోడానికి సప్లిమెంట్స్, అనేక క్రీముల వాడతారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. వీటిని తగ్గించుకునేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. అందుకే మీ ఆహారంలో పైన పేర్కొన్న ఆహారాన్ని చేర్చండి. తగినన్ని నీరు తాగడం. రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నల్లని వలయాలను తగ్గించడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. -
టమాట ధర ఢమాల్
కిలో రూ.80 నుంచి రూ.50కి పడిపోయిన రేటు పెరిగిన వంకాయల ధరలు తాడేపల్లిగూడెం : ఠారెత్తించిన టమాటా ధరలు ఆదివారం ఒక్కసారిగా పతనమయ్యాయి. సుమారు నాలుగు వారాల పాటు మార్కెట్‌ను ధరల దరువుతో కుదిపేసిన టమాటాలు సెంచరీ మార్కుకు చేరువయ్యే అంత సీన్ క్రియేట్ చేశాయి. రూ.80 వద్ద స్థిరంగా ఉండి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి టమాట ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో కిలో రూ.50కు పడిపోయింది. గుత్తగా 25 కిలోల ట్రే ధర రూ.900 రూపాయలకు పతనమైంది. అంతే కాకుండా సరుకులో నాణ్యత లేకపోతే ట్రే ధర రూ.400లే. దీంతో ఈ ప్రభావం రిటైల్ మార్కెట్‌పై పడింది. ధరలు మరింతగా దిగివచ్చాయి. కిలో 50 రూపాయలకే సరుకు దొరికింది. ఇదిలా ఉంటే వంకాయలు ధర ఒక్కసారిగా రయ్‌మంది. పది కిలోలు ఏకంగా 400 రూపాయలకు చేరుకుంది. విడిగా కిలో రూ.60కు అమ్మారు. నల్లవంకాయల ధర 40 రూపాయలకు చేరింది. ఆవపాడు నుంచి వచ్చే చిక్కుడు కాయల ధర కిలో 120 రూపాయలు పలికింది. గిద్దలూరు నుంచి వచ్చే చిక్కుళ్ల ధర కిలో 50 రూపాయలుంది. దోసకాయలు కిలో 30, దొండ కాయలు 24, కంద 40, పెండ్లం 30, మిర్చి 50, బీటురూట్,క్యారట్ 40రూపాయలకు విక్రయించారు. క్యాప్సికం 80, బీన్స్ వంద, క్యాబేజీ 20, చామ 40 రూపాయలకు అమ్మారు. కూరగాయల ధరలలో ఎగుడుదిగుడులు కనిపించాయి. కర్నూలు ఉల్లి.. ధరలో ఘాటు గుత్తా మార్కెట్లో క్వింటా రూ.1500 విడిగా మార్కెట్లో కిలో రూ.18 30 టిపిసి 21 : మార్కెట్‌కు వచ్చిన కర్నూలు ఉల్లిపాయలు కర్నూలు ఉల్లిపాయల సీజన్‌కు ఆదివారం వ్యాపారులు శ్రీకారం చుట్టారు. ముహూర్తాల ప్రకారం వ్యాపారులు లాంఛనంగా కర్నూలు నుంచి ఉల్లిపాయల లారీలను మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఆదిలోనే కర్నూలు ఉల్లిపాయల ధరలు దడను సృష్టించాయి. క్వింటాలు ధర గుత్త మార్కెట్లో 1500 రూపాయల వరకు పలికింది. విడిగా కిలో ఈ రకం ఉల్లిపాయలు 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వ్యాపారులు అమ్మారు. ప్రస్తుతం మార్కెట్ అవసరాలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు తీరుస్తున్నాయి. అవసరాల నిమిత్తం వ్యాపారులు ఉల్లిపాయలను కొనుగోలు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఉల్లిపాయలు కుళ్లిపోయాయి. దీంతో వ్యాపారులు వారం రోజుల క్రితం వరకు తీవ్ర నష్టాలను చవిచూశారు. కిలో పది రూపాయల కంటే కిందకు పెట్టి ఉల్లిపాయలను విక్రయించారు. కర్నూలు సీజన్ ప్రారంభం కావడంతో ఉల్లిపాయలు ఇక్కడి మార్కెట్‌కు ఆదివారం నుంచి వస్తున్నాయి. తొలుత క్వింటాలు 1400 రూపాయలు పలికిన ఉల్లిపాయలు ఆ తర్వాత 1500 రూపాయలకు ఎగబాకాయి. సరుకు నాణ్యతను బట్టి ఈ ధర వెళ్లింది. పాత ఉల్లిపాయల ధర క్వింటాలు 1600 నుంచి 1700 రూపాయలు పలుకగా విడిగా కిలో 20 రూపాయలకు విక్రయించారు. -
చుక్కల్లోనే కూరగాయల ధరలు
తాడేపల్లిగూడెం : టమాటాల ధర బాటలో వంకాయలు పయనిస్తున్నాయి. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో వంకాయలు ధరకు రెక్కలు వచ్చాయి. నల్ల వంకాయల ధర కిలో రూ.40కి ఎగబాకింది. తెల్లవంకాయల ధర రూ.50 పలికింది. క్యాప్సికం ధర కెవ్వుమనిపించి కిలో రూ.80కి చేరుకుంది. బీన్స్ సెంచరీ మార్కుకు చేరాయి. కీరా కూడా కిలో రూ.50కి చేరుకుంది. దొండకాయలు కిలో రూ.30, బెండకాయలు రూ.30, బీర రూ.40, దోసకాయలు రూ.24, కంద రూ.40, క్యాబేజీ రూ.20, క్యారెట్ రూ.40, బీట్రూట్ రూ.30, బీన్స్ రూ.90 ధర పలికాయి. చామ రూ.40, మిర్చి రూ.40కి అమ్మారు. మామిడికాయ ఒకటీ రూ.10, ములగకాడలు జత రూ.12 చేసి విక్రయించారు. టమాటాలు కాస్త కనికరం చూపించాయి. గుత్తగా 25 కిలోల ట్రే రూ.1,800 నుంచి రూ.1,600కి తగ్గింది. రిౖటైల్గా మాత్రం కిలో రూ.80 అమ్మారు. -
టమాటా కాలాంతకుడు !
‘సీఈటీ’ లీక్‌కూ పథకం పీయూసీ కింగ్‌పిన్ శివకుమారయ్య అరెస్ట్‌తో వెల్లడవుతున్న నిజాలు విస్తుపోతున్న పోలీసులు పలు యూనివర్శిటీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో కుమారయ్య హస్తం బెంగళూరు : కర్ణాటకలో ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కటకటాలపాలైన ప్రధాన ముద్దాయి, కింగ్‌పిన్ శివకుమారయ్య పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. కేవలం పీయూసీ ప్రశ్నపత్రాలే కాకుండా సీఈటీతో పాటు మరికొన్ని యూనివర్శిటీలకు చెందిన ప్రశ్నపత్రాలను లీక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సీఐడీ అధికారుల విచారణలో వెలుగుచూసింది. ఈ ఏడాది ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం రెండు సార్లు లీక్ అయిన ఘటనలో ప్రధాన నిందితుడైన శివకుమారయ్య రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల విక్రయ సమయంలో ఎవరికి అనుమానం రాకుండా ‘టమాటా’ అనే కోడ్ భాష వాడే శివకుమారయ్యను, సన్నిహితులు సైతం టమాటా అని పిలుస్తుంటారు. తుమకూరు జిల్లా గుబ్బికి చెందిన శివకుమారయ్య గతంలో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విచారణలో శివకుమారయ్య ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... కొన్నేళ్లుగా ఈ శివకుమారయ్య పీయూసీ, సీఈటీతో పాటు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల ముందు శివకుమారయ్య సహకారంతో సీఈటీలో ర్యాంకును పొంది ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న యువతి ఇప్పటి వరకూ ఇతనికి సహాయం చేసినట్లు తెలుస్తోంది. రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం లీకు ఘటనలో శివకుమారయ్య పేరు బయటకు వచ్చిన వెంటనే సదరు యువతికి అతడు కొంత డబ్బు ఇచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకోడానికి సహాయపడినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. సీఐడీ అధికారులు చివరికి ఆ యువతి ద్వారానే శివకుమారయ్య అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా అతడు అజ్ఞాతంలో ఉంటూనే ఈ ఏడాది సీఈటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్చేయడానికి స్కెచ్ వేశాడని, అయితే పోలీసుల నిఘా ఎక్కువ ఉండటంతో తన ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. ఇక శివకుమారయ్యకు ప్రశ్నపత్రాల లీకుకు సంబంధించి సహకారం అందించేవారిలో ప్రధానంగా పీయూసీ బోర్డులో గ్రూప్ 2 స్థాయి ఉద్యోగితో పాటు ఇద్దరు గ్రూప్–డీ ఉద్యోగులు కూడా ఉన్నారని సీఐడీ విచారణలో తేలింది. సదరు గ్రూప్ డీ ఉద్యోగులు ఇన్నోవా కారులో కార్యాలయానికి వచ్చేవారని ఇదంతా తనకు సహకారం అందించినందుకు పొందిన ప్రతిఫలమని శివకుమారయ్య సీఐడీ విచారణలో తెలిపినట్లు సమాచారం.