
సాక్షి, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా టమాటాల రేటు ఆకాశానంటిన విషయం తెలిసిందే. కిలో టమాట పలు చోట్ల ఏకంగా రూ.150 పలుకుతోంది. దీంతో, సామాన్యులు టమాటాలను కొనాలంటేనే జంకుతున్నాయి. అయితే, తాజగా ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే-44పై టమాటాలను తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడింది. దీంతో, టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ క్రమంలో కిందపడిపోయిన టమాటాలను తీసుకువెళ్లేందుకు ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు. ఇక, లారీ బోల్తా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, లారీ.. కర్ణాటకలోని కోలార్ నుంచి టమాటాలను లోడ్‌ను ఢిల్లీ తరలిస్తుండగా బోల్తాపడింది. లారీలో తరలిస్తున్న టమాటాల విలువ దాదాపు రూ.2లక్షలు ఉంటాయని అంచనా.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో ఉద్రికత్త.. పోలీసుల లాఠీచార్జ్!
Comments
Please login to add a commentAdd a comment