lorry overturned
-
టమాటాల లారీ బోల్తా.. దొరికిన కాడికి ఎత్తుకెళ్లిన జనం..
సాక్షి, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా టమాటాల రేటు ఆకాశానంటిన విషయం తెలిసిందే. కిలో టమాట పలు చోట్ల ఏకంగా రూ.150 పలుకుతోంది. దీంతో, సామాన్యులు టమాటాలను కొనాలంటేనే జంకుతున్నాయి. అయితే, తాజగా ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే-44పై టమాటాలను తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడింది. దీంతో, టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ క్రమంలో కిందపడిపోయిన టమాటాలను తీసుకువెళ్లేందుకు ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు. ఇక, లారీ బోల్తా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, లారీ.. కర్ణాటకలోని కోలార్ నుంచి టమాటాలను లోడ్‌ను ఢిల్లీ తరలిస్తుండగా బోల్తాపడింది. లారీలో తరలిస్తున్న టమాటాల విలువ దాదాపు రూ.2లక్షలు ఉంటాయని అంచనా. ఇది కూడా చదవండి: ఖమ్మంలో ఉద్రికత్త.. పోలీసుల లాఠీచార్జ్! -
మామిడి కాయల లోడు లారీ బోల్తా
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో స్క్యూ బ్రిడ్జి వద్ద మామిడి కాయల లోడు లారీ బోల్తా పడటంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం నూజివీడు నుంచి మామిడి కాయల లోడుతో చిత్తూరు వెళుతున్న లారీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ అదపు తప్పి స్క్యూబ్రిడ్జి తూర్పు భాగంలో కిందపడింది. ఆ సమయంలో బ్రిడ్జి కింద కొందదిటి శివ, మల్లేశ్వరి దంపతుల కుమారుడు సంజీవ్ (3)కు స్నానం చేయించి, బట్టలు వేసేందుకు తల్లి ఇంటిలోకి వెళ్లింది. ఇంతలో పెద్ద శబ్దంతో లారీ బోల్తా పడింది. లారీ బాలుడిపై పడింది. స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసలు సంఘటన స్ధలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కింద పడిన లారీని అర్ధరాత్రికి పైకి తీశారు. దాని కింద ఉన్న సంజీవ్‌ను 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. పిల్లాడి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి క్యాజువాలిటి ముందు నిరసనకు దిగారు. మృతదేహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఎస్కె ఖాదర్‌బాషా, పటమట, కృష్ణలంక సీఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తీవ్ర గాయాలైన లారీ డ్రైవర్ హరిబాబు, క్లీనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఔటర్‌పై లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
శంషాబాద్: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హమీదుల్లానగర్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గచ్చిబౌలి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ హమీదుల్లానగర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బోల్తా : ముగ్గురికి గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జాతీయరహదారిపై గురువారం పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే లారీ బోల్తాతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగంలోని దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బోల్తా: ఇద్దరు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి బస్టాండ్ వద్ద జనరేటర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీపై ఎక్కి ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. వారిపై జనరేటర్లు పడటంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పట్టణంలో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తా పడటంతో స్థానిక రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనరేటర్ల లోడుతో వెళ్తున్న లారీ విజయవాడ నుంచి రేపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.