లారీ బోల్తా: ఇద్దరు మృతి | Two died in lorry overturned in Tenali | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా: ఇద్దరు మృతి

Published Thu, Nov 13 2014 12:28 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

గుంటూరు జిల్లా తెనాలి బస్టాండ్ వద్ద జనరేటర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి బస్టాండ్ వద్ద జనరేటర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీపై ఎక్కి ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. వారిపై జనరేటర్లు పడటంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పట్టణంలో ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తా పడటంతో స్థానిక రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనరేటర్ల లోడుతో వెళ్తున్న లారీ విజయవాడ నుంచి రేపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement