Cucumbers
-
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు ప్రకృతి సహజం. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా మన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చెమట రూపంలో నీరు ఎక్కువ నష్టపోతాం కాబట్టి, నీరు ఎక్కువగా లభించే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఈ క్రమంలో సమ్మర్లో కీరదోసకాయను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. నిజానికి కీరదోస ఏ సీజన్లో తీసుకున్నా మంచిదే. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. వేసవిలో అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయలు కేలరీలు తక్కువ. విటమిన్లు , ఖనిజాలు ఎక్కువ. కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.కీరదోసతో లాభాలుహైడ్రేషన్ & డిటాక్సిఫికేషన్ కోసం మంచిదిరక్తపోటును నియంత్రిస్తుందిజీర్ణక్రియకు మంచిదిబ్లడ్ షుగర్ తగ్గిస్తుందిబరువు తగ్గడంలో ఉపయోగపడుతుందిమెరుగైన చర్మం కోసంకళ్లకు సాంత్వన చేకూరుస్తుందికేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందివడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో 95 శాతం నీటితోపాటు, పొటాషియం,మెగ్నీషియం లభిస్తాయి. సోడియం లోపం ఉన్నవారు ఆహారంలో ఈ కీర దోసకాయని తీసుకుంటే మంచిది. పొట్టుతో కీర దోసకాయ తినడం వల్ల గరిష్టంగా పోషకాలు అందుతాయి.ఫ్లేవనాయిడ్లు ,టానిన్లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి ,దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కీర దోసకాయలోని పెక్టిన్ పేగు కదలికలను బాగు పరుస్తుంది. తద్వారా మలబద్దకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. -
వేసవిలో ఈ పంటతో.. శ్రమ తక్కువ! ఆదాయం ఎక్కువ!
వేసవికాలంలో దోస పంట సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పంట సాగుకు రసాయన ఎరువులు వినియోగం ఉండదు. సాగు ఖర్చులు కూడా తక్కువే. తక్కువ శ్రమతో ఈ పంటను సాగు చేయవచ్చు. కరీంనగర్, నిర్మల్ మండలంలోని కనకాపూర్ గ్రామం దోసకాయలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. గ్రామానికి చెందిన 20 నుంచి 30 మంది రైతులు ఇతర గ్రామాల రైతులకు భిన్నంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే దోసకాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిగిలిన పంటల కంటే తక్కువ సమయంలో సాగయ్యే దోస కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రైతులు తాము పండించిన దోసకాలను స్వయంగా జాతీయ రహదారిపై కిలోకు రూ.60 నుంచి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితో దోస పంటను సాగు చేస్తున్నామని కనకాపూర్ రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. మధ్య దళారీలు లేకపోవడంతో రైతులు పండించిన దోస కాయలను నేరుగా తమ గ్రామంలోని బస్టాండ్‌లో అమ్ముతున్నారు. ఎకరాకు ఖర్చులు పోనూ రూ.80 వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. – రాజు, యువ రైతు, కనకాపూర్ సేంద్రియ ఎరువులతో సాగు దోస పంట సాగుకు ఇక్కడి రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. మంచి ఆదాయం.. ఎకరా విస్తీర్ణంలో దోస పంట సాగు చేశా. సాగు ఖర్చులు పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట. – రఘు, యువ రైతు, కనకాపూర్ ఇవి చదవండి: Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది -
పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు
గోదావరి జిల్లా వాసులంటే తిండితో చంపేస్తారురా బాబు అంటుంటారు. గోదావరి తీరాన వంటకాలకు ప్రసిద్ధి చెందిన పల్లెలు చాలానే ఉంటాయి. కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట ΄పొట్టిక్కలు... ఉసులుమర్రు పచ్చళ్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి గట్టుకు ఆనుకుని తణుకుకు అరగంట ప్రయాణ దూరంలో ఉండే ఆ గ్రామం ఎప్పుడూ సముద్రంలో ఉప్పునూ చెట్టు మీద కాయను కలిపి పచ్చళ్లు పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. వ్యక్తిగతంగా కావచ్చు, యజమాని కింద కావచ్చు ఆ గ్రామంలోని స్త్రీలలో ముప్పై, నలభై శాతం పచ్చళ్లు పెట్టడంలో ఉపా ధి ΄పొందుతూ ఉంటారు. వీరితో పా టు ఇరవై శాతం మగవారు ఈ పనిలో ఉంటారు. ఇక్కడి స్త్రీల చేతికి రుచి ఎక్కువ. అందుకే ఉసులుమర్రు పచ్చళ్లకు గిరాకీ ఎక్కువ. 40 సంవత్సరాల క్రితం నుంచి ఉసులుమర్రి జనాభా 2500 మాత్రమే. వీరిలో ఐదు వందల మంది స్త్రీలకు పైగా, మూడు వందల మంది పురుషులకు పైగా అందరూ కలిసి దాదాపు 1000 మంది వరకు సీజన్లో పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉంటారని అంచనా. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు అనేక రకాల పచ్చళ్లు పెడుతుంటారు. ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపా ధిని కల్పించుకున్నారు. 40 సంవత్సరాల క్రితం పిళ్లా పెదకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారిని చూసి వారి బంధువులు మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపా రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తయారీలో మూడోతరం నిమగ్నమైంది. ఇవీ ప్రత్యేకం టమాటా, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ తదితర పచ్చళ్ళకు ఉసులుమర్రు ప్రత్యేకం. పచ్చళ్ల తయారీలో మహిళలకు కనీసం 300 రోజు కూలీ దక్కుతోంది. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఖర్చులు పొ గా మిగిలే లాభంతో తమకెంతో సంతోషంగా ఉంటుందంటున్నారు. ఈ ఒక్క పల్లెలో అన్ని రకాల పచ్చళ్లూ కలిసి ఏడాదికి 500 టన్నులు పచ్చళ్లు పడుతుంటారని అంచనా. టన్ను పచ్చడి రూ.2.50 లక్షలు వంతున విక్రయిస్తుంటారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్లు. మహిళలు ఇళ్లవద్ద పచ్చళ్లు పెడితే పురుషులు మాత్రం ఏడెనిమిది నెలలపా టు ఊళ్లు తిరుగుతూ చివరిడబ్బా అమ్మేశాక మాత్రమే ఇంటికి తిరిగొస్తారు. కుటుంబాన్ని వదిలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, వరంగల్, నల్గొండ, బోధన్, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, మిరియాలగూడ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాది ΄పొడవునా నిల్వ ఉసులుమర్రు ఆవకాయ అంటే ఏడాది ΄పొ డవునా నిల్వకు తిరుగుండదంటారు. ముదురు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆరబెట్టి ఆవపిండి, మెంతులు, ఎర్రపచ్చడి కారం, వేరుశెనగ లేదా నువ్వుల నూనె కలిపి మూడు రోజుల తరువాత జాడీలో పెడతారు. ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన ముక్కలను డ్రమ్ములో వేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడే వారి కళ్లెదుటే అన్నీ కలిపి ఇవ్వడంతో నమ్మకం రెట్టింపు అయ్యిందంటారు. వేసవిలో పండుమిరప, ఉసిరి, ఆవకాయ, గోంగూర, కాకరకాయ పెడతారు. వానాకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆగస్టు నుంచి అల్లం, వెల్లుల్లి, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీరలాంటివి పెడతారు. మిక్స్డ్ వెజిటబుల్ అడిగితే పెట్టి ఇస్తారు. నిమ్మకు నిల్వ తక్కువ కాబట్టి తక్కువగా పెడతారు. చికెన్, రొయ్యలతో నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా చేసి ఇస్తారు. సరుకును బట్టి లాభం. ఉదాహరణకు డ్రమ్ (200 కిలోలు) పండు మిరప పచ్చడి పట్టడానికి 20 వేలు అవుతుంటే మార్కెట్లో కిలో రూ.250కు అమ్ముతుంటారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు సాక్షి, కాకినాడ ,ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, పెరవలి అందరూ ఆవకాయ పెట్టుకోరు. బయటి నుంచి తెచ్చుకునేవారు. ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆ ఊరి స్త్రీలు ఆవకాయ పెడతారు. మే నుంచి జూన్ వరకూ ఉమ్మడి తూ.గో.జిల్లాలోని ఉసులుమర్రు స్త్రీలు ఆవకాయతో పా టు రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. వాటిని తీసుకుని మగవారు జిల్లాలకు బయలుదేరి నెలల తరబడి అమ్ముతారు. రోజూ ఏదో ఒక పచ్చడి తయారు చేసే ఆ ఊరి స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధులు. -
వేసవికాలం మండే ఎండలు.. ఆ పంటతో అదిరిపోయే లాభాలు!
జైనథ్(ఆదిలాబాద్): నీటి వసతి ఉన్న చేన్లలో సైతం సాధారణంగా రెండు పంటలు తీయడానికి రైతులు నానా అవస్థలు పడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక, పెట్టిన పెట్టుబడి చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. కా నీ జైనథ్ మండలం పార్డి గ్రామానికి చెందిన అస్తక్ సుభాష్ పాలీహౌస్‌తో కేవలం ఒక ఎకరంలోనే సంవత్సరానికి మూడు పంటలు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలంలో ఎండలు దంచి కొడుతున్న తరుణంలో కూడా పాలీహౌజ్‌లో కీరదోస సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలతో విసిగి.. చాలా మంది రైతులు ఏళ్లతరబడి సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, ఇతర పప్పుధాన్యాల సాగును అంటిపెట్టుకుని యేటా నష్టాలు చవిచూస్తుంటారు. అయితే కొంత మంది రైతులు మాత్రం పత్తి, సోయా వంటి పంటలకు భిన్నంగా హార్టికల్చర్ వైపు దృష్టి సారిస్తున్నారు. నాలుగైదు ఏళ్లుగా పత్తి పంటను గులాబీరంగు పురుగు ఆశించడంతో దిగుబడి భారీ గా పడిపోతోంది. సోయాలో కూడా గతంలో మాది రి ఆశించిన దిగుబడి రాకపోవడంతో విసిగిపోయిన రైతులు పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయలు, పండ్ల సాగుకు అధికంగా శ్రమించాల్సి రావడంతో చాలా తక్కువ మంది మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. పార్డి గ్రామానికి చెందిన అస్తక్ సుభాష్ కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ పంటల జోలికి పోకుండా పాలీహౌస్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న కీరదోస, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ వంటి పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. మిగిలిన భూమిలో కూడా కాకర, బీరకాయ, టమాట, జొన్న, నువ్వులు వంటి పంటలు సాగు చేస్తున్నాడు. 250 క్వింటాళ్ల దిగుబడి సాధారణంగా కీరదోసకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే కీరదోస హాట్‌కేక్‌లా అమ్ముడుపోతుంది. ఇది గ్రహించిన రైతు సుభాష్ తన పాలీహౌజ్‌లో వేసవి ప్రారంభంలో ఫిబ్రవరి మాసంలో ఎకరం విస్తీర్ణంలో కీరదోస సాగు చేశాడు. రూ.82వేలతో గుజరాత్ నుంచి నాణ్యమైన విత్తనాలు తెప్పించాడు. ఎరువులు, కూలీ ఖర్చు కలిపి మరో రూ.70వేల వరకు అయ్యింది. మొత్తం రూ.1.50 లక్షల్లో కీర సాగు పూర్తి అయ్యింది. మార్చి చివరి నుంచి పంట దిగుబడి రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 200 క్వింటాళ్ల దోస మార్కెట్‌కు తరలించాడు. మరో 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. క్వింటాల్‌కు రూ.2వేల చొప్పున ఇప్పటి వరకు రూ.4 లక్షల ఆదాయం వచ్చిందని, మరో రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు పేర్కొంటున్నాడు. ఈ ఏడాది సకాలంలో పంట వేయడం, మార్కెట్లో మంచి ధర లభించడంతో మంచి లాభాలు వచ్చాయంటున్నాడు. -
నాలుగు నెలల్లో దిగుబడి, తక్కువ ఖర్చు.. మార్కెట్లో ఫుల్ డిమాండ్
సాక్షి,రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని విసంపేట గ్రామంలో పలువురు రైతులు కీర దోసకాయ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు చేయొద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో ప్రత్నామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో నాలుగు నెలల్లో గరిష్టంగా దిగుబడి పొందే అవకాశం ఉండటంతో పలువురు రైతులు కీర దోస సాగుపై మొగ్గు చూపారు. విసంపేటలో సుమారు 20 ఎకరాల్లో కీర దోస సాగు చేస్తున్నట్లు ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. ఖర్చు తక్కువ.. దిగుబడి అధికం కీర దోస సాగు ప్రారంభించిన తర్వాత నాలుగు నెలల కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వస్తుంది. భూమిలో బలం కోసం నెలకోసారి యూరియా చల్లితే సరిపోతుంది. నెల తర్వాత దిగుబడి ప్రారంభమై ప్రతిరోజూ సుమారు క్వింటాల్ కీర దోస పడుతుంది. భూమిపై పూర్తిగా పరుచుకొని సాగవుతుండటంతో కలుపు సమస్య ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువ. దిగుబడి ప్రారంభమయ్యాక ప్రతిరోజూ కాయలు తెంపాలి. మరుసటి రోజు తెంపితే ముదిరిపోయే అవకాశం ఉంటుంది. అధిక పోషక విలువలు.. ∙కీర దోసకాయల్లో అధిక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ∙నీటి శాతం, అంటీ యాక్సిడెంట్లు ఎక్కువ.హైడ్రేషన్‌ను ప్రోత్సహిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ జీవప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. ∙వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు, గొంతు తడిగా ఉంటూ శరీరం చల్లాగా ఉండేందుకు ఉపయోపడుతుంది. ∙300 గ్రాముల పొట్టు తీసిన దోసకాయలో కేలరీలు 45 గ్రాములు, కార్పొహైడ్రేట్స్ 11 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ సీ 14%, ప్రతీరోజు తీసుకోవడం వల్ల 62% కాల్షియం, మెగ్నీషియం 10%, పొటాషియం 13%, మాంగనీస్ 12% లభ్యమవుతాయి. ∙శరీరంలోని అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ∙బరువు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గడంలో సహాయపడుతుంది. ∙మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముక ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఆదాయం బాగుంది నాకున్న అర ఎకరంలో ఫిబ్రవరి 10వ తేదీన దోస సాగు ప్రారంభించా. నెల రోజులకు దిగుబడి ప్రారంభమైంది. ప్రతిరోజూ సుమారు 50 కిలోల దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండటంతో తెంపిన క్షణంలోనే విక్రయిస్తున్న. 50 కిలోలకు రూ.800వరకు ధర పలుకుతోంది. ఆదాయం బాగుంది. – బర్పటి సంతోశ్, కీర దోస సాగు రైతు, విసంపేట రైతులను ప్రోత్సహిస్తున్నాం నిత్యం మార్కెట్లో విరివిగా డిమాండ్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కాయలను ఉత్పత్తి చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. విసంపేటలో రైతులు కీరదోసతో లాభాలు గడించడంతో మరికొంత మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లిస్తారు. – శ్రీకాంత్, ఉద్యానవనశాఖ అధికారి ప్రయోజనకరం వేసవిలో కీర దోస ఎంత ఎక్కువ తింటే అంత ప్రయోజనం. నీటి శాతం ఎక్కువ ఉండటంతో డీహైడ్రేషన్‌కు అవకాశం ఉండదు. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉండటంతో సైడ్ ఎఫెక్టŠస్ ఉండవు. శరీరంలో నీటిశాతం పెరగడంతో వేడిని గ్రహించదు. దాని విలువ తెలియడంతో ప్రతీ ఫంక్షన్, హోటల్లలో ముందుగా కీరదోస ముక్కలు అందిస్తున్నారు. – డాక్టర్ కటుకం అమర్నాథ్, ఎండీ(ఆయుర్వేదం) -
కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే!
Health Benefits Of Cucumber: మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్‌లా తింటుంటారు. కీర దోస ఉపయోగాలను తెలుసుకుందాం. కీర దోస ఆరోగ్య ప్రయోజనాలు ►కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ►ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ►అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. ►శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. ►కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి. ►కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. ►దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. ►కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. ►దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. ►కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ►ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది. ►కీరదోసను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా ఉంటాయి. చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే -
ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం..
మనలోని చాలామందికి కళ్ల చుట్టూ నల్లని వలయాలు(డార్క్ సర్కిల్స్) సమస్యగా మారుతుంది. లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఎదరవుతుంది. ఇది మన అందాన్ని పాడుచేసి ఆత్మవిశ్వాసంను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు వయసు మీద పడుతున్న కొద్ది, కంటి చుట్టూ నల్లని వలయాలు అనువంశికత కారణంగా కూడా రావచ్చు. కానీ ఈ వలయాలు ఏర్పడటానకి కారణాలు అనేకం. కొన్నిసార్లు నిద్రలేమి, ఒత్తిడి, అధిక ధూమపానం, మద్యపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి వాటి వలన కూడా కావచ్చు. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.. ముఖానికి అందం కళ్లు. కానీ, ఆ కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు అందాన్ని తగ్గించమే కాదు, మనల్ని బలహీనులుగానూ చూపిస్తుంది. అయితే సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్‌ను అంతం చేయవచ్చు. ఈ 10 రకాల ఆహారాలను రోజువారీ డైట్లో తీసుకుంటే కళ్ల చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను సహజ సిద్ధంగా దూరం చేసుకోవచ్చు. అవేంటో చుద్దాం. అముదం నూనెతో అద్భుత ప్రయోజనాలు 1. టామోటా: ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు టమోటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్త ప్రసరణు పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతాయి. టామోటాలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ముఖం మీద మచ్చలు పోగొట్టి మేనును మెరిపించేందుకు టమోటాలు మేలు చేస్తాయి. ముఖ్యంగా లైకోపీన్, ఇది రక్త కణాలను రక్షించి కళ్ళకు ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. టొమాటోస్ విటమిన్ సిసి, పొటాషియం,విటమిన్ కే కు గొప్ప మూలం. -ఇవన్నీ మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. నల్లటి వలయాలను తొలగించాలంటే.. ఒక టీ స్పూన్ టమోటా రసం, నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఎఫెక్టివ్ టిప్ 2. కీరదోస: కీరదోస కంటికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయలో చర్మాన్ని రీహైడ్రేట్ చేసే నీటి శాతం అధికంగా ఉంటుంది. దోసకాయను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలోలో విటమిన్లు కే,ఏ,ఈ, సీ అధికంగా ఉంటాయి. కీరదోస ముక్కలను అర గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి నల్లటి వలయాలు ఉన్నచోట పెట్టుకోవాలి. పది నిమిషాలు తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. టొమాటో మాటున ఆరోగ్యం 3. పుచ్చకాయ పుచ్చకాయలో కంటి ఆరోగ్యానికి తోడ్పడే బీటా కెరోటిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది 92% నీటిని కలిగి ఉంటుంది. కావున శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు బి 1, బి 6, సి అలాగే పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. 4. బ్లూ బెర్రీస్(నల్ల ద్రాక్షాలు) వీటిలో ఒమేగా 3, విటమిన్లు క\కె, సితోపాటు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. -ఇవన్నీ కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇది కళ్ళకు ప్రసరణను మెరుగుపరిచి, రక్త కణాలను రక్షించడానికి సహాయపడుతుంది. 5. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహార పదార్థాలు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు చర్మ సౌందర్యాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లతో పోరాడటానికి సహాయపడతాయి. విటమిన్ ఇ ముడతలు, వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది మచ్చలు, నల్లని వలయాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారాలు విటమిన్ ఇ కి మంచి వనరులు. 6. ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలను తినడం వల్ల రక్త ప్రసరణను పెంపుదలకు దోహదపడుదుంది. దీని ద్వారా చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 7. నారింజ ఆరెంజ్‌లో విటమిన్లు సి, ఎ అధికంగా ఉంటాయి, ఈ రెండూ కొల్లాజెన్‌ను పెంచడానికి, చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి. నారింజ జ్యూస్‌తో కూడా నల్లటి వలయాలను తొలగించొచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి నల్లటి వలయాలు ఉన్న చోట రాసుకోవాలి. ఇలా రోజు చేసినట్లయితే.. చాలా త్వరగా ఫలితం కనిపిస్తుంది. 8. బీట్రూట్ బీట్రూట్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిని రోజువారీ తినడం వల్ల కంటికి మంచిది. అంతేకాకుండా బీట్రూట్లో డైలేట్, మెగ్నీషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి, ఇవి చీకటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ రసం, పంచదార మిశ్రమంతో చర్మానికి స్క్రబ్ చేస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఇలా రోజూ బీట్ రూట్ రసాన్ని చర్మానికి పట్టిస్తే.. చర్మం కాంతిని సంతరించుకుంటుంది. 9. బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మెగ్నీషియం, విటమిన్ సిలను కలిగి ఉంది. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. ఇది నల్లని వృత్తాలను తొలగించి చర్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. 10. నీరు నీరు తాగటం వల్ల కళ్ళ కింద నల్లని వలయాలు, ఉబ్బినట్లు అవ్వడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు తీయడానికి నీరు సహాయపడుతుంది. అలాగే కంటి ప్రాంతం చుట్టూ ఉన్న చెడు వాటిని తగ్గిస్తుంది. అయితే చాలామంది ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోడానికి సప్లిమెంట్స్, అనేక క్రీముల వాడతారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. వీటిని తగ్గించుకునేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. అందుకే మీ ఆహారంలో పైన పేర్కొన్న ఆహారాన్ని చేర్చండి. తగినన్ని నీరు తాగడం. రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నల్లని వలయాలను తగ్గించడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. -
ముఖమా! ముత్యమా!
మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలలు ఎండలు దంచి కొట్టాయి. రోట్లో స్వయానా మనమే ఎండు మిరపకాయలు దంచి కొట్టినా ఇంతగా మంటెత్తిపోదేమో. ప్రచండుడు ప్రతాపం చూపించాడు. రెండు మూడు రోజుల్లో రుతు ³వనాలు అంటున్నారు. వానలే వానలు. సంతోషమే కదా. భూమి చల్లబడుతుంది. మన ఇళ్లూ, ఒళ్లూ చల్లబడతాయి. అయితే ఇన్నాళ్లూ ఎండలకు ఛాయ తగ్గిన మోము మాటేమిటి? మెల్లిగా మునుపటి మెరుపులోకి తెచ్చుకోవలసిందే. అయితే అందుకోసం గొడుగు వేసుకుని సూపర్ బజార్‌కి పరుగెత్తే పని లేదు. ఇంట్లో ఉండి, ఇంట్లో ఉండేవాటితో ముఖ కాంతిని చల్లని చంద్రకాంతిలా వెలిగించుకోవచ్చు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్’ అంటున్నారా.. ఇంటి క్రీమ్‌లు అనగానే! క్రీమ్‌లు కావివి. కీర దోసకాయలు, బేసన్ ఫ్లోర్.. (సెనగపిండి), పసుపు, పెరుగు, తేనె, నిమ్మ, పాలు. అంతే! అన్నిటినీ కలిపి ముఖానికి టచింగ్ ఇవ్వమనడం లేదు. కాంబినేషన్లతో మూడు రకాలుగా ప్రయోగిస్తే చాలు. వా..డా..య్.. అంటూ మీ ముఖంలోకి కాటుక లేని అందమైన చంద్రముఖి వచ్చేస్తుంది. దోస్కాయ్ తీస్కోండి దోసంటే కీర దోస. రౌండ్‌గా చక్రాల్లా కొయ్యండి. రౌండ్‌గా ఎలా కొయ్యాల్రా దేవుడా అని కంగారు పడకండి. కళ్లు మూసుకుని కోసినా.. కీర చక్రాలు చక్రాలుగానే వస్తుంది. ఆ చక్రాలను కళ్ల మీద పెట్టుకోనవసరం లేదు. మెల్లిగా ముఖమంతా రుద్దండి. ఒకే చక్రాన్ని కాదు. ముఖానికంతటికీ చాలినన్ని చక్రాలు. ఇప్పుడు ముఖమంతా కీరా అయింది కదా. అదే.. కీరా రుద్దడంతో తడితడిగా అయింది కదా. ఆ తడిని పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. వెంటనే మెరిసిపోతుందా ముఖం?! మెరుపు కనిపిస్తుంది.. మంచి మెరుపు కోసం వారానికి రెండుసార్లైనా కీరాను కొయ్యాల్సిందే. సెనగ ప్యాక్ వేస్కోండి కీరాతో రుద్ది కడిగాక సెనగ ప్యాక్ వెయ్యమని కాదు. అది వేరు. ఇది వేరు. ఇదింకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనే మాట బాగోలేదా! అయితే సౌందర్యసాధనం అందాం. రెండు టేబుల్స్పూన్ల సెనగ పిండి తీసుకోండి. బజ్జీలు వేసే సెనగపిండే. ఇక రెండు టేబుల్స్పూన్లంటే రెండు రెండు చిన్న కూరగరిటెలంత. టీస్పూన్ లెక్క వేరు. కాఫీని, టీని కలపడానికి ఉపయోగించే స్పూన్ టీస్పూన్. సరే, ఇవి మీకు తెలియనివా కానీ, ఇప్పుడేం చేస్తారంటే సెనగపిండిలో టీ స్పూను పసుప్పొడి కలపండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వెయ్యండి.మూడింటినీ మిక్స్ చెయ్యండి. బాగా పేస్ట్‌లా వచ్చేయాలి. ఆ పేస్ట్‌ని బ్రష్‌తో ముఖానికికంతటికీ అద్దండి. మళ్లీ ఈ బ్రెష్ ఎక్కడి నుంచి తేవాలి! ఫేస్‌ప్యాక్ బ్రెష్ అని బయట అమ్ముతారు కానీ.. అక్కర్లేదు, వేళ్లతో మృదువుగా ముఖానికి పామేయండి. అదంతా ఆరిపోయేవరకు ఆగి, ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి. చల్లని నీళ్లతోనే. ముఖం తళతళ. మార్పు ఇమ్మీడియెట్‌గా కనిపిస్తుంది. తేనె, నిమ్మ రాస్కోండి రెండు చిన్నగరిటెల తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. మంచి వాసనొస్తుంది. తినబుద్ధవుతుంది. తినకండి. మనం పెట్టుకున్న పని వేరే కదా. ఆ సెషన్ (తినే సెషన్) మరోసారెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడైతే ముఖానికి పూసుకోండి. పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.ఈ మూడు ట్రిక్లలో (మీ ముఖం ఎలా ఇంతగా మెరిసిపోతుంది అని అడిగినవారికి చెప్పకపోతే అది ట్రిక్కే కదా).. ‘చల్లటి నీరు’ అనే మాట కనిపించింది కదా. చల్లటి నీరు అంటే ఫ్రిజ్‌లోని వాటర్ కాదు. ముఖానికి హాయినిచ్చేంత చల్లగా ఉండే నీరు. ఎటూ వర్షాలు మొదలై వాతావరణ చల్లబడబోతోంది కాబట్టి ట్యాంకులోని నీళ్లు, తొట్లలోని నీళ్లు, బిందెల్లోని నీళ్లు చల్లగానే ఉంటాయి. అవి చాలు. ఓ మగ్గు నీటితో మెరిసేయొచ్చు.. ఒకవేళ వర్షాలొచ్చినా.. మీ కాలనీలో నీళ్లు రాకపోతుంటే.గుర్తుంచుకోండి.. ఈ మూడు ఒకేసారి, ఒకే రోజు చేయవలసినవి కాదు. మీ మూడ్‌ని బట్టి, మీ టైమ్‌ని బట్టి, కిచెన్‌లో మీకు అందుబాటులో ఉన్నవాటిని బట్టి ఏదో ఒకటి ఎంచుకుని చెయ్యండి. ఇంకో రోజు ఇంకోటి.. తర్వాత ఇంకోటి.. ఇలా!వెలిగిపోతున్న మీ ముఖాన్ని చేసి, అంత కాంతిని భరించలేక సూర్యుడే తన కళ్లకు చెయ్యడ్డు పెట్టకోవాలి. దెబ్బకు దెబ్బ తియ్యకుండా ఊరుకుంటామా మరి. -
వేసవికి దోస
దోసకాయలో నీటిపాళ్లు ఎక్కువ. అందుకే ఈ వేసవి సీజన్లో తప్పక వండుకోవాల్సిన కూరగాయ దోస. దాదాపు 80 రకాల పోషకాలు నిండి ఉన్న ఆరోగ్య వనరు ఇది. చాలా రుచిగా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వాటిల్లో ఇవి కొన్ని. ►దోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ, పెద్దపేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్ట్రబుల్నూ, కడుపునొప్పిని అరికడుతుంది. ► నోట్లోకి యాసిడ్ రావడం, ఛాతీలో మంట వంటి సమస్యలను నివారిస్తుంది. ► దోసకాయ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ► రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చూడటంతో పాటు, గుండెను కాపాడుతుంది. ► అనేక రకాల చర్మవ్యాధులను, చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు మేనికి నిగారింపు తెస్తుంది. ► మనకు మేలు చేసే అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం వల్ల మనకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. ►అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మరీ ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది. ►త్వరగా కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటు, సంతృప్తభావనను ఇస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ►మైగ్రేన్ వంటి తలనొప్పులను తగ్గిస్తుంది. -
బీపీకీ, షుగర్కీ
కీరదోసకాయను మనమందరమూ సలాడ్‌లాగా వాడతాం. పైగా ఇప్పుడు వేసవి కావడంతో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దీన్ని సలాడ్‌లా వాడుకుంటారుగానీ నిజానికి కీరదోసతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని. కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణాలు కూడా చాలా ఎక్కువ. అందుకే ఒంట్లో నీటిపాళ్లు తగ్గి డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు వాటిని తక్షణం భర్తీ చేయడానికి కీరదోస ముక్కలు తినడం ఉత్తమమైన మార్గం.కీరదోసలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే అది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది దేహంలోకి చక్కెరను ఆలస్యంగా, నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు మేలుచేస్తుంది. కీరదోసలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు జీర్ణశక్తికి దోహదపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కీరదోసలో మేనిని నిగనిగలాడేలా చేసేందుకు ఉపయోగపడే మెగ్నీషియమ్ వంటి పోషకాలు చాలా ఎక్కువ. అందుకే దీన్ని సౌందర్యసాధనంగా కూడా వాడతారు. కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. కీరదోస ముఖ్యంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది.కీరదోసను మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పేర్కొనవచ్చు. అది ఒంట్లోని అనేక విషపదార్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తుంది. -
కుకుంబర్‌ను కుకర్బాంబ్ అన్నందుకు..
లండన్: బ్రిటన్‌లో నాలుగేళ్ల చిన్నారి ‘కుకుంబర్ (దోసకాయ)’ స్పెల్లింగ్‌ను ‘కుకర్ బాంబ్’ అని పొరపాటుగా పలకడం నేరమైంది. స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారిని తీవ్రవాద వ్యతిరేక చర్యలకు సిఫార్సు చేసింది. లూటన్‌లోని నర్సరీ పాఠశాలలో చదువుతున్న చిన్నారి.. ఒక మనిషి పెద్ద కత్తితో కూరగాయలను కోస్తున్న చిత్రాన్ని వేశాడు. అప్పుడు కుకుంబర్ అని చెప్పడానికి బదులు ‘కుకర్ బాంబ్’ అని పలికాడు. దీంతో పాఠశాల తమ బాబుకు శిక్ష విధించిందంటూ అతడి తల్లి వాపోయింది. కుకర్ బాంబ్ అని పలికినందుకు ఆ బాబును హోం శాఖ నిర్వహించే ఉగ్రవాద నిరోధక కార్యక్రమానికి పంపాలని ప్రతిపాదించామని పాఠశాల సిబ్బంది చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.