వేసవికి దోస | Cucumber is high in water | Sakshi
Sakshi News home page

వేసవికి దోస

Published Thu, May 10 2018 11:53 PM | Last Updated on Fri, May 11 2018 12:04 AM

Cucumber is high in water - Sakshi

దోసకాయలో నీటిపాళ్లు ఎక్కువ. అందుకే ఈ వేసవి సీజన్‌లో తప్పక వండుకోవాల్సిన కూరగాయ దోస. దాదాపు 80 రకాల పోషకాలు నిండి ఉన్న ఆరోగ్య వనరు ఇది.  చాలా రుచిగా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వాటిల్లో ఇవి కొన్ని.

►దోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.  జీర్ణవ్యవస్థ, పెద్దపేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్‌ట్రబుల్‌నూ, కడుపునొప్పిని అరికడుతుంది. 
► నోట్లోకి యాసిడ్‌ రావడం, ఛాతీలో మంట వంటి సమస్యలను నివారిస్తుంది. 
►  దోసకాయ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. 
► రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చూడటంతో పాటు, గుండెను కాపాడుతుంది. 
► అనేక రకాల చర్మవ్యాధులను, చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు మేనికి నిగారింపు తెస్తుంది. 
► మనకు మేలు చేసే అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం వల్ల మనకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. 
►అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మరీ ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది. 
►త్వరగా కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటు, సంతృప్తభావనను ఇస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. 
►మైగ్రేన్‌ వంటి తలనొప్పులను తగ్గిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement