ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు ప్రకృతి సహజం. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా మన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చెమట రూపంలో నీరు ఎక్కువ నష్టపోతాం కాబట్టి, నీరు ఎక్కువగా లభించే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఈ క్రమంలో సమ్మర్‌లో కీరదోసకాయను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.
నిజానికి కీరదోస ఏ సీజన్‌లో తీసుకున్నా మంచిదే. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. వేసవిలో అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయలు కేలరీలు తక్కువ. విటమిన్లు , ఖనిజాలు ఎక్కువ. కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
కీరదోసతో లాభాలు
హైడ్రేషన్ & డిటాక్సిఫికేషన్ కోసం మంచిది
రక్తపోటును నియంత్రిస్తుంది
జీర్ణక్రియకు మంచిది
బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది
బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది
మెరుగైన చర్మం కోసం
కళ్లకు సాంత్వన చేకూరుస్తుంది
కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
వడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో 95 శాతం నీటితోపాటు, పొటాషియం,మెగ్నీషియం లభిస్తాయి. సోడియం లోపం ఉన్నవారు ఆహారంలో ఈ కీర దోసకాయని తీసుకుంటే మంచిది. పొట్టుతో కీర దోసకాయ తినడం వల్ల గరిష్టంగా పోషకాలు అందుతాయి.
ఫ్లేవనాయిడ్లు ,టానిన్‌లతో సహా యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి ,దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
కీర దోసకాయలోని పెక్టిన్ పేగు కదలికలను బాగు పరుస్తుంది. తద్వారా మలబద్దకాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment