హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని హోటల్స్‌లో ఆహారభద్రతా శాఖ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం, కాలం తీరిన పదార్థాలు, బొద్దింకలు, పురుగులు, లేబుల్ లేని ఆహారం, లైసెన్స్ లేని ఆహార బ్రాండ్‌లులాంటివి చూస్తోంటే గుబులు రేగుతోంది. రెస్టారెంట్‌కు వెళ్లాలంటేనే వామ్మో.. అనుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే నోనూరించే టొమాటో కెచప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసినవి: టొమాటోలు – 2.5 కేజీలు; వెల్లుల్లి రేకలు-15; అల్లం– 3 అంగుళాల ముక్క; ఎండు మిర్- 6; కిస్‌మిస్-అర కప్పు; యాపిల్ సిడెర్ వినెగర్- అర కప్పు; ఉప్పు – టేబుల్ స్పూన్; చక్కెర- 6 టేబుల్ స్పూన్‌లు; సోడియం బెంజోయేట్ – పావు టీ స్పూన్ (టీ స్పూన్ నీటిలో వేసి కరిగించాలి)
తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడగాలి. ఆరిన తర్వాత తొడిమలు తొలగించాలి. ఇప్పుడు టొమాటోలన్నింటినీ మీడియం సైజు ముక్కలుగా తరగాలి వెల్లుల్లి రేకల పొట్టు వలిచి సన్నగా తరుక్కోవాలి. అల్లం కడిగి చెక్కు తీసి తరగాలి కిస్‌మిస్‌లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఎండు మిర్చి తొడిమలు తీసి, మధ్యకు విరిచి గింజలతను తొలగించాలి.
మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి, కిస్‌మిస్, వినెగర్, ఉప్పు, చక్కెర వేసి గరిటెతో కలిసి మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ టొమాటో ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి పాత్రను దించేయాలి ∙వేడి తగ్గిన తరవాత బ్లెండర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని పెద్ద చిల్లులున్న స్ట్రెయినర్‌లో వడ΄ోయాలి. టొమాటో తొక్కలు, మెదగని గింజల వంటివి పైన నిలుస్తాయి. వడ΄ోసిన ద్రవాన్ని బాణలిలో ΄ోసి కొంత సేపు మీడియం మంట మీద ఉడికించి దగ్గరవుతున్నప్పువు సన్నమంట మీద ఉడికించాలి. టొమాటో ద్రవం కెచప్‌కు తగిన చిక్కదనం సంతరించుకోవాలంటే అరగంటకు పైగా ఉడకాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. దించడానికి ముందు టీ స్పూన్ వేడి నీటిలో పావు టీ స్పూన్ సోడియం బెంజోయేట్ కలిపి కెచప్‌లో పోసి కలిపి స్టవ్ ఆపేయాలి.
సోడియం బెంజోయేట్ కెచప్ నిల్వ ఉండడానికి దోహదం చేసే ప్రిజర్వేటివ్. కెచప్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడుకునే వాళ్లు సోడియం బెంజోయేట్ లేకుండా కూడా సాస్ చేసుకోవచ్చు ∙కెచప్ ఉడికేలోపు సాస్ నిల్వ చేయడానికి గాజు బాటిల్‌ని సిద్ధం చేసుకోవాలి. బాటిల్‌ని శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీటిలో ముంచి తీసి ఆరబెట్టాలి ∙కెచప్ చల్లారిన తర్వాత సీసాలో వేసి గట్టిగా మూత పెట్టాలి. దీనిని స్నాక్స్‌లోకి తినవచ్చు లేదా భోజనానికి ముందు ఆకలి పెంచడానికి అప్పిటైజర్‌గా కూడా పని చేస్తుంది. నాలుక రుచి కోల్పోయినట్లు అనిపించినప్పుడు ఒక టీ స్పూన్ కెచప్‌ను చప్పరిస్తే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment