కమ్మని రుచి, చక్కని పోషకాలతో ఆరోగ్యాన్ని అందించే మఖానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసినవి:
వేయించిన మఖానా– కప్పు
బాదం పప్పు– 3 టేబుల్ స్పూన్‌లు
అరటిపండు – ఒకటి; ఖర్జూరాలు– 4;
పీనట్ బటర్– టేబుల్ స్పూన్;
పాలు– 300 ఎం.ఎల్;
గుమ్మడి గింజలు– టీ స్పూన్;
తయారీ:
గుమ్మడి గింజలుమినహా మిగిలిన అన్నింటినీ మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేయాలి. గ్లాసుల్లో పోసి పైన గుమ్మడి గింజలు చల్లి సర్వ్ చేయాలి. చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది మంచి ΄ోషకాహారం. పిల్లలు ఆటల్లో మునిగి తినడానికి ఇష్టపడక పరుగులు తీస్తుంటారు. పోషకాలన్నింటినీ ఒక గ్లాసులో పోసి ఇచ్చినట్లే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది ఒక గ్లాసు తాగితే రోజుకు అవసరమైన పోషకాలన్నీ దాదాపుగా అందినట్లే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ బదులుగా కూడా ఈ స్మూతీని ఇవ్వవచ్చు. ఫిట్‌నెస్ చేసేవాళ్లు వర్కవుట్ తర్వాత ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చు.
పోషకాలు:
శక్తి– 764 కిలోకేలరీలు
ప్రొటీన్– 26.1 గ్రాము
కార్బొహైడ్రేట్‌లు– 87.2 గ్రాములు
ఫ్యాట్ – 36.3 గ్రాములు
ఫైబర్– 10 గ్రాములు
డాక్టర్ కరుణ
న్యూట్రిషనిస్ట్ అండ్
వెల్‌నెస్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment