ఇడ్లీ, వడకు బ్రేక్ : మిల్లెట్స్‌తో ఈ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామా!
అధిక బరువు నుంచి బైటపడాలంటే చక్కని పోషకాహారంతోపాటు, రోజుకు కనీసం అరగంట వ్యామాయం చేయాల్సిందే. బరువు తగ్గాలంటే వ్యాయామం కంటే డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్నం మానేశాం అంటూనే ఉదయం పూట టిఫిన్‌లో ఇడ్లీ, పూరీ, వడ దోసలు, చపాతీలు లాగించేస్తే బరువు తగ్గడం కష్టమే. అందుకే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఉదాహరణకు కొన్ని చూద్దమా..!
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. రోజుమొత్తానికి శక్తినిచ్చేలా ఉండాలి. పోషకాలతో కూడిన అల్పాహారం తింటే ఆరోగ్యకరమైన బరువుతో, మెటబాలిజం మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్లూటెన్-రహిత మిలెట్ల్స్‌ను తీసుకోవడం ఉత్తమం.
మిల్లెట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ , విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రెడీమేడ్ మిల్లెట్ ఆధారిత పిండి, పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫింగర్ మిల్లెట్ లేదా రాగి దోస, రాగి ఇడ్లీ, రాగి జావ : ఫైబర్, కాల్షియం ,ఐరన్ అధికం.
జొన్నలతో కిచ్డీ, జొన్నరొట్టె : కార్బోహైడ్రేట్లు , ఫైబర్ పుష్కలం
ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్స్‌తో చేసిన పొంగల్,
లిటిల్ మిల్లెట్ దోస: కార్బోహైడ్రేట్లు, ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలం
ప్రోసో మిల్లెట్ దోస: సాధారణ దోసలాగానే బియ్యం కలపుకుండా, కొద్దిగా మినపపప్పు కలిపి చేసుకోవాలి.
బార్నియార్డ్ మిల్లెట్ పొంగల్ : దీన్ని కూడా బియ్యం పొంగల్‌లాగా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ , ప్రోటీన్‌లో అధికం.
Comments
Please login to add a commentAdd a comment