Smoothie
-
మఖానా స్మూతీ ఎపుడైనా ఇలా ట్రై చేశారా?
కమ్మని రుచి, చక్కని పోషకాలతో ఆరోగ్యాన్ని అందించే మఖానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసినవి:వేయించిన మఖానా– కప్పుబాదం పప్పు– 3 టేబుల్ స్పూన్లుఅరటిపండు – ఒకటి; ఖర్జూరాలు– 4;పీనట్ బటర్– టేబుల్ స్పూన్;పాలు– 300 ఎం.ఎల్;గుమ్మడి గింజలు– టీ స్పూన్;తయారీ:గుమ్మడి గింజలుమినహా మిగిలిన అన్నింటినీ మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేయాలి. గ్లాసుల్లో పోసి పైన గుమ్మడి గింజలు చల్లి సర్వ్ చేయాలి. చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది మంచి ΄ోషకాహారం. పిల్లలు ఆటల్లో మునిగి తినడానికి ఇష్టపడక పరుగులు తీస్తుంటారు. పోషకాలన్నింటినీ ఒక గ్లాసులో పోసి ఇచ్చినట్లే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది ఒక గ్లాసు తాగితే రోజుకు అవసరమైన పోషకాలన్నీ దాదాపుగా అందినట్లే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ బదులుగా కూడా ఈ స్మూతీని ఇవ్వవచ్చు. ఫిట్నెస్ చేసేవాళ్లు వర్కవుట్ తర్వాత ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చు.పోషకాలు:శక్తి– 764 కిలోకేలరీలు ప్రొటీన్– 26.1 గ్రాముకార్బొహైడ్రేట్లు– 87.2 గ్రాములుఫ్యాట్ – 36.3 గ్రాములుఫైబర్– 10 గ్రాములుడాక్టర్ కరుణన్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
క్షణాల్లో ఓట్స్ స్మూతీ.. సింపుల్ రెసిపి
ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సినవి: ఓట్స్ –మూడు టేబుల్ స్పూన్లు; వేయించి పొట్టుతీసిన పల్లీలు – పావు కప్పు ; అవిసెగింజలు – టేబుల్ స్పూను; సబ్జాగింజలు – టీస్పూను; దాల్చిన చెక్క – అరంగుళం ముక్క; కర్జురాలు – నాలుగు; బాగా పండిన అరటి పండు – ఒకటి. తయారీ విధానమిలా: ►ఓట్స్‌ను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో వేయాలి. దీనిలో కప్పు నీళ్లుపోయాలి. ► పల్లీలు, అవిసె, సబ్జా గింజలు, దాల్చిన చెక్క, కర్జూరాలు, అరటిపండు ముక్కలు కూడా వేయాలి. ► వీటన్నింటిని చక్కగా గ్రైండ్ చేస్తే స్మూతీ రెడీ. -
ఉత్సాహాన్నిచ్చే పోటాషియం కావాలా? బనానా కివీ స్మూతీ తీస్కో!
కావలసినవి: పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, కివి – ఒకటి, తేనె – మూడు టేబుల్ స్పూన్లు, లేత పాలకూర – కప్పు, ఆవకాడో – అర చెక్క, ఐస్‌క్యూబ్స్ – కప్పు. తయారీ: ⇔ అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి ⇔ పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ⇔ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి. దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి చదవండి👉🏻 అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం ⇔ అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరొసారి గ్రైండ్ చేసి ..గ్లాసులో పోసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ⇔తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకున్నవారికి ఈ స్మూతీ మంచి డ్రింక్ గా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి. ⇔ విటమిన్ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ⇔పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది. ⇔ అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. చదవండి👉🏼 సత్తువ పెంచే సగ్గుబియ్యం