ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సినవి:
ఓట్స్ –మూడు టేబుల్ స్పూన్లు; వేయించి పొట్టుతీసిన పల్లీలు – పావు కప్పు ;
అవిసెగింజలు – టేబుల్ స్పూను; సబ్జాగింజలు – టీస్పూను;
దాల్చిన చెక్క – అరంగుళం ముక్క; కర్జురాలు – నాలుగు; బాగా పండిన అరటి పండు – ఒకటి.
తయారీ విధానమిలా:
►ఓట్స్‌ను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో వేయాలి. దీనిలో కప్పు నీళ్లుపోయాలి.
► పల్లీలు, అవిసె, సబ్జా గింజలు, దాల్చిన చెక్క, కర్జూరాలు, అరటిపండు ముక్కలు కూడా వేయాలి.
► వీటన్నింటిని చక్కగా గ్రైండ్ చేస్తే స్మూతీ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment