వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం.
మీకు తెలుసా?
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలు
కొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి
కొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్
నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి
కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.
గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో
కొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది.
చర్మ ఆరోగ్యం
ఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
శరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గాలంటే
అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి.
థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
జాగ్రత్తలు
కొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment