Coriander
-
గుబురుగా, తాజాగా కొత్తిమీర : బాల్కనీలోనే ఇలా పెంచుకోండి!
ప్రస్తుతం కాలంలో ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పూలను సాగు చేయడం ఒక అలవాటుగా మారింది. చాలామంది టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెనింగ్ పేరుతో ఉన్నకొద్దిపాటి స్థలంలోనే చాలా రకాల మొక్కల్ని పెంచుతూ సేంద్రీయ ఉత్పత్తులను సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇది కాలుష్యం లేని ఆహారాన్ని అందించండం మాత్రమే కాదు ఇంటి వాతావారణానికి, పర్యావరణానికి చాలా మంచిది కూడా. ఇంట్లో చిన్న చిన్న కుండీలల్లో కొత్తమీర, పుదీనా లాంటి వాటిని సులభంగా పండించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇంత అంత ఈజీ కూడా కాదు. మరి సులభంగా, చక్కగా కొత్తిమీరను ఎలా పండించుకోవాలో చూద్దామా!ఇంట్లో కొత్తిమీరను పెంచడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. కొత్తిమీరలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెంచేందుకు విత్తన ఎంపిక చాలా ముఖ్యం. ఇందులో శాంటో, లీజర్ లేదా కాలిప్సో వంటి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ రకాలు త్వరగా మొలకెత్తి, ఎక్కువ కాలం పంట ఉండేలా చేస్తుంది.సరైన కంటైనర్కనీసం 8-12 అంగుళాల లోతు, మంచి డ్రైనేజీ ఉన్న కంటైనర్, లేదా గ్రో బ్యాగ్‌ను తీసుకోండి. ఎందుకంటే కొత్తిమీర వేళ్లు లోతుగా వెళతాయి. కుండీ, లేదా కంటైన్ లోతుగా ఉండేలా చేసుకోవాలి. కంటైనర్ దిగువన నీళ్లు పోయేలా రంధ్రాలేన్నాయో లేదో చూసుకోవాలి.సాయిల్ మిక్సింగ్ కొత్తిమీర బాగా పెరగాలంటే, బాగా ఎండిపోయే, సారవంతమైన మట్టి కావాలి. అందుకే కాస్త మట్టి, కొద్దిగా ఇసుక ఉండేలా సేంద్రీయ ఎరువు, అధిక-నాణ్యత పాటింగ్ మిశ్రమాన్ని ఉపయోగించాలి. మడి మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా జాగ్రత్తపడాలి.విత్తనాలు విత్తడం నాటేముందు విత్తనాలను(ధనియాలు) కొద్దిగా నలపాలి. అంటే ఒక గుడ్డపై ధనియాలను పోసి చపాతీ కర్రతోగానీ, ఏదైనా రాయితో గానీ సున్నితంగా నలపాలి. అపుడు గింజలు రెండుగా చీలతాయి. ఇలా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకలొస్తాయి. 1-2 అంగుళాలు దూరంలో విత్తనాలను 1/4 అంగుళాల లోతులో చల్లాలి. ఆపై మట్టితో తేలికగా కప్పి, నీరు పోయాలి.మొలకలు కంటైనర్‌ను వెచ్చని ఎండ తగిలేలా ఉంచాలి. కొత్తిమీర గింజలు సాధారణంగా మొల కెత్తడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ కాలంలో మట్టిలో నీళ్లు నిల్వలేకుండా, తేమగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 4-6 గంటల పాటు ప్రత్యక్ష ఎండ తగలాలి. నీళ్లు పోయడానికి విత్తనాలు చెదిరిపోకుండా, దెబ్బ తగలకుండా, స్ప్రే బాటిల్‌ని ఉపయోగించాలి.నిర్దిష్ట సమయంలో సాధారణంగా మొలకలు వచ్చేస్తాయి. మట్టిని సమానంగా తేమగా ఉంచడానికి కొత్తిమీర మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. ఇంకా బలంగా పెరగాలంటే, నీటిలో కరిగే ఎరువులు, కంపోస్ట్ టీ లేదా డైల్యూటెడ్ ఫిష్ ఎమల్షన్ వంటి సేంద్రీయ ఎరువు వాడితే మంచిది. చక్కగా గుబురుగా, పచ్చపచ్చగా కొత్తిమీర మొక్కలు ఎదుగుతాయి. 6 అంగుళాల ఎత్తు పెరిగాక కొత్తమీరను హార్వెస్ట్ చేయ వచ్చు. కోస్తూ ఉంటే, కొత్తమీర ఇంకా గుబురుగా పెరుగుతుంది. అఫిడ్స్, సాలీడు , శిలీంధ్ర వ్యాధుల సమస్యలొస్తాయి. ఎలాంటి చీడపీడలు రాకుండా, వేపనూనె, పుల్లటి మజ్జిగ ద్రావణం లాంటి స్ప్రే చేయవచ్చు. కొత్తమీర పువ్వులు వచ్చేదాకా వాడుకోవచ్చు. దీన్ని బోల్టింగ్ అంటారు. ఈ టైంలో ఆకులు చేదుగా మారతాయనేది గుర్తించాలి. -
కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు, వారికి తప్ప
వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా?కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయికొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోకొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యంఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిశరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గాలంటే అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలుకొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -
కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్ పాటించండి!
వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అదనంగా కలపడమో తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కోల్పోతాం. లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది. అందుకే ఈ టిప్స్ ఒకసారి చూడండి. ♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి. ♦ పూరీలు నూనె తక్కువ పీల్చుకుని, పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. ♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి. పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. ♦ యాపిల్‌ను కట్ చేసి, ఆ ముక్కలను ప్లేట్లో అమర్చి సర్వ్ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ కొత్తిమీరను పలుచని క్లాత్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -
కొత్తిమీరకు మార్కెట్లో ధర లేక అవస్థలు పడుతున్న రైతులు..!
-
కొత్తిమీర, పుదీనా సాగుచేసిన రైతులకు నష్టాలు తక్కువే..!
-
ఇలా చేస్తే కొత్తిమీరతో అధిక దిగుబడి మీ సొంతం
-
కేక పుట్టిస్తున్న కొత్తిమీర.. ఏడిపిస్తున్న కట్ట ధర!
హోసూరు(బెంగళూరు): కొత్తిమీర ధరలు ఆకాశాన్నంటాయి. రూ.10 నుంచి రూ.20 మధ్య ఉన్న కొత్తిమీర కట్ట ధర ఏకంగా రూ.80కి చేరింది. పెరిగిన ధరలు రైతుల్లో ఆనందాన్ని నింపుతుండగా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. హోసూరు, డెంకణీకోట, సూళగిరి, అంచెట్టి తాలూకాల్లో సుమారు 3వేలకుపైగా ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంట సాగు చేశారు. 45 రోజుల్లో పంట చేతికందుతుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొలాల్లో వరదనీరు చేరడంతో కొత్తిమీర పంట దెబ్బతింది. దీంతో మార్కెట్‌కు సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు అమాంతంగా పెరిగాయి. బెంగళూరు, ముంబై, చెన్నై నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పొలాల వద్దకు వెళ్లి పంటను కొనుగోలు చేస్తున్నారు. 10 రోజుల క్రితం హోసూరు రైతు బజారులో రూ.30 వరకు ధరపలికిన కొత్తిమీర బుధవారం అకస్మాత్తుగా రూ.80 వరకు చేరింది. ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. చదవండి: పాఠశాల గదిలో 140 మద్యం కాటన్లు.. షాకైన ఉపాధ్యాయులు! -
Health Tips: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన వస్తోందా.. అయితే..
What Is Detoxification: మనిషి పైకి చూడటానికి ఎంత బాగున్నా, పరిశుభ్రంగా ఉంటేనే ఆ అందానికి అర్థం ఉంటుంది. అయితే అది పైకే కాదు. శరీరంలోపల కూడా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే, శరీరానికి బాహ్య శుభ్రత ఎంత అవసరమో అంతర్గత శుభ్రత కూడా అంతే అవసరం. ఇక్కడ శుభ్రత అంటే కడుపులో పేరుకుపోతున్న విషాలను అంటే టాక్సిన్స్‌ను తొలగించుకోవడమే! విషాలను తొలగించడం అంటే డీటాక్స్ చేయాలని అర్థం. అసలు మనకు శరీరంలో టాక్సిన్స్ చేరాయని ఎలా తెలుస్తుంది, దాన్ని ఏవిధంగా గుర్తించాలో, ఎప్పుడెప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలో తెలుసుకుందాం... శరీరంలో విషపదార్ధాలు ఎక్కువైనప్పుడు శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది. ఆ సంకేతాలేంటి, ఎప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలో చూద్దాం. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లేదా శరీరంపై చెమట నుంచి చెడు వాసన వస్తున్నా శరీరంలో విషపదార్ధాలు పేరుకున్నాయని అర్ధం. అదే సమయంలో శ్వాస కూడా చెడు వాసన కల్గిస్తుంది. మీకు కూడా ఈ సమస్యలు ఎదురైతే మీ శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన సమయం వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలు తీవ్ర సమస్యల్ని సృష్టించే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో పేరుకున్న వ్యర్ధాల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేయాలి! అయితే చాలామందికి శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలనే సందేహం రావచ్చు. లేదా ఎప్పుడెప్పుడు డీటాక్స్ చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జంక్ ఫుడ్ తినడం వల్ల, కావల్సినంత నీరు తాగకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయేందుకు దోహదమౌతాయి. కడుపు ఉబ్బిపోవడం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే పేగుల్లో పేరుకున్న వ్యర్ధాలు, విషపదార్ధాలు జీర్ణశక్తిని బలహీన పరుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. మీ కడుపు పాడై ఉంటే లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురైనా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిందే. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మూడ్ పాడవడం, విసుగు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విష పదార్ధాలు శరీరం మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ సమతుల్యత సరిగ్గా ఉండాలంటే.. మెటబాలిజం కూడా సరిగ్గా ఉండాల్సిందే. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేయాలి. చర్మ సంబంధిత సమస్యల వల్ల కూడా శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. రక్తాన్ని మలినం చేసేస్తాయి. చర్మంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు ఇందుకు కారణాలు. ఇవికాకుండా హార్మోన్ అసమతుల్యత, చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటే.. శరీరాన్ని డీటాక్స్ చేయాలని అర్దం. సీజన్ మారినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే ముప్పు అధికం అవుతుంది. దీనికి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు కూడా కారణం అవుతాయి. మితంగా ఆహారం తీసుకోవడం, తేలికపాటి ఆహార పదార్థాలను తినడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన ట్యాక్సిన్లను బయటకు పంపొచ్చు. మార్కెట్లో విరివిగా లభించే కొత్తిమీర, పుదీనా, త్రిఫల చూర్ణం లాంటి మూలికలతో ట్యాక్సిన్లను బయటకు పంపించి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆహారంలో ఇవి తీసుకుంటే మేలు శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించడంలో కొత్తిమీర చక్కగా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలను చంపే, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఆవశ్యక నూనెలు ఇందులో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన భారీ లోహాలను కూడా ఇవి తొలగిస్తాయి. కొత్తిమీర జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, వికారాన్ని పోగొడుతుంది. కొత్తిమీర రక్తంలోని చక్కెర స్థాయులను సమతుల్యం చేస్తుంది. కూరలు ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీర వేయడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. జ్యూస్‌లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపొచ్చు. త్రిఫల చూర్ణంలో ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక గుణాలున్నాయి. ఇది ట్యాక్సిన్లను బయటకు పంపుతుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో దీన్ని తయారు చేస్తారు. సుమారు ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని అరకప్పు వేడినీటిలో కలపాలి. చల్లారిన తర్వాత రాత్రి నిద్రకు ఉపక్రమించే పది నిమిషాల ముందు దీన్ని తాగాలి. ఫలితంగా తెల్లవారేసరికల్లా కడుపులోని టాక్సిన్స్ అన్నీ మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి. పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది. కడుపు నొప్పి, గ్యాస్ వదలడం, మలబద్దకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. దంతాలు తెల్లగా మారడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి తోడ్పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, ఒంట్లోని ట్యాక్సిన్లను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఒంట్లోని మలినాలు, ట్యాక్సిన్లను తేలిగ్గా పోగొట్టుకోండి. ఇవే కాదు... వెల్లుల్లి, దానిమ్మ, బ్రోకలీ వంటివి కూడా శరీరాన్ని డీ టాక్సిఫై చేయగలవు. ►మరో ముఖ్యమైన విషయం... విషాలంటే ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేష, పగ, ప్రతీకారం, సహనం లేకపోవడం, హింసాప్రవృత్తి కూడా... అవి ఈ విషాలకన్నా మరింత ప్రమాదకరం. ఆ విషాలను దని చేరనివ్వకపోవడం ఇంకా అవసరం. చేరిన వాటిని వెంటనే తొలగించుకోవడం ఇంకా అవసరం. చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు! -
Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు!
చిన్నా, పెద్దా ఇష్టంగా తినే అల్పాహారం దోసెలు.. రొటీన్‌గా కాకుండా ఈసారి ఇలా గ్రీన్ దోసెలు చేసుకుని తినండి. వైరైటీకి వెరైటీ.. రుచికి రుచి. గ్రీన్ దోసెలు చేయడానికి కావలసినవి: ►కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు – పావు కప్పు ►గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు ►మినపపప్పు – ముప్పావు కప్పు (4 గంటల పాటు నానబెట్టుకోవాలి) ►మెంతులు – అర టీ స్పూన్ (4 గంటల పాటు నానబెట్టుకోవాలి) ►ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని ►నూనె – సరిపడా గ్రీన్ దోసెలు- తయారీ: ►ముందుగా మినపప్పును, మెంతుల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ► ఒక గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో గోధుమ పిండి, తగినంత ఉప్పు, తగినన్నీ నీళ్లు పోసుకుని.. ఉండలు కట్టకుండా దోసెల పిండిలా బాగా కలుపుకోవాలి. ►తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పెనం వేడి చేసుకుని.. కొద్దిగా నూనె వేసుకుని దోసెలు వేసుకోవాలి. ►అభిరుచిని బట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వంటివి దోసె మీద వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ►వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన చట్నీతో లేదా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి. చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! చదవండి👉🏾Chicken Keema Pakoda: రుచికరమైన చికెన్ కీమా పకోడా ఇలా ఇంట్లోనే ఈజీగా! -
Summer Drinks: నీర్ మోర్.. ఎసిడిటీ సమ్యసలు దూరం! ఇంకా..
Summer Drinks- Neer Mor: పెరుగుతో తయారు చేసే నీర్ మోర్‌ను మంచి ఎండల్లో తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారు. దాహం కూడా తీరుతుంది. జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా ప్రోత్సహించి, ఎసిడిటీ సమస్యలను దరిచేరనివ్వదు. రక్త పోటు(బీపీ)ను నియంత్రణలో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! నీర్ మోర్ తయారీకి కావలసినవి: ►పెరుగు – కప్పు, నీళ్లు – కప్పు ►అల్లం తరుగు – టీస్పూను ►మిరియాల పొడి – పావు టీస్పూను ►పచ్చిమిర్చి – ఒకటి ►కరివేప ఆకులు – ఏడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా. ►తాలింపునకు: ఆయిల్ – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. నీర్ మోర్ తయారీ విధానం: ►బ్లెండర్లో కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి కొత్తిమీర తరుగు వేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ►తర్వాత ఇంగువ వేసి దించేయాలి. ►తాలింపు మిశ్రమాన్ని మజ్జిగ మిశ్రమంలో వేసి తిప్పితే నీర్ మోర్ రెడీ. దీనిని వెంటనే తాగితే చాలా బావుంటుంది. చదవండి👉🏾 Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Coriander Leaves: పోషకాల గని
-
Health Tips: కొత్తిమీర చట్నీ, నిల్వ పచ్చడి తింటున్నారా.. ఇందులోని ‘డుడిసినాల్’ వల్ల
Top 11 Amazing Health Benefits Of Coriander Kothimeera In Telugu: కొత్తిమీర మంచి సువాసన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు. అంతేకాక కొత్తిమీరతో ఇన్స్టంట్ చట్నీ చేస్తారు. నిల్వ పచ్చడి కూడా పెడతారు. కొత్తిమీరను ఆహార పదార్దాల మీద అందంగా గార్నిష్ చేయడానికి మాత్రమే వాడతారని భావిస్తే పొరపాటే. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాలలో కొత్తిమీరను కూడా విధిగా వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాం.... కొత్తిమీర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►రక్తహీనతను తగ్గిస్తుంది. ►ధూమపానం, కీమోథెరపీ వల్ల తలెత్తే దుష్ఫలితాలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. ►కొవ్వుతో పోరాడుతుంది. ►రక్తనాళాలలో ఏర్పడిన ఆటంకాలను తొలగిస్తుంది ►కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌కు చేసే చికిత్సలో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని కొన్ని అధ్యయాల ద్వారా తెలిసింది. ►తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. ►నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలకు శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే ఉపశమనం కలుగుతుంది. మేని మెరుపు కోసం కూడా.. ►పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి.కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి. ►మొటిమలు, మంగు మచ్చలు చర్మంమీద నల్లని మచ్చలు, పొడి చర్మం, పెద్దసైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి ముఖానికి పూసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం. దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు ప్రయోగిస్తే కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ►విటమిన్–ఏ, విటమిన్–బి1, విటమిన్–బి6, విటమిన్–సి విటమిన్ల లోపం తలెత్తకుండా ఉండాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. చదవండి: Health Benefits Of Kismiss: నానబెట్టిన కిస్మిస్లు తరచూ తింటున్నారా... ఆ సమస్యలు ఉంటే! -
Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..
అటెన్షన్... మీ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్రైనేజీ వాటర్‌లో కడిగిన కూరగాయలు మీ వంటింటికి చేరుతున్నాయి. దయచేసి కూరగాయను కొనేముందు ఓ క్షణం ఆలోచించండి.. మరింత అవగాహన పెంచుకోండి.. అనే క్యాప్షన్‌తో ట్విటర్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. చూశారంటే యాక్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన ఓ గుర్తుతెలియని కూరగాయల వ్యాపారిపై కేసు ఫైల్ అయ్యింది. ఏం చేశాడో తెలెస్తే మీకు స్పృహ తప్పుతుంది. పొద్దుపొద్దునే తాజా కొత్తమీర కట్టల్ని సింథికాలనీ రోడ్డుపై లీకైపారుతున్న డ్రైనేజీ వాటర్‌లో కడిగాడు మరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైనేజీ నీళ్లతో కడిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వీడియో తీసిన వ్యక్తి పదేపదే చెబుతున్నా సదరు వ్యాపారి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడట. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! దీంతో జిల్లా కలెక్టర్ అవినాష్ లవనియా... ఈ కల్తీ, కలుషిత ఆహార సమాచార సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార శాఖ, పౌర అధికారులకు ఆదేశించినట్లు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్ జిల్లా ఆహార భద్రత అధికారి దేవేంద్ర కుమార్ దుబే ఐపీసీ సెక్షన్ 269 కింద సరదు గుర్తుతెలియని వ్యాపారిపై కేసు ఫైల్ చేశామని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెల్పారు. కాబట్టి.. కూరగాయల వ్యాపారుల దగ్గర కూరగాయాలు కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించిమరీ కొంటే మంచిది. ఏం తింటున్నామో.. ఎలాంటి ఆహారం కొంటున్నామో.. తెలసుకోకపోతే బతుకు డ్రైనేజి పాలౌతుంది! చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. सावाधान देखिए आपकी सेहत से कैसे हो रहा खिलवाड़, कंही पर ऐसी सब्जी तो नही खरीद रहे ,भोपाल के सिंधी कॉलोनी में नाली के पानी से धुक रही सब्जी @bhupendrasingho जी @CollectorBhopal @digpolicebhopal मामले पर संज्ञान लेकर उचित कार्यवाही का आग्रह है , @KamalPatelBJP @DrPRChoudhary pic.twitter.com/10Em39YxPz — sudhirdandotiya (@sudhirdandotiya) October 26, 2021 -
రాహుల్.. కొత్తిమీరకు, మెంతికి తేడా తెలుసా?
గాంధీనగర్: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు రైతులకు మద్దతుగా రోడుపైకి వచ్చి నిరసన తేలుపుతున్నాయి. కానీ గుజరాత్లో మాత్రం భారత్ బంద్ పాటించమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉత్తర గుజరాత్‌లోని మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రూపానీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టారు. ఇప్పుడు వారు రైతులకు మద్దతు తెలపుతున్నాం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నీకు వ్యవసాయం, రైతుల గురించి ఏ మేరకు అవగాహన ఉందో అందరికి అర్థమవుతుంది. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలుసా నీకు.. సమాధానం చెప్పు’ అంటూ రూపానీ ఎద్దేవా చేశారు. (చదవండి: విశ్వాస పునరుద్ధరణ కీలకం) అంతేకాక నరేంద్ర మోదీ ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని సాల్వ్ చేస్నున్నారని తెలిపారు రూపానీ. ‘ప్రస్తుతం రైతుల పేరు చెప్పి కాంగ్రెస్ లబ్ది పొందాలని భావిస్తుంది. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధర, సాగు నీరు వంటి అంశాల గురించి అస్సలు పట్టించుకోలేదు. బీజేపీ హయాంలో వీటన్నింటిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతుంది’ అంటూ రూపానీ విమర్శించారు. -
పొట్టకు హుచారు
పండగ హడావుడి ముగిసింది. అయినవాళ్ల మధ్య, ఆత్మీయుల మధ్య విందులు హెవీగా సాగి ఉంటాయి. గారెలు, బూరెలు, చికెన్, మటన్... ఒకటికి నాలుగు ముద్దలు పొట్టకు ఎక్స్ట్రా పని పెట్టి ఉంటాయి. ఇక చాలు... ఒకటి రెండు రోజులు డైనింగ్ టేబుల్ని తేలిగ్గా ఉంచుదాం. జీర్ణాశయానికి విశ్రాంతినిద్దాం. అందుకు మార్గం? చారును శరణు కోరడమే. మిరియాలు, జీలకర్ర, నిమ్మకాయ, కొత్తిమీర, టొమాటో వీటన్నిటితో పొగలుగక్కే చారు చేయండి. రసంతో అజీర్తికి విరసం పలకండి. నిమ్మరసం – కొత్తిమీర రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు (తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించాలి); పసుపు – పావు టీ స్పూను. పొడి కోసం: కొత్తిమీర – అర కప్పు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5 పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఎండు మిర్చి – 2; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నిమ్మ రసం – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేయాలి ►మిక్సీలో అర కప్పు కొత్తిమీర, రెండు టీ స్పూన్ల జీలకర్ర, అర టీ స్పూను మిరియాలు, రెండు పచ్చి మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, అర టీ స్పూను ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►కొత్తిమీర మిశ్రమం జత చేయాలి ∙ఇంగువ, పసుపు జత చేసి మరోమారు కలపాలి ►పప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాక, దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి కలియబెట్టాలి ►కొత్తిమీరతో అలంకరించాలి. మైసూర్ రసం కావలసినవి: పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – రెండు టేబుల్ స్పూన్లు ; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, టొమాటో తరుగు – అర కప్పు; చింతపండు రసం – ఒక కప్పు (పల్చగా ఉండాలి); కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; బెల్లం పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ముప్పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించి మరోమారు వేయించాలి ►కొబ్బరి తురుము జత చేసి మరి కాసేపు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో ముందుగా టొమాటో గుజ్జు, చింతపండు రసం వేసి ఉడికించాలి ►కరివేపాకు, పసుపు, ఉప్పు, బెల్లం పొడి జతచేసి బాగా కలిపి మరిగించాలి ►ఉడికించిన కందిపప్పు, నీళ్లు జత చేసి కొద్దిసేపు మరిగించాలి ►తయారుచేసి ఉంచుకున్న మైసూర్ రసం పొడి జత చేయాలి ►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, మరుగుతున్న రసంలో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి. మిరియాలు జీలకర్ర రసం కావలసినవి: మిరియాలు – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 7. చింతపండు – అర టేబుల్ స్పూను (అర కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి); టొమాటో తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు –పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తయారీ: ►చింతపండు రసం తీసి పక్కన ఉంచాలి ►మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి ►కరివేపాకు, మిరియాల పొడి మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ►చింతపండు రసం, నీళ్లు, ఉప్పు జత చేసి, బాగా కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►సుమారు పావు గంట సేపు మరిగించాక దింపేయాలి. పైనాపిల్ రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు; నీళ్లు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనా పిల్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; రసం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. పొడి కోసం: జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు –ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6 పోపు కోసం: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దింపి, పప్పు గుత్తితో మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ►మిక్సీలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు (పొడి కోసం చెప్పిన వస్తువులు) వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి, తీసి పక్కన ఉంచాలి ►అర కప్పు పైనాపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►పావు కప్పు టొమాటో ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి, తీసి పక్కనుంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర టేబుల్స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►మిరియాల పొడి మిశ్రమం జత చేసి కొద్దిసేపు వేయించాలి ►కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి బాగా వేయించాలి ►పైనాపిల్ గుజ్జు జత చేసి రెండు నిమిషాల పాటు వేయించాక, ఉడికించిన పప్పు జతచేసి బాగా కలపాలి ►పైనాపిల్ తరుగు, టొమాటో తరుగు, ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి, బాగా కలపాలి ►రెండు టీ స్పూన్ల రసం పొడి వేసి బాగా కలియబెట్టాలి ►పదినిమిషాల పాటు మరిగించాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి. పన్నీర్ రసం కావలసినవి: చింత పండు – నిమ్మకాయంత; నీళ్లు – 3 కప్పులు; రోజ్ వాటర్ (పన్నీరు) – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – 3; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; రోజ్ పెటల్స్ – కొన్ని ; ఉప్పు – తగినంత; పంచదార – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను. తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాక, ఉడికించిన పప్పు నీళ్లు జత చేయాలి ►తగినంత ఉప్పు, పంచదార వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె/నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►చింతపండు రసం జత చేయాలి ►రెండు నిమిషాల పాటు మరిగాక దింపేసి, రోజ్ వాటర్ జత చేయాలి ►కొత్తిమీర, గులాబీ రేకలతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. టొమాటో చారు చారుకావలసినవి: బాగా పండిన టొమాటో తరుగు – 2 కప్పులు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); నీళ్లు – 2 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 4; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; బెల్లం పొడి – అర టేబుల్ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను పొడి కోసం: ఎండు మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక పచ్చి సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, మిరియాలు జత చేసి బాగా వేయించాక, జీలకర్ర జత చేసి మరోమారు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే, చారు పొడి సిద్ధమైనట్లే. ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడం మొదలయ్యాక, ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి ►కరివేపాకు జత చేసి ఒక నిమిషం వేయించాక, టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో గుజ్జు బాగా మెత్తబడ్డాక, వెల్లుల్లి తరుగు, చింత పండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ►నీళ్లు పోసి మరిగించాక, మంట బాగా తగ్గించి, రసం పొడి జత చేయాలి ►కొత్తిమీర వేసి బాగా కలిపి దింపి, మూత ఉంచాలి ►వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది ►సూప్‌లా తాగినా కూడా రుచిగానే ఉంటుంది. -
మిర్చిః 18వేలు
ఖమ్మం వ్యవసాయం: ‘తేజా’రకం మిర్చి ధర ఆల్‌టైం రికార్డు సాధించింది. మిర్చి సాగు చరిత్రలో ఈ ధర ఎప్పుడూ లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చికి బుధవారం క్వింటాలు ధర రూ.18,100 పలికింది. ఈ రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది జూలై నెల నుంచి ధర పెరుగుతూ వచి్చంది. జూలైలో రూ.11 వేలు ఉన్న ధర.. రూ.18 వేలు దాటింది. మిర్చి పండించే కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల ధర ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. కిలో కొత్తిమీర.. రూ.150 విమానంలో తెప్పిస్తున్న వరంగల్ వ్యాపారులు వరంగల్: భారీ వర్షాల కారణంగా కొత్తిమీర పంటలు దెబ్బతినడంతో కిలో కొత్తిమీర బుధవారం వరంగల్‌లో రూ.150 పలికింది. స్థానికంగా కొత్తిమీర పంటలు దెబ్బతినడంతో కూరగాయల వ్యాపారులు బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ కూడా పంటలు పాడైపోవడంతో పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా కొత్తిమీర తీసుకువచ్చి ఇక్కడికి సరఫరా చేసేలా ఆ రాష్ట్రంలోని వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నట్లు వరంగల్‌లోని లక్ష్మీపురం మార్కెట్‌కు చెందిన వ్యాపారులు తెలిపారు. -
మెచ్చారు...
చారు అంటే మంచి అని అర్థం. మన చారు తమిళనాట రసమైంది. ఆ రసమే ఊరూరూ తిరిగి మళ్లీ మన దగ్గరకొచ్చింది.షడ్రుచులూ పుణికిపుచ్చుకుంది... నవరసాలూరింది.అందుకే కాబోలు...ఘుమఘుమలాడే చారు వాసన తగిలితే చాలు అన్నం ఆవురావురంటుంది. అన్నట్టు ఈ చలికాలంలో ఎవరైనా అతిథి వస్తే ఏం చేయాలా అని తడుముకోవద్దు. ఇక్కడ మేమిచ్చిన రకరకాల చారుల్లో ఓ చారు కాచండి. ఆ చారుతో కడుపు కాచుకుంటూనే వాళ్లు మిమ్మల్ని మెచ్చుతారు చూడండి... కొబ్బరిపాల చారు కావలసినవి:చింతపండు రసం కోసంచింతపండు – ఒక టేబుల్ స్పూను; వేడి నీళ్లు – అర కప్పుచారు కోసంనీళ్లు – ఒకటిన్నర కప్పులు; పసుపు – పావు టీ స్పూను; చారు పొడి – ఒక టేబుల్ స్పూనుచిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంతపోపు కోసంకొబ్బరి నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పైన చల్లడానికి కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు తయారీ:అర కప్పు వేడినీళ్లలో చింతపండును సుమారు అర గంటసేపు నానబెట్టాలి ∙చింతపండును గట్టిగా పిండి తీసేసి, రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి ∙పసుపు, చారు పొడి వేసి బాగా కలియబెట్టి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి మరిగించాలి ∙బాగా మరిగిన తరవాత మంట ఆర్పేసి, కొబ్బరి పాలు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడి చేశాక, కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపేయాలి ∙వేయించిన పోపును కొబ్బరి పాల చారులో వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి అన్నంలో వడ్డించాలి. నిమ్మరసం – కొత్తిమీర చారు కావలసినవి:నిమ్మ చెక్కలు – 2; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లుపోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ:కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు, ఉప్పు, ఇంగువ, పసుపు, నిమ్మ చెక్కలు, కొత్తిమీర ముద్ద వేసి కలియబెట్టాలి ∙బాగా మరిగాక కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. పైనాపిల్ చారు కావలసినవి:కందిపప్పు – పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనాపిల్ రసం కోసంపైనాపిల్ తురుము – ఒక కప్పు; తరిగిన టమాటా – 1; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; చారు పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత పొడి చేయడానికి కావలసినవి: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండుమిర్చి – 3; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను, మిరియాలు – 4, వెల్లుల్లి రేకలు – 2 తయారీ:కందిపప్పును శుభ్రంగా కడిగి, ముప్పావు కప్పు నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక మెత్తగా మెదపాలి ∙జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రేకలను మిక్సీలో వేసి తిప్పాలి (మరీ మెత్తగా చేయకూడదు) ∙పైనాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి (ఒక కప్పుడు పైనాపిల్ ముక్కలు ఉండాలి) ∙సగం ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙అదే మిక్సీ జార్లో ఒక టమాటా వేసి కొద్దిగా ముక్కలుగా ఉండేలా తిప్పాలి (చేతితో గట్టిగా చిదిమినా సరిపోతుంది) ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర + మిరియాల మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు కలపాలి ∙చిదిమిన టమాటా గుజ్జు జత చేసి రెండు మూడు నిమిషాలు కలపాలి ∙పైనాపిల్ గుజ్జు జత చేసి మరో రెండు నిమిషాలు బాగా కలియబెట్టాక, మెదిపిన పప్పు జత చేసి బాగా కలపాలి ∙పైనాపిల్ ముక్కలు, నీళ్లు జత చేసి మరిగించాలి ∙రెండు టీ స్పూన్ల చారు పొడి వేసి కలియబెట్టాలి ∙మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడి అన్నంలో వడ్డించాలి ∙ఈ చారు బాగా ఆకలి పుట్టిస్తుంది. బీట్రూట్ చారు కావలసినవి:సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు – అర కప్పు; నీళ్లు – తగినన్ని పొడి చేయడానికి:జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి)బీట్రూట్ రసం కోసం...చింతపండు – ఒక టేబుల్ స్పూను; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూనుఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూనుపసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతకొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ:కుకర్‌లో బీట్రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఉడికించాలి ∙మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు మిర్చి వేసి కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసి తీసి పక్కన ఉంచాలి ∙అదే జార్లో ఉడికించిన నీళ్లతో కలిపిన బీట్రూట్ను నీళ్లతో మిక్సీ పట్టాలి ∙ చింతపండు జత చేసి మరోమారు మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేగేవరకు మరోమారు కలియబెట్టాలి ∙మసాలా పొడి జతచేసి కలపాలి. బీట్రూట్ + చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి ∙రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙(ఎక్కువ మరిగించకూడదు)వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. మైసూర్ చారు కావలసినవి:చారు పొడి కోసంనెయ్యి – 2 టీ స్పూన్లు; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి శనగ పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు ఉడికించడానికికందిపప్పు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులుచింతపండు గుజ్జు కోసంచింతపండు – నిమ్మకాయంత; వేడి నీళ్లు – అర కప్పు (చింతపండు నానబెట్టడానికి)మరిన్ని వస్తువులుపసుపు – పావు టీ స్పూను; టమాటా – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నీళ్లు – 2 కప్పులుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ:ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్ లో ఉంచి ఏడెనిమిది విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙కొద్దిసేపయ్యాక మూత తీసి, పప్పును మెత్తగా మెదపాలి ∙చింతపండును వేడినీళ్లలో సుమారు అర గంట సేపు నానబెట్టాక, చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి శనగ పప్పు వేసి వేయించాలి ∙ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాక ఇంగువ, కరివేపాకు వేసి పదార్థాలన్నీ దోరగా వేగేవరకు కలపాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు బాగా వేయించి, దింపేయాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి (నీళ్లు కలపకూడదు). ఒక పాత్రలో చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙తరిగిన టమాటాలు జత చేయాలి ∙పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి ∙టమాటాలు బాగా మెత్తపడ్డాక, మైసూర్ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి, మరిగించాలి ∙స్టౌ మీద చిన్న బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి ఇంగువ వేసి దోరగా వేయించి తీసేసి, మరుగుతున్న చారులో వేసి కలియబెట్టి దింపేయాలి ∙చివరగా కొత్తిమీర వేసి కలపాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. వెల్లుల్లి చారు కావలసినవి:మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి – మూడు రెబ్బలు; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)చింతపండు గుజ్జు కోసంనీళ్లు – అర కప్పు; చింతపండు – ఒక టేబుల్ స్పూనునువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమినప్పప్పు – అర టీ స్పూనుకరివేపాకు – రెండు రెమ్మలుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)వెల్లుల్లి రెబ్బలు – 10 (చేతితో మెదపాలి)తరిగిన టమాటా – 1పసుపు – పావు టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనునీళ్లు – రెండు కప్పులుఉప్పు – తగినంతకొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు తయారీ:చింతపండును తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి వేసి మిక్సీ పట్టి (మరీ మెత్తగా ఉండకూడదు) పక్కన ఉంచాలి ∙10 వెల్లుల్లి రేకలను తొక్క తీయకుండా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙టమాటాలను సన్నగా తరిగి ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా తొక్కిన వెల్లుల్లి వరసగా వేసి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి ∙టమాటా తరుగు, పసుపు, ఇంగువ జత చేసి, టమాటాలు మెత్తగా ఉడికేవరకు కలియబెట్టాలి ∙మిక్సీ పట్టిన రసం పొడి జత చేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఆరు నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నంలో వడ్డించాలి ∙సూప్‌లా కూడా తీసుకోవచ్చు. సేకరణ: వైజయంతి పురాణపండ -
చిదిమి ఆరోగ్యం తెచ్చుకోవచ్చు!
కొత్తిమీర లేకపోతే వంటా పూర్తి కాదు. ఆరోగ్యమూ చేకూరదు. ఎంత గొప్ప వంటకం వండినా, ఏ కూర చేసినా చివర్లో కొత్తిమీర తప్పనిసరి. ఆకులు చిదిమితే ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పరోపకార గుణం దాని సొంతం. కొత్తిమీరతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... కొత్తిమీరలో ఇన్ఫెక్షన్లు దూరం చేసే యాంటిసెప్టిక్, యాంటీఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే చర్మంపై అయ్యే గాయాలు త్వరగా మానడానికి అదెంతో ఉపకరిస్తుంది. అంతేకాదు... ఎగ్జిమా లాంటి చర్మవ్యాధులనూ అరికడుతుంది. కొత్తిమీర రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థంగా తగ్గిస్తుంది. రక్తనాళాలలోపలి వైపున అంటుకుపోయి ఉండే కొవ్వులను శుభ్రం చేసి రక్తం సాఫీగా ప్రవహించేలా చూస్తుంది. అంతేకాదు... మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ అన్నింటి కారణంగా గుండెపోటును నివారిస్తుంది. ఇది ఆకలిని పెంచే సహజమైన అపిటైజర్. తిన్నతర్వాత ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. డయేరియా లాంటి సమస్యలనూ నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొత్తిమీర వికారాన్ని, వాంతులను అరికడుతుంది. దాని సువాసనతోనే వికారం చాలావరకు తగ్గిపోతుంది. రక్తపోటుతో బాధపడే రోగుల్లోని అధిక రక్తపోటును కొత్తిమీర నియంత్రిస్తుంది. రక్తనాళాలలో పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం ప్రమాదాలను నివారిస్తుంది. కొందరికి నోట్లో వచ్చే కురుపులు వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే సహజ యాంటిసెప్టిక్ గుణం ఇందుకు తోడ్పడుతుంది. నోటిదుర్వాసననూ ఇది అరికడుతుంది. కొత్తిమీరలో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది రక్తహీనత (అనీమియా)ను తగ్గిస్తుంది. దాంతో రక్తహీనత కారణంగా వచ్చే ఆయాసం, శ్వాస సరిగా అందకపోవడం, గుండెదడ, అలసట, నీరసం వంటి ఎన్నో లక్షణాలను తొలగిస్తుంది. కొత్తిమీరలోని యాంటీహిస్టమైన్ గుణాల కారణంగా ఇది ఎన్నో అలర్జీలకు సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీరలో క్యాల్షియమ్ చాలా ఎక్కువ. అందుకే ఇది ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఎముకల పెరుగుదలకూ బాగా దోహదపడుతుంది. కాబట్టి ఎదిగే వయసు పిల్లలకు కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల కొత్తిమీర కళ్లకూ, కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. చూపును చాలాకాలం పదిలంగా ఉంచుతుంది. -
సాంబారు రుచిగా రావాలంటే ...
సాంబారు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తమిళనాడు సాంబారు. వాళ్లకి సాంబారు లేనిదే వంట లేదు. అసలు సాంబారును ఇష్టపడని వారే ఉండరు. సాంబారును చాలా రకాలుగా చేస్తారు. సాంబారులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కావలసినవి: కంది పప్పు – ఒక కప్పు; చింత పండు – 10 గ్రా. (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటో తరుగు – అర కప్పు; బెండ కాయ ముక్కలు – అర కప్పు; వంకాయ ముక్కలు – పావు కప్పు; సొరకాయ ముక్కలు పెద్ద సైజువి – ఆరు; మునగ కాడ ముక్కలు – 4 ; ఉల్లి తరుగు – అర కప్పు; మిరప కారం – కొద్దిగా; పసుపు – చిటికెడు; బెల్లం పొడి – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – నాలుగు (నిలువుగా కట్ చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత సాంబారు పొడికి కావలసిన పదార్థాలు: ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెగన పప్పు, మినప్పప్పు – 6 టీ స్పూన్లు చొప్పున; ఆవాలు, జీలకర్ర – ఒక టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి – 6; ఇంగువ – చిటికెడు తయారీ: కందిపప్పుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి కుకర్‌లో ఉడికించాలి. మరొక గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తరవాత, ఉడకబెట్టిన కందిపప్పును మెత్తగా మెదిపి ముక్కలలో వేయాలి. చిక్కగా తీసిన చింతపండు రసం, మిరప కారం, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క వేసి, మరిగించాలి. వేరొక పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె లేకుండా ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని సాంబారులో వేసి బాగా కలిపి మరిగించాలి. వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక, చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. పోపు దినుసులు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించాక, రెండు గరిటెల మరుగుతున్న సాంబారును పోపులో పోసి, బాగా కలిపి మూత పెట్టి మరిగించాలి. ఆ తరవాత సాంబారు గిన్నెలో పోసి కలపాలి. కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. – ఎన్. కల్యాణ్ సిద్ధార్థ్ -
వ్యంజనం జనరంజకం
ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక భారతదేశం. మన సాంప్రదాయపు పర్వదినాలను జరుపుకోవటంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాలలో ఉండే చిన్న చిన్న వైరుధ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానం గా ఇవి ఆహారవిహారాలలో గల ప్రాంతీయ భేదాల్ని సూచిస్తాయి. భాద్రపద మాసంలో వచ్చే ‘వినాయక చవితి’ కి కూడా ఇది వర్తిస్తుంది. కుడుములు, ఉండ్రాళ్లు, గొట్టెక్క బుట్టలు వంటి పిండి వంటలను ఆస్వాదించేటప్పుడు రకరకాల పచ్చళ్లను నంజుకోవడం తెలుగువారి ప్రత్యేకత. అప్పటికప్పుడు తాజాగా తయారుచేసుకునే వాటిలో విశిష్టమైనవి... ‘చింతకాయ, కొత్తిమీర, అల్లం, నువ్వుల పప్పు’ పచ్చళ్లు. ప్రధాన భక్ష్యాలతో పాటు నంజుకునే సహద్రవ్యాలు లేదా‡అనుద్రవ్యాలను ‘వ్యంజనాలు’ అంటారు. ఇవి నాలుకకు రుచిని కలిగించడమే కాకుండా, తెలుగువారి మనసులకు కూడా ఆనందం కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. వీటి అవసరాలను, ఆరోగ్య ప్రయోజనాలను ఆయుర్వేదం చక్కగా వివరించింది.స్థూలంగా చెప్పాలంటే భాద్రపద మాసం వర్ష ఋతువు, వాత ప్రకోపం, పిత్త సంచయం కలిగి ఉండే వాతావరణం. ప్రాణుల్లో శక్తి కొంచెం తక్కువగా ఉండే సమయం. వినాయకచవితి పండుగ రోజున కనిపించే పిండి వంటలు, వ్యంజనాలకు బలం కలిగించే గుణం, వాతపిత్తాలను తగ్గించి ఆరోగ్య పరిరక్షణ చేసే లక్షణం కూడా ఉన్నాయి. పచ్చళ్లకు వాడే ప్రధాన పదార్థాలతో పాటు, వాటి తయారీలో ముఖ్యపాత్రను పోషించే ఉప్పు పులుపు కారాలు, ముఖ్య అతిథిగా దర్శనమిచ్చే ఇంగువ, నువ్వుల నూనె గుణగణాలను ఆయుర్వేదం అభివర్ణించింది. చింతకాయ (పచ్చడి) ‘‘అమిలకా అమ్లా గురుః వాతహరా పిత్త కఫాస్రకృత్‘పక్వాతు దీపనీరూక్షా రస ఉష్ణా కఫవాత నుత్‘‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి చింతకాయ/చింతపండుకు పర్యాయ పదాలు. కొత్తిమీర ఇవి ధనియాల యొక్క ఆకులు. ధాన్యకం, ధానకం, కునటీ, కుస్తుంబురు మొదలైనవి ధనియాలకు పర్యాయ పదాలు. ఇవి కొంచెం కారంగా, ఘాటుగా ఉంటాయి. జీర్ణమైన తరవాత మృదువుగా ఉంటుంది. ఆకలిని పుట్టించి అరుగుదలకు సహకరిస్తుంది. ఉష్ణవీర్యమైనప్పటికీ మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. జ్వరం, అతిసారం, దగ్గు, ఆయాసం, దప్పిక, వాంతులను తగ్గిస్తుంది. త్రిదోష హరం, బల్యం, క్రిమి హరం. ధనియాలు వాటి ఆకులైన కొత్తిమీరకు సమాన గుణకర్మలు ఉంటాయని చెప్పారు. ఆర్ద్రంతు తద్గుణం స్వాదు విశేషాత్ పిత్త నాశనం అల్లం దీనికి ఆర్ద్రక, కటుభద్ర, శృంగబేర వంటి పర్యాయపదాలు ఉన్నాయి. కటురస ప్రధానమైనప్పటికీ, జీర్ణమైన తరువాత మృదువుగా ఉంటుంది. శరీరంలోని నీటిని ఆర్చి, వాతకఫాలను తొలగిస్తుంది. అగ్నిదీపకం, శరీరానికి వేడి కలిగిస్తుంది. కొంచెం ఉప్పును కలిపి అల్లం తింటే, అరుచిని, కంఠ రోగాల్ని తగ్గిస్తుంది. తీక్ష›్ణగుణం కలిగి ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతనైనా శరీరంలో రక్తం కారుతున్నప్పుడు , జ్వరం వచ్చినప్పుడు, వేసవికాలంలోను అతిగా సేవించకూడదు.‘భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం!అగ్ని సందీపనం, రుచ్యం, జిహ్వా కంఠ విశోధనమ్ నువ్వులు నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో ఉంటుంది. బలకరం, కేశాలకు మంచిది. స్తన్య వర్ధకం. ఆకలిని, బుద్ధిని పెంచుతాయి. నల్ల నువ్వులు శ్రేష్ఠం. తెల్లనివి మధ్యమం. నువ్వుల నూనె: తిలతైలం గురుస్థైర్యం బలవర్ణకరం సరం, వృష్యం... వాతపిత్త కఫాపహం... కృశానాం తేన బృంహణం... లేఖనం, బద్ధ విణ్మూత్రం గర్భాశయ విశోధనం...’’ బరువైన ద్రవ్యం, త్రిదోష హరం. నీరసించిన వారికి బలం కలిగించి బరువును పెంచుతుంది. కొవ్వును కరిగించే గుణం కలిగి స్థూలకాయులకు బరువును తగ్గిస్తుంది. గట్టిగా ఉన్న మలాన్ని మెత్తబరచి నెట్టివేస్తుంది. స్త్రీలలో గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంగువ (హింగు): ఉష్ణం, పాచనం, రుచ్యం తీక్షవాత కఫఘ్నం, పిత్త వర్ధనంశరీరానికి వేడిని కలిగిస్తుంది, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. కడుపు నొప్పి, కడుపులోని వాయువుని పోగొడుతుంది. గుర్తు ఉంచుకోవలసిన సారాంశం: పిండివంటలు శోభిల్ల పండుగలనుగురుతరంబుగ చేయుడి కూర్మి మీరసాంప్రదాయపు భక్ష్యముల్ శాస్త్రహితముమనసు రంజిల్ల సేవించి మనగ వలయుకొత్తిమిరి చింత అల్లముల్ కోరుకొనుచుమంచి పచ్చళ్లు చేయంగ మరువ వలదుహింగు తిల తైల సంపర్క హిత గుణాన అఖిల జనరంజకములయ్య వ్యంజనములు డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు -
కంటిచూపుకూ.. మేని మెరుపుకూ
మనకు కొత్తిమీర అంటే వంటపూర్తయ్యా, చివరన గార్నిషింగ్ కోసం ఉపయోగించే ఆకులని మాత్రమే తెలుసు. కానీ ఇది కేవలం రుచి, సువాసనల కోసం మాత్రమే అనుకుంటే పొరబాటే. కొత్తిమీరతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఒక జాబితాగా రాస్తే అది బారెడంత పొడవు. కొత్తిమీరతోమనకు సమకూరే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే... కొత్తిమీరలో విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల అది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మాక్యులార్ డిజనరేషన్ వంటి కంటివ్యాధులను నివారిస్తుంది. ఇందులో విటమిన్–బి కాంప్లెక్స్‌కు చెందిన బి1, బి2, బి3, బి5, బి6 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఇవన్నీ మనకు మంచి వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి. విటమిన్–సి కూడా కొత్తిమీరలో పుష్కలంగా ఉండటం వల్ల అది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కొత్తిమీరలో విటమిన్–ఇ పాళ్లు కూడా ఎక్కువే. మేనికి మంచి నిగారింపును ఇవ్వడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి ఇది బాగా తోడ్పడుతుంది. దీర్ఘకాలం యౌవనంగా ఉంచడానికి కొత్తిమీర ఎంతగానో సహాయం చేస్తుంది. కొత్తిమీరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు... తాము తినే అన్ని పదార్థాలను కొత్తిమీరతో గార్నిష్ చేస్తే... రుచికరమైన రీతిలో తమ అనీమియా సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును నివారిస్తుంది. తద్వారా గుండెజబ్బులనూ అరికడుతుంది. కొత్తిమీర కిడ్నీ సమస్యలను సమర్థంగా నివారిస్తుంది. మెగ్నీషియమ్, జింక్ వంటి ఖనిజాలు కొత్తిమీరలో చాలా ఎక్కువే. అందుకే జుట్టు మంచి మెరుపుతో నిగనిగలాడేందుకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో క్యాల్షియమ్ కూడా ఎక్కువ. అందుకే అది ఎముకలను పటిష్టంగా మార్చి, వాటి ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. -
కొత్తిమీరతో కొలెస్ట్రాల్ దూరం!
గుడ్ ఫుడ్ వంటకాన్ని అలంకరించడానికి కొత్తిమీర చల్లుతారు. వంటలో చివరగా వాడినా ఆరోగ్యంలో మొదటిస్థానం కొత్తిమీరదే! కారణం... కొత్తిమీరలో పుష్కలంగా ఉండే ఆరోగ్య అంశాలు. వాటిలో కొన్ని ఇవి... ⇒ కొత్తిమీరలో క్యాలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్ ఉండకపోగా, ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ గురించి దిగులు పడేవాళ్లు కొత్తిమీర తింటే చాలు... స్థూలకాయాన్ని తేలిగ్గా నివారించవచ్చు / అదుపులో ఉంచుకోవచ్చు. ⇒ కొత్తిమీరలో పొటాషియమ్, క్యాల్షియమ్, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియమ్ సమృద్ధిగా ఉంటాయి. పొటాషియమ్ జీవకణం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ⇒ కొత్తిమీరలోని ఐరన్ రక్తహీనతను నివారించడంతో పాటు ఎర్ర రక్తకణాల ఉత్పాదనకు తోడ్పడుతుంది. ⇒కొత్తిమీరలో విటమిన్–ఏ, విటమిన్–బి కాంప్లెక్స్, విటమిన్–సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొత్తిమీరలో విటమిన్–సి పాళ్లు ఎంత ఎక్కువంటే ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన విటమిన్–సిలో 30 శాతం కొత్తిమీరతోనే లభ్యమవుతుంది. ⇒ కొత్తిమీర నోటిక్యాన్సర్లను నిరోధిస్తుంది. న్యూరాన్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ∙రక్తాన్ని గడ్డ కట్టించడంలో కీలక భూమిక నిర్వహించే విటమిన్–కె కొత్తిమీరలో పుష్కలం. ఇందులోని ఔషధ గుణాలు అలై్జమర్స్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగపడతాయి. -
కొత్తిమీర కోసం వచ్చి..మృత్యు ఒడికి
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు పత్తికొండ రూరల్ : కొత్తిమీర తీసుకొద్దామని బయలుదేరిన వ్యక్తి మృత్యు ఒడికి చేరిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా..ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన కొత్తిమీర వ్యాపారి బోయ ఈరన్న(45) మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి కొత్తిమీర తీసుకొద్దామని బయలుదేరాడు. దేవనకొండ మండలం గుండ్లకొండకు చెందిన కిరణ్‌కుమార్, అదే గ్రామానికి చెందిన పాండు, బడికెలింగన్న బైక్‌పై పత్తికొండకు బయలుదేరారు. చిన్నహుల్తి సమీపంలోని సూర్యాభారత్ గ్యాస్ గోడౌన్ వద్ద బోయ ఈరన్న కిరణ్‌కుమార్ బైకును ఓవర్టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో కిరణ్‌కుమార్ బైకు వెనకనుంచి ఈరన్న బైకును ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న బోయ ఈరన్న ఎగిరి బోర్లా పడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కిరణ్‌కుమార్‌తోపాటు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. ఎస్ఐ మధుసూదన్‌రావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రమాదానికి కారణం తెలుసుకున్నారు. గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత వైద్యుల సలహా మేరకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడికి భార్య లక్ష్మి మాత్రమే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎగ్–బ్రెడ్ టోస్ట్
హెల్దీ కుకింగ్ తయారి సమయం: 10 నిమిషాలు కావలసినవి: కోడిగుడ్లు – రెండు బ్రెడ్ స్లైసెస్ – ఆరు (ఒక్కో దానిని రెండేసి ముక్కలుగా త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి) మిరియాల పొడి – టీ స్పూన్ ఉప్పు – చిటికెడు నూనె – టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా – చిటికెడు కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్ తయారి:ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు బాగా గిలక్కొట్టాలి.అందులో మిరియాలపొడి, ఉప్పు, బేకింగ్ సోడా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.నాన్‌స్టిక్ పాన్ వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి.ఒక్కో బ్రెడ్ స్లైస్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి పాన్ పై వేయాలి. రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేవరకు కాల్చి తీయాలి. -
బీట్రూట్ సలాడ్
హెల్దీ కుకింగ్ కావలసినవి: బీట్రూట్ తురుము – ఒక కప్పు టొమాటో తరుగు – రెండు టీ స్పూనులు, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను, నిమ్మరసం – అర టీ స్పూను ఉప్పు – తగినంత, పోపుకి: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి... అన్నీ కొద్దికొద్దిగా. తయారి: బీట్రూట్ తురుములో టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. తరవాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా వేయించుకున్న పోపు వేసి ఫ్రెష్‌గా తినాలి. ఎప్పటికప్పుడు చేసుకోలేని వాళ్లు రెండు మూడు రోజులకి సరిపడా తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. (డయాబెటిక్ పేషెంట్లు దీనిని తినకూడదు)