Health Tips In Telugu: What Is Detoxification And Its Significance Explained - Sakshi
Sakshi News home page

Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం..

Published Mon, Jul 4 2022 9:52 AM | Last Updated on Mon, Jul 4 2022 10:40 AM

Health Tips In Telugu: What Is Detoxification And Its Significance Explained - Sakshi

What Is Detoxification: మనిషి పైకి చూడటానికి ఎంత బాగున్నా, పరిశుభ్రంగా ఉంటేనే ఆ అందానికి అర్థం ఉంటుంది. అయితే అది పైకే కాదు. శరీరంలోపల కూడా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే, శరీరానికి బాహ్య శుభ్రత ఎంత అవసరమో అంతర్గత శుభ్రత కూడా అంతే అవసరం.

ఇక్కడ శుభ్రత అంటే కడుపులో పేరుకుపోతున్న విషాలను అంటే టాక్సిన్స్‌ను తొలగించుకోవడమే! విషాలను తొలగించడం అంటే డీటాక్స్‌ చేయాలని అర్థం. అసలు మనకు శరీరంలో టాక్సిన్స్‌ చేరాయని ఎలా తెలుస్తుంది, దాన్ని ఏవిధంగా గుర్తించాలో, ఎప్పుడెప్పుడు శరీరాన్ని డీటాక్స్‌ చేయాలో తెలుసుకుందాం...

శరీరంలో విషపదార్ధాలు ఎక్కువైనప్పుడు శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది. ఆ సంకేతాలేంటి, ఎప్పుడు శరీరాన్ని డీటాక్స్‌ చేయాలో చూద్దాం. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లేదా శరీరంపై చెమట నుంచి చెడు వాసన వస్తున్నా శరీరంలో విషపదార్ధాలు పేరుకున్నాయని అర్ధం. అదే సమయంలో శ్వాస కూడా చెడు వాసన కల్గిస్తుంది.

మీకు కూడా ఈ సమస్యలు  ఎదురైతే మీ శరీరాన్ని డీటాక్స్‌ చేయాల్సిన సమయం వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలు తీవ్ర సమస్యల్ని సృష్టించే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో పేరుకున్న వ్యర్ధాల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.

అందుకే శరీరాన్ని డీటాక్స్‌ చేయాలి!
అయితే చాలామందికి శరీరాన్ని ఎందుకు డీటాక్స్‌ చేయాలనే సందేహం రావచ్చు. లేదా ఎప్పుడెప్పుడు డీటాక్స్‌ చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల, కావల్సినంత నీరు తాగకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయేందుకు దోహదమౌతాయి.

కడుపు ఉబ్బిపోవడం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా శరీరాన్ని డీటాక్స్‌ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే పేగుల్లో పేరుకున్న వ్యర్ధాలు, విషపదార్ధాలు జీర్ణశక్తిని బలహీన పరుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. మీ కడుపు పాడై ఉంటే లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురైనా శరీరాన్ని డీటాక్స్‌ చేయాల్సిందే.

ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మూడ్‌ పాడవడం, విసుగు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విష పదార్ధాలు శరీరం మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. హార్మోన్‌ సమతుల్యత సరిగ్గా ఉండాలంటే.. మెటబాలిజం కూడా సరిగ్గా ఉండాల్సిందే. అందుకే శరీరాన్ని డీటాక్స్‌ చేయాలి. 

చర్మ సంబంధిత సమస్యల వల్ల కూడా శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. రక్తాన్ని మలినం చేసేస్తాయి. చర్మంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు ఇందుకు కారణాలు. ఇవికాకుండా హార్మోన్‌ అసమతుల్యత, చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటే.. శరీరాన్ని డీటాక్స్‌ చేయాలని అర్దం.

సీజన్‌ మారినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే ముప్పు అధికం అవుతుంది. దీనికి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు కూడా కారణం అవుతాయి. మితంగా ఆహారం తీసుకోవడం, తేలికపాటి ఆహార పదార్థాలను తినడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన ట్యాక్సిన్లను బయటకు పంపొచ్చు. మార్కెట్లో విరివిగా లభించే కొత్తిమీర, పుదీనా, త్రిఫల చూర్ణం లాంటి మూలికలతో ట్యాక్సిన్లను బయటకు పంపించి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

ఆహారంలో ఇవి తీసుకుంటే మేలు
శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించడంలో కొత్తిమీర చక్కగా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలను చంపే, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఆవశ్యక నూనెలు ఇందులో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన భారీ లోహాలను కూడా ఇవి తొలగిస్తాయి. కొత్తిమీర జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, వికారాన్ని పోగొడుతుంది.

కొత్తిమీర రక్తంలోని చక్కెర స్థాయులను సమతుల్యం చేస్తుంది. కూరలు ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీర వేయడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. జ్యూస్‌లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపొచ్చు.

త్రిఫల చూర్ణంలో ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక గుణాలున్నాయి. ఇది ట్యాక్సిన్లను బయటకు పంపుతుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో దీన్ని తయారు చేస్తారు. సుమారు ఒక టీ స్పూన్‌ త్రిఫల చూర్ణాన్ని అరకప్పు వేడినీటిలో కలపాలి. చల్లారిన తర్వాత రాత్రి నిద్రకు ఉపక్రమించే పది నిమిషాల ముందు దీన్ని తాగాలి. ఫలితంగా తెల్లవారేసరికల్లా కడుపులోని టాక్సిన్స్‌ అన్నీ మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి. 

పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది. కడుపు నొప్పి, గ్యాస్‌ వదలడం, మలబద్దకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. దంతాలు తెల్లగా మారడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి తోడ్పడుతుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలో, ఒంట్లోని ట్యాక్సిన్లను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఒంట్లోని మలినాలు, ట్యాక్సిన్లను తేలిగ్గా పోగొట్టుకోండి. 

ఇవే కాదు... వెల్లుల్లి, దానిమ్మ, బ్రోకలీ వంటివి కూడా శరీరాన్ని డీ టాక్సిఫై చేయగలవు. 

మరో ముఖ్యమైన విషయం...  విషాలంటే ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేష, పగ, ప్రతీకారం, సహనం లేకపోవడం, హింసాప్రవృత్తి కూడా... అవి ఈ విషాలకన్నా మరింత ప్రమాదకరం. ఆ విషాలను దని చేరనివ్వకపోవడం ఇంకా అవసరం. చేరిన వాటిని వెంటనే తొలగించుకోవడం ఇంకా అవసరం.

చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement