Mint juice
-
Health Tips: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన వస్తోందా.. అయితే..
What Is Detoxification: మనిషి పైకి చూడటానికి ఎంత బాగున్నా, పరిశుభ్రంగా ఉంటేనే ఆ అందానికి అర్థం ఉంటుంది. అయితే అది పైకే కాదు. శరీరంలోపల కూడా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే, శరీరానికి బాహ్య శుభ్రత ఎంత అవసరమో అంతర్గత శుభ్రత కూడా అంతే అవసరం. ఇక్కడ శుభ్రత అంటే కడుపులో పేరుకుపోతున్న విషాలను అంటే టాక్సిన్స్‌ను తొలగించుకోవడమే! విషాలను తొలగించడం అంటే డీటాక్స్ చేయాలని అర్థం. అసలు మనకు శరీరంలో టాక్సిన్స్ చేరాయని ఎలా తెలుస్తుంది, దాన్ని ఏవిధంగా గుర్తించాలో, ఎప్పుడెప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలో తెలుసుకుందాం... శరీరంలో విషపదార్ధాలు ఎక్కువైనప్పుడు శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది. ఆ సంకేతాలేంటి, ఎప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలో చూద్దాం. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లేదా శరీరంపై చెమట నుంచి చెడు వాసన వస్తున్నా శరీరంలో విషపదార్ధాలు పేరుకున్నాయని అర్ధం. అదే సమయంలో శ్వాస కూడా చెడు వాసన కల్గిస్తుంది. మీకు కూడా ఈ సమస్యలు ఎదురైతే మీ శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన సమయం వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలు తీవ్ర సమస్యల్ని సృష్టించే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో పేరుకున్న వ్యర్ధాల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేయాలి! అయితే చాలామందికి శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలనే సందేహం రావచ్చు. లేదా ఎప్పుడెప్పుడు డీటాక్స్ చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జంక్ ఫుడ్ తినడం వల్ల, కావల్సినంత నీరు తాగకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయేందుకు దోహదమౌతాయి. కడుపు ఉబ్బిపోవడం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే పేగుల్లో పేరుకున్న వ్యర్ధాలు, విషపదార్ధాలు జీర్ణశక్తిని బలహీన పరుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. మీ కడుపు పాడై ఉంటే లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురైనా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిందే. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మూడ్ పాడవడం, విసుగు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విష పదార్ధాలు శరీరం మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ సమతుల్యత సరిగ్గా ఉండాలంటే.. మెటబాలిజం కూడా సరిగ్గా ఉండాల్సిందే. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేయాలి. చర్మ సంబంధిత సమస్యల వల్ల కూడా శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. రక్తాన్ని మలినం చేసేస్తాయి. చర్మంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు ఇందుకు కారణాలు. ఇవికాకుండా హార్మోన్ అసమతుల్యత, చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటే.. శరీరాన్ని డీటాక్స్ చేయాలని అర్దం. సీజన్ మారినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే ముప్పు అధికం అవుతుంది. దీనికి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు కూడా కారణం అవుతాయి. మితంగా ఆహారం తీసుకోవడం, తేలికపాటి ఆహార పదార్థాలను తినడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన ట్యాక్సిన్లను బయటకు పంపొచ్చు. మార్కెట్లో విరివిగా లభించే కొత్తిమీర, పుదీనా, త్రిఫల చూర్ణం లాంటి మూలికలతో ట్యాక్సిన్లను బయటకు పంపించి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆహారంలో ఇవి తీసుకుంటే మేలు శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించడంలో కొత్తిమీర చక్కగా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలను చంపే, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఆవశ్యక నూనెలు ఇందులో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన భారీ లోహాలను కూడా ఇవి తొలగిస్తాయి. కొత్తిమీర జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, వికారాన్ని పోగొడుతుంది. కొత్తిమీర రక్తంలోని చక్కెర స్థాయులను సమతుల్యం చేస్తుంది. కూరలు ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీర వేయడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. జ్యూస్‌లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపొచ్చు. త్రిఫల చూర్ణంలో ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక గుణాలున్నాయి. ఇది ట్యాక్సిన్లను బయటకు పంపుతుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో దీన్ని తయారు చేస్తారు. సుమారు ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని అరకప్పు వేడినీటిలో కలపాలి. చల్లారిన తర్వాత రాత్రి నిద్రకు ఉపక్రమించే పది నిమిషాల ముందు దీన్ని తాగాలి. ఫలితంగా తెల్లవారేసరికల్లా కడుపులోని టాక్సిన్స్ అన్నీ మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి. పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది. కడుపు నొప్పి, గ్యాస్ వదలడం, మలబద్దకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. దంతాలు తెల్లగా మారడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి తోడ్పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, ఒంట్లోని ట్యాక్సిన్లను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఒంట్లోని మలినాలు, ట్యాక్సిన్లను తేలిగ్గా పోగొట్టుకోండి. ఇవే కాదు... వెల్లుల్లి, దానిమ్మ, బ్రోకలీ వంటివి కూడా శరీరాన్ని డీ టాక్సిఫై చేయగలవు. ►మరో ముఖ్యమైన విషయం... విషాలంటే ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేష, పగ, ప్రతీకారం, సహనం లేకపోవడం, హింసాప్రవృత్తి కూడా... అవి ఈ విషాలకన్నా మరింత ప్రమాదకరం. ఆ విషాలను దని చేరనివ్వకపోవడం ఇంకా అవసరం. చేరిన వాటిని వెంటనే తొలగించుకోవడం ఇంకా అవసరం. చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు! -
ఔషధాల ఖజానా పుదీనా
పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబంధ వ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2–3 చెంచాలు సేవిస్తూ వుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా ఆకులు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషాయాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతీమంట, కడుపులో మంట, మూత్ర సంబంధ వ్యాధులు సమసిపోతాయి. గర్భిణులు చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడుతుంది. పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనాన్నిస్తుంది. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆ రసంలో ముంచి, ముక్కులోనూ, చెవిలోనూ డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది. ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలు కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది. పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచిగా ఉండడమే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృదువుగా మధురంగా తయారవుతుంది. ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స కంపెనీల్లో, బబుల్ గమ్స్ తయారీలో, మందుల్లో, మరి కొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది. -
Summer: మామిడి, పుదీనా, నిమ్మరసం.. ఈ లస్సీ ఒక్కసారి తాగితే..
Mango Peppermint Lassi Recipe: పుదీనా, నిమ్మరసం ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక వేసవిలో లభించే మామిడిపండు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తాయి. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకెన్నో ఉపయోగాలు. మరి మండే ఎండల్లో మధ్యాహ్నం పూట వీటితో తయారు చేసిన మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ తాగితే దాహార్తి తీరుతుంది. అంతేకాదు ఇందులోని పోషకాలు చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంట్లో ఈ సమ్మర్ డ్రింక్‌ను ఈజీగా తయారు చేసుకోండి. మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడిపండు గుజ్జు – కప్పు, పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – టీస్పూను, నిమ్మరసం – టేబుల్ స్పూను, పెరుగు – నాలుగు కప్పులు, ఐస్ ముక్కలు – కప్పు తయారీ విధానం: బ్లెండర్లో మామిడి పండు గుజ్జు, పుదీనా, పాలు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ గ్రైండ్ అయ్యాక పెరుగు, ఐస్ ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసి సర్వ్‌చేసుకోవాలి. చదవండి👉🏾Boppayi Banana Smoothie: ఈ స్మూతీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే! -
రెండాకులు ఎక్కువే పిండాం..!
టేస్ట్ ద థండర్ ... గుట గుటమనిపించే ఉంటారు ఓపెన్ హ్యాపీనెస్... సిప్పు కొట్టే ఉంటారు. యే దిల్ మాంగే మోర్... ఆస్వాదించే ఉంటారు జ్యాదా మస్తి ... లాగించే ఉంటారు క్లియర్ హై ... క్లియర్ చేసే ఉంటారు ఇవి... అన్నీ కూల్‌డ్రింక్స్ ట్యాగ్లైన్లు. కానీ, మేం ఆరులైన్లు ఎక్కువే చదివాం. అందుకే, రెండాకులు ఎక్కువే పిండాం. ఆకుకూరలతో జ్యూసులు టేస్ట్ ద వండర్! పుదీనా జ్యూస్ కావల్సినవి: పుదీనా ఆకులు – ఒకటిన్నర కప్పు; బెల్లం లేదా పంచదార – 6 టేబుల్ స్పూన్లు (తగినంత); నీళ్లు – అర కప్పు; నల్లుప్పు – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – టీ స్పూన్; నిమ్మరసం – 3 టీ స్పూన్లు తయారీ: పుదీనా కాడల నుంచి ఆకులను వేరు చేసి, నీళ్లలో వేసి కడగాలి. తర్వాత జల్లిలో వేసి నీళ్లన్నీ పోయేదాకా ఆరనివ్వాలి. అన్ని పదార్థాలు మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా పేస్ట్ అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పుదీనా జ్యూస్ పావు కప్పు తీసుకుంటే 3 కప్పుల నీళ్లు దీనికి కలపాలి. గ్లాస్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సేవించాలి. (తీపి కావాలనుకుంటే మరికాస్త కలుపుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం లేదంటే తేనెను కూడా వాడుకోవచ్చు.) మునగాకు జ్యూస్ కావల్సినవి: మునగాకు – అర కప్పుతేనె – టేబుల్ స్పూన్ నిమ్మరసం – టేబుల్ స్పూన్ నీళ్లు – అర గ్లాసు తయారీ: మునగాకు మెత్తగా రుబ్బి, అందులో నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. గ్లాసులో పోసి నిమ్మరసం, తేనె కలపాలి. క్యాల్షియం సమృద్ధిగా లభించే మునగాకు ఎముకల బలానికి మేలు చేస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పుపైనాపిల్ ముక్కలు – 6 కప్పులుపుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి.గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. కొత్తిమీర జ్యూస్ కావల్సినవి: పాలకూర తరుగు – కప్పు ఏదైనా మరో ఆకు కూర – ఒక ఆకు యాపిల్ – 1 నిమ్మరసం – టీ స్పూన్నీళ్లు – కప్పు తయారీ: ఆకు కూరను, యాపిల్‌ను శుభ్రపరచాలి. యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి, మెత్తగా బ్లెండ్ చేయాలి. నిమ్మరసం కలిపి సర్వింగ్ గ్లాస్లో పోసి అందించాలి. చల్లగా కావాలనుకునేవారికి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి. తమలపాకు జ్యూస్ కావల్సినవి: కొత్తిమీర తరుగు – అర కప్పు పుదీనా ఆకులు – గుప్పెడు నీళ్లు – కప్పు నిమ్మరసం – టీ స్పూన్ ఉప్పు – తగినంత తయారీ: కప్పు నీళ్లు మరిగించాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, పైన మూత పెట్టి, మంట తీసేయాలి. ఐదు నిమిషాలు ఉంచి, ఆ నీటిని వడకట్టాలి. ఆకులను గ్రైండర్లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో వడకట్టిన నీళ్లు కలిపి ఆకులను మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ జ్యూస్ ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయ్యాక అందించాలి. వీట్‌గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పు పైనాపిల్ ముక్కలు – 6 కప్పులు పుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. పాలకూర జ్యూస్ కావల్సినవి: తమలపాకులు – 2 గులాబీ పూల రేకలు – కొన్ని బెల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు లవంగం – 1 దాల్చిన చెక్క – చిన్న ముక్క నీళ్లు – కప్పు తయారీ: తమలపాకులు, గులాబీ పువ్వు రేకలు శుభ్రం చేయాలి. అన్నీ కలిపి, జ్యూస్ మిక్సర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వడకట్టి, సేవించాలి. నోట్ : ఆకుకూరలను తప్పనిసరిగా తగినన్ని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కనీసం 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మరో రెండు సార్లు మంచి నీళ్లతో శుభ్రపరచాలి. ఆకుల మీద పురుగుమందుల అవశేషాలు పోయే వరకు శుభ్రం చేయాలి.