రెండాకులు ఎక్కువే పిండాం..!
టేస్ట్ ద థండర్ ... గుట గుటమనిపించే ఉంటారు
ఓపెన్ హ్యాపీనెస్... సిప్పు కొట్టే ఉంటారు.
యే దిల్ మాంగే మోర్... ఆస్వాదించే ఉంటారు
జ్యాదా మస్తి ... లాగించే ఉంటారు
క్లియర్ హై ... క్లియర్ చేసే ఉంటారు
ఇవి... అన్నీ కూల్‌డ్రింక్స్ ట్యాగ్‌లైన్లు.
కానీ, మేం ఆరులైన్లు ఎక్కువే చదివాం.
అందుకే, రెండాకులు ఎక్కువే పిండాం.
ఆకుకూరలతో జ్యూసులు టేస్ట్ ద వండర్!
పుదీనా జ్యూస్
కావల్సినవి: పుదీనా ఆకులు – ఒకటిన్నర కప్పు; బెల్లం లేదా పంచదార – 6 టేబుల్ స్పూన్లు (తగినంత); నీళ్లు – అర కప్పు; నల్లుప్పు – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – టీ స్పూన్; నిమ్మరసం – 3 టీ స్పూన్లు
తయారీ: పుదీనా కాడల నుంచి ఆకులను వేరు చేసి, నీళ్లలో వేసి కడగాలి. తర్వాత జల్లిలో వేసి నీళ్లన్నీ పోయేదాకా ఆరనివ్వాలి. అన్ని పదార్థాలు మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా పేస్ట్ అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పుదీనా జ్యూస్ పావు కప్పు తీసుకుంటే 3 కప్పుల నీళ్లు దీనికి కలపాలి. గ్లాస్‌లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సేవించాలి. (తీపి కావాలనుకుంటే మరికాస్త కలుపుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం లేదంటే తేనెను కూడా వాడుకోవచ్చు.)
మునగాకు జ్యూస్
కావల్సినవి: మునగాకు – అర కప్పుతేనె – టేబుల్ స్పూన్ నిమ్మరసం – టేబుల్ స్పూన్ నీళ్లు – అర గ్లాసు
తయారీ: మునగాకు మెత్తగా రుబ్బి, అందులో నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. గ్లాసులో పోసి నిమ్మరసం, తేనె కలపాలి. క్యాల్షియం సమృద్ధిగా లభించే మునగాకు ఎముకల బలానికి మేలు చేస్తుంది.
వీట్‌గ్రాస్ జ్యూస్
కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పుపైనాపిల్ ముక్కలు – 6 కప్పులుపుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్
తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్‌లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి.గ్లాస్‌లో పోసి చల్లగా అందించాలి.
నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు.
కొత్తిమీర జ్యూస్
కావల్సినవి: పాలకూర తరుగు – కప్పు ఏదైనా మరో ఆకు కూర – ఒక ఆకు యాపిల్ – 1 నిమ్మరసం – టీ స్పూన్‌నీళ్లు – కప్పు
తయారీ: ఆకు కూరను, యాపిల్‌ను శుభ్రపరచాలి. యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్‌లో వేసి, మెత్తగా బ్లెండ్ చేయాలి. నిమ్మరసం కలిపి సర్వింగ్ గ్లాస్‌లో పోసి అందించాలి. చల్లగా కావాలనుకునేవారికి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.
తమలపాకు జ్యూస్
కావల్సినవి: కొత్తిమీర తరుగు – అర కప్పు పుదీనా ఆకులు – గుప్పెడు నీళ్లు – కప్పు నిమ్మరసం – టీ స్పూన్ ఉప్పు – తగినంత
తయారీ: కప్పు నీళ్లు మరిగించాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, పైన మూత పెట్టి, మంట తీసేయాలి. ఐదు నిమిషాలు ఉంచి, ఆ నీటిని వడకట్టాలి. ఆకులను గ్రైండర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో వడకట్టిన నీళ్లు కలిపి ఆకులను మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ జ్యూస్ ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయ్యాక అందించాలి.
వీట్‌గ్రాస్ జ్యూస్
కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పు పైనాపిల్ ముక్కలు – 6 కప్పులు పుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్
తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్‌లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. గ్లాస్‌లో పోసి చల్లగా అందించాలి.
నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు.
పాలకూర జ్యూస్
కావల్సినవి: తమలపాకులు – 2 గులాబీ పూల రేకలు – కొన్ని బెల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు లవంగం – 1 దాల్చిన చెక్క – చిన్న ముక్క నీళ్లు – కప్పు
తయారీ: తమలపాకులు, గులాబీ పువ్వు రేకలు శుభ్రం చేయాలి. అన్నీ కలిపి, జ్యూస్ మిక్సర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వడకట్టి, సేవించాలి.
నోట్ : ఆకుకూరలను తప్పనిసరిగా తగినన్ని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కనీసం 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మరో రెండు సార్లు
మంచి నీళ్లతో శుభ్రపరచాలి. ఆకుల మీద పురుగుమందుల అవశేషాలు పోయే వరకు శుభ్రం చేయాలి.