ఏప్రిల్–జూన్ మధ్యలో అర్బన్ మార్కెట్ కంటే మెరుగ్గా రూరల్ మార్కెట్
ఆర్థికమాంద్య పరిస్థితుల్లోనూ పెరుగుతున్న అమ్మకాలు
సగటు భారత కుటుంబాల్లో 50 శాతం పెరిగిన బాటిల్డ్ సాఫ్ట్‌డ్రింక్స్ వినియోగం
కన్సలి్టంగ్ సంస్థ కాంటార్ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాల్లో అర్బన్ మార్కెట్‌ను రూరల్ మార్కెట్ అధిగమిస్తోంది. ఈ వస్తువుల అమ్మకాల్లో పట్టణ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలు వెనక్కి నెడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో అర్బన్ మార్కెట్ కంటే రూరల్ మార్కెట్ మెరుగైన స్థితిలోకి చేరుకుంది. ఆర్థికమాంధ్య పరిస్థితుల్లోనూ ఎఫ్‌ఎంసీజీల అమ్మకాల్లో రూరల్ ఇండియా టాప్‌లో నిలిచింది.
ప్రస్తుత పరిస్థితుల్లో నగరాల్లో ఈ వస్తువుల అమ్మకాలు కొంత ఇబ్బందుల్లోనే కొనసాగవచ్చునని, గ్రామీణ మార్కెట్ మాత్రం ఇప్పుడున్న స్థితిని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 తో తలెత్తిన విపత్కర పరిస్థితులతో రూరల్ మార్కెట్ తిరోగమనంతో ఒత్తిళ్లకు గురికాగా, క్రమంగా పుంజుకున్నట్టు కన్సల్టింగ్ సంస్థ ‘కాంటార్’తాజా నివేదికలో వెల్లడైంది.
నివేదికలో ఏం చెప్పారంటే..
⇒ 2024 ప్రారంభం నుంచే గ్రామీణ మార్కెట్ అంచనాలకు మించి పుంజుకుంటోంది.
⇒2023 సంవత్సరంలో మెరుగైన స్థితిలో ఉన్న అర్బన్ మార్కెట్ క్రమంగా దిగజారుతూ వస్తోంది.
⇒ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన మార్కెట్‌గా ఉన్న న్యూడుల్స్, సాల్టీస్నాక్స్ వంటి కేటగిరి వస్తువుల అమ్మకాల తగ్గుదలతో కూడా ఈ పరిస్థితి ఎదురైంది.
⇒ సెంట్రల్ ఇండియాలో అధిక వర్షపాతం తదితర కారణాలతో రూరల్ మార్కెట్ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడింది.
⇒ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గ్రామీణ మార్కెట్ వృద్ధి చెందేందుకు మరిన్ని అవకాశాలున్నాయని, ఈ ఏడాది రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ పురోగతిలోనే ముందుకు సాగుతుంది.
ఇదీ ఎఫ్‌ఎంసీజీ పల్స్ రిపోర్ట్
కూల్‌డ్రింక్స్ (బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్)తాగే సగటు భారతీయ కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండేళ్లతో పోల్చితే గత మార్చితో ముగిసిన 2023–24లో ఇది 50 శాతానికి పెరిగినట్టుగా ‘కాంటార్ ఎఫ్‌ఎంసీజీ పల్స్‌రిపోర్ట్’వెల్లడించింది. గత రెండేళ్లలో సగటు కుటుంబాల్లో 250 మిల్లీలీటర్ల సాఫ్ట్‌డ్రింక్స్ వినియోగంతో పెరుగుదల నమోదైంది.
⇒ ప్రీమియం ల్యాండ్రీ ఐటమ్‌గా పరిగణిస్తున్న ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లను మాత్రం నాలుగు కుటుంబాల్లో ఒకటి మాత్రమే ఉపయోగిస్తోంది.
మిగతా వస్తువుల విషయానికొస్తే..
⇒ ప్రీమియం ల్యాండ్రీ ఉత్పత్తిగా పరిగణిస్తున్న వాషింగ్ లిక్విడ్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల మార్క్‌ను దాటి రికార్డ్ బ్రేక్ చేశాయి.
⇒ మార్చి 2023తో పోలి్చతే మార్చి 2024లో బాటిల్డ్ సాఫ్ట్‌డ్రింక్ కేటగిరి అనేది 41 శాతం వృద్ధి (మూవింగ్ యాన్యువల్ టోటల్)గా నమోదైంది.
⇒ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చానళ్లలో వినియోగదారులు ఏడాదికి 156 సార్లు ఎఫ్‌ఎంసీజీ వస్తువులు (ప్రతీ 56 గంటలకు ఒకసారి) కొనుగోలు
చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment