soft drinks
-
రూ.9,000 కోట్ల నిధుల సమీకరణ
పానీయాల తయారీ కంపెనీ పెప్సీకోకు బాటిళ్లు సమకూర్చడంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న వరుణ్ బెవరేజెస్, ఫోర్టీస్ హెల్త్‌కేర్ తాజాగా నిధుల సమీకరణ బాట పట్టాయి. వ్యాపార వృద్ధి, కొత్త ప్రొడక్టులు, కొత్త ప్రాంతాలకు విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, రుణాల చెల్లింపునకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థలు తెలిపాయి.వరుణ్ బెవరేజెస్ రూ.7,500 కోట్లుఅర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు వరుణ్ బెవరేజెస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వృద్ధి ప్రణాళికల అమలుకు వీలుగా క్విప్ ద్వారా రూ.7,500 కోట్లు మించకుండా సమకూర్చుకునేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలియజేసింది. అయితే ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతులు సైతం కోరనున్నట్లు పేర్కొంది. క్విప్‌లో కనీసం 10 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించనుంది. నిధులను అనుబంధ, భాగస్వామ్య లేదా సహచర సంస్థలలో పెట్టుబడులకు వెచ్చించనున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?ఫోర్టిస్ హెల్త్‌కేర్ రూ.1,500 కోట్లుఎన్సీడీలు(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు) జారీ ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో అర్హతగల ఇన్వెస్టర్లకు ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,500 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇన్వెస్టర్ల జాబితాలో డీబీఎస్ బ్యాంక్(డీబీఎస్), హెచ్ఎస్బీసీ, సిటీకార్ప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(సింగపూర్), మిజుహో బ్యాంక్ సింగపూర్సహా ఇతర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఎన్సీడీలను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. -
వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
ఆల్కహాల్‌లేని పానీయాలపై జీఎస్టీని సరళీకరించాలని ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ సూచించింది. డ్రింక్స్‌లో ఉండే చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు విధించాలని తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఆల్కహాల్‌లేని పానీయాల మార్కెట్ దేశీయంగా 2030 వరకు రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కార్బొనేటెడ్ పానీయాలపై పన్ను విధానాల మీద ఐసీఆర్ఐఈఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.పి.మీనా మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఈ విభాగ పరిమాణం రూ.60,000 కోట్లుగా ఉంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆల్కహాలేతర పానీయాలు(సీసాల్లోని నీరు, సాఫ్ట్ డ్రింక్స్) కీలకం. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అవతరించనుంది. ప్రస్తుతం 20 లీటర్లు లేదా అంతకుమించి నీళ్ల సీసాలకు 12 శాతం జీఎస్టీ, 20 లీటర్ల లోపైతే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలా కాకుండా ఒకే రేటు వర్తించేలా చూడాలి. నీళ్ల సీసాలన్నింటికీ 5 శాతం జీఎస్టీ విధించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!దేశీయంగా, అంతర్జాతీయంగా నీళ్ల సీసాల సరఫరాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మీనా తెలిపారు. ఈ విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ ప్రతిపాదన తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆల్కహాలేతర పానీయాల్లో చక్కెర స్థాయులు ఎక్కువ ఉంటే అధిక జీఎస్టీ, తక్కువ ఉంటే తక్కువ జీఎస్టీ విధించాలన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఆల్కహాలేతర పానీయాలను హానికారక ఉత్పత్తుల కేటగిరీలో చేర్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు పునరాలోచించాలన్నారు. సాఫ్ట్డ్రింక్స్పై చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు నిర్ణయించాలని సూచించారు. -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో రూరల్.. రూలర్!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో అర్బన్ మార్కెట్‌ను రూరల్ మార్కెట్ అధిగమిస్తోంది. ఈ వస్తువుల అమ్మకాల్లో పట్టణ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలు వెనక్కి నెడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో అర్బన్ మార్కెట్ కంటే రూరల్ మార్కెట్ మెరుగైన స్థితిలోకి చేరుకుంది. ఆర్థికమాంధ్య పరిస్థితుల్లోనూ ఎఫ్ఎంసీజీల అమ్మకాల్లో రూరల్ ఇండియా టాప్‌లో నిలిచింది.ప్రస్తుత పరిస్థితుల్లో నగరాల్లో ఈ వస్తువుల అమ్మకాలు కొంత ఇబ్బందుల్లోనే కొనసాగవచ్చునని, గ్రామీణ మార్కెట్ మాత్రం ఇప్పుడున్న స్థితిని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 తో తలెత్తిన విపత్కర పరిస్థితులతో రూరల్ మార్కెట్ తిరోగమనంతో ఒత్తిళ్లకు గురికాగా, క్రమంగా పుంజుకున్నట్టు కన్సల్టింగ్ సంస్థ ‘కాంటార్’తాజా నివేదికలో వెల్లడైంది.నివేదికలో ఏం చెప్పారంటే..⇒ 2024 ప్రారంభం నుంచే గ్రామీణ మార్కెట్ అంచనాలకు మించి పుంజుకుంటోంది. ⇒2023 సంవత్సరంలో మెరుగైన స్థితిలో ఉన్న అర్బన్ మార్కెట్ క్రమంగా దిగజారుతూ వస్తోంది. ⇒ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన మార్కెట్‌గా ఉన్న న్యూడుల్స్, సాల్టీస్నాక్స్ వంటి కేటగిరి వస్తువుల అమ్మకాల తగ్గుదలతో కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ⇒ సెంట్రల్ ఇండియాలో అధిక వర్షపాతం తదితర కారణాలతో రూరల్ మార్కెట్ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడింది. ⇒ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గ్రామీణ మార్కెట్ వృద్ధి చెందేందుకు మరిన్ని అవకాశాలున్నాయని, ఈ ఏడాది రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ పురోగతిలోనే ముందుకు సాగుతుంది. ఇదీ ఎఫ్ఎంసీజీ పల్స్ రిపోర్ట్ కూల్‌డ్రింక్స్ (బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్)తాగే సగటు భారతీయ కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండేళ్లతో పోల్చితే గత మార్చితో ముగిసిన 2023–24లో ఇది 50 శాతానికి పెరిగినట్టుగా ‘కాంటార్ ఎఫ్ఎంసీజీ పల్స్రిపోర్ట్’వెల్లడించింది. గత రెండేళ్లలో సగటు కుటుంబాల్లో 250 మిల్లీలీటర్ల సాఫ్ట్‌డ్రింక్స్ వినియోగంతో పెరుగుదల నమోదైంది. ⇒ ప్రీమియం ల్యాండ్రీ ఐటమ్‌గా పరిగణిస్తున్న ఫాబ్రిక్ సాఫ్ట్నర్లను మాత్రం నాలుగు కుటుంబాల్లో ఒకటి మాత్రమే ఉపయోగిస్తోంది. మిగతా వస్తువుల విషయానికొస్తే..⇒ ప్రీమియం ల్యాండ్రీ ఉత్పత్తిగా పరిగణిస్తున్న వాషింగ్ లిక్విడ్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల మార్క్‌ను దాటి రికార్డ్ బ్రేక్ చేశాయి. ⇒ మార్చి 2023తో పోలి్చతే మార్చి 2024లో బాటిల్డ్ సాఫ్ట్‌డ్రింక్ కేటగిరి అనేది 41 శాతం వృద్ధి (మూవింగ్ యాన్యువల్ టోటల్)గా నమోదైంది. ⇒ ఆన్లైన్, ఆఫ్‌లైన్ చానళ్లలో వినియోగదారులు ఏడాదికి 156 సార్లు ఎఫ్ఎంసీజీ వస్తువులు (ప్రతీ 56 గంటలకు ఒకసారి) కొనుగోలు చేస్తున్నారు. -
దెబ్బకు దిగొచ్చిన ఇండిగో.. ఇక ఫ్రీగా..
దేశీయంగా విమాన ప్రయాణాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల మధ్య విమానాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల్లో ఆహార పదార్థాలు, పానీయాల కోసం ప్రయాణికుల నుంచి అత్యధికంగా వసూలు చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేయడంతో ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ దిగొచ్చింది. ఇండిగో విమానంలో సాఫ్ట్ డ్రింక్ కావాల్సిన ప్రయాణికుతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారని, విడిగా సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వడం లేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎక్స్‌ట్రాల పేరుతో ప్రయాణికులను పిండడం మానేయాలని ఆ విమానయాన సంస్థకు హితవు పలికారు. (ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!) ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో స్నాక్స్ అనుభవాన్ని అందించడానికి తమ సేవలను పునరుద్ధరించినట్లు ఇండిగో ప్రతినిధి తాజాగా తెలిపారు. ఇక క్యాన్లలో పానీయాలు విక్రయించడం నిలిపివేసినట్లు చెప్పారు. వేలాది క్యాన్ వ్యర్థాలను అరికట్టే తమ గో గ్రీన్ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానాలలో క్యాన్లలో పానీయాల విక్రయం ఎప్పటి నుంచి నిలిపివేసిందో ఇండిగో ఎయిర్‌లైన్ పేర్కొనలేదు. ఉచితంగా సాఫ్ట్ డ్రింక్ ఇండిగో ఎయిర్‌లైన్ ప్రకటన ప్రకారం.. కస్టమర్లు ఆన్‌బోర్డ్‌లో కొనుగోలు చేసిన ఏదైనా స్నాక్‌తో కాంప్లిమెంటరీ పానీయాన్ని (ఉచితంగా) ఆస్వాదించవచ్చు. దేశీయ విమానయాన మార్కెట్లో 63 శాతానికిపైగా వాటాతో ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతోంది. -
ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
లియోన్: డైట్ సోడా తదితర ఎన్నో ఆహారపదార్థాల్లో వాడే నాన్ షుగర్ స్వీట్నర్(ఎన్ఎస్ఎస్) ఆస్పర్టెమ్తో కేన్సర్ వచ్చేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. తమ అధ్యయనంలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఏఆర్సీ) తెలిపింది. ఆస్పర్టెమ్‌లో కేన్సర్ కారకాలుండేందుకు అవకాశమున్నట్లు మనుషులు, జంతువులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఐఏఆర్సీ తెలిపింది. అయితే, ఆస్పర్టెమ్ పరిమిత వాడకం సురక్షితమేనంటూ ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ), డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసిన నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాన్సెస్కో బ్రాంకా మాట్లాడుతూ.. ఆస్పర్టెమ్‌ను మొత్తానికే మానేయాలని అనడం లేదు, మితంగా వాడాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అత్యధికంగా వాడే వారు మాత్రమే తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాస్త ఎక్కువగా వాడినా ఎటుంటి అనర్థాలు ఉండవని బ్రాంకా చెప్పారు. ‘ఆస్పర్టెమ్తో కాలేయ క్యాన్సర్ రావొచ్చనేందుకు మాత్రం ఆధారాలు పరిమితంగానే లభించాయి. ప్రస్తుతం వినియోగించే స్థాయిల్లో ఆస్పర్టెమ్ ప్రమాదకరమని చెప్పేందుకు బలమైన ఆధారం దొరకలేదు. ఆమోదయోగ్యమైన వినియోగ స్థాయిలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులేదు. పరిమితంగా, మార్గదర్శకాలకు లోబడి వాడితే ఆస్పర్టెమ్ వల్ల సాధారణంగా ఎటువంటి హాని కలగదు’అని ఎఫ్‌డీఏ తెలిపింది. సాధారణంగా రోజుకు 14 కేన్ల వరకు ఆస్పర్టెమ్ ఉన్న డ్రింకులను తాగొచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్హాల్టెర్ తెలిపారు. -
కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే ఇది చదవండి
ఎండవేడి ఇంకా తగ్గడం లేదు. వర్షాకాలం మొదలైనా ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వేడి తట్టుకోలేక చాలామంది శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కూల్‌డ్రింక్స్‌ను ఇష్టపడుతుంటారు. ఇంటికి అతిథులు వచ్చినా, ఏదైనా నాన్‌వెజ్ వంటలు తిన్నా పక్కన కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే అనేంతలా లాగిస్తుంటారు. అయితే ఇలా కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ► కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ► కూల్‌డ్రింక్స్‌లో ఎక్కవ మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దీనిల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తాగితే ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ► శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే గుండె, డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లయితే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ► మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం. ► కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయి. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ► కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొత్తానికి కూల్‌డ్రింక్స్ వల్ల శరీరానికి మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. -
రెండేళ్లలో ఆ టార్గెట్‌ని చేరుకుంటాం: కోకా–కోలా
వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని ‘మాజా’ సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. చదవండి: అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే -
పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ
సాక్షి,ముంబై: ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొస్తున్న రిలయన్స్ దాదాపు రెండు డజన్ల బ్రాండ్లను ఇప్పటికే గుర్తించిందనీ, వీటిని జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేయనుందని ఈటీ రిపోర్ట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్, సోప్ బ్రాండ్ తదితర కంపెనీలతో చర్చలు జరుపుతోందని ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపింది. తాజా రిపోర్టు ప్రకారం రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరానా స్టోర్లలో కొనుగోలుకు కాంపాకోలా డ్రింక్ అందుబాటులో ఉంచనుంది. నిమ్మ, నారింజ రుచులలో పునఃప్రారంభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకపుడు కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది ఐకానిక్ కోలా.1990ల నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించనున్నామని ఇటీవల జరిగిన రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెటా, జియో మార్ట్ భాగస్వామ్యంతో వాట్సాప్‌లో రిలయన్స్ రిటైల్ సేవలను వివరించారు. కేవలం కొన్ని నిమిషాల్లో వాట్సాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని ఆమె వివరించారు. (Benda V302C: కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు) కాగా 1990లలో, పార్లే అభివృద్ధి చేసిన శీతల పానీయాల బ్రాండ్లతో పాటు, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా మార్కెట్లో కాంపా ఆధిపత్యం చెలాయించింది. అయితే, కోకా-కోలా తన రీ-ఎంట్రీలో మూడు పార్లే బ్రాండ్లను కొనుగోలు చేసిన తర్వాత, కాంపా పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత 2019లో మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు పదే పదే ప్రయత్నాలు చేసినా ఆర్థిక బలం లేకవిఫలమైంది. -
Soft Drinks: శీతల పానీయాలకు బ్రేక్
సాక్షి, అమరావతి: వేసవిలో ఇష్టంగా తీసుకునే శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు వినియోగదారులు దూరంగా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న తరుణంలో శీతల పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు చెబుతుండటంతో వాటి అమ్మకాలు 80 శాతానికి పైగా పడిపోయాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో కరోనా వేళ వీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్రంలో పెప్సీ, కోకాకోలా వంటి కార్బొనేటెడ్ శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వినియోగం 80 శాతం తగ్గిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ల వినియోగం అధికంగా ఉంటుంది. 700 కోట్ల లీటర్ల నుంచి 150 కోట్ల లీటర్లకు.. దేశంలో ఏటా 700 కోట్ల లీటర్ల శీతల పానీయాలు అమ్ముడవుతుండగా.. ఈ ఏడాది 150 కోట్ల లీటర్లు కూడా దాటకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. లాక్‌డౌన్‌తో షాపులు మూసివేస్తుండటంతో ఐస్‌క్రీమ్ అమ్మకాలు కూడా పడిపోయినట్టు డ్యూమాంట్ ఐస్‌క్రీం ఎండీ వివేక్ ఇనంపూడి ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా ఐస్‌క్రీమ్ అమ్మకాలు 90 శాతం తగ్గిపోయాయని, కేవలం మిల్క్ బూత్‌ల ద్వారా 10 శాతం మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనా దెబ్బతో చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌లలో ఔట్లెట్ల విస్తరణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొన్నారు. వేసవిలో ఐస్‌క్రీమ్ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదవుతుందని, ఈసారి ఏప్రిల్‌లో వీటి అమ్మకాలు 40 శాతం తగ్గినట్టు అమూల్ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ సోధి వెల్లడించారు. కషాయాలకు, జ్యూస్‌లకు డిమాండ్ ఇదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాలు, ఔషధ గుణాలుండే పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా వేళ జీరా, అలొవెరా, ఉసిరి, త్రిఫల జ్యూస్ అమ్మకాలు పెరుగుతున్నట్టు టెట్రా ప్యాక్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమ్య త్యాగి తెలిపారు. పసుపు, అల్లం, తులసితో కూడిన పాల విక్రయాలు పెరుగుతున్నట్టు చెప్పారు. అధిక ప్రోటీన్లు ఉండే సోయా మిల్క్, బాదం మిల్క్ విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. వ్యూహాలు మార్చుకుంటున్న కంపెనీలు ఆరోగ్య పరిరక్షణకు వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వివిధ కంపెనీలు కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ఊపందుకోవడంతో కోకాకోలా, పెప్సీ వంటి బహుళజాతి సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. కార్బొనేటెడ్ డ్రింక్‌ల వినియోగం తగ్గుతుండటంతో స్థానిక పండ్ల రసాలు, పానీయాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ ప్రజలు అమితంగా ఇష్టపడే కాఫీ మార్కెట్లోకి కోకాకోలా అడుగు పెట్టింది. మూడు ఫ్లేవర్స్‌లో కూల్ కాఫీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. -
సినిమా ప్రేక్షకులకు ఊరట
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లలో ధరల దూకుడుకు కళ్లెం పడనుంది. వినోదం కోసం వచ్చే వినియోగదారుల నుంచి వివిధ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో అడ్డగోలు ధరలపై తూనికలు, కొలుతల శాఖ కన్నెర్ర చేసింది. బుధవారం (ఆగస్టు ఒకటి) నుంచి సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీ ప్రకారమే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు కఠినతరం చేసింది. కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించక తప్పదు. విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాతో పాటు జైలుపాలు కావాల్సిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలుజరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలు, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తూనికలు, కొలుతల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అడ్డగోలు దోపిడీ సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలు అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణంగా తయారైంది. దీంతో గత కొంత కాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్ మెట్రాలజీ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయడానికి తూనికల కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలోని థియేటర్ యాజమాన్యాలతో ఏరియా వారిగా సమావేశాలు నిర్వహించి అధిక ధరల దోపిడీని కట్టడిచేయాలని సూచించారు. కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. నిబంధనలు ఇలా... ⇔ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఏ వ్యాపారం కానీ, ఏ సేవ కానీ, ఏ వినోదం కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఈ విషయంలో ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. ⇔ ఆగస్టు 1వ తేదీ నుండి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పీ ప్రకారం విక్రయాలు జరపాలి. తినుబండారాలు, మంచి నీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. ⇔ విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ⇔ సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి. ⇔ ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడికి వివిధ బ్రాండ్లు అందుబాటులో ఉంచాలి. ⇔ ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్పీ, కస్టమర్ కేర్ వివరాలు ⇔ ఎమ్మార్పీ ధర ఉన్న ఫడ్స్ మాత్రమే విక్రయించాలి. ⇔ వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి. రెండు రోజులు తనిఖీలు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బహిరంగ మార్కెట్లో ఏదైతే ఎంఆర్పీ ఉందో అదే ధరకు మల్టీప్లెక్స్, థియేటర్లల్లో కూడా విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎంఆర్పి ధర ప్రకారమే విక్రయిస్తున్నారా, ఇతరత్రా కొత్త నిబంధనల అమలుపై బుధ, గురువారాల్లో తూనికల, కొలుతల శాఖ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పరిశీలించనున్నాయి. అనంతరం ఆకస్మిక తనిఖీలతో కేసుల నమోదు, జరిమానాలు విధించనున్నారు. -
శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడులు..
సాక్షి, విశాఖపట్నం : శీతల పానీయాల తయారీ కేంద్రంపై(ఖార్కాన్) బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాక డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో కూల్ పాయింట్ నిర్వహకులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. జీవీఎంసీ పాయి మాధవ నగర్ పరిధిలో కృప ఏజెన్సీస్ పేరుతో పిల్లా శ్రీనివాస్ కూల్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. వివిధ రకాల డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. నాణ్యత ప్రమాణాలకు పాటించకుండా.. హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు విశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. కూల్ పాయింట్లో శాంపిల్స్‌ను కూడా అధికారులు సేకరించారు. కూల్ డ్రింక్స్ తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించడంలేదని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉంది, అయితే అతను నేరుగా బోర్ నీటిని వినియోగిస్తున్నాడని అధికారుల చెప్పారు. అలాగే ప్రజలకు హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్ ప్లేవర్స్‌తో పాటుగా ఎసెన్స్.. కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలిపి ఈ పానీయాలను తయారు చేస్తున్నట్టు ఈ దాడుల్లో బయటపడ్డాయి. ఏ విధమైన ఫిల్టరైజేషన్ నీరు వాడకుండా కలుషితమైన దోమలు, ఈగలు వాలిని నీటిని వాడుతూ కూల్ డ్రింక్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. శీతల పానీయాలు తయారీ కేంద్రం నుంచి సేకరించిన శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ స్టేట్ ఫుడ్ ల్యాబ్ రేటరీ పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుటామని అధికారులు చెప్పారు. కూల్ పాయింట్ నిర్వహకుడు పిల్లా శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ సీఎం నాయుడు తెలిపారు. -
‘రెండు సార్లు తాగినా రిస్కే’
సాక్షి,న్యూఢిల్లీ: వారానికి రెండు సార్లు ఫిజీ డ్రింక్ లేదా ఇతర శీతల పానీయాలను సిప్ చేసినా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ర్టోక్ను ఆహ్వానించినట్టేనని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. వారానికి కేవలం రెండు సార్లు శీతలపానీయం తీసుకున్నా టైప్ 2 డయాబెటిస్ రిస్క్ అధికమవుతుందని, ఒకే ఒక్కసారి ఈ డ్రింక్ తీసుకుంటే రక్తపోటు అధికమవుతుందని పరిశోధన బాంబు పేల్చింది.ఈ పానీయాలతో మధుమేహంతో పాటు అధిక కేలరీలు శరీరంలో పేరుకుని బరువు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. వారానికి ఐదు సార్లు పైగా శీతల పానీయాలను సేవించే వారిపై జరిపిన అథ్యయనాల ఆధారంగా దక్షిణాఫ్రికాలోని స్టెలెన్‌బాష్ యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు ఈ విషయం నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిలోనూ చక్కెరతో కూడిన శీతలపానీయాల వినియోగం పెరుగుతోందని సర్వే రచయిత ప్రొఫెసర్ ఫడీల్ ఎసోప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పానీయాలతో మధుమేహం, అధిక రక్తపోటు ముప్పు ఎక్కువవుతోందని తమ విశ్లేషణల్లో వెల్లడైందని చెప్పారు.ఎండోక్రిన్ సొసైటీ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది. -
టెన్త్‌లోనే స్టార్టప్
- 3 కోట్ల నిధులు సాధించిన చిచ్చరపిడుగులు పదోతరగతి విద్యార్థులంటే.. పాఠాలకు ప్రాధాన్యం ఇస్తారు. మార్కులపై దృష్టి పెడతారు. ర్యాంకులు సాధించాలని తపిస్తారు. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. చదివే చదువుతో, ఎదిగే వయసుతో సంబంధం లేకుండా కుర్రాళ్లు దూసుకుపోతున్నారు. మైనార్టీ కూడా తీరని ముగ్గురు విద్యార్థులు.. స్టార్టప్ ఫండ్ కింద ఇప్పటికే రూ.3 కోట్లను ఆకర్షించారు. వివరాల్లోకెళ్తే.... ‘మార్కెట్లో దొరికే శీతల పానీయాలు ఎంతవరకు సేఫ్? కూల్ డ్రింక్స్‌లో హానికారక క్రిమిసంహారాలున్నట్లు ఇప్పటికే రుజువు కాలేదా? అయినా జనాలు వాటినే తాగేస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారెందుకు? ఎందుకంటే... సురక్షితమైన శీతల పానీయాలు మార్కెట్లో అందుబాటులో లేకే ఈ పరిస్థితి. మంచి ఫ్లేవర్‌తో సురక్షితమైన కూల్‌డ్రింక్ దొరికితే జనాలు ఎందుకు తాగరు? అలాంటిదేదైనా తయారు చేయడం గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? తాగే నీటికే కమ్మని ఫ్లేవర్ ఇస్తే ఎలా ఉంటుంది..?’ అని ఆలోచించిన ముగ్గురు విద్యార్థుల జీవితాలు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయాయి. మొదట్లో తిరస్కరణ.. జైపూర్‌లోని నీరజ మోదీ స్కూల్లో పదో తరగతి చదువుతున్న చైతన్య, మృగాంక్, ఉత్సవ్లు ..తాగునీటికి మంచి ఫ్లేవర్ ఇచ్చి, సురక్షితమైన శీతల పానీయాన్ని తయారు చేయాలనే ఆలోచన చేశారు. అనుకున్న విధంగా ఫ్లేవర్డ్ వాటర్‌ను రూపొందిం చి.. ‘ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ ఫెస్ట్’లో ప్రదర్శించారు. అయితే మొదటి రౌండ్లోనే వీరి కాన్సెప్ట్‌ను తిరస్కరించారు. దీంతో నిరాశగా వెనుదిరిగిన ఈ ముగ్గురికి.. ఫెస్టివల్ నిర్వాహకులకే నీటిని సరఫరా చేసే ఆర్డర్ దక్కింది. దీంతో తాము రూపొందిం చిన ఫ్లేవర్డ్ వాటర్‌నే సరఫరా చేశారు. దీంతో వారి దశ మారిపోయింది. అందులో పాల్గొన్న బడా వ్యాపారవేత్తలంతా కాన్సెప్ట్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. ఇప్పుడెలా....? ఆలోచన బాగుందంటున్నారు... మరి వీటిని తయారు చేయాంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి. ఇదంతా పెద్ద తతంగం. మనమంతా మైనర్లమే. మన వయసుకు లైసెన్స్ కూడా ఇవ్వరు. మరేం చేయాలి? ...అని ఆలోచిస్తున్న ఈ ముగ్గురికి స్టార్టప్ ఐడియా వచ్చింది. ముందుగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి, ఐడియాను పారిశ్రామికవేత్తల వద్దకు తీసుకెళ్లగలిగితే.. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం ఇండోర్‌లో కాంపిటీషన్లలో కాన్సెప్ట్‌ను ప్రదర్శించా రు. దీంతో మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీముందుకొచ్చింది. వెంటనే స్టార్టప్‌ను ప్రారంభించాలని, అవసరమైన రూ.3 కోట్లను తాము సమకూరుస్తామని ప్రకటించింది. పేటెంట్ హక్కుల కోసం కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చింది. -
పప్సీకో ఇంద్రా నూయికి రూ. 113 కోట్ల వేతనం
న్యూయార్క్: సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి గతేడాది సుమారు రూ. 113 కోట్ల (18.6 మిలియన్ డాల ర్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం అధికం. 2006 నుంచి భారతీయ సంతతికి చెందిన ఆమె పెప్సీకో సీఈవోగా ఉన్నారు.