సాక్షి,ముంబై: ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్‌ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది.
దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్‌లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొస్తున్న రిలయన్స్ దాదాపు రెండు డజన్ల బ్రాండ్‌లను ఇప్పటికే గుర్తించిందనీ, వీటిని జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేయనుందని ఈటీ రిపోర్ట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్, సోప్ బ్రాండ్ తదితర కంపెనీలతో చర్చలు జరుపుతోందని ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపింది. తాజా రిపోర్టు ప్రకారం రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరానా స్టోర్లలో కొనుగోలుకు కాంపాకోలా డ్రింక్ అందుబాటులో ఉంచనుంది. నిమ్మ, నారింజ రుచులలో పునఃప్రారంభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకపుడు కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది ఐకానిక్ కోలా.1990ల నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..)
ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించనున్నామని ఇటీవల జరిగిన రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెటా, జియో మార్ట్ భాగస్వామ్యంతో వాట్సాప్‌లో రిలయన్స్ రిటైల్ సేవలను వివరించారు. కేవలం కొన్ని నిమిషాల్లో వాట్సాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని ఆమె వివరించారు. (Benda V302C: కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు)
కాగా 1990లలో, పార్లే అభివృద్ధి చేసిన శీతల పానీయాల బ్రాండ్‌లతో పాటు, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా మార్కెట్‌లో కాంపా ఆధిపత్యం చెలాయించింది. అయితే, కోకా-కోలా తన రీ-ఎంట్రీలో మూడు పార్లే బ్రాండ్‌లను కొనుగోలు చేసిన తర్వాత, కాంపా పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత 2019లో మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు పదే పదే ప్రయత్నాలు చేసినా ఆర్థిక బలం లేకవిఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment