fast moving consumer goods
-
ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరు ఇలా..
ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.433 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.360 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగింది. స్థిరాస్తుల విక్రయం, రూ.42 కోట్లకు సంబంధించిన వివాదంలో సానుకూల పరిష్కారం లాభం 20 శాతం పెరిగేందుకు దారితీసినట్టు మారికో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది.కన్సాలిడేటెడ్ ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ.2,476 కోట్ల నుంచి రూ.2,664 కోట్లకు చేరింది. దేశీయ అమ్మకాలు 5 శాతం పెరగ్గా, అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ రూపంలో 13 శాతం వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారం ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,979 కోట్లుగా ఉంది. కోకోనట్ (పారాచ్యూట్) ఆయిల్ ధరలను పెంచడంతోపాటు అమ్మకాలు పెరగడం సానుకూలించినట్టు మారికో పేర్కొంది. పారాచ్యూట్ అమ్మకాలు 4 శాతం పెరగ్గా, ఆదాయం 10 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. సఫోలా వంట నూనెల రూపంలో ఆదాయం కేవలం 2 శాతమే పెరిగింది. ఎఫ్ఎంసీజీ రంగానికి సంబందించి ధరల వృద్ధి సానుకూలంగా మారినట్టు మారికో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?డాబర్ లాభం నేలచూపుఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 418 కోట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాలలో డిమాండ్ తగ్గడం, ఆహార ధరల పెరుగుదల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 507 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం వెనకడుగుతో రూ. 3,029 కోట్లను తాకింది. మొత్తం వ్యయాలు సైతం స్వల్పంగా 1 శాతం తగ్గి రూ. 2,634 కోట్లకు చేరాయి. ఆదాయంలో కన్జూమర్ కేర్ విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 2,488 కోట్లు లభించగా.. ఫుడ్ బిజినెస్ 13 శాతం క్షీణించి రూ. 467 కోట్లకు పరిమితమైంది. -
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: పెట్రోలు, నిత్యావసరాల ధరల వాత తప్పదా?
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం దేశీయంగా ప్రజలపై పెనుభారం పడనుందా? పెట్రోలు సహా, పలు వినియోగ వస్తువులు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయనుంది. దీంతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తులు ఇతర మరెన్నో ప్రపంచ సరఫరాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రభావ తీవ్రతను కచ్చితంగా అంచనా లేనప్పటికీ ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల మాట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరాపై ప్రభావం చూపినట్లే, ఇజ్రాయెల్-హమాస్ వార్ ప్రపంచ ముడి చమురు సరఫరాకు ముప్పు తెస్తుందని, తద్వారా దేశంలో హైదరాబాద్ లాంటి ఇతర ప్రధాన నగరాల్లోని ప్రజల గృహవినియోగం భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 7.5 శాతానికి పైగా పెరిగింది.ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఎన్‌సిఆర్‌కు చెందిన వైట్ గూడ్స్ తయారీదారు సూపర్ప్లాట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ప్రకారం, యుద్ధం మరో పక్షం రోజులు కొనసాగితే, నవంబర్‌లో స్మార్ట్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెంపు తయారీదారులను రెండు రంగాల్లో ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో కీలకమైన పదార్థం ప్లాస్టిక్ ధరలు, లాజిస్టిక్స్, సరఫరా ఖర్చులు పెరుగుతాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ఉత్పత్తి , డెలివరీ ఖర్చులో ఈ రెండింటి వాటా దాదాపు 33 శాతం. ఇంకా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వస్తువులు వంటివి ప్రభావితం కావచ్చు. దేశంలోని ఎఫ్ఎంసీజీ తయారీదారులు ఇప్పటికే పేలవమైన అమ్మకాలు, గ్రామీణ కుటుంబాల నుండి తగ్గిన డిమాండ్‌తో సతమత మవుతున్నారు. Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధి తక్కువగానే ఉంటుంది, ఆగస్టు నెలలో వర్షపాతం లోటు వందేళ్ల గరిష్టానికి చేరడంతో ప్రముఖ FMCG కంపెనీల వృద్ది సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.బీఎన్పీ పారిబాస్ డైరెక్టర్-హెడ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ రీసెర్చ్, కునాల్ వోరా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆదాయంలో మధ్య-ప్రాచ్య ప్రాంతం వాటా ఉన్న డాబర్ , మారికో లాంటి భారతీయ కంపెనీలకు నష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి అక్టోబర్ 6 నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.58 డాలర్లు ఉండగా, ఈరోజు (అక్టోబర్ 16) 90.98 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు పైకి ఎగియ వచ్చు. దీంతో భారతదేశంతో సహా చమురు-దిగుమతి చేసుకునే దేశాలకు చమురు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం ఉండదనే అంచనాలున్నాయి. అంతేకాదు ఈ యుద్ధంతో దేశీయ టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంనుంచి తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ప్రభావం చూపితే అది తమ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన ఆందోళన. గాజాలో ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే తాము చూస్తూ ఉరుకోబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వార్‌లో ఇరాన్- లెబనాన్ చేరిపోతే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత ముదురుతుందనే ఆందోళన నెలకొంది. -
ప్యాకెట్ సైజ్ పెంచి ధరలు తగ్గించి.. వృద్ధిపై ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆశలు
న్యూఢిల్లీ: పరిస్థితులు తిరిగి గాడిన పడుతుండడంతో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధి పట్ల ఆశావహ అంచనాలతో ఉంది. ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచడంతోపాటు, పెట్టుబడులను కూడా ఇతోధికం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని త్రైమాసికాల విరామం తర్వాత అవి తిరిగి అమ్మకాల్లో వృద్ధిని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు తగ్గడం వాటికి అనుకూలిస్తోంది. దీంతో ప్యాకెట్లలో గ్రాములు పెంచడం, ధరల తగ్గింపు వంటి నిర్ణయాలతో వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరును పరిశీలిస్తే.. హిందుస్తాన్ యూనిలీవర్, డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 2023–24లో ఎఫ్ఎంసీజీ వినియోగం క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేశాయి. ‘‘స్థిరమైన వృద్ధి అవకాశాలు బలపడ్డాయి. ఐదు త్రైమాసికాలుగా విక్రయాల్లో క్షీణత అనంతరం ఈ రంగం అమ్మకాల్లో వృద్ధిని చూసింది. పట్టణ వినియోగం స్థిరంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ క్షీణత ముగిసినట్టేనని సంకేతాలు కనిపిస్తున్నాయి’’అని మారికో ఎండీ, సీఈవో సౌగతగుప్తా తెలిపారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ వృద్ధిని నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. హోమ్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సానుకూల శ్రేణిలోకి వచ్చేశాయి. సఫోలా, పారాచ్యూట్ తదితర ప్రముఖ బాండ్లతో ఉత్పత్తులను విక్రయించే మారికో లాభం మార్చి త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ.305 కోట్లుగా ఉండడం గమనార్హం. అమ్మకాలు 4 శాతం పెరిగాయి. మందగమనం ముగిసినట్టే.. ‘‘ఎఫ్ఎంసీజీ మార్కెట్లో మందగమనం ముగిసింది. అమ్మకాలతో మెరుగైన వాతావ రణం నెలకొంది. డిసెంబర్ క్వార్టర్లో సింగిల్ డిజిట్ క్షీణత ఉంటే, మార్చి త్రైమాసికంలో ఫ్లాట్‌గా విక్రయాలు ఉన్నాయి’’అని హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ తెలిపారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా రు. మార్చి త్రైమాసికంలో హెచ్‌యూఎల్ నికర అమ్మకాలు 11 శాతం పెరిగితే, నిరక లాభం సైతం 13 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా మందగమనం, ఎల్‌నినో కారణంగా వర్షాలపై నెలకొన్న అనిశ్చితులతో సమీప కాలంలో నిర్వహణ వాతావరణం ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని హెచ్‌యూఎల్ భావిస్తోంది. 2023–24 సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని, అమ్మకాలతోపాటు మార్జిన్లలోనూ మెరుగుదల ఉంటుందని నువమా గ్రూప్ ఈడీ అబ్నీష్రాయ్ అంచనా వేశారు. ‘‘ముడి సరుకుల ధరలు తగ్గాయి. దీంతో కంపెనీలు క్రమంగా ధరలను తగ్గించొచ్చు. లేదంటే గ్రాములను పెంచొచ్చు. అమ్మకాలు పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది’’అని రాయ్ చెప్పారు. అయితే, ఎల్‌నినో, ఎఫ్ఎంసీజీ విభాగంలో పెద్ద సంస్థగా అవతరించాలని రిలయన్స్ లక్ష్యం విధించుకోవడం వంటి సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్ మార్చి త్రైమాసికంలో అమ్మకాల్లో 11 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత సానుకూల వాతావర ణం మరింత బలపడుతుందని, అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సుధీర్ సీతాపతి తెలిపారు. ఇదీ చదవండి: బ్లాక్‌స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ -
ప్రిజర్వేటివ్స్పై యుద్దానికి సిద్ధమంటున్న ఐడీ ఫ్రెష్ ఫుడ్
ఐడీ ఫ్రెష్ ఫుడ్ పలు కొత్త ఉత్పత్తులతో విస్తరిస్తోంది. ఎఫ్ఎంసిజిలో మొత్తం వృద్ధి కంటే ఆన్లైన్ విక్రయాల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో సంస్థ విస్తరణ, కొత్త ప్లాన్స్ గురించి ఐడి ఫ్రెష్ ఫుడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ గాంధీ మాటల్లో.. మీడియా నివేదికల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరం అమ్మకాలు రూ. 500 కోట్లు(రూ. 382 కోట్ల నుంచి) దాటాయి. వచ్చే ఏడాది రూ. 700 కోట్లకు పెరుగుతాయని అంచనా. ప్రస్తుతానికి పోర్ట్‌ఫోలియో ఎలా బకెట్ చేశారు - ఫ్రెష్ పిండి (FY22లో 35శాతం), పరోటా (FY22లో 33.5శాతం), వంటివి మాత్రమే కాకుండా మిలినవి ఎలా పెరుగుతాయి? ప్రాధమిక వృద్ధి ఫ్రెష్ పిండి ద్వారా ముందుకు సాగింది, అది మా పోర్ట్‌ఫోలియోలో స్టార్ పెర్ఫార్మర్గా కొనసాగుతోంది. ఇది 35 శాతం నుంచి 37 శాతానికి పెరిగింది. పరోటా అటు ఎక్కువ లేదా ఇటు తక్కువగానే ఉంది. మిగిలిన ప్రాధాన్యత చపాతీకి ఉంది. సంస్థ బ్రాండ్ కోసం UAE వ్యాపారాన్ని నడిపిస్తోంది, ఇది వ్యాపారాన్ని పెంచడంలో 10 శాతం వరకు దోహదపడుతుంది. దీని తర్వాత డెయిరీ కూడా 10 శాతం దగ్గరగా ఉంటుంది. మేము ఫ్రెష్ పిండి 30 శాతం వృద్ధిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తాము. అయితే పరోటా, చపాతీ 30 శాతంగా ఉండవచ్చు. మేము ఇటీవల లోఫ్ బ్రెడ్‌ను కూడా ప్రారంభించాము. కాబట్టి ఆ కేటగిరిలో స్కేల్ అప్ ప్లాన్ చేస్తున్నాము. పరోటా స్టేబుల్‌లో మంచి వృద్ధిని తీసుకు రావడానికి హోమ్ స్టైల్ పరోటాను పరిచయం చేసాము. కంపెనీ రెండు ఉత్పత్తుల ప్రారంభ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మేము బెంగళూరులో ఈ-కామర్స్‌లో మాత్రమే లోఫ్ బ్రెడ్‌ని ప్రారంభించాము. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారమ్‌లలో దీని మార్కెట్ వాటా 10 శాతం ఉంది. ఇది చాల పెద్ద వర్గం, కావున ఇందులో అనేక ఉత్పత్తులు ఉన్నాయి, ఇందులో చాలా బ్రెడ్లలో కొంత మొత్తంలో రసాయనాలు ఉంటాయి. కానీ మా ఉత్పత్తి వాటికంటే భిన్నంగా ఉండటం వల్ల అఖిల భారత స్థాయిలో విడుదలైన హోమ్‌స్టైల్ పరోటా రొట్టెల కంటే మెరుగైన పనితీరును కనపరుస్తుందని ఆశిస్తున్నాము. తురిమిన కొబ్బరి & లేత కొబ్బరి ఆఫరింగ్స్ ఏమయ్యాయి? కరోనా మహమ్మారి సమయంలో మేము ఆ ఉత్పత్తులను నిలిపివేసాము, కానీ ఆ తరువాత వాటిని తిరిగి ప్రవేశపెట్టలేదు. అయితే దీనిని మళ్ళీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాము, కానీ ఈ సంవత్సరం అది సాధ్యమయ్యే అవకాశం ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ కొత్త ప్రోడక్ట్ డెవలప్మెంట్లోకి ప్రవేశిస్తున్నామో దానిని జాగ్రత్తగా ఎంచుకోవడమే కాకుండా జాగ్రత్తగా చూడటానికి కట్టుబడి ఉన్నాము. ఇది ప్రస్తుత మా వ్యాపారంలో ఉన్న మార్జిన్లకు మంచిది. లేత కొబ్బరి ధర కొంత ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా ఇది చాలా సెన్సిటివ్ ప్రొడక్ట్, కావున సప్లై చేయడానికి కొంత కష్టంగా ఉంటుంది. అయితే మేము ఇంటర్నేషనల్ మార్కెట్లో తురిమిన కొబ్బరిని ప్రారంభించడానికి యోచిస్తున్నాము. అయితే దీనికి ఎప్పటికి శ్రీకారం చుడతామో ఖచ్చితంగా చెప్పలేము. ముందుగా ఇండియన్ బ్రెడ్ పోర్ట్‌ఫోలియోను సరిగ్గా విస్తరించాలి. ఇది వచ్చే ఏడాదికి పూర్తిగా విస్తరించవచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ ఆన్లైన్ ఛానెల్స్ నుంచి 300 శాతం వృద్ధిని సాధించింది. అయితే FY23లో ఇది 100 శాతం తగ్గింది. కానీ ప్రస్తుతం 30 శాతం వద్ద స్థిరంగా ఉంది. మీరు కోవిడ్ తర్వాత ఆఫ్‌లైన్ అండ్ ఆన్లైన్ అమ్మకాలు ఒకే విధంగా పెరుగుతున్నాయని చూస్తున్నారా? ఆన్లైన్ హైపర్గ్రోత్ కాలం ముగిసిందని నేను భావిస్తున్నాను. చాలా ఆన్లైన్ వ్యాపారాల విషయంలో, అవి చాలా వేగంగా విస్తరించినప్పటికీ.. స్టోర్లను మూసివేయడం, టైర్ 2 నగరాల నుంచి బయటకు వెళ్లడం మనం చూస్తున్నందున కొంత హేతుబద్ధీకరణ జరుగుతోంది. మేము ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ రెండింటిని సాధారణంగానే చూస్తాము. అయితే ఆధునిక వాణిజ్యం గత కొన్ని త్రైమాసికాల్లో చాలా బాగా వస్తోంది. భారతదేశంలో సాధారణ వాణిజ్య అనేది చాలా పెద్దది, కాబట్టి వచ్చే ఏడాది మిశ్రమ వృద్ధి కాలం, కావున ఛానెల్‌లలో సమతుల్యత ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ-కామర్స్ 30 శాతం అమ్మకాలను అందించనుంది. ఆన్లైన్లో ఏ ఉత్పత్తులు బాగా పని చేస్తున్నాయి? ఇది ఆఫ్‌లైన్‌కి భిన్నంగా ఉందా? ఫ్రెష్ పిండి చాలా బాగా పనిచేస్తుంది. దీనికి కారణం ఇది అందరికి అవసరమైన ప్రొడక్ట్, ఇది మీకు అవసరమైనప్పుడు ఇంట్లో లేకపోతే దాని కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సమయం ఉండకపోవచ్చు. వినియోగదారులు ఖచ్చితంగా కొనుగోలు చేసే వస్తువుల్లో ఫ్రెష్ పిండి, పాలు, పెరుగు వంటివి తప్పకుండా ఉంటాయి. కాఫీ కూడా మనకు చాలా మేలు చేస్తుంది. మా ఫ్రెష్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా iD ఉత్పత్తులు దేశంలోని ప్రతి నగరానికి చేరలేవు. కావున ఈ ఉత్పత్తులు ఈ-కామర్స్‌లో అందుబాటులో ఉండటం వల్ల, ఇది ఒక వినూత్న ఉత్పత్తి అయినందువల్ల ఢిల్లీ, ముంబైలలోని ప్రజలకు ఫిల్టర్ కాఫీ సులభంగా అందుబాటులో లేనందువల్ల ఆన్లైన్లో దీనికి మంచి ట్రాక్షన్ ఉంది. ఆన్లైన్లో ఏ మార్కెట్లు బాగా పనిచేస్తున్నాయి? ఇది ఆఫ్‌లైన్‌కి భిన్నంగా ఉందా? బ్రాండ్ కోసం ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్పేస్ రెండింటిలోనూ ఢిల్లీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ స్పేస్‌లో, మార్కెట్ల మధ్య నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఆన్లైన్ అన్ని నగరాల్లో సమానంగా పని చేస్తుందని నమ్ముతున్నాను. బేస్ చాలా చిన్నది, ఇది చాలా పెద్ద నగరం కాబట్టి ఢిల్లీ కొంత మినహాయింపు కావచ్చు. కానీ ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల మధ్య ఎంచుకోవడానికి ఏమీ లేదు. ఆన్లైన్ స్పేస్ శక్తివంతమైనది, ఎందుకంటే రిటైల్ షేర్లో కొంత శాతాన్ని స్కౌట్ చేసింది. డెలివరీ చార్జెస్ భరించగలిగేలా ఉన్నందున, ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి బయటికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఇది వినియోగదారు అవసరాన్ని తీరుస్తోంది. ఆన్లైన్ స్పేస్ పోతుందని నేను ఆశించడం లేదు. వృద్ధి రేట్లు ఇప్పటికీ FMCG కేటగిరీ మొత్తం వృద్ధి రేట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. మీరు గత నెలలో ‘TransparenSee’ (2.0) ప్రత్యక్ష ప్రసార ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారాన్ని ఎలా స్వీకరించారు? వినియోగదారుల అభిప్రాయాలను, ప్రశ్నలను వినడం లక్ష్యం. గత సంవత్సరం ప్రచారం ప్రపంచంలోనే అతిపెద్ద పిండి కర్మాగారాన్ని ప్రజలకు ప్రదర్శించడం. ఎందుకంటే మీరు బ్రాండ్ ఎథోస్ గురించి ప్రజలను ఎంతగా ఒప్పించినా.. iD ఉత్పత్తులకు ప్రిజర్వేటివ్‌లను జోడించకుండా వారికి అవగాహన కల్పించినా, ప్రజలు ఇప్పటికీ ఇలాంటి ప్రశ్నలను సంధిస్తారు: 'అయితే మీరు కొన్ని ప్రిజర్వేటివ్‌లను జోడించారా?' గత ఏడాది మేము ఫ్యాక్టరీ గురించి ఐదు రోజుల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసాము, అక్కడ కెమెరాను ఆన్ చేసి ఐదు రోజులు ప్రత్యక్షంగా ఉంచుతామని చెప్పాము, ఎందుకంటే మా ఉత్పత్తి ప్రక్రియ గురించి వారికి పూర్తి తెలుస్తుంది. ప్రజలు వారు తీసుకునే ఆహారం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఇది కంపెనీ ఉత్పత్తుల మీద తప్పకుండా నమ్మకాన్ని పెంచుతుంది. ప్రశ్నలు లేవనెత్తడం సాధ్యం కాదు కాబట్టి ఇది తగినంతగా నిమగ్నమై లేదని మేము గ్రహించాము. ఈ సంవత్సరం మేము వినియోగదారులకు ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాము. మా సంస్థ ఫౌండర్ అండ్ CEO PC ముస్తఫా అండ్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ GLN మూర్తి ఆ ప్రశ్నలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో నిర్వహించిన TransparenSeeకి ఆదరణ చాలా బాగుంది. మేము అన్ని నగరాల్లో దాని కోసం ఒక చమత్కారమైన ముద్రణ ప్రకటన చేసాము. యాడ్‌కి కూడా మంచి ఆదరణ లభించింది. నేర్చుకున్న పాఠాలు సందేశాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉంది. బ్రాండ్లు వినియోగదారు ట్రస్టులను ఆస్వాదించడానికి, ఉత్పత్తి పనితీరు మాత్రమే కాదు, పనితీరు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మమల్ని సందర్శించడానికి ఎక్కువ మంది స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు. ID ఆఫ్‌లైన్ ఉనికిని పెంచడానికి ప్లాన్ చేస్తోంది. 45 నగరాల ప్రస్తుత వ్యాప్తిలో, మీరు ఏ భౌగోళిక ప్రాంతాలలో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు? మీరు ఏ కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తారు? మూడు రెట్లు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఒకటి మేము పెద్ద నగరాల్లోకి మరింత లోతుగా వెళ్తున్నాము, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో మరిన్ని అవుట్లెట్లను జోడించనున్నాము మేము చేపడుతున్న రెండో విస్తరణ చండీగఢ్, లక్నో తదితర టైర్ 2 నగరాలుగా ఉండబోతోంది. మేము అక్కడ ఈ-కామర్స్ మార్గాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇది మనలాంటి తాజా ఆహార బ్రాండ్‌కు మరింత ఆచరణీయమైనది. మూడవది అంతర్జాతీయ మార్కెట్లు. మేము యూకే, అమెరికాల్లో ప్రవేశించినప్పటికీ, మార్కెట్‌ను మెరుగుపరచడానికి మరిన్ని ఉత్పత్తులను పరిచయం చేయాలి. రాబోయే రోజుల్లో బ్రాండ్ ప్లాన్ చేస్తున్న కొత్త ఉత్పత్తి లాంచింగ్‌లు ఏమిటి? ఈ మధ్యకాలంలో ‘బట్టర్ స్టిక్’ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం. జూన్ 2023లో, మరొక లాంచ్ ప్లాన్ చేస్తున్నాం. కొత్త అవతార్‌లో కాఫీ డికాక్షన్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పటికే ఇది ఉత్పత్తి దశలో ఉంది. ఒక బాటిల్లో మీరు ఎంత కాఫీ పెడుతున్నారో వినియోగదారులు తెలుసుకోవడానికి వీలుగా ఒక బాటిల్లో దీన్ని అందిస్తున్నాం. జూలై 2023లో వడ 2.0ని కూడా తీసుకు రాబోతున్నాం. ఇంతకు ముందు లాంచ్ చేసిన వడ పిండిపై కస్టమర్ల రివ్యూ, కోరిక మేరకు మసాలా దినుసులను ఈ పిండిలో జోడిస్తున్నాం. అలాగే సైజులో పెద్దగా, రౌండ్ వడలు తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌కు వెనుక భాగంలో జిప్పర్ కూడా అందిస్తున్నాం. దీంతో పాటు పర్సులో ఎంత పిండి మిగిలి ఉందనే దానిపై అంచనా ఉండడం లేదన్న కస్టమర్ల ఫీడ్‌బ్యాడ్ మేరకు ట్రాన్సపరెంట్ పౌచ్‌లను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. వీటిని మీ స్వంత వడ పిండితో కూడా తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ లాంచ్‌లు భారతదేశం మరియు దుబాయ్‌లో జరుగుతాయి. చిన్న సైజు ప్యాకెట్లను కూడా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు ఇంకా పిండిని ప్రయత్నించలేదు. కనుక 500 గ్రాముల దోస పిండి, పరోటా ప్యాకెట్లలో రెండు నుంచి మూడు పరోటాలతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. 2022 ఆర్థిక సంవత్సరంలో, 71 శాతం అమ్మకాలు భారతదేశం నుంచి జరిగాయి. అంతర్జాతీయ అమ్మకాలలో ప్రస్తుత వాటా ఎంత? మిడిల్ ఈస్ట్ విక్రయాలు బాగా ఉన్నట్టున్నాయి? విక్రయాలు దాదాపు మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఐడీఫ్రెష్ ఈ ఆర్థిక సంవత్సరంలో యూకే మార్కెట్లోకి ప్రవేశించింది. తొలి స్పందన ఎలా ఉంది? ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మీ విస్తరణ ప్రణాళికలు ఏమిటి? ప్రారంభంలో మార్కెట్లో మంచి స్పందన వచ్చింది. ఆ మార్కెట్ల నుంచి చాలా లాభపడాలి. మేము ఇంకా దాని వెనుక ఎటువంటి మార్కెటింగ్ సొమ్మును ఉంచ లేదు ఎందుకంటే మీరు కొత్త మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు చేయాల్సిన మొదటి పని మార్కెట్‌ను అధ్యయనం. మేం దీన్ని పూర్తిగా చేశాం. మిగిలినది తరువాత నిర్ణయించనున్నాం. బ్రాండ్ కోసం పైప్‌లైన్‌లో ఉన్న ఇతర ప్రచారాలు ఏమిటి? తొలి త్రైమాసికంలో మదర్స్ డే ప్రచారాన్ని మొదలు పెట్టాం. నేను ఇంతకుముందే చెప్పినట్టు కొత్త ఉత్పత్తి లాంచ్‌లు, ప్రచారాలు కూడా ఉంటాయి. ప్రధానంగా 'వార్ ఆన్ ప్రిజర్వేటివ్స్' మరో ముఖ్యమైన ప్రచారాన్ని క్యూ2 లో మొదలవుతుంది. మా పూర్తి పోర్ట్‌ఫోలియో మార్పును కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో పరోటా పోర్ట్‌ఫోలియో నిమిత్తం భారతదేశంలోని అగ్రశ్రేణి చెఫ్‌లతో అనుసంధించాలను కుంటున్నాము. కంపెనీ యాజమాన్యంలోని వ్యాన్లపై మా బ్రాండ్‌ను ఎలా నిర్వహించాలనేది కూడా ఆలోచిస్తున్నాం. మేము ఇలస్ట్రేషన్/కార్టూన్ రూట్లో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే వడలు, ఇడ్లీలు మొదలైన వాటితో కేరెక్టర్లతో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది అమూల్ గర్ల్ లేదా ఎయిర్ ఇండియా మహారాజా లాగా కాకుండా కొత్తగా, కొత్త కేరెక్టర్లతో ఉండబోతున్నాయి. ఈ కంపెనీ వ్యాన్ ప్రచారాలు క్యూట్, ఆసక్తికరమైన సంభాషణలతో క్యూట్‌గా ఉండబోతున్నాయి. మొత్తం మీడియా ఖర్చులో 70-80 శాతం డిజిటల్ వైపు మళ్లిస్తాం. 30-40 శాతం యూట్యూబ్ వైపు, 20-30శాతం ఓటీటీలో, 10-15 శాతం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కార్యకలాపాల కోసం వెచ్చించనున్నాం. మిగిలిన 20-30 శాతం టీవీలు, వ్యాన్ ప్రచారంగా ఉంటాయి. దుబాయ్‌లో రేడియో ద్వారా కూడా మా బ్రాండ్ ప్రచారాన్ని చేపడుతున్నాం. -
గోద్రెజ్ చేతికి రేమండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం, భారీ డీల్!
ముంబై: గోద్రెజ్ కన్జూమర్ కేర్ (జీసీసీఎల్) తాజాగా రేమండ్ గ్రూప్‌నకు చెందిన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 2,825 కోట్లు. డీల్‌లో భాగంగా కండోమ్ బ్రాండ్ కామసూత్ర, పార్క్ అవెన్యూ మొదలైన ప్రీమియం.. డియోడరెంట్ బ్రాండ్లను రేమండ్ గ్రూప్ విక్రయించింది. దీంతో ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి రేమండ్ గ్రూప్ నిష్క్రమించినట్లవుతుంది. (చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) అయితే, ఆయా ఉత్పత్తులను కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి గోద్రెజ్ కన్జూమర్ కేర్‌కు విక్రయించడాన్ని కొనసాగించనుంది. ఒక రకంగా వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించడం నుంచి మాత్రమే రేమండ్ గ్రూప్ తప్పుకున్నట్లవుతుంది. మే 10 నాటికి ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. మరోవైపు, తమ లైఫ్‌స్టయిల్ తదితర వ్యాపార విభాగాలను రేమండ్ కన్జూమర్ కేర్ (ఆర్సీసీఎల్)లో విలీనం చేసి, లిస్ట్ చేయనున్నట్లు రేమండ్ గ్రూప్ తెలిపింది. రేమండ్ షేర్హోల్డర్లకు తమ దగ్గరున్న ప్రతి అయిదు షేర్లకు గాను నాలుగు ఆర్సీసీఎల్ షేర్లు లభిస్తాయి. ఇవీ చదవండి: షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే! డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .! -
హెచ్‌యూఎల్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13% బలపడి రూ. 2,601 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అమ్మకాల పరిమాణం, మార్జిన్లు మెరుగుపడటం లాభాల వృద్ధికి దోహదపడింది. నికర అమ్మకాలు 11 శాతం పుంజుకుని రూ. 14,926 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 13,468 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సర్వీసులతో కలిపి మొత్తం రూ. 15,375 కోట్ల నిర్వహణ ఆదాయం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 10,782 కోట్ల నుంచి రూ. 11,961 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. విభాగాలవారీగా: క్యూ4లో హెచ్‌యూఎల్ హోమ్ కేర్ విభాగం ఆదాయం 19% వృద్ధితో రూ. 5,637 కోట్లను తాకింది. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఆదాయం 11% పుంజుకుని రూ. 5,257 కోట్లకు చేరింది. ఇక ఫుడ్స్, రిఫ్రెష్మెంట్ నుంచి 3 శాతం అధికంగా రూ. 3,794 కోట్లు నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌యూఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 14% ఎగసి రూ.10,143 కోట్లను తాకింది. 2021–22లో రూ. 8,892 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 15%పైగా జంప్‌చేసి రూ.59,443 కోట్లయ్యింది. అంతక్రితం రూ.51,472 కోట్ల టర్నోవర్ సాధించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 1.7 శాతం క్షీణించి రూ. 2,469 వద్ద ముగిసింది. -
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్‌ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్‌తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్‌బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
చిన్న ప్యాక్స్ ఎత్తుగడ, దూసుకుపోతున్న వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిస్కట్స్, స్నాక్స్, సబ్బులు, టీ, కాఫీ పొడులు.. ఇలా ఉత్పాదన ఏదైనా మారుమూల పల్లెల్లోని దుకాణాల్లో రూ.1, రూ.2, రూ.5, రూ.10 ధరలో లభించే చిన్న ప్యాక్‌లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఉత్పాదనను వినియోగదారుడికి అలవాటు చేయడం, అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఇలా చిన్న ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఇటువంటి చిన్న ప్యాక్‌లు ఇప్పుడు ప్రధాన నగరాల్లోని రిటైల్ షాపుల్లో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. ఆధునిక రిటైల్ ఔట్లెట్లు, ఆన్లైన్ వేదికల్లోనూ ఇవి చొచ్చుకువచ్చాయి. ఇందుకు రిటైల్ ద్రవ్యోల్బణం కారణమని ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలు చెబుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు అధికంగా ఉండడంతో భారత్‌లో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతం నమోదైంది. దేశంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ 2020లో రూ.9.1 లక్షల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రెండింతలు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగం పెరిగేందుకు.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమ 2022 అక్టోబర్-డిసెంబర్లో 7.6 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం త్రైమాసికంలో ఇది 9.2 శాతంగా ఉంది. నిత్యావసరాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ప్రముఖ తయారీ కంపెనీలు చిన్న ప్యాక్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ ధరలో లభించే చిన్న బ్రాండ్స్, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల వైపు కస్టమర్లు మళ్లకుండా పెద్ద బ్రాండ్లు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం నెలవారీ చేసే ఖర్చులపై ఒత్తిడి ఉండడం కూడా మరో కారణం. ముడిసరుకు వ్యయాలు పెరుగుతుండడంతో కంపెనీలు ప్యాక్ బరువు తగ్గించడం లేదా ధర పెంచడమో చేస్తున్నాయి. ధర పెంచిన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. వినియోగం పెరిగేందుకు చిన్న ప్యాక్‌లను కొనసాగించాల్సిందేనని రిసర్చ్ కంపెనీ నీల్సన్ఐక్యూ తెలిపింది. ఆహారేతర విభాగాల్లో ఇవి డిమాండ్‌ను పెంచుతాయని వివరించింది. విక్రయాల్లో 50 శాతం దాకా.. చిన్న ప్యాక్‌ల వాటా మొత్తం అమ్మకాల్లో కంపెనీని బట్టి 50 శాతం వరకు ఉందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు నెలల్లో నగరాల్లో మొత్తం విక్రయాల్లో చిన్న ప్యాక్‌ల వాటా 5 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. మొత్తం సేల్స్‌లో చిన్న ప్యాక్‌ల వాటా ఏకంగా 50 శాతం ఉందని పార్లే ప్రొడక్ట్స్ వెల్లడించింది. నగరాల్లో గడిచిన రెండు మూడు నెలల్లో పెద్ద ప్యాక్‌లకు బదులుగా చిన్న ప్యాక్‌ల విక్రయాలే అధికంగా ఉన్నాయని కంపెనీ సీనియర్ కేటగిరీ హెడ్ మాయంక్ షా తెలిపారు. గతంలో ఇలా ఉండేది కాదన్నారు. సాధారణంగా ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అని చెప్పారు. ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాక్‌ల వైపు మార్కెట్ మళ్లుతోందని సుస్పష్టం అవుతోందని విప్రో కంజ్యూమర్ కేర్ చెబుతోంది. ద్రవ్యోల్బణం ప్రధాన సవాల్‌గా ఉందని కోకా-కోలా ఇండియా తెలిపింది. ఇతర విభాగాల్లోనూ.. మిల్క్, న్యూట్రీషన్ విభాగాల్లో అందుబాటు ధరలో ప్యాక్‌లను పరిచయం చేయాలని దిగ్గజ సంస్థ నెస్లే నిర్ణయించింది. ఇప్పటికే ఈ కంపెనీ కెచప్, చాకొలేట్స్, కాఫీలో చిన్న ప్యాక్స్‌ను విక్రయిస్తోంది. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని బ్రాండ్స్‌లో అందుబాటు ధరలో విక్రయించేందుకు చిన్న ప్యాక్‌లు దోహదం చేస్తున్నాయి. చిన్న ప్యాక్‌లు లక్ష్యంగా ఇతర విభాగాల్లో విస్తరిస్తున్నాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది’ అని కోక–కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సంకేత్ రే తెలిపారు. పెప్సి, మిరిండా, మౌంటెయిన్ డ్యూ సింగిల్ సర్వ్ బాటిల్స్ అమ్మకాలు ఇతర ప్యాక్‌లను మించి నమోదయ్యాయి. గెలాక్సీ, స్నిక్కర్స్, ఎంఅండ్ఎం బ్రాండ్ల చాకొలేట్లను విక్రయిస్తున్న మార్స్ రిగ్లీ రూ.10 ధరలో లభించే ప్యాక్‌లను నగరాల్లోనూ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రమే ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ, ధర నిర్ణయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
గాడిన పడని ఎఫ్ఎంసీజీ రంగం
న్యూఢిల్లీ: వినియోగంపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ (ఎఫ్ఎంసీజీ) డిసెంబర్ త్రైమాసికంలో ప్రతికూల వృద్ధిని చూసింది. విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల విలువ 7.6 శాతం పెరిగింది. కానీ, విక్రయించిన ఉత్పత్తుల సంఖ్య పరంగా చూస్తే 0.3 శాతం తగ్గింది. విక్రయాల సంఖ్య పరంగా ప్రతికూల వృద్ధి పరిశ్రమలో నమోదైంది. కరోనా ముందు నాటితో పోలిస్తే విలువ, సంఖ్యా పరంగా అమ్మకాలు ఎగువనే ఉన్నాయి. వరుసగా ఆరో త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో విలువ పరంగా 2.8 శాతం క్షీణత నమోదైంది. కానీ, గత డిసెంబర్ క్వార్టర్లో పట్టణ మార్కెట్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1.6 శాతం వృద్ధిని చూసింది. రిటైల్ విభాగంలో ఆధునిక విక్రయ చానళ్లలో విలువ పరంగా 23.3 శాతం, సంఖ్యా పరంగా 12.6 శాతం చొప్పున వృద్ధి, అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు నమోదైంది. సంప్రదాయ చానళ్లు అయిన కిరాణా దుకాణాలు తదితర నమూనాల్లో అమ్మకాలు 1.5 శాతం తగ్గాయి. ‘‘వినియోగదారులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండగా, తయారీదారులు కూడా ప్రోత్సాహకాలను తొలగించి మార్జిన్లను కాపాడుకునే విధానాన్ని అనుసరించారు’’అని నీల్సన్ ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సోనికా గుప్తా తెలిపారు. చిన్న ప్యాకెట్లకే మొగ్గు ‘‘సంప్రదాయ, ఆధునిక విక్రయ చానళ్లలో వినియోగదారులు ఇప్పటికీ చిన్న పరిమాణంలోని ప్యాకెట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తయారీ సంస్థలు సైతం విక్రయాల కోసం చిన్న ప్యాక్‌లను తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. చిన్న సంస్థల నుంచి పోటీ ఉండడం కూడా పోర్ట్‌ఫోలియో పరంగా వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం పెద్ద సంస్థలకు ఏర్పడింది. ఆహారోత్పత్తులకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తూ, నాన్ ఫుడ్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని నీల్సన్ఐక్యూ నివేదిక తెలియజేసింది. నాన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు అన్ని విభాగాల్లోనూ కరోనా ముందు నాటితో పోలిస్తే తక్కువగా నమోదువుతున్నట్టు చెప్పింది. -
రిలయన్స్ మరో సంచలనం: గుజరాత్లో షురూ
సాక్షి,ముంబై ముఖేశ్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలికింది. ఆయిల్ టూ టెలికాం, రీటైల్ వ్యాపారంలో దూసుకుపోతున్న రిలయన్స్ తన రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతీ అణువులోనూ భారత్ అంటూ స్వదేశీ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను లాంచ్ చేసింది. మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్, ఇండిపెండెన్స్ కింద స్టేపుల్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు , ఇతర రోజువారీ అవసర సరుకులు సహా అనేక వర్గాల విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టబోతున్నామని ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ ‘ఇండిపెండెన్స్’ అనే బ్రాండ్ పేరుతో సేవలను గుజరాత్లో గురువారం ప్రారంభించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ సేవలను లాంచ్ చేసింది. రాబోయే నెలల్లో ఇండిపెండెన్స్ బ్రాండ్‌ను విస్తరించాలని , గుజరాత్ వెలుపలి రిటైలర్లను చేర్చాలని యోచిస్తోంది. ఎడిబుల్ ఆయిల్, పప్పులు, తృణ ధాన్యాలు, బిస్కట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ తదితర నిత్యావసర వస్తువులను నాణ్యమైన, సరసమైన ధరలకు సరఫరా చేయనున్నామని కంపెనీ ప్రకటించింది. ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద ఎఫ్ఎంసీజీ సేవలను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వెంచర్స్ లిమిటెడ్ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. గుజరాత్‌ను ‘గో టు మార్కెట్’ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ FY22లో కంపెనీ అమ్మకాలు, సేవల విలువ రూ.1,99,749 కోట్లును సాధించి తద్వారా మార్కెట్ విలువ రూ.2 ట్రిలియన్లకు చేరింది. అనుబంధ సంస్థల ద్వారా, రిలయన్స్ రిటైల్ 16,500 కంటే ఎక్కువ సొంత దుకాణాలను నిర్వహిస్తోంది. కిరాణా, ఎలక్ట్రానిక్స్, అపెరల్, ఫార్మసీ, లోదుస్తులు, ఇల్లు , ఫర్నిషింగ్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంరక్షణలో 2 మిలియన్లకు పైగా వ్యాపారులతో భాగస్వాములను కలిగి ఉంది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్! అక్కడ డిమాండ్ ఢమాల్!
ముంబై: ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఎఫ్ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది. (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్) ధరలు తగ్గితే అనుకూలం.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది క్రిసిల్ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. ధరల ప్రభావం.. పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్ పెరగడాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. -
గుడ్‌న్యూస్: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంపై ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడి కొద్దిగా తగ్గుతోందని ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. ప్రస్తుతం భారీ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్ 2022లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ విషయాలు వివరించారు. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలోనే ఉందని పురి చెప్పారు. గతంలో దాదాపు అయిదేళ్లలో పెరిగేంత స్థాయిలో ప్రస్తుతం చాలా మటుకు ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని, వినియోగ ధోరణులపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, వర్షపాత ధోరణులను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గానే ఉండబోతోందని చెప్పారు. మరోవైపు, పెట్టుబడులకు ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పురి తెలిపారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నిధుల లభ్యత, కార్పొరేట్ల ఆదాయాలు మొదలైనవన్నీ బాగున్నాయన్నారు. సామర్థ్యాల వినియోగం కూడా పుంజు కుంటోందని చెప్పారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితి నెలకొనడమనేది ఎగుమతులపరంగా ప్రతికూలాంశంగా ఉంటోందని పురి తెలిపారు. ప్రధానంగా దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టే తమ కంపెనీల్లాంటివి ప్రైవేట్ పెట్టుబడులను యథాప్రకారం కొనసాగిస్తున్నాయన్నారు. తయారీ రంగం కీలకమైనదే అయినప్పటికీ మిగతా రంగాల్లోనూ భారత్ పుంజుకోవాలని పురి చెప్పారు. ఆదాయాల స్థాయిలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ‘వింటర్’ దన్ను
న్యూఢిల్లీ: చలి పెరగడంతో చర్మ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. ఈ సీజన్‌తో అయినా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పుంజు కుంటాయని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనుండడంతో వినియోగం మరింత పెరుగు తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధి రికవరీ ఉంటుందని భావిస్తున్నాయి. డాబర్, ఇమామీ, మారికో కంపెనీలకు సంబంధించి చర్మ సంరక్షణ, రోగ నిరోధక శక్తిని పెంచే (చ్యవన్‌ప్రాశ్) ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ కామర్స్ వేదికలపై పెరిగాయి. ఈ ఏడాది సాగు బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, రానున్న త్రైమాసికాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు బలపడతాయన్న అంచనాలు కంపెనీల్లో ఉన్నాయి. 50 శాతం మేర వృద్ధి తమ ఉత్పత్తుల్లో బాడీ లోషన్, సఫోలా ఇమ్యూనివేద శ్రేణి తదితర అమ్మకాలకు శీతాకాలం కీలకమని మారికో ఇండియా బిజినెస్ సీవోవో సంజయ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది కూడా అమ్మకాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే హెయిర్ ఆయిల్ అమ్మకాలు పెరిగాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా చూస్తే బాడీ లోషన్ అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో పెరిగాయన్నారు. కనుక అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బాడీలోషన్ అమ్మకాల్లో 50 శాతానికి పైనే వృద్ధి నమోదు చేయగలమని భావిస్తున్నట్టు మిశ్రా చెప్పారు. మంచి డిమాండ్.. ఈ ఏడాది పండుగల సీజన్ తమకు రికవరీపై ఆశలు కలిగించినట్టు డాబర్ ఇండియా సీవోవో ఆదర్శ్ శర్మ తెలిపారు. డాబర్ చ్యవన్ ప్రాశ్, డాబర్ హనీ, గులాబరితోపాటు, చర్మ సంరక్షణ ఉత్పత్పత్తులతో వింటర్ పోర్ట్‌ఫోలియోను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభంలో ఉన్నామని, తమ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తోందని చెబుతూ.. ఈ ఏడాది మంచి వృద్ధి నమోదు అయితే, తదుపరి డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది సాగు మంచిగా ఉండడంతో వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తీకరించారు. ఈ ఏడాది వింటర్ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తున్నట్టు ఇమామీ సేల్స్ ప్రెసిడెంట్ వినోద్ రావు తెలిపారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పుటికీ శీతాకాలంలో వినియోగించే ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రికవరీ కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హెచ్‌యూఎల్, డాబర్, ఇబామీ చర్మ సంరక్షణ విభాగంలో అధిక వాటాను ఆక్రమిస్తున్నాయని, ఇటీవల పామాయిల్, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల తయారీ వ్యయాల పరంగా ఇవి లాభపడతాయని నువమా గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబనీష్ రాయ్ అంచనా వేశారు. క్రమంగా పెరుగుతున్న -
తగ్గుతున్న ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం
న్యూఢిల్లీ: ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మందగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పరిమాణం మరింతగా పడిపోతోంది. డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ఐక్యూ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల (ప్యాకేజ్డ్ ఆహార, ఆహారయేతర ఉత్పత్తులు మొదలైనవి) విక్రయ పరిమాణం 0.9 శాతం తగ్గింది. ఇలా అమ్మకాల పరిమణం వృద్ధి మందగించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. వరుసగా గత ఆరు త్రైమాసికాల్లో రేట్లు రెండంకెల స్థాయిలో పెరగడం దీనికి దారి తీసిందని నివేదిక వివరించింది. గ్రామీణ మార్కెట్లలో అమ్మకాల పరిమాణం జూన్ త్రైమాసికంలో 2.4 శాతం క్షీణించగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.6 శాతం తగ్గింది. అయితే, ఇదే వ్యవధిలో పట్టణ ప్రాంత మార్కెట్లలో విక్రయాల పరిమాణం 1.2 శాతం పెరిగింది. ఆహార ఉత్పత్తుల అమ్మకాలు 3.2 శాతం పెరిగాయి. రేట్ల పెంపు నేపథ్యంలో విలువపరంగా చూస్తే .. జూన్ త్రైమాసికంతో పోల్చినప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.9 శాతం మేర వృద్ధి చెందినట్లు నివేదిక వివరించింది. ఇక పరిమాణం, విలువపరంగా చూసినా అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి (2020 మార్చి త్రైమాసికం) మించి నమోదయ్యాయి. మహమ్మారి ప్రభావం తగ్గాక మార్కెట్లు పూర్తిగా తెరుచుకోవడం ఇందుకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు .. రేట్ల పెరుగుదల నేపథ్యంలో వినియోగదార్లు ఎక్కువగా చిన్న ప్యాక్‌లవైపు మొగ్గు చూపడం కొనసాగుతోంది. కంపెనీలు చాలా మటుకు ఉత్పత్తులను కొత్తగా చిన్న ప్యాక్‌ల్లో ప్రవేశపెడుతున్నాయి. ముడి వస్తువుల ధరలు ఇంకా అధిక స్థాయిలో కొనసాగుతుండటమే కారణం. హైపర్మార్కెట్లు, సూపర్మార్కెట్లు, మాల్స్ మొదలైనవి .. విలువపరంగా (22 శాతం అధికం), పరిమాణంపరంగా (11 శాతం వృద్ధి) మెరుగ్గా రాణిస్తున్నాయి. చిన్న తయారీ సంస్థలు, టాప్ 400 ఎఫ్ఎంసీజీ సంస్థలు .. వినియోగ చోదకాలుగా ఉంటున్నాయి. గత 2–3 త్రైమాసికాలుగా విలువ, పరిమాణంలో వాటి వాటా పెరుగుతోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ
సాక్షి,ముంబై: ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొస్తున్న రిలయన్స్ దాదాపు రెండు డజన్ల బ్రాండ్లను ఇప్పటికే గుర్తించిందనీ, వీటిని జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేయనుందని ఈటీ రిపోర్ట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్, సోప్ బ్రాండ్ తదితర కంపెనీలతో చర్చలు జరుపుతోందని ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపింది. తాజా రిపోర్టు ప్రకారం రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరానా స్టోర్లలో కొనుగోలుకు కాంపాకోలా డ్రింక్ అందుబాటులో ఉంచనుంది. నిమ్మ, నారింజ రుచులలో పునఃప్రారంభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకపుడు కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది ఐకానిక్ కోలా.1990ల నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించనున్నామని ఇటీవల జరిగిన రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెటా, జియో మార్ట్ భాగస్వామ్యంతో వాట్సాప్‌లో రిలయన్స్ రిటైల్ సేవలను వివరించారు. కేవలం కొన్ని నిమిషాల్లో వాట్సాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని ఆమె వివరించారు. (Benda V302C: కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు) కాగా 1990లలో, పార్లే అభివృద్ధి చేసిన శీతల పానీయాల బ్రాండ్లతో పాటు, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా మార్కెట్లో కాంపా ఆధిపత్యం చెలాయించింది. అయితే, కోకా-కోలా తన రీ-ఎంట్రీలో మూడు పార్లే బ్రాండ్లను కొనుగోలు చేసిన తర్వాత, కాంపా పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత 2019లో మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు పదే పదే ప్రయత్నాలు చేసినా ఆర్థిక బలం లేకవిఫలమైంది. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో!
న్యూఢిల్లీ: కొబ్బరినూనె, బిస్కెట్లు, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలో ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో డిమాండ్ మందగమనంలో సాగింది. ప్రధాన కంపెనీలు డాబర్, మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) త్రైమాసిక నివేదికలు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాయి. ద్రవ్యోల్బణం తీవ్రత ఆదాయాలపై ప్రభావం చూపుతున్నందున, వినియోగదారులు ప్రధాన వస్తువులపై ఖర్చు చేయడానికి వెనుకాడారని సంస్థలు వెల్లడించాయి. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిల కారణంగా భారీగా దెబ్బతిందని పేర్కొన్నాయి. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించాయి. వంట నూనెలు, తేనె, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి సంస్థల స్థూల మార్జిన్లు ప్రభావితం అయ్యే స్థాయిలో వినియోగం పడిపోయిందని ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. అంతేకాకుండా, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్ల వృద్ధి జూన్ త్రైమాసికంలో నెమ్మదించిందని వెల్లడించాయి. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారికోలు తమ భారతీయ వ్యాపార పరిమాణం క్షీణ దిశలో ఉందని కూడా ఆందోళన చెందుతుండడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిమాండ్‌ను తగ్గిస్తుండడం దీనికి కారణం. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డిమాండ్ ధోరణులు, సంస్థల పనితీరు గురించి తొలి అంచనాలను తమ అప్డేటెడ్ నివేదికల్లో పేర్కొన్నాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి వాటి సంబంధిత బోర్డులు సంస్థల ఆర్థిక ఫలితాలను ఆమోదించిన తర్వాత వివరణాత్మక ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. మూడు సంస్థలు ఈ మేరకు తమ జూన్ త్రైమాసిక అప్డేటెడ్ తొలి నివేదికలను వెల్లడించాయి. అంతర్జాతీయ వ్యాపారం ఓకే... ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం నుండి వృద్ధిని నమోదుచేసుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదిక చూస్తే, కన్సాలిటేడెడ్ ఆదాయాలు పెరిగినట్లు మారికో పేర్కొంది. డాబర్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బలమైన వృద్ధిని నమోదుచేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో తమ మార్కెట్ వాటా వృద్ధిని నమోదుచేసుకుంటోందని తెలిపింది. కాగా గోద్రెజ్ మాత్రం తమన కంపెనీకి భారత్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన ఇండోనేయాలో వినియోగం, మార్జిన్లు దెబ్బతింటున్నట్లు తెలిపింది. ఆఫ్రికా, అమెరికా, పశ్చిమాసియాల్లో మాత్రం వృద్ధి రెండంకెల్లో నమోదవుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. వినియోగమంటే భయం ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తుంటే, వినియోగదారులు కొన్ని అనవసరమైన వస్తువుల కొనుగోళ్లను మానేశారు. అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ధర బ్రాండ్‌వైపు మళ్లడం, చిన్న ప్యాక్‌లకు మారడం వంటి ధోరణులను అవలంభిస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు క్షీణతలోకి కూడా జారిపోయాయి. సఫోలా ఆయిల్స్‌ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సఫోలా నూనెలను మినహాయించి, భారతదేశ వ్యాపారం స్వల్ప పరిమాణంలో వృద్ధిని నమోదు చేసింది. పారాచూట్ కొబ్బరి నూనె స్వల్ప పరిమాణంలో క్షీణతను నమోదు చేసింది. – మారికో ఆదాయాలు పరిమితం 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. అయితే తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో ఈ రేటు ఒకంకెకు పరమితం అవుతుంని అంచనావేస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను భారత్ క్రమంగా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గుదల ఇందుకు దోహదపడతాయని అంచనా. – డాబర్ -
హిందూస్థాన్ యూనీలీవర్ చేతికి దిగ్గజ మసాలా కంపెనీ..! అదే జరిగితే పెనుమార్పులు..!
ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎండీహెచ్)లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలు లావాదేవీలో భాగంగా ఎండీహెచ్ మార్కెట్ విలువను రూ.10,000-15,000 కోట్లకు లెక్కగట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పెను మార్పులు..! దేశవ్యాప్తంగా ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులు అత్యంత ఆదరణను పొందాయి. ఈ కంపెనీలో హెచ్‌యూఎల్ వాటాలను కొనుగోలు చేయడంతో మసాలా ఉత్పత్తుల సెగ్మెంట్లో పెనుమార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వాటాల విక్రయంపై హోచ్‌యూఎల్‌తో పాటుగా మరిన్ని కంపెనీలు ఎండీహెచ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2020 చివర్లో ఎండీహెచ్ వ్యవస్థాపకులు, పద్మ భూషన్ అవార్డు గ్రహీత ధరమ్ పాల్ గులాటీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ యాజమాన్యం వాటా విక్రయ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా ఎండీహెచ్ 60కి పైగా మసాలా ఉత్పత్తులు విక్రయిస్తోంది. కనీసం 1,000 మంది హోల్‌సేలర్లు, లక్షల కొద్ది రిటైల్ కేంద్రాలతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! వాటిని తినాలంటే జంకుతున్న భారతీయులు..!
నాన్నకు ప్రేమతో సినిమాలో ‘బటర్ ఫ్లై ఎఫెక్ట్’ గురించి ఎన్టీఆర్ చెబితే మనందరం చూసే ఉంటాం. ఎక్కడో బటర్ ఫ్లై రెక్కలు వీదిలిస్తే...అది అమెరికాలో పెను తుఫానుకి కారణమవుతోంది. అచ్చంగా మన పరిస్థితి అలాగే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభిస్తే.. ధరల పేలుడు ప్రభావం మన ఇళ్లలో కనిపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు శాంతిమంత్రం అంటుంటే అనివార్య పరిస్థితుల్లో ఇండియన్లు నిర్భంధ పొదుపు మంత్రం జపించాల్సి వస్తోంది. ఫ్రైడ్ ఫుడ్‌కు దూరం..! కోవిడ్-19 రాకతో రెండేళ్లపాటు ఆర్థికంగా చిక్కిపోయినా కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అంతా సర్దుకుపోతుందనుకుంటే మళ్లీ రష్యా-ఉక్రెయిన్ వార్ సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో వంటనూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో పాటుగా క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు సిద్ధమైంది. పెట్రోల్, డిజీల్, వంటగ్యాస్ ధరలను కేంద్రం పెంచేసింది. ఈ చర్యలు నేరుగా సామాన్యుడిపై పడుతున్నాయి. ధరల పెంపుతో పలు ప్యాకేజ్డ్ ఫుడ్, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తమ జేబులకు చిల్లు పడకుండా తమ ఖర్చులను తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం తమ ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండేందుకు భారతీయులు సిద్దమయ్యారు. వేయించిన తినుబండారాలకు, పలు కూరగాయల జోలికి పోవడం లేదు. చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు పొదుపు మంత్రం..! ఖర్చులు పెరగడంతో ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోని భారతీయులు ధరల పెంపు కాటుకు గురవుతున్నారు. చేసేదేమి లేక పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. దాదాపు 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 800 మిలియన్లు మహమ్మారి సమయంలో ప్రధానమైన ఆహార పదార్థాల ప్రభుత్వ సరఫరాలను ఉచితంగా పొందుతూ బతుకు వెళ్లదీస్తున్నారు. పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు చిగురించేలోగా వచ్చిన యుద్ధం దెబ్బతో చిన్న వస్తువుల ధరలు కూడా పెరగాయి. దీంతో సామాన్యుల బడ్జెట్ కుదేలవుతోంది. వరుసగా మూడో ఏదాది కూడా సామాన్యుల ఆర్థిక పరిస్థితి పుంజుకునే అవకాశం కనిపించడం లేదని భారతదేశ ప్రధాన గణాంక నిపుణుడు ప్రణబ్ సేన్ హెచ్చరించారు. భారతీయుల్లో పొదుపు మంత్రం కోవిడ్-19 వచ్చిన్పటినుంచే మొదలైనా.. ఇప్పుడది నిర్బంధ పొదుగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూయల్ ఎఫెక్ట్ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, దిగుమతిపై ఆధారపడిన దేశాలకు శాపంగా మారాయి. ముఖ్యంగా శాతం ముడిచమురుని దిగుమతి చేసుకునే భారత్‌కి అయితే దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. మూడు నెలలు పూర్తికాకముందే ముడి చమురు ధరలు 50 శాతం పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు రెడీ అయ్యాయి. ఇంధన ధరల బాదుడును మొదలు పెట్టాయి. ముందుగా బల్క్ ఫ్యూయల్ ధరలు పెరగగా ఇప్పుడు రిటైల్ ధరలు కూడా పైకి ఎగబాకడం మొదలెట్టాయి. చదవండి: చక్కెర ఉత్పత్తిని తగ్గించండి..లేకపోతే భారీ నష్టం ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరల పెంపు..! రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ విడత పెంపు 10 శాతం వరకూ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి క్రమానుగతంగా రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి. చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు -
బాదుడే..బాదుడు! సామాన్యులకు మరో షాక్.. వీటి ధరలు పెరగనున్నాయ్!
న్యూఢిల్లీ: బిస్కెట్లు మొదలుకుని నూడుల్స్ వరకు పలు ప్యాకేజ్డ్ ఉత్పత్తుల రేట్లు మళ్లీ పెరగనున్నాయి. రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ విడత పెంపు 10 శాతం వరకూ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డాబర్, పార్లే వంటి కంపెనీలు ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి క్రమానుగతంగా రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి. ‘పరిశ్రమలో ధరలు 10–15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం‘ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. ప్రస్తుతం కమోడిటీల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున.. రేట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పడం కష్టమేనని ఆయన చెప్పారు. పామాయిల్ రేటు లీటరుకు రూ.180కి ఎగియగా.. ప్రస్తుతం రూ.150కి తగ్గింది. అటు ముడిచమురు ధరలు బ్యారెల్‌కి 140 డాలర్లకు పెరిగినా.. మళ్లీ 100 డాలర్ల దిగువకి వచ్చాయి. అయినా ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయని షా పేర్కొన్నారు. ఆచితూచి నిర్ణయం.. కోవిడ్ అనంతరం ఇప్పుడిప్పుడే డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో రేట్లను భారీగా పెంచే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని షా చెప్పారు. క్రితం సారి కూడా కంపెనీలు ధరల పెంపు భారాన్ని పూర్తిగా వినియోగదారులపై బదలాయించకుండా కొంత మేర తామే భరించినట్లు వివరించారు. ‘అందరూ దాదాపు 10–15 శాతం మేర పెంపు గురించి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ముడి వస్తువుల ధరలు అంతకుమించి పెరిగిపోయాయి‘ అని షా చెప్పారు. పార్లే విషయానికొస్తే ప్రస్తుతానికి తమ వద్ద ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇతర ఉత్పత్తుల నిల్వలు తగినంత స్థాయిలో ఉన్నాయని, నెలా రెణ్నెల్ల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతోందని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుశ్ జైన్ తెలిపారు. ‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, తత్ఫలితంగా ధరల పెంపు కారణంగా వినియోగదారులు తమ పర్సులను తెరవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల భారాన్ని అధిగమించేందుకు క్రమంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం‘ అని ఆయన చెప్పారు. ఇప్పటికే పెంపు.. హెచ్‌యూఎల్, నెస్లే ఇప్పటికే రేట్లను పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నందువల్ల అవి ధరలను సత్వరం పెంచగలుగుతున్నాయని పేర్కొన్నాయి.‘హెచ్‌యూఎల్, నెస్లే వంటి వాటికి ధరలను నిర్ణయించే విషయంలో కాస్తంత ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. కాఫీ, ప్యాకేజింగ్ మెటీరియల్స్ భారాన్ని అవి వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరో విడత 3–5 శాతం మేర ధరలను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం‘ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అవనీష్ రాయ్ చెప్పారు. కొన్ని వర్గాల కథనాల ప్రకారం హెచ్‌యూఎల్, నెస్లే మొదలైన సంస్థలు తమ మార్జిన్లను కాపాడుకోవడం కోసం టీ, కాఫీ, నూడుల్స్ వంటి ఉత్పత్తుల రేట్లను ఇప్పటికే పెంచేశాయి. బ్రూ కాఫీ, బ్రూక్‌బాండ్ టీ మొదలైన వాటి రేట్లను హెచ్‌యూఎల్ పెంచింది. అలాగే నెస్లే ఇండియా కూడా తమ మ్యాగీ నూడుల్స్ రేటును 9–16 శాతం మేర పెంచింది. అటు పాల పౌడరు, కాఫీ పౌడర్ ధరను కూడా పెంచినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా వ్యయాలను కట్టడి చేసుకోవడం, ఆదా చేసుకోదగిన అంశాలపై కసరత్తు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఆ తర్వాతే ఇంకా భారం పడుతుంటే దాన్ని వినియోగదారులకు బదలాయించాల్సి వస్తోందని కంపెనీల వర్గాలు పేర్కొన్నాయి. -
తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..!
రష్యా-ఉక్రెయిన్ వార్ ప్రభావంతో ఒక్కసారిగా వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంటనూనె ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా అధిక ద్రవ్యోల్భణ పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) కంపెనీలు సామాన్యుడిపై ధరల పెంపు బాంబును వేసేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఒత్తిడి..! గోధుమ, వంటనూనె, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి వస్తువుల ధరలు మరొక సారి భారీగా పెరగనున్నాయి. అధిక ద్రవ్యోల్భణ ప్రభావాన్ని అధిగమించడానికి ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరల పెంపును యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సామాన్యులు తమ రోజువారీ నిత్యావసర వస్తువుల కోసం మరింత చెల్లించే పరిస్థితులు త్వరలోనే రానున్నాయి. ఇదిలా ఉండగా రష్యా-ఉక్రెయిన్ యుధ్ద పరిస్థితులు నిత్యావసర వస్తువుల పెంపుకు అనివార్యమైందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. అధిగమించాలంటే..! ప్రస్తుత పరిస్థితిని ఎఫ్ఎంసీజీ కంపెనీలైన డాబర్,పార్లే వంటి కంపెనీలు గమనిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడానికి ధరలు పెంపుకు సవరణలను చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం...గత వారం హెచ్‌యూఎల్(హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్), నెస్లే వంటి సంస్థలు ఆహార ఉత్పత్తుల ధరలను భారీగా పెంచారు. ద్రవ్యోల్భణ పరిస్థితుల నుంచి కంపెనీలను కాపాడేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు కనీసం 10 నుంచి 15 మేర పెంపు ఉండే అవకాశం ఉంటుందని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా పిటిఐకి చెప్పారు. అస్థిరత..! గత కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువుల ధరల్లో అధిక హెచ్చుతగ్గులు ఉన్నట్లు షా తెలిపారు. అయితే ధరల అస్థిరత కారణంగా కచ్చితమైన పెరుగుదల గురించి చెప్పడం అంతా సులువుకాదని ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఒక్కసారిగా క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారెల్ క్రూడాయిల్ తిగమనం పట్టాయని మయాంక్ షా గుర్తుచేశారు. ఒకానొక సమయంలో లీటర్ పామాయిల్ ధర రూ. 180కు పెరిగి ప్రస్తుతం రూ. 150కి పడిపోయింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు సుమారు 10 నుంచి 15 శాతం నిత్యవసర వస్తువుల ధరలను పెంచాలనే ప్రతిపాదనలతో ఉన్నట్లు తెలిపారు. ఇన్పుట్ ఖర్చులను తగ్గించేందుకుగాను ధరల పెంపుకు సిద్దమైనట్లు షా అన్నారు. చదవండి: మందగమనంలో ఎఫ్ఎంసీజీ! -
టీవీ ప్రకటనలు గతేడాది 22% అప్
ముంబై: కోవిడ్–19 మహమ్మారితో 2020లో టీవీ ప్రకటనలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినప్పటికీ 2021లో మాత్రం యాడ్ల పరిమాణం గణనీయంగా పుంజుకుంది. 22 శాతం పెరిగి 1,824 మిలియన్ సెకన్లుగా నమోదైంది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. టీవీ ప్రకటనల పరిమాణం 2019లో 1,542 మిలియన్ సెకన్లుగా ఉండగా 2020లో 1,497 మిలియన్ సెకన్లకు తగ్గింది. టీవీలో మొత్తం 9,239 ప్రకటనకర్తలు.. 14,616 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ ఇచ్చారు. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగం ప్రకటనలు (1,117 మిలియన్ సెకన్లు) అత్యధికంగా ఉండగా, 185 మిలియన్ సెకన్లతో ఈ–కామర్స్, నిర్మాణ రంగ ప్రకటనలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
పేస్ట్, సబ్బు, ఫేస్పౌడర్లు బంద్.. మరో నాలుగు రాష్ట్రాలకు!
ఎఫ్ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. రిటైల్ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది. ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తులైన పౌడర్, సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్. జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్, వాల్‌మార్ట్)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు. మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది. సంబంధిత వార్త: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. -
కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..
Colgate Products Shortage In Maharastra: కోల్గేట్ పేస్ట్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్ పేస్టులు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్ నడుస్తోంది. అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి మ్యాక్స్ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు. కారణం.. ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్ అంటే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) ఛానెల్ నుంచి స్టాక్లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు. కోల్గేట్ స్పందన.. కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్ లివర్ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది. లేఖలు రాసినా.. ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు).. ఎఫ్ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది). లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చదవండి: లేస్ చిప్స్ ‘ఆలు’పై పేటెంట్ రైట్స్ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట -
కొత్త ఏడాది..కొత్త బాదుడు.. 2022లో సామాన్యుడికి చుక్కలే..!
2021లో అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాల, ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంపు సామాన్యుల నెత్తి మీద పడ్డాయి. ఈ ఏడాది అధిక ద్రవ్యోల్భణం సామాన్యులకు ఊపిరి ఆడకుండా చేసింది. 2021లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్భణం ప్రతినెల పెరుగుతూనే వచ్చింది. గత నెలలో డబ్ల్యూపీఐ ఏకంగా 14.23 శాతంగా నమోదయ్యింది. గడచిన దశాబ్దకాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్భణం ఇదే తొలిసారి. ఇక కొత్త ఏడాది రాబోతుంది. వచ్చే ఏడాదిలో కూడా ఆయా ధరలు మరోసారి ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. ► ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ దిగ్గజం కంపెనీలు 2022 వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అధిక ఇన్పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ తయారీ కంపెనీలు, కన్స్యూమర్ కంపెనీలు రాబోయే ఏడాదిలో మరోసారి ధరల పెంపును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ( ఎఫ్ఎంసిజి ) కంపెనీలు వచ్చే మూడు నెలల్లో ఆయా వస్తువుల ధరలను సుమారు 4-10 శాతం మేర పెంచే అవకాశం ఉంది. గత రెండు త్రైమాసికాల్లో హిందూస్ధాన్ యూనీలివర్, డాబర్, బ్రిటానియా, మారికో ఇతర ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు సుమారు 5-12 శాతం మేర ధరలను పెంచాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, నాల్గవ త్రైమాసికంలో మరో రౌండ్ ధరల పెరుగుదల అనివార్యమని డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా అన్నారు. ► భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ నెలలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు , ఎయిర్ కండీషనర్లపై ఇప్పటికే 3-5 శాతం మేర ధరలను పెంచాయి. అయితే వచ్చే ఏడాది నుంచి మరో సారి ధరలను పెంచే అవకాశం ఉంది. సుమారు 6-10 శాతం మేర హోమ్ అప్లియెన్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2020 నుంచి వైట్ గూడ్స్ ధరల పెరుగుదల ఇది నాల్గోసారి. అధిక ఇన్‌పుడ్ కాస్ట్, చిప్స్ కొరత, సప్లై చైయిన్ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు పెరగనున్నాయి. ► గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుంచి 12శాతం వరకు జీఎస్స్టీను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ► దేశంలోని వాహన తయారీదారులు 2022 నుంచి వాహనాల ధరల పెంపును తెలపగా, అవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల భావిస్తున్నారు. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, వోక్స్వ్యాగన్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం), హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడంతో ఏడాది పొడవునా అనేక సార్లు ధరలను పెంచాయి. ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ కొత్త సంవత్సరంలో వాహనాల ధరలను మళ్లీ పెంచనున్నట్లు తెలిపింది . ఇది గత సంవత్సరంలో కంపెనీ ధరలను పెంచడం నాల్గవది, 18 నెలల్లో ఆరవది. ► ఉత్పాదకతను మెరుగుపరచడానికి కంపెనీలు అంతర్గత చర్యలు తీసుకునప్పటికీ, స్టీల్, రాగి, ప్లాస్టిక్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలలో అపూర్వమైన పెరుగుదల ఉంది. దీంతో వాహనాల పెంపు అనివార్యమైంది. 2022లో సామాన్యులకు మరోసారి గట్టి షాకే తగ్గలనుంది. ఎఫ్ఎమ్సీజీ, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనకొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!