హిందూస్థాన్‌ యూనీలీవర్‌ చేతికి దిగ్గజ మసాలా కంపెనీ..! అదే జరిగితే పెనుమార్పులు..! | Hindustan Unilever in Talks to Buy Majority Stake in Mdh Spices: Report | Sakshi
Sakshi News home page

హిందూస్థాన్‌ యూనీలీవర్‌ చేతికి దిగ్గజ మసాలా కంపెనీ..! అదే జరిగితే పెనుమార్పులు..!

Published Wed, Mar 23 2022 6:21 PM | Last Updated on Wed, Mar 23 2022 6:26 PM

Hindustan Unilever in Talks to Buy Majority Stake in Mdh Spices: Report - Sakshi

ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎండీహెచ్‌)లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలు లావాదేవీలో భాగంగా ఎండీహెచ్‌ మార్కెట్‌ విలువను రూ.10,000-15,000 కోట్లకు లెక్కగట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

పెను మార్పులు..!
దేశవ్యాప్తంగా ఎండీహెచ్‌ మసాలా ఉత్పత్తులు అత్యంత ఆదరణను పొందాయి. ఈ కంపెనీలో హెచ్‌యూఎల్‌ వాటాలను కొనుగోలు చేయడంతో మసాలా ఉత్పత్తుల సెగ్మెంట్‌లో పెనుమార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వాటాల విక్రయంపై హోచ్‌యూఎల్‌తో పాటుగా మరిన్ని కంపెనీలు ఎండీహెచ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

2020 చివర్లో ఎండీహెచ్‌ వ్యవస్థాపకులు, పద్మ భూషన్‌ అవార్డు గ్రహీత ధరమ్‌ పాల్‌ గులాటీ  మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ యాజమాన్యం వాటా విక్రయ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా ఎండీహెచ్‌ 60కి పైగా మసాలా ఉత్పత్తులు విక్రయిస్తోంది. కనీసం 1,000 మంది హోల్‌సేలర్లు, లక్షల కొద్ది రిటైల్‌ కేంద్రాలతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌ కైవసం.. డీల్‌ విలువ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement