Cool Drinks
-
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో రూరల్.. రూలర్!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో అర్బన్ మార్కెట్‌ను రూరల్ మార్కెట్ అధిగమిస్తోంది. ఈ వస్తువుల అమ్మకాల్లో పట్టణ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలు వెనక్కి నెడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో అర్బన్ మార్కెట్ కంటే రూరల్ మార్కెట్ మెరుగైన స్థితిలోకి చేరుకుంది. ఆర్థికమాంధ్య పరిస్థితుల్లోనూ ఎఫ్ఎంసీజీల అమ్మకాల్లో రూరల్ ఇండియా టాప్‌లో నిలిచింది.ప్రస్తుత పరిస్థితుల్లో నగరాల్లో ఈ వస్తువుల అమ్మకాలు కొంత ఇబ్బందుల్లోనే కొనసాగవచ్చునని, గ్రామీణ మార్కెట్ మాత్రం ఇప్పుడున్న స్థితిని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 తో తలెత్తిన విపత్కర పరిస్థితులతో రూరల్ మార్కెట్ తిరోగమనంతో ఒత్తిళ్లకు గురికాగా, క్రమంగా పుంజుకున్నట్టు కన్సల్టింగ్ సంస్థ ‘కాంటార్’తాజా నివేదికలో వెల్లడైంది.నివేదికలో ఏం చెప్పారంటే..⇒ 2024 ప్రారంభం నుంచే గ్రామీణ మార్కెట్ అంచనాలకు మించి పుంజుకుంటోంది. ⇒2023 సంవత్సరంలో మెరుగైన స్థితిలో ఉన్న అర్బన్ మార్కెట్ క్రమంగా దిగజారుతూ వస్తోంది. ⇒ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన మార్కెట్‌గా ఉన్న న్యూడుల్స్, సాల్టీస్నాక్స్ వంటి కేటగిరి వస్తువుల అమ్మకాల తగ్గుదలతో కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ⇒ సెంట్రల్ ఇండియాలో అధిక వర్షపాతం తదితర కారణాలతో రూరల్ మార్కెట్ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడింది. ⇒ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గ్రామీణ మార్కెట్ వృద్ధి చెందేందుకు మరిన్ని అవకాశాలున్నాయని, ఈ ఏడాది రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ పురోగతిలోనే ముందుకు సాగుతుంది. ఇదీ ఎఫ్ఎంసీజీ పల్స్ రిపోర్ట్ కూల్‌డ్రింక్స్ (బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్)తాగే సగటు భారతీయ కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండేళ్లతో పోల్చితే గత మార్చితో ముగిసిన 2023–24లో ఇది 50 శాతానికి పెరిగినట్టుగా ‘కాంటార్ ఎఫ్ఎంసీజీ పల్స్రిపోర్ట్’వెల్లడించింది. గత రెండేళ్లలో సగటు కుటుంబాల్లో 250 మిల్లీలీటర్ల సాఫ్ట్‌డ్రింక్స్ వినియోగంతో పెరుగుదల నమోదైంది. ⇒ ప్రీమియం ల్యాండ్రీ ఐటమ్‌గా పరిగణిస్తున్న ఫాబ్రిక్ సాఫ్ట్నర్లను మాత్రం నాలుగు కుటుంబాల్లో ఒకటి మాత్రమే ఉపయోగిస్తోంది. మిగతా వస్తువుల విషయానికొస్తే..⇒ ప్రీమియం ల్యాండ్రీ ఉత్పత్తిగా పరిగణిస్తున్న వాషింగ్ లిక్విడ్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల మార్క్‌ను దాటి రికార్డ్ బ్రేక్ చేశాయి. ⇒ మార్చి 2023తో పోలి్చతే మార్చి 2024లో బాటిల్డ్ సాఫ్ట్‌డ్రింక్ కేటగిరి అనేది 41 శాతం వృద్ధి (మూవింగ్ యాన్యువల్ టోటల్)గా నమోదైంది. ⇒ ఆన్లైన్, ఆఫ్‌లైన్ చానళ్లలో వినియోగదారులు ఏడాదికి 156 సార్లు ఎఫ్ఎంసీజీ వస్తువులు (ప్రతీ 56 గంటలకు ఒకసారి) కొనుగోలు చేస్తున్నారు. -
ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఆరోగ్యం మటాష్
సాక్షి, అమరావతి: ప్రాసెస్డ్, అల్డా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురి పెద్దల్లో ఒకరు, ప్రతి 8మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనపరులుగా మారుస్తోంది. ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్, రెడీ మీల్స్ (రెడీ టు ఈట్), ప్రాసెస్ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అడిక్షన్’ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్ ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. మద్యంతో సమానం ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కాహాల్ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్‌లో ఎక్స్ట్రా సెల్యులర్ డోపమైన్‌ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్టు తేల్చారు. తద్వారా తీవ్రమైన కోరికలు, స్థూలకాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక–మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. యూకే, యూఎస్‌లలో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణ కోసం ఏడాదికి 7 ట్రిలియన్ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థూలకాయం, నాన్–కమ్యూనికేబుల్ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాలలో గణనీయంగా పెరిగాయి. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులతోపాటు స్త్రీ, పురుషుల ఉద్యోగాలు, ప్రయాణ సమయాలు పెరగడంతో కొన్ని దేశాల్లో అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రాసెస్ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, నూడుల్స్, కృత్రిమ స్వీటెనర్లతో కార్డియో వాసు్కలర్, కార్డియో మెటబోలిక్ కోమోర్చిడిటీలు 9శాతం పెరుగుతోంది. అయితే రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని నివేదించింది. పౌష్టికాహార భద్రత లోపం ఇప్పటికే ఆసియా, లాటిన్ అమెరికాల్లో అత్యంత ప్రాసెస్‌తోపాటు సహా ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. ఇది ఆఫ్రికాకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కోవిడ్–19కి ముందు స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా పౌష్టికాహార లోపం భయపెడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 29.6 శాతం మంది (240 కోట్ల మంది ప్రజలు) 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 90 కోట్ల మంది (11.3 శాతం మంది) ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. ఇక 2030లో దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన చెందుతోంది. తొమ్మిది దక్షిణాసియా దేశాలలో పోషకాహార లోపం (24 కోట్ల మంది)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారత్‌లో పోషకాహార లోపం 2004–06లో 21.4 శాతం నుంచి 2020–22 నాటికి 16.6కి తగ్గింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడికక్కడ లభిస్తున్నాయి. నగరం/పట్టణం నుంచి 1–2 గంటలు, అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న గ్రామాల్లోనూ ఈ ఆహార విధానం వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
కృత్రిమ తీపితో క్యాన్సర్!
వాషింగ్టన్: కూల్ డ్రింకులు తదితర బేవరేజెస్‌ల్లో నాన్ షుగర్ స్వీటెనర్(ఎన్ఎస్ఎస్)ల వాడకంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని వాడటం మానేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మే నెలలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వాడే కృత్రిమ స్వీటెనర్లలో ఒకటైన ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ప్రమాదం ఉన్నదంటూ తాజాగా పరిశోధనలో తేలడంతో దీని వినియోగంపై అమెరికాలో సమీక్ష మళ్లీ మొదలైందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. అత్యంత విరివిగా వాడే కృత్రిమ షుగర్ పదార్థం ఒకటి క్యాన్సర్‌కు కారకంగా మారే అవకాశం ఉందని వచ్చే నెలలో డబ్ల్యూహెచ్‌వో క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రకటించనుందంటూ రాయిటర్స్ తెలిపింది. ఆస్పర్టెమ్‌ను వాడొచ్చంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్‌డీఏ) 1981లోనే అనుమతులిచి్చంది. అయిదేళ్లకోసారి ఈ అనుమతిని సమీక్షిస్తూ వస్తోంది. భారత్ సహా 90కి పైగా దేశాల్లో అస్పర్టెమ్ వినియోగంలో ఉంది. ఆస్పర్టెమ్‌లో ఎలాంటి కేలరీలు ఉండవు. చక్కెర కంటే సుమారు 200 రెట్లు తీపిని ఇది కలిగిస్తుంది. ఆస్పర్టెమ్‌ను వినియోగించేందుకు 2009లో భారత ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతినిచి్చంది. ఆస్పర్టెమ్‌ను 95% కార్పొనేటెడ్ సాఫ్ట్ డ్రింకుల్లో స్వీటెనర్‌గా వాడుతున్నారు. బేవరేజెస్ మార్కెట్ షేర్లో అతిపెద్దదైన రెడీ టూ డ్రింక్ టీల్లో 90% వరకు వినియోగిస్తున్నారు. మిగతా స్వీటెనర్లతో పోలిస్తే ఆస్పర్టెమ్, అసెసల్ఫేమ్–కె అనే వాటి వాడకంతో క్యాన్సర్ ప్రమాదం కాస్త ఎక్కువేనంటూ గతేడాది ఫ్రాన్సులో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. -
కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే ఇది చదవండి
ఎండవేడి ఇంకా తగ్గడం లేదు. వర్షాకాలం మొదలైనా ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వేడి తట్టుకోలేక చాలామంది శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కూల్‌డ్రింక్స్‌ను ఇష్టపడుతుంటారు. ఇంటికి అతిథులు వచ్చినా, ఏదైనా నాన్‌వెజ్ వంటలు తిన్నా పక్కన కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే అనేంతలా లాగిస్తుంటారు. అయితే ఇలా కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ► కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ► కూల్‌డ్రింక్స్‌లో ఎక్కవ మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దీనిల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తాగితే ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ► శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే గుండె, డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లయితే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ► మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం. ► కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయి. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ► కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొత్తానికి కూల్‌డ్రింక్స్ వల్ల శరీరానికి మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. -
ఉడాన్‌లో విక్రయానికి సిద్దమైన కాంపా డ్రింక్స్ - మరో రెండు నెలల్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ పోర్టల్ ఉడాన్ తాజాగా రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న కాంపా పానీయాలను ఉడాన్ విక్రయించనుంది. తొలుత 50,000 పైచిలుకు రిటైలర్లు, కిరాణా స్టోర్లలో కాంపా ఉత్పత్తులు లభిస్తాయి. వచ్చే రెండు నెలల్లో ఈ కేంద్రాల సంఖ్యను 1 లక్షకు చేరుస్తారు. ప్రాజెక్ట్ విస్తార్లో భాగంగా 3,000 వరకు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను ఉడాన్ చేరవేస్తోంది. 2022లో 1.5 లక్షల టన్నుల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్టు వెల్లడించింది. -
రిలయన్స్ కిట్టీలో సోస్యో డ్రింక్
కార్బొనేటెడ్ పానీయాల కంపెనీ సోస్యో హజూరీ బెవరేజెస్‌లో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ గుజరాత్ కంపెనీలో మిగిలిన 50 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు హజూరీ కుటుంబం కలిగి ఉంటుందని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. తాజా కొనుగోలుతో పానీయాల విభాగం మరింత బలపడనున్నట్లు రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ పేర్కొంది. శత వసంతాల పురాతన కంపెనీ సోస్యో కార్బొనేటెడ్ పానీయాలు, జ్యూస్‌ల తయారీలో ఉంది. కాగా.. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ సుప్రసిద్ధ బ్రాండ్ క్యాంపాకోలాను సొంతం చేసుకోవడం తెలిసిందే. 1923లోనే..: సోస్యో హజూరీ బెవరేజెస్‌ను 1923లో అబ్బాస్ అబ్దుల్రహీమ్ హజూరీ ఏర్పాటు చేశారు. గుజరాత్లో తయారీ యూనిట్ ఉంది. ప్రధాన బ్రాండ్ సోస్యో పేరుతో గుజరాత్‌తోపాటు పొరుగు రాష్ట్రాలలోనూ పానీయాలు విక్రయిస్తోంది. పానీయాలను యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా స్థానిక హెరిటేజ్ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడంతోపాటు.. వృద్ధి అవకాశాలకు తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో! -
రెండేళ్లలో ఆ టార్గెట్‌ని చేరుకుంటాం: కోకా–కోలా
వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని ‘మాజా’ సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. చదవండి: అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే -
Health Tips: డైట్ సోడా తాగినా.. ప్రమాదంలో పడ్డట్లే! ప్రాణాంతక వ్యాధులు..
చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అందులోనూ సోడా ఉండే వాటిని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు. వేసవికాలం, చలికాలం అనే సంబంధం లేకుండా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల కన్నా... ఆరోగ్య సమస్యలే ఎక్కువ. కూల్ డ్రింకులు, సోడాలు, చక్కెర పానీయాలు తాగడం వల్ల మధుమేహం,ఊబకాయం, కొవ్వు పెరిగి కాలేయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు సోడాకు బదులు డైట్ సోడా తాగితే ఆరోగ్యంపై అంతగా ప్రభావం ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ, మెటబాలిక్ సిండ్రోమ్, అలాగే స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మరి కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా వినియోగం కూడా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే విధంగా.. రసాయనాలు కలిసిన కూల్డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. -
సార్.. నన్ను చదివించండి!
నవాబుపేట: మండలంలోని మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ అమ్ము తున్న ఓ బాలుడిని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్‌కు చెందిన మల్లెల బుజ్జమ్మ, వెంకటేష్ దంపతుల కుమారుడు విజయ్‌కుమార్ స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రతి ఆదివారం మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ అమ్ముతుంటాడు. ఆదివారం అమ్ముతుండగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అలా వెళుతున్న మంత్రి బాలుడిని చూసి పలకరించాడు. ‘ఏం చదువుతున్నావ్?’అనగానే మంత్రి చేయి పట్టుకుని ‘సార్! నేను చదువుకుంటా.. నన్ను చదివించండి. ప్లీజ్’అంటూ విలపించాడు. వెంటనే బాలుని పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని భరోసానిచ్చారు. బాలుడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలలో బాలుడిని చేర్పించి, అక్కడే హాస్టల్ వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. తమ కొడుకుపై మంత్రి చూపిన ఔదార్యాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
శీతల పానీయాల మోజులో పడి.. వేసవిలో ఇవి తాగడం మరవకండి..!
మండే ఎండల్లో శరీరానికి వేడి చేయకుండా చల్లదనాన్ని అదించే వివిధ రకాల జావలను మన పూర్వికులనుంచి తాగుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో రకరకాల శీతలపానీయాలకు అలవాటు పడి జావలు తాగడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అయితే మన వంటింట్లో దొరికే కొన్ని రకాల పిండి దినుసులతో జావచేసుకోని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందడంతోపాటు, శరీరానికి హాని చేసే వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. నిమిషాల వ్యవధిలో ఎంతో రుచికరమైన జావలను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... జొన్నగటక కావలసినవి: జొన్నపిండి – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, అల్లం – అంగుళం ముక్క(తురుముకోవాలి) మజ్జిగ – కప్పు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, క్యారట్ తురుము – పావు కప్పు. తయారీ: ముందుగా జొన్నపిండిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లుపోసుకుని ఉండలు లేకుండా గరిటజారుగా కలపి పక్కనపెట్టుకోవాలి జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద రెండు కప్పుల నీళ్లను వేడిచేయాలి. నీళ్లు బాగా మరిగినప్పుడు కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని నీళ్లలో వేసి తిప్పుతూ ఉడికించాలి. జొన్నపిండి మిశ్రమాన్ని సన్నని మంట మీద బాగా ఉడికిస్తూ..పిండి మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం తురుము వేసి స్టవ్ మీద నుంచి దించేయాలి. ఈ జావ చల్లారాక మజ్జిగ, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము వేసి సర్వ్ చేసుకోవాలి. ఈ జావ తాగితే శరీరం చల్లబడడమేగాక, బరువు తగ్గాలనుకునే వారు బరువు కూడా తగ్గుతారు. దీనిలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. బనాన మాల్ట్ కావలసినవి: ఓట్స్ – అరకప్పు, పాలు – మూడు కప్పులు, దాల్చిన చెక్క పొడి – టీస్పూను, అరటి పండు – ఒకటి, తెనే – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ ముందుగా జావకాచే పాత్రలో ఓట్స్, పాలు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ∙ తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించిన తరువాత దాల్చిన చెక్కపొడి వేయాలి. మిశ్రమం దగ్గర పడ్డప్పుడు.. చిదుముకున్న అరటి పండు, తెనే వేసి కలిపితే అరటి జావ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇది చాలా బావుంటుంది. ∙జావ మరీ మందంగా అనిపిస్తే నీళ్లు కలుపుకోవచ్చు. బార్లీ కావలసినవి: బార్లీ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు – ఐదు కప్పులు, ఉప్పు – చిటికెడు, పంచదార – పావు కప్పు, పాలు – రెండు కప్పులు. తయారీ: ముందుగా బార్లీగింజలను దోరగా వేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. మందపాటి పాత్రలో ఐదు కప్పుల నీళ్లుపోసి మరిగించాలి ∙నీళ్లు మరిగేటప్పుడు బార్లీ పొడిని నీటిలో వేసి గరిటజారుడుగా కలుపుకోవాలి ∙ మరుగుతున్న నీటిలో ఈ గరిటజారుడు పిండిని వేసి తిప్పుతూ ఉడికించాలి. ఐదునిమిషాల తరువాత ఉప్పు, పంచదార, పాలు వేసి ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడిన తరువాత స్టవ్‌మీద నుంచి దించేసి సర్వ్‌చేసుకోవాలి. ఓట్స్ కావలసినవి: ఓట్స్ – కప్పున్నర‡ క్యారట్ ముక్కలు – అరకప్పు, బంగాళ దుంప ముక్కలు – అరకప్పు, పచ్చిబఠాణి – అరకప్పు, మిరియాల పొడి – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా తయారీ: ∙ ముందుగా ఓట్స్‌ను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి వేయించిన ఓట్స్‌లో బంగాళ దుంప ముక్కలు, పచ్చిబఠాణి, క్యారట్ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు,నాలుగు కప్పులు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి ∙ ముక్కలన్ని ఉడికి మిశ్రమం దగ్గర పడినప్పుడు ఉప్పు, మిరియాలపొడి వేసి దించేస్తే ఓట్స్ జావ రెడీ. మల్టీగ్రెయిన్ కావలసినవి: మల్టీ గ్రెయిన్స్ పొడి – నాలుగు టేబుల్ స్పూన్లు( జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు, సిరిధాన్యాలు, బాదం పప్పు, అవిసె గింజలను తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి), బియ్యం – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మజ్జిగ – నాలుగు గ్లాసులు తయారీ: ∙ గిన్నెలో నాలుగు గ్లాసులు నీళ్లు బియ్యం పోసి మరిగించాలి. ∙నాలుగు టేబుల్ స్పూన్ల మల్టీగ్రెయిన్ పొడిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపి పెట్టుకోవాలి. ∙ నీళ్లు మరిగిన తరువాత కలిపిపెట్టుకున్న మల్టీ గ్రెయిన్ పొడి వేయాలి. ∙ ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి. ∙చల్లారాక మజ్జిగ వేసి సర్వ్ చేసుకోవాలి. రాగి కావలసినవి: రాగి పిండి – మూడు టేబుల్ స్పూన్లు, నీళ్లు రెండు కప్పులు, మజ్జిగ – ఒకటిన్నర కప్పులు, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి) పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు – ఒక రెమ్మ. తయారీ: ∙ రాగిపిండిలో కొద్దిగా నీళ్లుపోసి ఉండలు లేకుండా కలపుకోవాలి ∙స్టవ్ మీద గిన్నె పెట్టి కప్పున్నర నీళ్లుపోసి మరిగించాలి ∙ నీళ్లు మరిగేటప్పుడు కలిపి పెట్టుకున్న రాగిపిండి వేసి కలపాలి ఐదు నిమిషాలు ఉడికాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి. ∙ చల్లారకా సర్వ్ చేసుకుంటే రాగి జావ ఎంతో రుచిగా ఉంటుంది. సగ్గుజావ కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, నీళ్లు – ఆరు కప్పులు, మజ్జిగ – రెండు గ్లాసులు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ∙ ముందుగా సగ్గుబియ్యాన్ని రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి నీటిని వంచేయాలి ∙సగ్గుబియ్యం మునిగే అన్ని నీళ్లుపోసి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాలి జావతయారు చేసుకోవడానికి మందపాటి పాత్ర తీసుకుని ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగాక నానిన సగ్గుబియ్యాన్ని వడగట్టి వేడినీటిలో వేసి మూతపెట్టకుండా సన్నని మంటమీద ఉడికించుకోవాలి ∙మధ్య మధ్యలో తిప్పుతుండాలి సగ్గుబియ్యం ఉడికిన తరువాత స్టవ్ మీద నుంచి దించేసి చల్లారనివ్వాలి. ∙ సగ్గుబియ్యం జావ పూర్తిగా చల్లారిన తరువాతే జావలో మజ్జిగ పోసి కలపాలి.(జావ వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ పోస్తే మజ్జిగ విరిగిపోతాయి) ∙మజ్జిగ కలిపాక రుచికి సరిపడా ఉప్పు వేసి సర్వ్ చేసుకోవాలి. ∙ ఈ జావ తాగడం వల్ల ఒంట్లోని వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది ∙ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో నిల్వచేసుకోని రోజూ కొద్దిగా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. రవ్వ జావ కావలసినవి: ఆయిల్ – టేబుల్ స్పూను, సన్నని గోధుమ రవ్వ – కప్పు, బాదం పాలు – రెండున్నర కప్పులు, యాలకులపొడి – ముప్పావు టీస్పూను, డ్రైఫ్రూట్స్ పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, పంచదార – పావు కప్పు, కిస్మిస్లు – టేబుల్ స్పూను, పిస్తా, కుంకుమ పువ్వు – గార్నిష్‌కు సరిపడా. తయారీ:∙ ముందుగా వేడెక్కిన బాణలిలో ఆయిల్ వేయాలి. దీనిలో గోధుమ రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ∙ రవ్వ వేగాక బాదంపాలు, యాలకులపొడి, డ్రైఫ్రూట్స్ వేసి ఉడికించాలి రవ్వ దాదాపు ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించాలి. ∙ పదినిమిషాల తరువాత ఉడికిన మిశ్రమంపై పిస్తా, కుంకుమ పువ్వు చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. -
యువకుడి ప్రాణం తీసిన చిప్స్?
తిరువొత్తియూరు(చెన్నై): చిప్స్ తిని కూల్‌డ్రింక్స్ తాగిన యువకుడు కొద్ది సమయానికే ఊపిరాడక మృతి చెందాడు. వివరాలు.. పొల్లాచ్చికి చెందిన సతీష్ (25). చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను చెన్నై ఈస్టుకోస్టు ఆలయానికి స్నేహితులతో కలసి వెళ్లి.. అక్కడ ఓ దుకాణంలో చిప్స్, కూల్‌డ్రింక్స్ తీసుకుని తరువాత సముద్రతీరంలో వెళ్లాడు. అక్కడ కూర్చొని చిప్స్ తింటూ కూల్‌డ్రింక్స్ తాగాడు. కొద్ది సమయానికే గొంతులో సమస్యగా ఉందంటూ సతీష్ పడిపోవడంతో.. స్నేహితులు అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. చదవండి: ఆన్లైన్ పరిచయం.. అసభ్యకర వీడియోలను అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో.. -
Summer Tips: మితిమీరి ఐస్‌క్రీములు తింటే.. ఇక అంతే!
వేసవిలో ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకుల కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. ఇవన్నీ ఎండ ధాటి నుంచి తక్షణ ఉపశమనం కలిగించవచ్చునేమో గాని, దీర్ఘకాలంలో వీటివల్ల రకరకాల అనర్థాలు, ఆరోగ్య సమస్యలు తప్పవు. మితిమీరి ఐస్‌క్రీములు తింటే దీర్ఘకాలంలో స్థూలకాయం, మధుమేహం వంటివి తప్పవు. వీటికి తోడు రసాయనాలు కలిసిన కూల్డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల వేసవిని చల్లగా గట్టెక్కేయాలంటే చక్కగా మన పెద్దలు చెప్పిన మార్గాన్నే అనుసరించడం ఎంతైనా క్షేమం. ‘పెద్దలమాట చద్దిమూట’ అని ఊరకే అనలేదుగా మరి! అసలు వేసవిలో చద్దన్నానిదే అగ్రస్థానం. వేసవిలో ఉదయంపూట వేడివేడిగా తినే నానా రకాల అల్పాహారాల కంటే చల్లగా చద్దన్నం తినడమే శ్రేష్ఠం. భారత ఉపఖండంలోను, దక్షిణాసియా దేశాల్లోను చద్దన్నం తినడం తరతరాల అలవాటు. వేర్వేరు ప్రాంతాల్లో చద్దన్నాన్ని వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు. ఇందులోనే చిన్న చిన్న మార్పులతో రకరకాల రుచులను తయారు చేసుకుంటారు. తమ తమ స్థానిక వంటకాలను ఇందులో నంజుకుంటారు. ఇక వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరినీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలను సేవించడం దేశవ్యాప్తంగా చిరకాలంగా ఉన్న అలవాటే. కాబట్టి ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్ జోలికి పోకుండా ఎంచక్కా వీటితో ఆరోగ్యకర రీతిలోనే భానుడి ప్రతాపం నుంచి విముక్తి పొందండి. చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే -
విటమిన్ ’సి’తో అది కలిసి క్యాన్సర్ కారకంగా మారుతుంది.. వీటికి దూరం మేలు!
వేసవి రాబోతోంది. ఇక కూల్‌డ్రింక్స్ తాగడమనే అలవాటు పెరుగుతుంది. ఇటు పిల్లలూ, అటు పెద్దలూ హానికరమైన ఈ శీతలపానీయాలవైపు మొగ్గుతారు. వీటిల్లో చక్కెర మోతాదులు చాలా ఎక్కువ. అందుకే పిల్లల్లో ఊబకాయానికి, ఫలితంగా భవిష్యత్తు లో డయాబెటిస్ రిస్క్‌కి అవకాశాలు ఎక్కువ. అలాగే అందులోని ఫాస్ఫారిక్ యాసిడ్, దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతీస్తుంది. క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుందని, దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే దాఖలాలూ ఉన్నాయి. కృత్రిమ రంగులు కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతాయి. నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలైన సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటివి పిల్లల్లో అతిధోరణులకు కారణమవుతాయి. సోడియం బెంజోయేట్ విటమిన్ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుంది. ఇన్ని అనర్థాలు ఉన్నందున ముందునుంచే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం ఈ వేసవికే కాదు... ఎప్పుడూ మేలు. చదవండి: (Beauty Tips: పెదాలను సెలైవాతో తడిచేస్తున్నారా .. అందులోని ఎంజైమ్స్ వల్ల!) -
అడ్డగోలు దోపిడీ.. ప్రేక్షకులపై తిను‘బండ’రాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోతమోగుతున్నాయి. సినిమా టికెట్టుకంటే స్నాక్స్, పాప్‌కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలే అధికం. విజయవాడలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లు వెరసి 46 వరకు ఉన్నాయి. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. చదవండి: Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు ఏ క్లాస్‌కు వెళ్లిన వారి కైనా ఒకటే బాదుడు. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు పది నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఆ సమయంలో క్యాంటీన్లకు వచ్చి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ కొనుగోలు చేయడం రివాజు. కుటుంబ సమేతంగా వెళ్లిన వారు పిల్లలకు తినుబండారాలు కొనివ్వక తప్పదు. లేదంటే వారు మారం చేస్తారు. క్యాంటీన్లలో విక్రయించే ధరలు బయట దొరికే రేట్లకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ధర మార్కెట్లో రూ.14 (గాజు బాటిల్), రూ.20 (ప్లాస్టిక్ బాటిల్) ఉండగా థియేటర్లలో రూ.60 నుంచి 79 వరకు వసూలు చేస్తున్నారు. బయట రూ.30కి దొరికే 150 గ్రాముల పాప్‌కార్న్ రూ.180, రూ.20 విలువచేసే స్వీట్‌కార్న్ రూ.60, రూ.20కే దొరికే ఐస్క్రీంను రూ.50కి, రూ.20ల కేక్, పఫ్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.10లకే దొరికే టీ సినిమా హాళ్ల క్యాంటీన్లలో కొన్నిచోట్ల రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో టీ, కాఫీ, లెమన్ టీలు ఏదైనా రూ.50 చొప్పున పిండుతున్నారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో నాలుగైదు రెట్ల అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ‘ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం’ అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్‌ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతోంది. మామూలు థియేటర్ టికెట్టు ధర రూ.100 ఉంటే నలుగురికి రూ.400 అవుతుంది. థియేటర్లో తినుబండారాలకు పొదుపుగా ఖర్చు చేస్తే మరో రూ.600 అయినా వెచ్చించక తప్పదు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రాను, పోను ఖర్చులు కాకుండా రూ.వెయ్యి భారం పడుతోంది. -
ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?
సాక్షి, చెన్నై: ఆహారంలో తీసుకున్న చికెన్ గ్రేవీ, శీతల పానీయం విషతుల్యమై కుమార్తెతో సహా తల్లి కుమార్తె విగతజీవులయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలోని తంగప్ప నగర్‌కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్లో చికెన్ గ్రేవిని బుధవారం కొన్నారు. మధ్యాహ్నం భోజనంలో ఆ చికెన్ గ్రేవీని కుమార్తె దర్శిని(4)తో పాటు కర్పగం తీసుకున్నారు. అజీర్ణం సమస్య తలెత్తడంతో మరో దుకాణంలో ఓ శీతలపానీయం బాటిల్ తీసుకొచ్చి తల్లి, కుమార్తె తాగారు. కొంతసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వీరి మరణానికి చికెన్ గ్రేవీ లేదా శీతల పానీయం కారణం కావొచ్చని మృతుల బంధువులు ఫిర్యా దు చేయడంతో కోవిల్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) -
కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? జర జాగ్రత్త
కూల్‌డ్రింక్స్ తాగితే లావెక్కుతారని చాలా కాలంగా తెలుసు. అందుకే వాటిని జంక్‌ఫుడ్ జాబితాలో చేర్చారు. అయితే ఎందుకు అలా జరుగుతుందన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. అమెరికాకు చెందిన వీల్ కార్నెల్ మెడిసన్ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని పూరించారు. కూల్‌డ్రింక్స్‌తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ (హెచ్‌ఎఫ్‌సీఎస్) వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతోందని, ఇదే అనారోగ్య హేతువు అవుతోందని వారు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. హెచ్ఎఫ్సీఎస్లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులు జరిగేందుకు కారణమవుతోందని, ఫలితంగా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరి లావెక్కుతున్నారని వారు చెబుతున్నారు. చదవండి: సూపర్ కెపాసిటర్! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు ఈ రకమైన చక్కెరలను అధికంగా తీసుకుంటే ఆహారంలోని కొవ్వును ఎక్కువగా శోషించుకునే పరిస్థితి వస్తుందని వివరించారు. 2019లో పేగు కేన్సర్‌పై జరిగిన ఒక పరిశోధన ఫ్రక్టోస్ కాస్తా కేన్సర్ కణితి పెరుగుదలకు దోహదపడుతుందని తేలడంతో దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునేందుకు తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగానే చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్ ప్రభావాన్ని పరిశీలించారు. చిన్నపేగుల్లో వెంట్రుకలను పోలినట్లు ఉండే కోట్లాది నిర్మాణాలైన ‘విల్లీ‘లు పోషకాలను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంటాయి. ఎలుకలకు హెచ్ఎఫ్సీఎస్లు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40 శాతం వరకూ పెరగడమే కాకుండా.. బరువు కూడా ఎక్కువైనట్లు తేలింది. కణాల్లో ఫ్రక్టోస్–1–ఫాస్పేట్ ఎక్కువగా పేరుకుపోతుండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త శామ్యూల్ టేలర్ తెలిపారు. -
మొన్న చాక్ లెట్లు ... తాజాగా కూల్ డ్రింక్స్ పడేసిన వైనం
-
కూల్‌డ్రింక్స్ తాగితే.. శరీరం చల్లబడుతుందా?
చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్‌తో క్యాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే పరిశోధనల నివేదికలు ఉన్నాయి. పైగా కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసింది. చదవండి: నాకు ఫిట్స్, ప్రయత్నిస్తే సమస్యలొస్తాయా? -
కూల్‌డ్రింక్స్‌తో శరీరం చల్లబడుతుందా?
చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్‌తో క్యాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే పరిశోధనల నివేదికలు ఉన్నాయి. పైగా కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసింది. -
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా.. దుష్ప్రభావాలు తెలుసా?
ఆరోగ్యంపై స్పృహ పెరిగాక ఆహారంపైనా అదే స్థాయిలో జాగ్రత్త మొదలైంది. ఫలితంగా ఏ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి? ఏ పానీయంలో ఎంత సుగర్ శాతం ఉంది? లాంటి తదితర వాటినీ గమనించడం మొదలైంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు వివిధ ఆహార ఉత్పత్తుల, పానీయాల సంస్థలు రంగంలోకి దిగాయి. కూల్‌డ్రింక్స్ స్థానంలో ఎనర్జీ డ్రింకులు, డైట్ డ్రింక్‌లు మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. కూల్ డ్రింక్స్‌తో ఉండే నష్టాలు వీటితో ఉండవనే వాదనలు బయలుదేరాయి. వీటితో తక్షణ శక్తి వస్తుందని, బరువు తగ్గుతారని, డయాబెటిక్ పేషెంట్లు నిర్భయంగా తాగవచ్చని.. అనేక పుకార్లు వీటి చుట్టూ హల్చల్ చేస్తున్నాయి. అసలు నిజంగా ఈ పానీయాలు మేలు చేస్తాయా? వీటితో నిజంగానే ఏ సమస్యలు ఉండవా? చూద్దాం. 1950 నుంచే... నిజానికి డైట్ డ్రింక్స్‌కు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోన్నప్పటికీ వాస్తవానికి వీటి ఉనికి 1950 నుంచే ఉంది. అప్పట్లో వీటిని మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఇవి బరువు తగ్గడం కోసం, చక్కెర శాతం తక్కువ తీసుకోవాలనుకునేవారి కోసం రూపొందించినట్లు ప్రచారంలోకి వచ్చింది. డైట్ డ్రింక్స్‌ను కార్బొనేటేడ్ వాటర్, స్వీట్నర్ (కృత్రిమ తీపి పదార్థం), రంగులు, ఫ్లేవర్స్ తదితర వాటిని ఉపయోగించి చేస్తారు. డైట్ డ్రింక్స్‌లో కేలరీలు ఉండవు. 354 ఎంఎల్ డైట్ సోడా క్యాన్(డబ్బా)లో కేలరీలు, చక్కెర, ప్రొటీన్ శాతం జీరో. 40 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే ఉంటుంది. అయితే, కృత్రిమ తీపిపదార్థంతో చేసే అన్ని డైట్ డ్రింక్‌లూ కేలరీలు లేనివి, సుగర్ ఫ్రీ అయినవీ కాదు. కొన్నింటిలో కొంచెం చక్కెర, మరికొంత స్వీట్నర్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు కృత్రిమ తీపిపదార్థం స్టివియాతో తయారుచేసే ‘కోకా కోలా లైఫ్’ డైట్ సోడాలో 24 గ్రాముల చక్కెర కూడా ఉంటుంది. అంటే బ్రాండ్‌ను బట్టి డైట్ డ్రింక్స్‌లోనూ తేడాలుంటాయి. అయితే, అన్నింటిలోనూ సర్వసాధారణంగా ఉండేవి మాత్రం కార్బొనేటెడ్ నీరు, స్వీట్నర్స్, యాసిడ్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, విటమిన్స్, మినరల్స్, కెఫైన్. బరువు తగ్గడం నిజమేనా? డైట్ డ్రింక్స్‌లో కేలరీల శాతం సున్నా అని చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం సహజంగానే ఇది బరువు తగ్గడంలో తోడ్పడుతుందని ప్రచారంలోకి వచ్చింది. అయితే, దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. డైట్ డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, ఊబకాయం ముప్పు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డైట్ డ్రింక్‌లోని స్వీట్నర్ ప్రభావం వల్ల మెదడులోని డోపమైన్ స్పందనలు మారడం, అలాగే ఆకలి హార్మోన్ల సంఖ్య వృద్ధి చెందడం దీనికి కారణమంటు న్నాయి. ముఖ్యంగా కేలరీలు లేని డైట్ డ్రింక్స్ తాగడం వల్ల అధిక స్థాయిలో తీపి, కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడంపై ధ్యాస ఎక్కువవుతుందని, ఆ ప్రకారం ఇది బరువు పెరగడం, ఊబకాయానికి దారి తీస్తుందని వివరిస్తున్నాయి. మరొక అధ్యయనం ఏం చెబుతోందంటే సాధారణంగా మద్యం విపరీతంగా సేవించే వారు, చెడు అలవాట్లు ఉన్నవారు ఎక్కువగా డైట్ సోడాలను తాగుతుంటారు. ఆ కారణంగానే డైట్ సోడాకు, బరువు పెరగడానికి మధ్య పరస్పర సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంటోంది. అయితే, ఇవన్నీ పరిశీలనాత్మక అధ్యయనాలే. ప్రయోగాత్మకం కాదు. వాస్తవానికి సాధారణ డ్రింక్స్‌తో పోలిస్తే డైట్ సోడాల వల్ల బరువు తగ్గినట్లు కొన్ని పరిశోధనలు తేల్చాయి. కానీ, ఈ పరిశోధనలను డైట్ డ్రింక్స్ తయారీ కంపెనీలు ప్రభావితం చేస్తున్నాయనేది ఆరోపణ మధుమేహం, హృద్రోగాలకు అవకాశం? డైట్ డ్రింక్స్‌లో కేలరీలు, షుగర్, ఫ్యాట్ లేనప్పటికీ దీన్ని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, హృద్రోగాలు వస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి ఒక అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం ఒక డైట్ సోడా తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు 8 నుంచి 13శాతం మేర అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే రోజూ కనీసం ఒక బాటిల్ డైట్ డ్రింక్ తాగే 64,850 మంది మహిళల్లో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం ఉన్నట్లు మరొక పరిశోధన చెప్పింది. అయితే, సాధారణ డ్రింక్స్‌తో పోలిస్తే ఈ ప్రమాదం సగమే కావడం గమనార్హం. తాజాగా వెల్లడైన మరొక అధ్యయనం డైట్ డ్రింక్స్‌కు మధుమేహానికి సంబంధం లేదంటోంది. ఇక డైట్ డ్రింక్స్‌పై ఉన్న మరో ప్రచారం.. ఇవి బీపీ పెరగడానికి, హృద్రోగాలకు కారణం. రోజూ డైట్ డ్రింక్స్ తాగే వారిలో హైబీపీ రావడానికి 9శాతం అవకాశం ఉన్నట్లు కొన్ని పరిశోధనలు తేల్చాయి. దీనికి తోడు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని మరొక పరిశోధన పేర్కొంది. అయితే ముందు చెప్పుకున్నట్లు ఇవన్నీ పరిశీలనాత్మక అధ్యయనాలే. నిజానికి డైట్ సోడా తాగడానికి బీపీ పెరగడానికి, గుండెపోటుకు మధ్య సంబంధం ప్రయోగాత్మకంగా కనుగొనలేదు. అలా ఆరంభం బరువు పెరిగితే సమస్యలు పెరుగుతాయన్న స్పృహ పెరిగాక ‘డైట్’ సంబంధ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తాయి. వీటిలో డైట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారని, మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలని.. ఇలా రకరకాల వాదనలు బయలుదేరాయి. మరి ఇవన్నీ నిజమేనా? కొంతవరకే అంటున్నారు నిపుణులు. మార్కెట్లో దొరికే వివిధ రకాల సాధారణ సాఫ్ట్ డ్రింక్స్ (శీతల పానీయాలు)కు మరో రూపమే ఈ డైట్ డ్రింక్స్. వీటినే అమెరికాలో డైట్ సోడాలుగానూ వ్యవహరిస్తారు. సాఫ్ట్ డ్రింక్స్ (కోక్, పెప్సి..)ల తయారీలో కొద్ది మేర చక్కెర వాడతారు. అయితే, దీనికి బదులు కృత్రిమ తీపి పదార్థాలైన ఆస్పర్టమ్, సిక్లమేట్స్, శాచరిన్, ఎసెసుల్ఫేమ్కె, సుక్రలోజ్ వంటి వాటిని ఉపయోగించే తయారు చేసేవే డైట్ డ్రింక్స్. ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే డైట్ కోక్, కోక్ జీరో, పెప్సి మాక్స్, స్పైట్ జీరో వంటివి ఇలాంటివే. కొన్నింటిపై ‘డైట్’కు బదులు ‘లైట్’ అని కూడా ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్యలు కూడా.. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి డైట్ డ్రింక్స్‌కు మధ్య సంబంధం ఉందని మరో వాదన ప్రచారంలో ఉంది. ఇది నిజమో కాదో తేల్చేందుకు 15,368 మందిపై ఒక అధ్యయనం జరిగింది. వీరిలో సగం మంది రోజూ కనీసం ఒక గ్లాస్ డైట్ డ్రింక్ తాగేవారు కాగా, మిగిలిన వారు వారానికి ఒకసారి ఒక డైట్ డ్రింక్స్ తాగేవాళ్లు. ఇందులో వారానికి ఒకసారి తాగేవారితో పోలిస్తే రోజూ తాగేవారికి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం రెట్టింపు ఉన్నట్లు తేలింది. డైట్ డ్రింక్స్‌లో అధిక స్థాయిలో ఉన్న భాస్పరం.. మూత్రపిండాల్లో ఆమ్ల శాతం పెరిగేందుకు తోడ్పడుతోందని, ఫలితంగా కిడ్నీపై దుష్ప్రభావం చూపుతోందని కనుగొన్నారు. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికీ ఇదే కారణమంటున్నారు. మరికొన్ని దుష్ప్రభావాలు.. గర్భిణులు డైట్ డ్రింక్స్ తీసుకోవడం కొన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ముందస్తు ప్రసవం, శిశువుల్లో ఊబకాయం ఇందులో ప్రధానమైనవని చెబుతున్నారు. డైట్ డ్రింక్స్ తీసుకోవడం వలన కాలేయం చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. డైట్ డ్రింక్స్‌తో కేన్సర్ వచ్చే అవకాశం ఉందనడానికి ఆధారాలు లేవని మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. డైట్ డ్రింక్స్‌లోని మలిక్, క్రిటిక్, పాస్పరిక్ ఆమ్లాల కారణంగా దంత సమస్యలు వస్తున్నట్లు కొన్నింటిలో తేలింది. రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డైట్ డ్రింక్స్ తాగేవారు ఒత్తిడికి గురవుతున్నట్లు మరికొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంపై డైట్ డ్రింక్స్ ప్రభావం గురించి వెలువడిన చాలా అధ్యయనాలు పరస్పరం విభిన్నంగా ఉన్నాయి. కారణం.. ఇవన్నీ కేవలం పరిశీలనాత్మకమైనవే. ప్రయోగాత్మకమైనవి కావు. అందువల్ల డైట్ డ్రింక్స్ కచ్చితమైన దుష్ప్రభావాలు తెలియాలంటే సరైన ప్రయోగాత్మక పరిశోధనలు అవసరం. వీటిని బట్టి చివరగా గ్రహించాల్సింది ఏంటంటే రెగ్యులర్ సాఫ్ట్ డ్రింక్స్ కంటే డైట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలేమీ ఉండవు. దీనికి బదులు పాలు, కాఫీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, పండ్ల రసాలు తీసుకోవడం అత్యుత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
నిస్వార్థమెంత గొప్పదో..
-
లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు
సాక్షి, విశాఖపట్నం : ఆమె సేవ డీజీపీని కదిలించింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్నారైలు స్పందించారు. మరిన్ని సేవాకార్యక్రమాలు కొనసాగించేలా ఆర్థికసాయం అందించారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో ఆయాగా పనిచేస్తున్న లోకమణి ఈనెల 15న వేతనం తీసుకుని ఇంటికి వెళ్తూ పాయకరావుపేట వై జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెండు డ్రింక్ బాటిళ్లు కొనిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి : మనసున్న మహిళకు డీజీపీ అభినందనలు) ఇది సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. డీజీపీ ప్రసంశలు అందుకోవడమే కాకుండా, కళాశాల యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ రెండు ఘటనలు చూసిన ఎన్నారైలు స్పందించారు. కాలిఫోర్నియాకు చెందిన ఎన్నారై రూ.37 వేలు, మరో ఎన్నారై సత్యప్రకాష్ రూ.40 వేలు ఆర్థిక సాయం అందించారు. ఫోన్‌నంబరు తెలుసుకుని తనతో మాట్లాడి బ్యాంకు ఖాతాలో ఈ నగదు మొత్తాన్ని జమ చేసినట్లు లోకమణి తెలిపింది. -
లోకమణి అమ్మకు సెల్యూట్: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి : ఓ మంచి పని చేస్తే సమాజం గుర్తిస్తుంది. ఇప్పుడు విశాఖ జిల్లాలో ఓ మహిళకు అలాంటి గౌరవం దక్కింది. లాక్డౌన్ వేళ ఏపీలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు రోజుల క్రితం కూల్‌డ్రింక్స్ అందించిన మహిళను తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. వివరాళ్లోకి వెళితే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ తూర్పుగోదావరి సరిహద్దులో గత కొన్ని వారాలుగా పోలీస్ చెక్ పోస్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. అయితే అటుగా వెళ్తున్న లోకమణి అనే మహిళ.. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 2 కూల్ డ్రింక్ బాటిల్స్ అందించింది. ఎందుకు ఇస్తున్నారని అక్కడున్న ఇన్స్‌ప్టెక్టర్ ప్రశ్నించగా మీరు చేస్తున్న పనికి మా వంతు సహాయం సార్ అంటూ నవ్వింది. దీంతో ఊహించని అభిమానానికి ఆ పోలీసు అధికారి సంతోషంతో అమ్మ నీ నెల జీతం ఎంత. మాకు కూల్‌డ్రింక్‌లు ఇస్తున్నావు అని అన్నారు. (వైరల్ వీడియో: చిన్న జీతం.. పెద్ద మనసు) దానికి మహిళ స్పందిస్తూ.. ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నానని.. నెలకు 3500 రూపాయల వేతనం వస్తుందని చెప్పింది. దీంతో తక్కువ వేతనంతో జీవితం గడుపుతూ ఎంతో పెద్ద మనసుతో పోలీసులకు కూల్‌డ్రింక్ ఇస్తున్నారంటూ ఆమెను పోలీసులు అభినందించారు. అలాగే రెండు కూల్‌డ్రింక్‌లు ఆమెకిచ్చి పిల్లలకు ఇవ్వమని పోలీసు అధికారులు సూచించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అందరూ లోకమణిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్తా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వీడియోకాల్ ద్వారా ఆమెను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసులకు కూల్‌డ్రింక్స్ ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు చేసిన మంచి పనికి మేము దండం పెడుతున్నాం. మీ అమ్మతనం చూసి చలించిపోయాము. మీకు సెల్యూట్ చేస్తున్నాం. అంటూ లోకమణిని డీజీపీ ప్రశంసించారు. (మే 4 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం) -
పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి.. ఆపై తండ్రి కూడా
సాక్షి, మేడ్చల్( హైదరాబాద్) : కన్న తండ్రే కుమారుల పాలిట కాలయముౖడయ్యాడు. కుమారులకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాపించాడు. అనంతరం తానూ తాగాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మృతి చెందాడు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజబొల్లారం తండాలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని రోడామేస్త్రినగర్‌కు చెందిన సురేష్ దంపతులు రాజబొల్లారం తండాలో నివాసముంటున్నారు. సురేష్ భార్య మంజుల తల్లిదండ్రులు రాజబొల్లారంలోనే ఉంటున్నారు. వీరికి ప్రదీప్(7),ప్రణీత్(5)కుమారులున్నారు. మద్యానికి బానిసైన సురేష్ అత్తగారి ఇంట్లోనే ఉంటూ స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేస్తుండగా మంజుల కూడా కంపెనీలో పనిచేస్తోంది. సురేష్ ఆరు నెలల క్రితం అదే గ్రామంలోనే అద్దె ఇంట్లోకి మారాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన సురేష్ భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మంజుల నిద్రలో ఉన్న పిల్లలను వదిలేసి సమీపంలో ఉన్న తల్లి వద్దకు వెళ్లిపోయింది. కొద్ది సేపటికి మత్తులో ఉన్న సురేష్ కూల్‌డ్రింక్ తీసుకువచ్చి అందులో విష గుళికలు కలిపి పడుకున్న చిన్నారులకు తాపించి తాను కూడా తాగాడు. పిల్లల్ని తీసుకువచ్చి మంజుల దగ్గర వదిలిపెట్టి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. పిల్లలిద్దరూ పెద్దగా ఏడుస్తుండడం, గుళికల వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన మంజుల తన భర్తను నిలదీయగా విషయం చెప్పాడు. వారిని వెంటనే మెడిసిటి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్న కుమారుడు ప్రణీత్(5) మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రదీప్(7) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు ప్రదీప్‌కు నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి, సురేష్‌ను గా«ంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా భన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మంజుల పోలీసులను కోరింది. -
రోజూ మిల్క్ సెంటరే
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా గలగల పారే గోదావరి మీదుగా రాజమండ్రి చేరుకున్నవారు, మెయిన్ రోడ్లోకి ప్రవేశిస్తారు. నల్లమందు సందు చివరగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని అనుకుని చిన్న షాపు కనిపిస్తుంది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం చేతుల్లో రోజ్మిల్క్, సేమ్యా, కోవాలతో తయారయిన గ్లాసులు కనువిందు... కాదు కాదు... నోటికి విందు చేస్తుంటాయి. ఎక్కడెక్కడ నుంచో షాపింగుకి వచ్చినవారు తమ లిస్టులో విధిగా రోజ్‌మిల్క్‌ను చేర్చుతారు. ఒక్క గ్లాసుడు సేవించగానే షాపింగ్ అలసట పోయిందనుకుంటారు. ఇదీ కథ... గుబ్బా సింహాచలం రాజమండ్రి వాస్తవ్యులు. 1950 నాటికి రోజ్ మిల్క్ అంటే రాజమండ్రిలోనే కాదు, రాష్ట్రంలోనే ఎవరికీ తెలియదు. మంచి ప్రమాణాలతో కూడిన రోజ్ మిల్క్ తయారు చేసి, వినియోగదారులకు నిత్య విందు అందించాలన్న అభిలాష కలిగింది ఆయనకు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సింహాచలం నాటిన మొక్క ఇంతై, ఇంతింతై, మరియు తానంతై అన్నట్లుగా రోజ్ మిల్క్ వ్యాపారం వృద్ధి చెందింది. మూడు తరాలుగా ఆయన వారసులకు కల్పవృక్షంగా నిలబడుతోంది. నగరవాసులకు హాట్ ఫ్యావరేట్... కూల్ డ్రింక్ అనగానే కేవలం వేసవిలో మాత్రమే తీసుకునే పానీయం అనుకుంటారు. ఇక్కడకు వచ్చేవారికి ఋతువులు, కాలాలతో పని లేదు. ఏడాది పొడవునా ఈ ‘రోజ్ మిల్క్’ ప్రజలకు హాట్ ఫ్యావరేట్గానే ఉంటుంది. నిత్యం ఈ దుకాణం ముందు జనం గుంపులుగా చేరి, రోజ్మిల్క్ సేవించడం సర్వసాధారణం. రెండో తరం... గుబ్బా సింహాచలం తరువాత, 1982 నుంచి ఆయన కుమారులు రామచంద్రరావు, శ్రీనివాస్‌లు ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మూడో తరానికి చెందిన రామచంద్రరావు కుమారులు రిషిక్, వంశీలు కూడా ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు. ఇదే విజయ రహస్యం... రుచికరమైన రోజ్ మిల్క్ కోసం వీరు స్వంత డెయిరీని నిర్వహిస్తున్నారు. కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే అంత రుచి. ఈ పాలలో బాదం, సుగంధి (చలువ కోసం) కలుపుతారు. శుద్ధిచేసిన నీటితో తయారు చేసిన ఐస్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ రోజ్‌మిల్క్‌ను ఒక్కసారి రుచి చూస్తే, ఇక జన్మలో ఎవరూ వదిలిపెట్టరు. డయాబెటిక్ వారి కోసం ప్రత్యేకంగా సుగర్ ఫ్రీ రోజ్ మిల్క్‌ను తయారు చేస్తూ, వారిక్కూడా రుచి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎసెన్స్ సీసాలకు డిమాండ్... రాజమండ్రి రోజ్ మిల్క్‌కు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వరకు డిమాండ్ ఉంది. రాజమండ్రి రోజ్‌మిల్క్‌కు మాత్రం ఎక్కడా బ్రాంచీలు లేవు. ఎందరో సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైనది.. ‘దివిసీమ ఉప్పెన బాధితుల కోసం విరాళాలు సేకరించిన సమయంలో నాటి అగ్రనటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు నా చేతితో ఈ పానీయాన్ని అందించాను. ఇది నాకు గర్వకారణం. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా, బూరుగుపూడి వచ్చినప్పుడు ఈ పానీయాన్ని అందించాను. ఆ సమయంలో ఆయన కొద్దిపాటి అస్వస్థులుగా ఉన్నారు. ఈ రోజ్‌మిల్క్‌ను ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు. వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పాదయాత్రలో ధవళేశ్వరం వచ్చినప్పుడు, రోజ్ మిల్క్‌ను పంపాను. జమున, ఆలీ, అనంత్, రవితేజ, వినాయక్, రాజబాబు వంటి సినీ ప్రముఖులు మా రోజ్ మిల్క్‌ను రుచి చూశారు. ఏడు దశాబ్దాలుగా మా రోజ్ మిల్క్‌ను ఆస్వాదిస్తున్నావారూ ఉన్నారు. మాకు ఇంతకు మించిన తృప్తి వేరే ఏముంటుంది? – గుబ్బా రామచంద్రరావు (సింహాచలం కుమారుడు) -
చల్లగా దాడిచేస్తాయ్...!
విజయనగరం మున్సిపాలిటీ: వేసవి వచ్చేసింది. వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు 35–40 డిగ్రీల మార్కు మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఔషధాలు వాడుతున్నవారు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు, కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటితో ముప్పు ♦ ఆస్తమా, బ్రాంకైటీస్, ఇస్నోఫీలియా బాధితులు అప్రమత్తంగా ఉండాలి. బాగా చల్లని పదా ర్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకుపోయే ట్యూబ్‌లు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. వీరు ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాల జోలికి సైతం వెళ్లొద్దు. ♦ చిన్నపిల్లలు, వద్ధులు అదే పనిగా చల్లని ద్రవాలు, రోడ్డు పక్కన దొరికేవి తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులకు కారణమవుతాయి. సరైన ఐస్‌ను ఉపయోగించకపోవడం ఒక కారణమైతే... వీటిని అమ్మే వారు శుభ్రత పాటించకపోవడం.. రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి వీటిపై పడటం మరో కారణం. ♦ తొలుత గొంతు నొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. తర్వాత గొంతు బొంగురుపోవడం, కఫం పట్టడం, దగ్గు, జలుబుతోపాటు తీవ్ర జ్వరం వస్తుంది. ఆస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్నవారు.. కిడ్నీ, సుగర్, లివర్, సీవోపీడీ సమస్యలున్నవారిలో న్యూమెనియాకు దారి తీస్తుంది. ♦ చిన్నపిల్లల్లో దీర్ఘకాలిక దగ్గు, పొడిదగ్గు, ఆయాసం, కఫం పట్టడం, ఛాతి బిగుసుకుపోయి ఆస్తమా కింద మారుతుంది. ♦ ఏసీల ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. దీర్ఘకాలిక రోగాలకు మందులువాడుతుంటే... ♦ అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక సమస్యలకు వాడే మందుల కారణంగా చెమట తక్కువగా వస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యత ఉండదు. ఫలితంగా ఎండలోకి వచ్చినప్పుడు త్వరగా వడదెబ్బ బారిన పడతారు. ♦ ఈ మందులు వాడే రోగులు వేసవిలో వైద్యులను సంప్రదించి డోసులు మార్చుకోవాలి. యూరిన్ ముదురు రంగులోకి మారితే శరీరంలో నీటి శాతం తగ్గినట్లు గుర్తించాలి. ఆ మేరకు భర్తీ చేస్తూ ఉండాలి. ♦ మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ మూత్రానికి పోతుంటారు. దీంతో శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోతుంటాయి. వేసవిలో ఇది మరింత ప్రమాదకరం. శరీరంలో నీరు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. ♦ అధిక రక్తపోటు ఉంటే ఉప్పు కలిపిన నీళ్లు అదే పనిగా తీసుకోవద్దు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, యూరిన్ పసుపు పచ్చగా వచ్చినప్పుడు నీటిని తీసుకుంటూ ఉండాలి. ♦ వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర అవసరం. పెద్దలు 6–7 గంటలు, పిల్లలు 9 గంటల పాటు నిద్రపోవాలి. జాగ్రత్తగా ఉండాలి.. రోడ్ల పక్కన దొరికే నిమ్మరసం, ఐస్ క్రీమ్‌లు, పుచ్చకాయ ముక్కలు తీసుకునేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లదనం కోసం చాలా మంది ఐస్ కలుపుతుంటారు. ఐస్ తయారీలో కంపెనీలు ప్రమాణాలు పాటించవు. స్వచ్ఛమైన నీటితో తయారుచేయవు.–పి. ఉదయ్‌కిరణ్, వైద్యులు, విజయనగరం -
మల్టీప్లెక్స్‌లకు మొట్టికాయ
విజయవాడ లీగల్: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలకు కూల్‌డ్రింక్స్ అమ్మకాలు సాగించడంపై కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్లో ఒక ధరతో, మల్టీప్లెక్స్‌లో మరో ధరతో కూల్‌డ్రింక్స్ అమ్మినందుకు వాటి తయారీ సంస్థలకు భారీ జరిమానా విధించింది. రూ.ఐదేసి లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఐదు కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీలను ఆదేశించింది. అదే సమయంలో మల్టీప్లెక్స్‌లకు సైతం మొట్టికాయలు వేసింది. తినుబండారాలు, మంచి నీళ్ల బాటిళ్లను లోపలికి అనుమతించాలని.. వినియోగదారులకు మంచి నీరు అందుబాటులో ఉంచాలని మల్టీప్లె్లక్స్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం–2 అధ్యక్షుడు సీహెచ్ మాధవరావు గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. తినుబండారాలు, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతేడాది ఏప్రిల్ 2న విజయవాడకు చెందిన గరికపాటి ప్రభాకరరావు గాంధీనగర్‌లోని ఐనాక్స్ థియేటర్‌పై, వేమూరి వెంకట శ్రీరామ్‌కుమార్ పటమటలోని ఐనాక్స్ థియేటర్‌పై, లింగారెడ్డి విద్యాప్రకాష్.. ట్రెండ్సెట్పై, బి.నరసింహమూర్తి పీవీఆర్‌పై, చెన్నుపాటి మణినాగేందర్ పీవీపీ మాల్స్‌పై వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. మల్టీప్లెక్స్‌లతో పాటు కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్ బుల్, పల్పీ ఆరెంజ్.. అలాగే తూనికలు, కొలతల శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫిర్యాదును విచారించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు.. కూల్‌డ్రింక్స్ కంపెనీలు, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలు వసూలు చేసిన కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్‌బుల్, పల్పీ ఆరెంజ్ కంపెనీలకు రూ.ఐదేసి లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని స్పష్టం చేశారు. సెలెక్ట్ చానల్ పేరిట తినుబండారాలు, పానీయాలపై మార్కెట్ ధర కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని.. 9 శాతం వడ్డీతో సహా ఫిర్యాదుదారులకు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ధరల పట్టిక అందరికీ కనిపించాలని, వినియోగదారులు ఫిర్యాదు చేయడం కోసం అధికారుల నంబర్లు ఏర్పాటు చేయాలని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌కు స్పష్టం చేశారు. -
శీతలపానీయం అనుకుని..
కోదాడఅర్బన్ : కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో గల గణేశ్‌నగర్‌లో ట్యూషన్ కోసం వెళ్లిన విద్యార్థి శీతల పానీయం అనుకుని బాటిల్లోని క్రిమిసంహారక మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెం దాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గణేషనగర్‌లో నివాసముండే గుంటా మహేశ్వరరావు కుమారుడు నాగసాయి(7) స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. మహేశ్వరరావు తన కుమారుడిని అదే కాలనీలోని తోమారెడ్డి ఇంట్లోని ట్యూషన్‌కు పంపిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో అక్కడ స్ప్రైట్ బాటిల్ కనిపించడంతో దానిని శీతలపానీయంగా భావించి తాగాడు. అయితే ఆ బాటిల్లో క్రిముల నివారణకు క్రిమిసంహారక మందును కలిపి ఉం చారు. ఈ విషయం తెలియని నాగసాయి దానిని తాగడంతో వాంతులు ప్రారంభమయ్యాయి. దీం తో నాగసాయిని పట్టణంలోని సిద్ధార్థ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి మిషమంగా ఉండడంతో మొదట ఖమ్మం, తరువాత గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగసాయి గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనలో ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ నాగసాయి తండ్రి మహేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏఎస్ఐ సైదా తెలిపారు. -
ఈ థియేటర్లకు ఏమైంది?
మధురవాడ ప్రాంతానికి చెందిన రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సీఎంఆర్ సెంట్రల్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు సభ్యులకు రూ.150 చొప్పున ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాడు. ట్యాక్స్‌తో కలిపి రూ. 687 అయింది. విరామ సమయంలో బయటకు పిల్లలను తీసుకుని వచ్చి రెండు పాప్‌కార్న్‌లు, రెండు కూల్ డ్రింక్‌లు ఇవ్వమన్నాడు. వాస్తవానికి వాటి ధర రూ.200కు మించి ఉండదని రాజేష్ ఊహించాడు. కానీ రూ.900 బిల్లు వేసి అతని చేతిలో వాటిని పెట్టారు. ఒక్కసారిగా కంగుతిన్న రాజేష్ పిల్లలను బాధపెట్టలేక ఆ సమయానికి డబ్బులు చెల్లించేశాడు. ఇది ఆయన ఒక్కడికే కాదు.. మల్టీప్లెక్స్ థియేటర్లకు వినోదం కోసం వెళుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎదురవుతున్న అనుభవం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తనకు వచ్చే జీతంలో 15 శాతం ఒక్క సినిమాకు ఖర్చు అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. జగదాంబ ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్‌కు లక్ష్మణ్ తన భార్యతో సినిమాకు వెళ్లాడు. సినిమా టికెట్ రూ.118( ఇద్దరి రూ.236), బైక్ పార్కింగ్ రూ.20, కూల్ డ్రింక్రూ.60 (ఇద్దరికి రూ.120), సమోసాలు రూ.30 (నాలుగు), పాప్‌కార్న్ రూ.30 (ఇద్దరికి రూ.60) ఖర్చు అయింది. రూ. 500 నోటుతో వెళ్లిన ఆయనకు తిరిగి వచ్చేటప్పుడు కాస్తా చిల్లర మిగిలింది. సినిమా పూర్తయ్యేలోగా ఆయనకు సినిమా కనిపించింది. సినిమా ప్రేక్షకుడి ప్రస్తుత పరిస్థితిని సంఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి. టికెట్ల ధరలతో పాటు తినుబండారాల విషయంలో ప్రేక్షకుడు నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. పైగా జీఎస్టీ బాధుడు. ఎమ్మార్పీకే తినుబండారాలు విక్రయించాలన్న అధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అలసిన మనసుకు సాంత్వన చేకూర్చేది వినోదం. అందులోనూ ప్రతి ఒక్కరినీ రంజింపజేసే మాధ్యమం సినిమా. అలాంటి సినీ వినోదం మరింత ఖరీదైపోయింది. సింగిల్ థియేటర్ల స్థానాన్ని మల్టీప్లెక్స్‌లు ఆక్రమిస్తున్న తరుణంలో సగటు ప్రేక్షకుడిని దోపిడీ చేయడమనేది సర్వసాధారణమైపోయింది. పార్కింగ్ కష్టాలు మొదలుకొని, టికెట్ ధరలు, ఫుడ్ అండ్ బేవరేజెస్ వరకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమాకు సొంత కారులో వెళ్లిరావాలంటేనే రూ.2వేల వరకు ఖర్చవుతున్నాయి. అందులో టికెట్లకు రూ.600 అయితే, మిగిలినదంతా ఫుడ్ అండ్ బేవరేజెస్కే! అలాగని ఇంటి నుంచి బిస్కెట్ ప్యాకెట్టో, వాటర్ బాటిలో తీసుకువెళ్దామంటే థియేటర్ డోర్ దగ్గరే ఆపేస్తున్నారు. దాంతో రెండున్నర గంటల వినోదానికి వేలల్లో వదిలించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తూ ముంబై హైకోర్టు మల్టీప్లెక్స్‌ల్లోకి స్నాక్స్ తీసుకువెళ్లేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. మార్గదర్శకాలు రూపొందించాలని సూచించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి మల్టీప్లెక్స్‌ల్లో బయట ఫుడ్ అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని థియేటర్లలో బయట ఫుడ్ అనుమతించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. నగరంలోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా చిప్స్ ప్యాకెట్లను రూ.10 నుంచి విక్రయిస్తున్నారు. ఇవి బయట మార్కెట్లో కనిపించవు. వాటి నాణ్యతను బట్టి చూస్తే రూ.5 కూడా ఎక్కువే. నాణ్యత లేని తినుబండారాలను నచ్చిన ధరకు అమ్ముతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. సీఎంఆర్ లాంటి అతి పెద్ద మాల్లో మనకు నచ్చిన పాప్‌కార్న్ ప్లేవర్ రూ.25 మాత్రమే. కానీ సినిమా థియేటర్లలో రూ.30(మల్టీప్లెక్స్‌లో రూ.60 నుంచి). నగరంలో ఎక్కడ తీసుకున్న సమోసా ధర రూ.5 నుంచి రూ.7. మల్టీప్లెక్స్‌లో మాత్రం వీటి ధర ఒక్కొక్కటి రూ.50. ఎగ్ పఫ్ ప్రముఖ ఫుడ్ జోన్ల్లో రూ.15 దాటదు. కానీ సినిమా థియేటర్లలో రూ. 30. కేఎఫ్సీలో రూ.80లకు మీడియం సైజ్ కూల్ డ్రింక్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది. కానీ థియేటర్లలో కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ రూ.60కు అమ్ముతున్నారు. స్వీట్ కార్న్ నగరంలోని ఎక్కడైనా రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. కాని సినిమా థియేటర్లలో మాత్రం రూ.50. మిగతా తినుబండారాలు కూడా ఇలానే విక్రయిస్తున్నారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ మీదే అధికాదాయం ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు మల్టీప్లెక్స్‌లు, థియేటర్లకు పెనుభారంగా పరిణమించే అవకాశముందన్నది మల్టీప్లెక్స్ మేనేజర్ల మాట. మల్టీప్లెక్స్‌ల ఆదాయంలో 30 శాతం ఫుడ్ అండ్ బేవరేజెస్ అమ్మకాల ద్వారానే లభిస్తోంది. ఈ కారణం వల్లే ఆదాయం మరింత పెంచుకోవడానికి లైవ్ కిచెన్ కౌంటర్లు, ఎఫ్ అండ్ బీ మెనూ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నాయి. ఫిక్కీ–కేపీఎంజీ 2017లో విడుదల చేసిన అధ్యయనంలోనూ ఎఫ్ అండ్ బీ ఆదాయం ద్వారానే మల్టీప్లెక్స్‌లు తమ ఆదాయం స్థిరంగా వృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడించింది. కోర్టు తీర్పు ఇచ్చినా మారని యాజమన్యాలు సినిమా థియేటర్లలో ప్రత్యేక ప్యాకేజీల ధరలతో తినుబండారాలను గతంలో విక్రయించేవారు. దీనిపై వినియోగదారుల కోర్టు గతేడాది నవంబర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 జనవరి నుంచి అన్ని థియేటర్లలో సాధారణ ధరలకే తినుబండారాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్ని థియేటర్ల యాజమాన్యాలను పిలిచి సాధారణ ధరలకే తినుబండారాలు విక్రయించాలని సూచించారు. మొదట్లో వాటర్ బాటిల్ మాత్రమే ఎమ్మార్పీకి విక్రయించారు. తర్వాత కోర్టు, కలెక్టర్ ఆదేశాలకు తమకు వర్తించవు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాగా..వాణిజ్య సంస్థల్లో, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కోర్టు చెప్పినా.. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం విచ్చలవిడిగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తారటా.. ప్రేక్షకుల నుంచి థియేటర్ల యాజమాన్యాలు అడ్డంగా దోచుకుంటున్నా.. తమకు ఏం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులు. సినిమా థియేటర్లపై నియంత్రణకు కలెక్టరేట్లో సీ సెక్షన్ ఉంది. వారు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేస్తుండాలి. యాజమాన్యాలు తమ కార్యాలయాలకు పిలిపించుకుని మాట్లాడటం తప్పితే.. ఇటీవల కాలంలో థియేటర్లను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. థియేటర్లలో జరుగుతున్న ధరల దోపిడీపై వివరణ అడిగితే.. వారు చెప్పే సమాధానం ‘మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు’. ఫిర్యాదు చేస్తే అప్పుడు తనిఖీలు చేస్తాం అంటూ సెలవిస్తున్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సినిమా హాళ్లకు వెళ్లి తినుబండరాలను కొనేవారికి కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఉందని అందరికీ తెలిసినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇంత ధరలతో వినోదమా.. వినోదాన్ని ఎవరు కోరుకోరు. కానీ మరి ఇంత మూల్యానికా.. ధరలు పెంచడం వలనే పైరసీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. సరసమైన ధరలు ఉంటే ప్రతీ ఒక్కరూ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్లు, తినుబండారాల ధరలు పెరిగితే సామాన్యుడు థియేటర్ల వైపు చూడడు. –దినేష్, ప్రేక్షకుడు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం ఏ సినిమా థియేటర్లలో అయినా అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నట్టు 1100, 18004250082, 18004252977 నంబర్లకు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం. నిజంగానే అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడప్పుడు తూనికలు– కొలతల అధి కారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. – ఆర్.నరసింహమూర్తి, సి–సెక్షన్ సూపరింటెండెంట్ చుక్కలు చూపిస్తున్నారు సరదాగా సినిమా కోసం వస్తే ప్రత్యేక ధరలంటూ చుక్కలు చూపిస్తున్నారు. కుటుంబంతో కలసి సినిమాకు రావాలంటే భయం వేస్తుంది. మా నుంచి యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకుంటున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అధికారులు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేయాలి. –కల్యాణ్,ప్రేక్షకుడు థియేటర్లను తనిఖీ చేయాలి సినిమా థియేటర్లలో లభించే ఆహార పదార్థాలు తినాలంటే భయం వేస్తుంది. ఒక వైపు అధికంగా ధరలు ఉంటే మరో వైపు ఎలాంటి నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారు. కొన్ని చిప్స్ ప్యాకెట్ల థియేటర్లలో తప్పితే.. ఎక్కడా లభించవు. వాటిని తినడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లను తనిఖీ చేయాలి. –కిశోర్ వర్మ, ప్రేక్షకుడు -
అనుమతులు లేకుండా స్వీట్ డ్రింక్ తయారీ
విశాఖ సిటీ ,చోడవరం: అనుమతులు లేకుండా స్వీట్ డ్రింక్స్ తయారుచేస్తున్న సెంటర్‌పై విజిలెన్స్, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు గురువారం దాడులు చేశారు. చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఈ సెంటర్‌పై రెండు శాఖల అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. లోకల్ డ్రింక్ పేరుతో ఇక్కడ తయారుచేస్తున్న స్వీట్ డ్రింక్‌ను పాత పెప్సీ, బ్రీజర్, ఇతర సీసాల్లోనింపి గ్రామీణ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. నీటిలో పంచదార, ఎసెన్స్, కొన్ని రంగులు ఒక మిషన్ ద్వారా మిక్స్‌చేసి ఆ ద్రావణాన్ని సీసాల్లో నింపి అమ్ముతున్నారు. సంపత్ వినాయక సంతోషిమాత డ్రింక్ పేరున నడుస్తున్న ఈ లోకల్ డ్రింక్ తయారు చేసేందుకు ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో దాడులు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా శీతల పానీయం తయారీ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదమని, ఈ మేరకు ఈ సెంటర్‌పై దాడి చేసి కేసు నమోదుచేసినట్టు విజిలెన్స్ డీఎస్పీ పి.ఎం. నాయుడు, ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి బి.వేణుగోపాల్, గజిటెడ్ ఫుడ్ ఇనస్పెక్టర్ కె. వెంకటరత్నం తెలిపారు. అయితే ఉత్పత్తి చేసిన డ్రింక్స్, శీతలపానీయాలను విక్రియించేం దుకు ఫుడ్ కంట్రోల్ శాఖ నుంచి ఈ సెంటర్‌కు అనుమతి ఇస్తూ లైసెన్సు ఉంది. దీనిని పరిశీలించిన అధికారులను ఇక్కడ ఏ లేబుల్ లేకుండా స్వీట్ డ్రింక్స్ సీసాల్లో నింపి ఉన్న 15 కేసులను అధికారులు సీజ్‌చేశారు. కొన్ని బాటిళ్లను శాంపిల్స్ కోసం సీజ్‌చేసి తీసుకెళ్తున్నట్టు ఫుడ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. -
కూల్ డ్రింక్స్ కేంద్రంపై విజిలెన్స్ దాడులు
కంచరపాలెం(విశాఖ ఉత్తర): జీవీఎంసీ 36వ వార్డు కంచరపాలెం పరిధి గోకుల్‌నగర్‌లో నిర్వహిస్తున్న వనజాక్షి శీతల పానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ వనజాక్షి కూల్ పాయింట్ నిర్వాహకులు డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించడం లేదన్న సమాచారం మేరకు జీవీఎంసీ ఆహార భద్రత అధికారులతో కలిసి దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో కూల్ డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించనట్లుగా గుర్తించామని తెలిపారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉన్నప్పటికీ నేరుగా బోరు నీటిని వినియోగించి అందులో హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్ ప్లేవర్స్‌తో పాటుగా ఎసెన్స్, కూల్‌డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించామన్నారు. శీతల పానీయాలు తయారీ కేంద్రంలో సేకరించిన శ్యాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి నివేదిక అధారంగా చర్యలు చేపడతామన్నారు. కూల్ పాయింట్ నిర్వాహకుడు కె.ఈశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీఎం.నాయుడు, ఎస్ఐ రమేష్, డీసీటీవోలు రేవతి, మోహన్‌రావు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు కోటేశ్వరరావు, జనార్థన్, జి.వి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
బోరు నీటితో కూల్‌డ్రింక్స్..అధికారుల దాడులు
-
కూల్ కిల్లర్..
దురాజ్‌పల్లి (సూర్యాపేట) :ఎండాకాలంలో ప్రజలంతా చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్, క్యూలర్, ఏసీలను వినియోగించక తప్పడం లేదు. భయటకు వెలితే నీడ కోసం వెతుకులాడుతుంటారు. ఈ సమయంలో ముఖ్యంగా ప్రజలకు చల్లటి నీరు, పానీయాలు తాగుతుంటారు. అయితే చల్లని పానీయాల కోసం వ్యాపారులు ఐస్ వాడుతారనేది అందరికీ తెలిసిన విషయమే.. రోడ్లపై ఉన్న బండ్ల దగ్గర నుంచి దుకాణాల వరకు అందరు ఐస్ ముక్కలను ఉపయోగించి పానీ యాలు తయారుచేస్తుంటారు. వాటిని మనం తాగేస్తుంటాము కానీ.. అందులో వాడుతున్న ఐస్ ఎంతమాత్రం నాణ్యమైనదని ఆలోచించం. ఈ ఐస్ ఏ మాత్రం నాణ్యమైనది కాదని, ప్రజలు అనారోగ్యం బారిన పడేలా చేస్తోందని వైద్యులు, నిపుణులు అంటున్నారు. అవగాహన లేక.. ప్రజలకు సరైన అవగాహన లేక ఆర్యోగానికి ప్రమాదకరమైన ఐస్ కలిపిన శీతల పానీయాలు తాగి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఐస్ నాణ్యమైనది కాదని వ్యాపారులకు కూడా తెలిసే వాడుతున్నారు. ప్రజల ఆర్యోగాలతో వారికి పని లేదు తమ వ్యాపారాలు నడిస్తే చాలు. సాధారణగా పండ్ల రసాలు ఆర్యోగానికి చాలా మంచివి. కాని అందులో కలిపే ఐస్‌తో మొత్తం ప్రమాదం పొంచి ఉన్నది. సాధారణంగా శీతల పానీయాలలో ఎడిబుల్ ఐస్ ప్లాంట్లలో తయారైన ఐస్‌ను మాత్రమే వాడాలి. కాని జిల్లాలో ఎక్కడా ఎడిబుల్ ఐస్ ప్లాంట్లు లేవు. ఉన్నవన్నీ పారిశ్రామిక అవసరాల కోసం ఐస్ తయారు చేసే ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఐస్ కేవలం చేపలు, రొయ్యలు, మృతదేహాలు నిల్వ చేయడం కోసమే వాడాలి. ఐస్ కలిపిన పానీయాలు తాగితే అంతే.. ఐస్ తయారీ బ్లాకులలో వాడే ఉప్పు నీరు చాలా కాలం పాటు ప్లాంట్‌లో కదలకుండా ఉండిపోతుంది. ఈ నీటిలో ప్రమాదకరం బ్యాక్టీరియాలు ఉంటాయి. అందరూ ఐస్‌లో బ్యాక్టీరియా ఉండదని భావిస్తారు. కాని అది నిజం కాదు. నీరు గడ్డ కట్టినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు నిద్రావస్థలోనికి వెలుతాయి. సాధారణ ఉష్ణోగ్రత రాగానే అవి తమ జీవన ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తాయి. ఐస్ ప్యాక్టరీలలో ఎటువంటి సురక్షిత విధానాలు పాటించరు. అందువల్ల ఐస్‌లో కొల్లి బ్యాక్టీరియా, రోటా, హెపటైటిస్ వంటి వైరస్లు ఉంటాయి. ఇలాంటి ఐస్ కలిపిన పానీయాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు, విరేచనాలు వంటి జబ్బులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో నీటిని ఉంచుకొని తాగడమే మేలు. రోజూ రూ.75వేల వ్యాపారం జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి, హుజూర్నగర్ వంటి ప్రధాన పట్టణాలలో పారిశ్రామిక, సాధారణ అవసరాలకు వినియోగించే ఐస్ ఫ్యాక్టరీలు సుమారు 15వరకు ఉన్నాయి. వీటిలో జిల్లా కేంద్రంతో పాటు కోదాడలో ఉన్న ఐస్ఫ్యాక్టరీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రోజు సుమారు రూ.5వేల నుంచి ఏడు వేల వరకు వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. సరాసరి రోజుకు రూ.5వేల చొప్పున బేరం జరిగితే రూ.75వేల ఠివరకు ఐస్‌ను అమ్ముతున్నట్టు తెలుస్తోంది. నెలకు రూ.22.50లక్షల వ్యాపారం చేస్తున్నారు. అలాగే జిల్లాలో పండ్ల రసాలను, నిమ్మ సోడాలను ఇతర పదార్థాలను ఐస్ వేసి అమ్మే వ్యాపారులు సుమారు 700పైనే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సూర్యాపేట, కోదాడలో 500 వరకు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వ్యాపారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క ఐస్ సాధారణ బాక్స్ సుమారు పది కేజీలు రూ.100పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరం..! పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసిన ఐస్‌ను ప్రజలు నేరుగా తీసుకోకూడదు. కాని వ్యాపారులు తమ అవసరాకోసం ఈ ఐస్నే వాడుతున్నారు. చెరుకు రసం, లస్సీ, ఫ్రూట్ జ్యూస్‌లు, నిమ్మరసం, షోడా, సుగంధ పానీయాల తయారీలో ఈ ఐస్‌ను వాడుతున్నారు. ఈ ఐస్ అతి సాధారణమైన నీటితో తయారు చేస్తారు. అంతే కాకుండా ఈ ఐస్ తయారి సమయంలో ఐస్ బ్యాకులు ఉప్పు నీటిలో మునిగి ఉంటాయి. ఉప్పునీరు తీసుకున్న చల్లదానాన్ని ఈ బ్లాక్ గ్రహించి దీనిలో దీనిలో ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తున్నది. కొన్ని సందర్భలాలో ఉప్పు నీరు బ్లాక్‌లోకి నేరుగా చేరుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంమైనది. -
పరి పరిశోధన
తాగుడును దూరం చేసే జన్యుమార్పులు! తాగుడు అలవాటును అధిగమించేలా మనిషి పరిణమిస్తున్నాడా? అవునంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మానవుల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపారు. ఇప్పటికే పూర్తయిన దాదాపు వెయ్యి జన్యుక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందుకోసం విశ్లేషించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2500 మంది డీఎన్ఏ వివరాలను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఆఫ్రికా సంతతి వ్యక్తుల్లో మలేరియా వ్యాధికి నిరోధకత పెరుగుతూండగా, యూరోపియన్లలో ఒక అమినో యాసిడ్‌లో మార్పులు నమోదయ్యాయి. అలాగే నియాండెర్తల్ జాతికి సంబంధించిన మానవులతో కలవడం వల్ల వచ్చిన రెండు డీఎన్ఏ ముక్కలు అలాగే ఉన్నట్లు తెలిసింది. చివరగా ఏడీహెచ్ అనే జన్యువులో వచ్చిన మార్పు. ఈ జన్యువు శరీరంలో ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది మద్యాన్ని విడగొట్టి అసిటాల్డీహైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువులో వచ్చిన మార్పులు భవిష్యత్తులో శరీరాన్ని మద్యం ప్రభావం నుంచి రక్షించేదిగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. మద్యాన్ని వేగంగా విడగొట్టడం ద్వారా తాగుబోతులకు జబ్బు పడిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఈ జన్యువు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాంటీబయాటిక్‌ల ప్రభావాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్! కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు కారణంగా యాంటీబయాటిక్ మందుల ప్రభావం గణనీయంగా వృద్ధి చెందుతుందని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. మెట్రోనైడజాల్ అనే యాంటీబయాటిక్‌కు కార్బన్ మోనాక్సైడ్‌ను జోడించి ప్రయోగించినప్పుడు హెచ్.పైలోరీ రకం బ్యాక్టీరియా వేగంగా నాశనమైందని వీరు జరిపిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కడుపులో పుండ్లు అయ్యేందుకు ఈ హెచ్.పైలోరీ కారణమవుతుందన్నది తెలిసిన విషయమే. కార్బన్ మోనాక్సైడ్‌తో కలిపి ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ ప్రభావం 25 రెట్ల వరకూ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బింగే వాంగ్ తెలిపారు. బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌కు స్పందించకపోవడం నిరోధకత కాదని, చాలా సందర్భాల్లో అవి మందులకు అలవాటుపడిపోవడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయని ఆయన వివరించారు. బ్యాక్టీరియాను మళ్లీ మందులకు సున్నితంగా మారిస్తే అవి వాటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. గాఢత ఎక్కువగా ఉండే విషంలా పనిచేసే కార్బన్ మోనాక్సైడ్‌ను అతి తక్కువ సాంద్రతల్లో వాడినప్పుడు మాత్రం చికిత్సకు ఉపయోగపడుతుందని తాము గుర్తించినట్లు చెప్పారు. శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఈ వాయువు వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌లకు కణాలు ప్రతిస్పందించే గుణాన్ని కూడా పెంచుతాయని చెప్పారు. కూల్‌డ్రింక్స్‌తో కేన్సర్ ముప్పు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వారికి ఊబకాయ సంబంధిత కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని మెల్బోర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఒకటి తెలిపింది. దాదాపు 35 వేల మంది అలవాట్లను పరిశీలించి జరిపిన విశ్లేషణ ద్వారా కూల్‌డ్రింక్స్ 11 రకాల కేన్సర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఊబకాయానికి సంబంధించినవే అయినప్పటికీ అధ్యయనంలో పాల్గొన్న వారు మాత్రం ఊబకాయులు కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం కూల్‌డ్రింక్స్ తాగేవారితో పోలిస్తే కృత్రిమ చక్కెరలతో కూడిన డైట్ కూల్‌డ్రింక్స్ తాగే వారికి వ్యాధి ముప్పు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని అలిసన్ హాడ్జ్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. అధిక చక్కెర... ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేస్తూండగా.. కేన్సర్ కారకమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో చక్కెరలు కేన్సర్ కణాలను ఎలా ప్రేరేపితం చేస్తాయో స్పష్టం అవడమే కాకుండా.. చక్కెరలు కణతి ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేన్సర్ల నివారణకు చక్కెరలను పూర్తిస్థాయిలో త్యజించడమూ అంత మంచిదేమీ కాదని, కణాలకు అవసరమైన శక్తి గ్లూకోజ్ ద్వారానే లభిస్తుందన్న విషయం మరువరాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఆ షాపుల్లో... చాక్లెట్లు, కూల్‌డ్రింక్‌లకు ‘నో’
భావితరాలను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కాలను అమ్మే షాపులు స్థానిక సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకొని... విక్రయాలకు అనుమతి పొందాలని ప్రతిపాదించింది. అలాగే మైనర్లు వీటి పట్ల ఆకర్షితులు కాకూడదనే ఉద్దేశంతో పాన్‌షాపుల్లో చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్ లాంటివి అమ్మకూడదని స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపులకు స్థానిక సంస్థల ద్వారా అనుమతిని జారీచేసే ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఈనెల 21న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల అమ్మకుండా ఓ కన్నేసి ఉంచడానికి ఈ విధానం పనికి వస్తుందని ఆరోగ్యశాఖ సలహాదారు అరుణ్ ఝా అన్నారు. అయితే మన దేశంలో పాన్‌షాపుల్లో కాకుండా ప్రతిచిన్న కిరాణా కొట్టులోనూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగే వారిలో 90 శాతం మందికి 20 ఏళ్ల వయసులోపే దమ్ము అలవాటైందని గణాంకాలు చెబుతున్నాయి. మొక్కగా ఉన్నపుడే వంచడం సులువు కాబట్టి యుక్త వయసులో అటు వైపు ఆకర్షితులు కాకుండా నిరోధిస్తే... ఈ మహమ్మారి బారినపడకుండా యువ శక్తిని కాపాడుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. – భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి పొగాకు నమిలే అలవాటు ఉందని ప్రభుత్వ సర్వే తేల్చింది. – 10 కోట్లు: భారత్‌లో పొగాకు తాగే అలవాటు ఉన్నవారు. – 1 కోటి: పొగాకు తాగే అలవాటు కారణంగా... క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధం వ్యాధుల బారినపడి ప్రతియేటా మనదేశంలో మరణించే వారి సంఖ్య. – 60 శాతం నివారించొచ్చు: క్యాన్సర్లలో 60 శాతం నివారించదగ్గవే. వీటిలో పొగాకు సంబంధింత క్యాన్సర్లు 40 శాతం. – 16 ఏళ్లు: భారత్‌లో పొగాకు అలవాటుపడుతున్న పిల్లలు 16 ఏళ్ల సగటు వయసులో దీన్ని మొదలుపెడుతున్నారు. – 4.4 శాతం: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (గాట్స్) నివేదిక ప్రకారం 2010 నుంచి 2016 మధ్యకాలంలో 15–17 ఏళ్ల మధ్యలో పొగాకుకు అలవాటుపడుతున్న వారి సంఖ్య 9.6 శాతం నుంచి 4.4 శాతానికి పడిపోయింది. – 15.4 శాతం: ఇదే కాలంలో 18–24 ఏళ్ల వయసు వారిలో పొగాకు అలవాటున్న వారి శాతం 21.4 నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదో ఆరోగ్యకర పరిణామంగా భావించిన కేంద్రం... యువతను ఈ అలవాటుకు దూరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాజా చర్యలు చేపట్టింది. – 7 ఏళ్లు: 2015లో ఆమోదించిన జువనైల్ చట్టం ప్రకారం... మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల దాకా కఠినకారాగార శిక్షను విధించే అవకాశముంది. 100 మీటర్లు: విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలోపు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదు. – 4వ స్థానం: ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్లు అమ్ముడయ్యే దేశాల్లో భారత్‌ది నాలుగోస్థానం. చైనా, అమెరికా, జపాన్ల తర్వాత మనమున్నాం. 9,900 కోట్లు: 2016లో భారత్‌లో అమ్ముడైన సిగరెట్ల సంఖ్య. 51 శాతం: ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినయోగంలో టాప్–4 దేశాలు ( చైనా, అమెరికా, జపాన్, భారత్) ఏకంగా 51 శాతం వినియోగిస్తున్నాయి. 11.2 శాతం: ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొగరాయుళ్లలో భారతీయులు 11.2 శాతం. – ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానంలో 2020 కల్లా పొగాకు వినియోగాన్ని 15 శాతం తగ్గించాలని, 2025 కల్లా 30 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రెండాకులు ఎక్కువే పిండాం..!
టేస్ట్ ద థండర్ ... గుట గుటమనిపించే ఉంటారు ఓపెన్ హ్యాపీనెస్... సిప్పు కొట్టే ఉంటారు. యే దిల్ మాంగే మోర్... ఆస్వాదించే ఉంటారు జ్యాదా మస్తి ... లాగించే ఉంటారు క్లియర్ హై ... క్లియర్ చేసే ఉంటారు ఇవి... అన్నీ కూల్‌డ్రింక్స్ ట్యాగ్లైన్లు. కానీ, మేం ఆరులైన్లు ఎక్కువే చదివాం. అందుకే, రెండాకులు ఎక్కువే పిండాం. ఆకుకూరలతో జ్యూసులు టేస్ట్ ద వండర్! పుదీనా జ్యూస్ కావల్సినవి: పుదీనా ఆకులు – ఒకటిన్నర కప్పు; బెల్లం లేదా పంచదార – 6 టేబుల్ స్పూన్లు (తగినంత); నీళ్లు – అర కప్పు; నల్లుప్పు – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – టీ స్పూన్; నిమ్మరసం – 3 టీ స్పూన్లు తయారీ: పుదీనా కాడల నుంచి ఆకులను వేరు చేసి, నీళ్లలో వేసి కడగాలి. తర్వాత జల్లిలో వేసి నీళ్లన్నీ పోయేదాకా ఆరనివ్వాలి. అన్ని పదార్థాలు మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా పేస్ట్ అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పుదీనా జ్యూస్ పావు కప్పు తీసుకుంటే 3 కప్పుల నీళ్లు దీనికి కలపాలి. గ్లాస్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సేవించాలి. (తీపి కావాలనుకుంటే మరికాస్త కలుపుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం లేదంటే తేనెను కూడా వాడుకోవచ్చు.) మునగాకు జ్యూస్ కావల్సినవి: మునగాకు – అర కప్పుతేనె – టేబుల్ స్పూన్ నిమ్మరసం – టేబుల్ స్పూన్ నీళ్లు – అర గ్లాసు తయారీ: మునగాకు మెత్తగా రుబ్బి, అందులో నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. గ్లాసులో పోసి నిమ్మరసం, తేనె కలపాలి. క్యాల్షియం సమృద్ధిగా లభించే మునగాకు ఎముకల బలానికి మేలు చేస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పుపైనాపిల్ ముక్కలు – 6 కప్పులుపుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి.గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. కొత్తిమీర జ్యూస్ కావల్సినవి: పాలకూర తరుగు – కప్పు ఏదైనా మరో ఆకు కూర – ఒక ఆకు యాపిల్ – 1 నిమ్మరసం – టీ స్పూన్నీళ్లు – కప్పు తయారీ: ఆకు కూరను, యాపిల్‌ను శుభ్రపరచాలి. యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి, మెత్తగా బ్లెండ్ చేయాలి. నిమ్మరసం కలిపి సర్వింగ్ గ్లాస్లో పోసి అందించాలి. చల్లగా కావాలనుకునేవారికి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి. తమలపాకు జ్యూస్ కావల్సినవి: కొత్తిమీర తరుగు – అర కప్పు పుదీనా ఆకులు – గుప్పెడు నీళ్లు – కప్పు నిమ్మరసం – టీ స్పూన్ ఉప్పు – తగినంత తయారీ: కప్పు నీళ్లు మరిగించాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, పైన మూత పెట్టి, మంట తీసేయాలి. ఐదు నిమిషాలు ఉంచి, ఆ నీటిని వడకట్టాలి. ఆకులను గ్రైండర్లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో వడకట్టిన నీళ్లు కలిపి ఆకులను మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ జ్యూస్ ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయ్యాక అందించాలి. వీట్‌గ్రాస్ జ్యూస్ కావల్సినవి: వీట్‌గ్రాస్ తరుగు – అరకప్పు పైనాపిల్ ముక్కలు – 6 కప్పులు పుదీనా ఆకులు – 6, క్రష్డ్ ఐస్ – టేబుల్ స్పూన్ తయారీ: పై పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసి,మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. వడకట్టాలి. గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. నోట్: ఐస్ కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఐస్‌ను ఎక్కువగా వాడకపోవడమే మేలు. పాలకూర జ్యూస్ కావల్సినవి: తమలపాకులు – 2 గులాబీ పూల రేకలు – కొన్ని బెల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు లవంగం – 1 దాల్చిన చెక్క – చిన్న ముక్క నీళ్లు – కప్పు తయారీ: తమలపాకులు, గులాబీ పువ్వు రేకలు శుభ్రం చేయాలి. అన్నీ కలిపి, జ్యూస్ మిక్సర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వడకట్టి, సేవించాలి. నోట్ : ఆకుకూరలను తప్పనిసరిగా తగినన్ని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కనీసం 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మరో రెండు సార్లు మంచి నీళ్లతో శుభ్రపరచాలి. ఆకుల మీద పురుగుమందుల అవశేషాలు పోయే వరకు శుభ్రం చేయాలి. -
అలా అమ్మితే.. ఇక జైలుకే
మామూలు దుకాణాల్లో తప్ప బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, థియేటర్లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింకుల వరకు ఏవీ ఎంఆర్పీ ధరకు అమ్మరు. దానికంటే ఎంతో కొంత ఎక్కువ ధర పెడితే తప్ప దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక ముందు ఇలా అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ చూసినా మంచినీళ్ల బాటిళ్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పి) కంటే 10-20 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని పాశ్వాన్ అన్నారు. అసలు కొన్ని బాటిళ్ల మీద అయితే దాని ధర ఎంతో కూడా ముద్రించడం లేదని మండిపడ్డారు. 47వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూనికలు కొలతల చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం.. ముందుగానే ప్యాక్ చేసిన వస్తువులో ప్రమాణాలు దాని మీద పేర్కొన్నట్లు లేకపోతే.. రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా అలాంటి నేరం చేస్తే.. విధించే జరిమానాను ఇప్పుడు రూ. 50 వేలకు పెంచుతున్నారు. ఇంకా పదే పదే అలాగే చేస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ కూడా విధిస్తారు. 2009 నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినా.. దాని గురించిన పరిజ్ఞానం పౌరులకు పెద్దగా లేదు. ఎంఆర్పి కూడా లేబుల్ మీద ముద్రించే ఉంటుంది కాబట్టి దాన్ని ఉల్లంఘించినా కూడా జైలుశిక్ష, జరిమానా విధిస్తారని పాశ్వాన్ ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారులు అవగాహన పెంచుకుని ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు అన్నదే లేకపోతే చర్యలు ఎలా తీసుకుంటామని ఆయన అడిగారు. ఈ విషయంలో 2007లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్సులో నీళ్ల బాటిల్‌ను ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు జాతీయ వినియోగదారుల కమిషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది. -
కూల్‌డ్రింక్స్‌తో శరీరం చల్లబడుతుందా?
అవాస్తవం అపోహ: వేసవిలో కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వాస్తవం: చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫరిక్ యాసిడ్‌తో కాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనల నివేదికలు చెబుతున్నాయి. పైగా కూల్ డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాల (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందట. అందుకే కూల్‌డ్రింక్స్‌కు బదులు తాజా పళ్లరసాలు, మజ్జిగ, క్యారట్ జ్యూస్, టొమాటో జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం మేలు. ఒకవేళ కూల్‌డ్రింక్స్ తాగాల్సి వచ్చినా వాటిని చాలా తక్కువ పరిమితిలో ఎప్పుడో ఒకసారి తాగాలి. ముఖ్యంగా పిల్లలకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా పళ్లరసాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. -
కూల్‌డ్రింక్స్‌తో డయాబెటిస్ ముప్పు
కొత్త పరిశోధన వేడి వాతావరణంలో చల్లచల్లగా తీపితీపిగా దాహార్తిని చల్లార్చే కూల్‌డ్రింక్స్‌ను పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడతారు. అయితే, తరచు కూల్‌డ్రింక్స్ తాగేవారికి డయాబెటిస్ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కనీసం ఒక కూల్‌డ్రింక్ అయినా తాగే అలవాటు ఉన్న వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువగా ఉంటాయని తమ అధ్యయనంలో తేలినట్లు కేంబ్రిడ్జి వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు కారణంగానే బ్రిటన్‌లో ప్రతిఏటా కొత్తగా 8 వేలకు పైగా డయాబెటిస్ కేసులు నమోదవుతున్నాయని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 32,500 మందిపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా తరచుగా కూల్‌డ్రింక్స్ తాగేవారు డయాబెటిస్‌కు లోనవుతున్నారనే నిర్ధారణకు వచ్చామని చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌లో మోతాదుకు మించి చక్కెర ఉండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. -
గుడ్డు ముందా... కోడి ముందా...?
‘‘ఇంతకూ... గుడ్డు ముందా... కోడి ముందా...? నీ దృష్టిలో ఏది ముందో నువ్వు చెప్పు’’ అంటూ అడిగారు మా శ్రీవారు. అంతకు ముందు ఆ అంశంపై మా శ్రీవారూ, వారి స్నేహితులు కొందరు కలిసి ఓ రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పెరట్లో సాగిన ఈ చర్చల సమయంలో వారు తినడానికి వీలుగా చిప్స్, కారప్పూసా, చివరన కూల్‌డ్రింక్స్... ఆ మధ్య ఒకసారి బ్రేక్‌లో కాసింత కాఫీ నీళ్లూ... ఇవన్నీ వాళ్లకు నేనే సర్వ్ చేశా. ‘‘ఏం... మీ సుదీర్ఘ చర్చల్లో ఏ విషయమూ తేలలేదా? పైగా రెండు గంటలకు పైగా సాగింది కదా ఆ సంభాషణ’’ అన్నాను కాస్త వ్యంగ్యం ధ్వనించేలా. ఆయనకు అది అర్థం కాలేదు. అర్థం అవుతుందని కూడా నేననుకోలేదనుకోండి! ‘‘ఏవిటోనోయ్... మేమందరమూ కాస్త బుద్ధిజీవులమే. పైగా సైన్స్ కోణంలో కొద్దిసేపూ, చివరన ఆధ్యాత్మిక-లౌకిక-పారలౌకిక-అలౌకిక దృష్టితో మరికాసేపూ... ఇలా అన్ని కోణాల నుంచి ఒక నిబద్ధత కూడిన అర్థవంతమైన చర్చసాగించి, బలవంతంగా ప్రయత్నించినా ఫలవంతమైన ఫలితం రాలేదోయ్. అందుకే అడుగుతున్నా. గుడ్డు ముందా? కోడి ముందా నువ్వైనా చెప్పు’’ అంటూనే... ‘‘అయినా నీ కోడిమెదడుకు ఇంతటి లోతైన సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకోవడం నా పొరబాటేనోయ్’’ అంటూ ఒక సెటైరు విసిరారు. ‘‘అవునండీ... నా కోడిమెదడుకు ఇలాంటి చర్చలూ, వాటి ఫలితాలూ పెద్దగా పట్టవు. కానీ కోడి ముందా, గుడ్డు ముందా అనే ఓ సైంటిఫికల్ మిక్స్డ్ తాత్విక సమస్య కంటే నేను చాలా చిన్న విషయాలకే ప్రాధాన్యమిస్తా’’ అన్నాన్నేను. ‘‘అంటే?’’ అడిగారాయన. ‘‘అంటేనా? మనింట్లో అరడజను కోడి గుడ్లుంటే... మన పిల్లలు ఆరోగ్యంగా, బలంగా, ఎత్తుగా పెరగాలంటే వాటిని బాయిల్డ్ ఎగ్స్ రూపంలో పిల్లలకు పెట్టాలా? లేక రుచిగా తినిపించడానికి ఆమ్లెట్లు వేయాలా అన్నదే నాలో అంతర్గతంగా జరిగే చర్చ. ఒకవేళ బాయిల్డ్ ఎగ్స్ చేస్తే... నలభై దాటిన మీ ఆరోగ్యం దృష్ట్యా మీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకూ, ఎగ్ కలర్ తాలూకు ఎల్లో మెరుగులు నా ముఖాన నిగారింపులా పదికాలాలపాటు పదిలంగా నిలిచేందుకు దాని పసుపుసొన ఉండను... మన పిల్లలకు పెట్టి మీకు ఎగ్ వైట్ మాత్రమే పెట్టాలా అనేది కూడా నా మనసులో జరిగే చర్చ. ఇక పిల్లలు ఆరోగ్యకరంగా పెరుగుతూ, మీకూ గుండె చుట్టూ కొవ్వు పెరగకుండా ఉండాలంటే వేటమాంసానికి బదులు వైట్మీటైన చికెన్ పెడితేనే మంచిది కదా అన్న చిన్న విషయాలే నాకు పెద్ద సందేహాలు. వీటితోనే నేను సతమతమవుతూ ఉంటే మేధావులైన మీరూ-మీ మిత్రుల్లా కోడి ముందా, గుడ్డు ముందా అనే అంశంపై తాత్విక, శాస్త్రీయ, గతితార్కికవాద.. లాంటి అనేక కోణాలకు తావెక్కడుంటుందండీ’’అంటూ నా ముఖాన అమాయకత్వాన్ని ఒలికిస్తూ జవాబిచ్చాను. -వై! -
ఓహో.. బాటిల్‌నూ తినేయొచ్చు..!
లండన్: ఇకపై నీళ్లు తాగేసి వాటర్ బాటిళ్లను చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులను రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు. చిత్రంలో చూస్తున్న ఈ ‘ఓహో’ ఆల్గే బెలూన్లను బాటిల్‌గా ఉపయోగిస్తే చాలు.. తాగాల్సింది తాగేసి, బాటిల్‌ను కూడా లొట్టలేసుకుంటూ తినేయొచ్చు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు. గోధుమ రంగు నాచు (బ్రౌన్ ఆల్గే) నుంచి సోడియం అల్జినేట్ అనే పదార్థాన్ని తీసుకుని దానికి కాల్షియం క్లోరైడ్, జెల్ పదార్థాన్ని కలిపి జిగురు పొరలతో కూడిన ఈ ఓహో బెలూన్లను తయారు చేశారు. వివిధ ఆకారాల్లోకి మార్చి వీటి జిగురు పొరల మధ్య ద్రవాలను సురక్షితంగా నిల్వచేయొచ్చు. ప్యాకింగ్‌కూ అనుకూలంగా ఉండే ‘ఓహో’ ఆల్గే బెలూన్లు పర్యావరణహితమైనవే కాకుండా ఎంతో చవకైనవి కూడా. -
ఆగని అకృత్యాలు
ఈ ఏడు నేర సంస్కృతి మరింత జడలు విప్పింది. నిత్యం ఏదో ఓ చోట చోరీలు, ఒకరిపై ఒకరు దాడులు, చీటింగ్ తదితర నేరాలు పెచ్చుమీరాయి. మహిళలపై దాడులు పెరిగిపోయాయి. నిర్భయ కేసులు కలవరపెడుతున్నాయి. వరకట్న, శారీరక వేధింపుల సంఖ్య పెరిగింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒకే ఘటనలో ఇద్దరు, ముగ్గురు దుర్మరణం పొందిన కేసులు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం రూ.7.46 కోట్ల సొత్తు దొంగలు అపహరించారు. గతేడాదితో పోల్చుంటే తక్కువే అయినప్పటికీ.. రికవరీ చేయడంలో పోలీసులు చాలా వెనుకబడ్డారు. - సాక్షి, నల్లగొండ రాలిన ప్రేమసుమాలు... జనవరి 8 : వరంగల్ జిల్లాకు చెందిన ప్రేమికులు రాజు, పూజ ఆలేరులో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లికి పెద్దలు నిరాకరించారని మనస్తాపం చెందిన వీరు కలిసి ప్రాణం తీసుకున్నారు. జనవరి 15 : పెళ్లికి కుటుంసభ్యులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన కర్ణాకర్, రత్నకుమారి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపితాగి అవని నుంచి దూరమయ్యారు. ఫిబ్రవరి 22 : చిట్యాల శివారులో ప్రేమికుల జంట ఆత్మహత్యకు ఒడిగట్టింది. విజయవాడకు చెందిన నాగరాజు, పద్మ పురుగు మందుతాగి బలవర్మరణానికి పాల్పడ్డారు. నెత్తురోడిన రహదారులు ఫిబ్రవరి 2 : కేతేపల్లి ఇనుపాముల శివారులో ఆటోను తవేరా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి. ఫిబ్రవరి 7 : కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద స్కార్పియో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు భార్యాభర్తలున్నారు. మే 29 : నకిరేకల్ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యు ఒడికిచేశారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. మృతి చెందినవారిలో నలుగురు ప్రయాణికులు, కండక్టర్ ఉన్నారు. జూలై 2 : చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టింది. కూతురిని మెడికల్ కళాశాలలో చేర్పించడానికి హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లి, కూతురు, కొడుకు, ఆడపడుచు, డ్రైవర్ విగత జీవులయ్యారు. ఆగస్టు 14 : నార్కట్‌పల్లి - అద్దంకి బైపాస్ రోడ్డులో వేములపల్లి వద్ద ఆంబులెన్స్‌ను రాంగ్ రూట్లో వెళ్లి డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 15 : ప్రజలంతా ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవాల్లో మునగగా.. నార్కట్‌పల్లి వద్ద టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు లాన్జాన్బాషా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతివేగంగా ప్రయాణిస్తున్న అతని కారు రోడ్డు రేలింగ్‌కు ఢీ కొట్టింది. తీవ్రగాయాలవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సెప్టెంబర్ 19 : హైదరాబాద్ - సాగార్జునసాగర్ రహదారిలో ఉన్న చింతపల్లి మండలం రాజ్యాతండా వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 11 మంది దుర్మరణం చెందగా... 15 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తుల రికవరీ నామమాత్రమే.. ఏటేటా దొంగలు కొల్లగొడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే వాటిని రికవరీ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఈ ఏడాది రికవరీ మరింత దిగజారింది. మొత్తం రూ.7.46కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించగా... రూ.3.49 కోట్ల ఆస్తిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. రికవరీ ఈ ఏడాది 46.79 శాతానికి పడిపోయింది. తగ్గిన ప్రమాదాలు జిల్లాలో ఈ ఏడాది కూడా నెత్తుటేరులు పారాయి. రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే స్వల్పంగా తగ్గినా.. ప్రమాదాలు జరిగిన తీరు భీతిగొల్పాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది దుర్మరణం చెందిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ, నార్కట్‌పల్లి - అద్దంకి రహదారులపై ఘోర ప్రమాదాలు సంభవించాయి. గతేడాది కంటే దాదాపు 8 శాతం ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జరిగిన 1,958 రోడ్డు ప్రమాదాల్లో 775 మంది మృత్యువాత పడ్డారు. గత నాలుగేళ్లుగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అమ్మో కిడ్నాపా...! కిడ్నాప్ అంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తులు చాలా సార్లు హత్యకు గురికావడమే ఇందుకు ముఖ్య కారణం. కిడ్నాప్‌ల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 88 కిడ్నాప్ కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఎస్సీ, ఎస్టీ నేరాలు.. గతేడాది కంటే ఈసారి ఎస్సీ, ఎస్టీ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 248 ఫిర్యాదులు రాగా.. అందులో 52 తప్పుడు ఫిర్యాదులను పోలీసులు నిర్ధరించి కొట్టి వేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు 44 నమోదు కాగా.. 14 కేసులు కొట్టివేశారు. మహిళలపై పెచ్చుమీరిన నేరాలు మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దీంతో వారి మనుగుడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గడిచిన రెండేళ్ల కంటే ఈ ఏడాది మహిళలపై దాడులు అధికమయ్యాయి. గతేడాది 1,327 కేసులు నమోదుకాగా.. ఈఏడాది 1,426కు పెరిగాయి. కట్నం కోసం మూడు హత్యలు జరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. వరకట్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టణం శుభపరిణామం. వేధింపులు, లైంగికదాడులు మాత్రం తగ్గగపోగా... రోజురోజుకూ పెరుగుతున్నాయి. తగ్గిన హత్యలు.. హత్య ఘటనలు గతంతో పోల్చుకుంటే కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది హత్యలు 84 జరిగాయి. హత్యాయత్నాలు గతేడాది కంటే 5 పెరిగాయి. హత్యకు కుట్రపన్నిన కేసుల సంఖ్య గత రెండేళ్ల కంటే ఎగబాకింది. ‘నిర్భయ’ వచ్చినా.. మృగాళ్ల కన్ను పసిమెగ్గలపై పడింది. చిన్నారులపై లైంగిక దాడులు, లైంగికదాడికి యత్నాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఓబాలికపై లైంగికదాడి చేసి కిరాతకంగా మట్టుబెట్టాడో దుర్మార్గుడు. 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడులకు సంబంధించి 17 కేసులు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మరో 17 కేసులు నమోదు చేశారు. ఇలామొత్తం 38 కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. 18 ఏళ్లు పైబడి న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడినందుకు నిర్భయ చట్టం కింద 14 కేసులు నమోదయ్యాయి. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ‘నిర్భయ’ కింద మొత్తం 52 కేసులు నమోదయ్యాయి. సంచలన హత్యలు, ఘటనలు... మార్చి 1 : నల్లగొండ మండలం పానగల్ చెరువు వద్ద ముగ్గురు యువకులు దారుణహత్యకు గురయ్యారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని పీఏపల్లి మండలానికి చెందిన ఇద్దరితో పాటు హైదరాబాద్‌కు చెందిన ఒకర్ని వెంటాడి హతమార్చారు. ఏప్రిల్ 29 : జిల్లాకేంద్రంలోని మాన్యంచెల్కకు చె ందిన 11 ఏళ్ల బాలిక ఉస్మతున్నిసా కామాంధుడి చేతిలో బలైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి అతికిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఈ ఘటనపై జిల్లాలో ‘నిర్భయ చట్టం’ కింద కేసు నమోదైంది. ఇదేరోజు వేధింపులు భరించలేక కనగల్ మండలం తుర్కపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో ఎనిమిదేళ్ల బాలిక లైంగికదాడికి గురైంది. నవంబర్ 5 : నల్లగొండ మండలంలోని శేషమ్మగూడెంలో ఇద్దరు వ్యక్తుల్ని మంత్రాల నెపంతో అతిదారుణ ంగా హత్యచేశారు. నవంబర్ 6 : చిలుకూరు మండలం రామాపురం ఉన్నత పాఠశాల విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాడు కీచకంగా ప్రవర్తించాడు. అభంశుభం తెలియని వయసులో ఆమెను గర్భవతి చేసి ఆపై ఆబార్షన్ చేయించాడు. ఈ ఘటనలో ఆ హెచ్‌ఎంతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యవర్తులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. న వంబర్ 23 : సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సులోంచి 2.60 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 15 రోజులపాటు పోలీసులు కష్టపడి ఈ కేసును ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. డిసెంబర్ 17 : జిల్లాకేంద్రంలో బీటెక్ విద్యార్థిని తలారి అరుణపై ఓ ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆరు రోజులపాటు నరకం అనుభవించి మృత్యుఒడికి చేరింది. ఈ ఘటన జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెరిగిన నేరాల సంఖ్య.. జిల్లాలో ఈ ఏడాది నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది మొత్తం 8,499 కేసులు నమోదు కాగా.. ప్రస్తుత ఏడాదిలో 9,590 కేసులు నమోదు చేశారు. ఇందులో 427 కేసులకు సంబంధించి శిక్షలు ఖరార య్యాయి. 119 కేసులను కోర్టు కొట్టివేంది. 5,465 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. వీటిపై కోర్టు తీర్పు వె ల్లడించాల్సి ఉంది. 2,66 కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయి. అంతేగాక ప్రత్యేక, స్థానిక శాంతిభద్రతల (ఎస్ఎల్ఎల్), సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ల కింద 4,848 కేసులు, ఎస్ఎల్ఎల్ కింద 122 కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది 5 జరగగా.. ఈ ఏడాదిలో 9 నమోదయ్యాయి. రాత్రి పూట చోరీలు, సాధారణ దొంగతనాలు, దోపిడీల సంఖ్య కూడా పెరిగింది. -
బాబుకు బ్రాంకైటిస్... తగ్గడం ఎలా?
మా బాబు వయసు ఆరేళ్లు. గత మూడు నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ జ్వరం, కొద్దిపాటి కళ్లె కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలన్నీ చేసి డాక్టర్లు ‘బ్రాంకైటిస్’గా నిర్ధారణ చేసి మందులిచ్చారు. అయినా పెద్దగా ఫలితం కనబడటం లేదు. పూర్తిగా తగ్గాలంటే ఆయుర్వేద చికిత్స సూచింప ప్రార్థన. కె. రాధిక, సిరిసిల్ల మీరు చెప్పిన లక్షణాలను బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘పిత్తజ కాస’గా పరిగణించవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ అసాత్మ్యత (అలర్జీ) కూడా చోటు చేసుకుంటుంది. సాధారణంగా పిల్లలను ఆకర్షించే చాక్లెట్లు, నూడిల్స్, లాలీపాప్స్ ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్ వంటి చిరుతిళ్లను పూర్తిగా నిషేధించాలి. బయటి తిండిని మానేయాలి. ఇంట్లో వండే వంటకాలలో వాడే నూనెలు, రంగులు మొదలైనవాటిల్లో కల్తీ లేకుండా చూసుకోవాలి. బలకరమైన ఆహారంతో బాటు బాదం, జీడిపప్పు వంటి ఎండుఫలాలను తినిపించండి. పాలు, పెరుగు తగు రీతిలో సేవించాలి. ఈ కింద వివరించిన మందుల్ని ఒక నెలపాటు వాడి ఫలితాన్ని సమీక్షించండి. రస పీపరీ రస (మాత్రలు) ... ఉదయం 1, రాత్రి 1. అతిమధురం చూర్ణం రెండు గ్రాములు, ప్రవాళ పిష్ఠి ఒక చిటికెడు కలిపి తేనెతో రెండుపూటలా తినిపించండి. వాసారిష్ట (ద్రావకం) ... ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి, రెండు లేక మూడు పూటలా తాగించాలి. నా వయసు 68. శీతాకాలంలో చర్మం పొడిగా మారి దురదలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేద సూచనలీయగలరు. - ఎస్. మేరీ, విశాఖపట్నం ఆయుర్వేద సూత్రాల రీత్యా ‘రూక్షత్వక’ (పొడిచర్మం)ను నివారించడానికి ఈ కింది విధానాలను పాటించండి. రోజుకి నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఆహారంలో ఆకుకూరలు, మునగకాడలు విరివిగా వాడండి. రోజూ రెండు చెంచాలు నువ్వుల పప్పు (పచ్చిది) నమిలి తినండి. ఉప్పు, కారం తగ్గించాలి. స్నానం కోసం సబ్బులేమీ వాడవద్దు. ముఖాలంకరణకు పౌడర్లు, క్రీములు వాడవద్దు. చెమటపట్టేటట్టు తేలికపాటి వ్యాయామం అవసరం. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రాణాయామం ఉపయోగకరం. స్వచ్ఛమైన నువ్వులనూనెతో శరీరమంతా అభ్యంగనం చేసుకొని, అనంతరం సున్నిపిండి లేదా శనగపిండితో నలుగుపెట్టుకొని, పిదప గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ ప్రక్రియ రోజు విడిచి రోజు చేసినా సరిపోతుంది. ముఖానికి: పాలమీగడ, శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపిన ముద్దను పూసుకొని, 20 నిమిషాల అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ‘కుమార్యాసవం, శారిబాద్యాసవం’ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్ల్లు కలిపి, రెండుపూటలా తాగాలి. నా వయసు 73. మలబద్దకానికి ‘త్రిఫలాచూర్ణం’ వాడవచ్చా? - సిద్ధప్ప, అనంతపురం ‘కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ’... ఈమూడింటిని విడివిడిగా చూర్ణం చేసి సమానంగా కలుపుకుంటే త్రిఫలాచూర్ణం తయారవుతుంది. దీంతో కషాయం కాచుకుని రాత్రి పడుకునేప్పుడు 30 మి.లీ. తాగండి. రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. ఈ ఔషధం గుండెకు, కంటికి, రక్తనాళాలకు, కాలేయానికి, మెదడుకు బలం కలిగించే చక్కటి రసాయనంగా ఆయుర్వేదం వర్ణించింది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
మా వాడి బరువు తగ్గడం ఎలా..?
మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 68 కిలోలు. కొంతకాలంగా వాడి బరువు 62 కిలోల నుంచి క్రమంగా పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగదేమోనని, బరువు ఇంకా పెరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి. - సూర్యారావు, హైదరాబాద్ ప్రస్తుతం టీనేజ్‌లో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ ఆసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనపాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్