
కూల్‌డ్రింక్స్‌తో శరీరం చల్లబడుతుందా?
అవాస్తవం
అపోహ: వేసవిలో కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.
వాస్తవం: చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది.
కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫరిక్ యాసిడ్‌తో కాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనల నివేదికలు చెబుతున్నాయి. పైగా కూల్ డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాల (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందట.
అందుకే కూల్‌డ్రింక్స్‌కు బదులు తాజా పళ్లరసాలు, మజ్జిగ, క్యారట్ జ్యూస్, టొమాటో జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం మేలు. ఒకవేళ కూల్‌డ్రింక్స్ తాగాల్సి వచ్చినా వాటిని చాలా తక్కువ పరిమితిలో ఎప్పుడో ఒకసారి తాగాలి. ముఖ్యంగా పిల్లలకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా పళ్లరసాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది.