సాక్షి, విశాఖపట్నం : ఆమె సేవ డీజీపీని కదిలించింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్నారైలు స్పందించారు. మరిన్ని సేవాకార్యక్రమాలు కొనసాగించేలా ఆర్థికసాయం అందించారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో ఆయాగా పనిచేస్తున్న లోకమణి ఈనెల 15న వేతనం తీసుకుని ఇంటికి వెళ్తూ పాయకరావుపేట వై జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెండు డ్రింక్ బాటిళ్లు కొనిచ్చిన సంగతి తెలిసిందే.