
ఓహో.. బాటిల్‌నూ తినేయొచ్చు..!
ఇకపై నీళ్లు తాగేసి వాటర్ బాటిళ్లను చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులను రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు. చిత్రంలో చూస్తున్న ఈ ‘ఓహో’ ఆల్గే బెలూన్‌లను బాటిల్‌గా ఉపయోగిస్తే చాలు..
లండన్: ఇకపై నీళ్లు తాగేసి వాటర్ బాటిళ్లను చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులను రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు. చిత్రంలో చూస్తున్న ఈ ‘ఓహో’ ఆల్గే బెలూన్‌లను బాటిల్‌గా ఉపయోగిస్తే చాలు.. తాగాల్సింది తాగేసి, బాటిల్‌ను కూడా లొట్టలేసుకుంటూ తినేయొచ్చు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు.
గోధుమ రంగు నాచు (బ్రౌన్ ఆల్గే) నుంచి సోడియం అల్జినేట్ అనే పదార్థాన్ని తీసుకుని దానికి కాల్షియం క్లోరైడ్, జెల్ పదార్థాన్ని కలిపి జిగురు పొరలతో కూడిన ఈ ఓహో బెలూన్‌లను తయారు చేశారు. వివిధ ఆకారాల్లోకి మార్చి వీటి జిగురు పొరల మధ్య ద్రవాలను సురక్షితంగా నిల్వచేయొచ్చు. ప్యాకింగ్‌కూ అనుకూలంగా ఉండే ‘ఓహో’ ఆల్గే బెలూన్లు పర్యావరణహితమైనవే కాకుండా ఎంతో చవకైనవి కూడా.