
సాక్షి, విశాఖపట్నం : ఆమె సేవ డీజీపీని కదిలించింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్నారైలు స్పందించారు. మరిన్ని సేవాకార్యక్రమాలు కొనసాగించేలా ఆర్థికసాయం అందించారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో ఆయాగా పనిచేస్తున్న లోకమణి ఈనెల 15న వేతనం తీసుకుని ఇంటికి వెళ్తూ పాయకరావుపేట వై జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెండు డ్రింక్ బాటిళ్లు కొనిచ్చిన సంగతి తెలిసిందే.
(చదవండి : మనసున్న మహిళకు డీజీపీ అభినందనలు)
ఇది సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. డీజీపీ ప్రసంశలు అందుకోవడమే కాకుండా, కళాశాల యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ రెండు ఘటనలు చూసిన ఎన్నారైలు స్పందించారు. కాలిఫోర్నియాకు చెందిన ఎన్నారై రూ.37 వేలు, మరో ఎన్నారై సత్యప్రకాష్ రూ.40 వేలు ఆర్థిక సాయం అందించారు. ఫోన్‌నంబరు తెలుసుకుని తనతో మాట్లాడి బ్యాంకు ఖాతాలో ఈ నగదు మొత్తాన్ని జమ చేసినట్లు లోకమణి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment