Mother And Daughter Died After Consuming Chicken Curry And Soft Drinks In Thoothukudi - Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన చికెన్‌ గ్రేవీ, శీతల పానీయం?

Published Thu, Oct 14 2021 6:41 AM | Last Updated on Fri, Oct 15 2021 2:38 PM

Mother And Daughter Deceased With Poisonous Food - Sakshi

సాక్షి, చెన్నై: ఆహారంలో తీసుకున్న చికెన్‌ గ్రేవీ, శీతల పానీయం విషతుల్యమై కుమార్తెతో సహా తల్లి కుమార్తె విగతజీవులయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టిలోని తంగప్ప నగర్‌కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్‌లో చికెన్‌ గ్రేవిని బుధవారం కొన్నారు. మధ్యాహ్నం భోజనంలో ఆ చికెన్‌ గ్రేవీని కుమార్తె దర్శిని(4)తో పాటు కర్పగం తీసుకున్నారు.

అజీర్ణం సమస్య తలెత్తడంతో మరో దుకాణంలో ఓ శీతలపానీయం బాటిల్‌ తీసుకొచ్చి తల్లి, కుమార్తె తాగారు. కొంతసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వీరి మరణానికి చికెన్‌ గ్రేవీ లేదా శీతల పానీయం కారణం కావొచ్చని మృతుల బంధువులు ఫిర్యా దు చేయడంతో కోవిల్‌పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది 

చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement