కూల్ డ్రింక్స్(ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అందులోనూ సోడా ఉండే వాటిని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు. వేసవికాలం, చలికాలం అనే సంబంధం లేకుండా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల కన్నా... ఆరోగ్య సమస్యలే ఎక్కువ.
కూల్ డ్రింకులు, సోడాలు, చక్కెర పానీయాలు తాగడం వల్ల మధుమేహం,ఊబకాయం, కొవ్వు పెరిగి కాలేయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు సోడాకు బదులు డైట్ సోడా తాగితే ఆరోగ్యంపై అంతగా ప్రభావం ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ, మెటబాలిక్ సిండ్రోమ్, అలాగే స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
మరి కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా వినియోగం కూడా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే విధంగా.. రసాయనాలు కలిసిన కూల్‌డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు.
చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment