తోటకూర సమోసా కావలసినవి:
తోటకూర తురుము – ఒకటిన్నర కప్పులు
టొమాటో గుజ్జు – పావు కప్పు (నిప్పులపై కాల్చి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి)
స్వీట్ కార్న్ – పావు కప్పు (ఉడికించుకోవాలి)
తాలింపు సామాన్లు – కొన్ని
మైదా పిండి – 2 కప్పులు
గోధుమ పిండి – 1 కప్పు.
ఉప్పు – సరిపడా,
నూనె – తగినంత
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో మైదా పిండి, గోధుమ పిండి, కొద్దిగా ననె, సరిపడా నీళ్లు, ఉప్పు వేసుకుని చపాతీ ముద్దలా చేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు తాలింపు పెట్టుకుని.. అందులో టొమాటో గుజ్జు, తోటకూర తురుము వేసుకుని చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అనంతరం చపాతీ పిండిని ఉండల్లా చుట్టుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, చిన్న చిన్న సమోసాల్లా చుట్టుకోవాలి. తర్వాత ప్రతి సమోసాలో.. కొద్దికొద్దిగా తోటకూర మిశ్రమంతో పాటు ఒక టీ స్పూన్ స్వీట్ కార్న్ వేసుకుని.. ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన ననెలో వేయించి తీసి.. సర్వ్ చేసుకోవాలి.
(చదవండి: పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment