పెదవులకు కొత్తిమీర!
బ్యూటిప్స్
పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే సరి. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపుదనం పోయి ఎర్రగా మారుతాయి. అలాగే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ ఉంటే మార్పును వెంటనే చూడొచ్చు. చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూను ఉల్లిపాయ రసాన్ని, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. ఓ అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది.
టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్‌లో భద్రపరచాలి. రాత్రి పడుకునేముందు చేతులను శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఎండవల్ల నలుపుగా మారిన చేతులపై చర్మం సహజ రంగులోకి మారుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.