చర్మం లాగానే జుట్టు కూడా పొడిబారుతుంది. ముఖ్యంగా చల్లని శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చుండ్రు సమస్యకూడా ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి జుట్టును తేమగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం, ఎక్కువ హైడ్రేటింగ్ షాంపూలను ఉపయోగించడం లాంటివి చెయ్యాలి. కండిషనింగ్ విషయంలో నువ్వుల నూనె బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి జుట్టు సంరక్షణలో ఎలా వాడవచ్చో తెలుసుకుందాం!
జుట్టు సంరక్షణలో నువ్వులు
కప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో నువ్వుల పొడి, నాలుగు మందార పువ్వులు, పది కరివేపాకులు వేసి సన్నని మంటమీద మరిగించాలి.
మందారపువ్వులు, కరివేపాకు వేగాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. రెండురోజుల కొకసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి.
క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లనువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment