Hair Care: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్‌! ఒత్తైన జుట్టు ఇంకా.. | Hair Care Tips: Black Sesame Oil Amazing Benefits Control Dandruff | Sakshi
Sakshi News home page

Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్‌! ఒత్తైన జుట్టు ఇంకా..

Published Fri, Dec 9 2022 12:19 PM | Last Updated on Fri, Dec 9 2022 12:34 PM

Hair Care Tips: Black Sesame Oil Amazing Benefits Control Dandruff - Sakshi

Beauty- Hair Care Tips In Telugu: జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా ఈ చిట్కాలు ట్రై చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల నువ్వుల పొడి కలిపిన కొబ్బరినూనె తలకు రాసుకుంటే చుండ్రు తగ్గడమే కాకుండా.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇలా తయారు చేసుకోవాలి..
►కప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.
►అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి.
►దీనిలో నువ్వులపొడి, నాలుగు మందార పువ్వులు, రెండు కరివేప రెబ్బలూ వేసి సన్నని మంటమీద మరిగించాలి.

►మందారపువ్వులు, కరివేపాకు క్రిస్పీగా మారాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి.
►రెండురోజులకొకసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి.
►క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. 

నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు
►తెల్ల నువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి.
►యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి. 

చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్‌ అదే!
Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం
Actress Rekha: కొబ్బరి నూనె, పెరుగు, తేనె.. కేశాల ఆరోగ్యం కోసం ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ రేఖ చెప్పిన చిట్కాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement