ప్రతీకాత్మక చిత్రం
కురులు ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరకుంటుందనడంలో సందేహం లేదు. కానీ కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలడం సహా చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
►కొబ్బరి నూనె, ఆముదం సమపాళ్లల్లో తీసుకుని చక్కగా కలపాలి.
►ఈ నూనెను మాడుకు, జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పదినిమిషాలపాటు మర్దన చేయాలి.
►రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి.
►వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఆముదంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టుకు అంది చుండ్రు రానివ్వకుండా చేస్తాయి.
►కురులలో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ దరిచేరవు.
►పీహెచ్ స్థాయులు నియంత్రణలో ఉండి జుట్టురాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఇవి తింటే ఆరోగ్యకరమైన కేశాలు
►బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కురుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
►రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి.
►బ్రకోలి, పాలకూర, కాకరకాయ, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి.
►తులసి, పుదీనా, సొరకాయల జ్యూస్.. బెల్లం, తులసి ఆకులతో చేసిన టీ కూడా జుట్టుకు పోషణ అందిస్తుంది.
చదవండి: Breast Cancer Screening: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు! ఇంకా వీరికి
Comments
Please login to add a commentAdd a comment