Sesame
-
శీతాకాలంలో చుండ్రు, జుట్టు సమస్యలు : నువ్వులతో చెక్
చర్మం లాగానే జుట్టు కూడా పొడిబారుతుంది. ముఖ్యంగా చల్లని శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చుండ్రు సమస్యకూడా ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి జుట్టును తేమగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం, ఎక్కువ హైడ్రేటింగ్ షాంపూలను ఉపయోగించడం లాంటివి చెయ్యాలి. కండిషనింగ్ విషయంలో నువ్వుల నూనె బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి జుట్టు సంరక్షణలో ఎలా వాడవచ్చో తెలుసుకుందాం!జుట్టు సంరక్షణలో నువ్వులుకప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో నువ్వుల పొడి, నాలుగు మందార పువ్వులు, పది కరివేపాకులు వేసి సన్నని మంటమీద మరిగించాలి. మందారపువ్వులు, కరివేపాకు వేగాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. రెండురోజుల కొకసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లనువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి. -
శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!
చలికాలం వచ్చేసింది. కీళ్లు బిగుసుకుపోతుంటాయి. నువ్వులతో దేహాన్ని వెచ్చబరచాలి. ఎముకలకు తగినంత శక్తినివ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పాటు ఒక ఓట్స్ లడ్డు. ఈవెనింగ్ స్నాక్‌గా డేట్స్ లడ్డు. రాత్రి భోజనంలోకి వేడిగా నువ్వుల రైస్. చలికాలం పేజీలను నవ్వుతూ తిప్పేద్దాం. డేట్స్ లడ్డు. కావలసినవి: కర్జూరాలు – 300 గ్రాములు (సీడ్లెస్ అయితే 280 గ్రాములు చాలు); నువ్వులు – కప్పు; నువ్వులు – పావు కప్పు (పైన చల్లడానికి); జీడిపప్పు పలుకులు – పావు కప్పు; యాలకులు – 4.తయారీ: ∙మంద పాటి బాణలిలో నువ్వులను (అన్నింటినీ) వేయించాలి (నూనె వేయకూడదు). చల్లారిన తర్వాత పావు కప్పు విడిగా తీసి పెట్టుకుని మిగిలిన నువ్వులను, యాలకులకు మిక్సీలో పొడి చేయాలి ∙కర్జూరాలను గింజలు తొలగించి వెడల్పు పాత్రలో వేసి చిదమాలి. అందులో నువ్వుల పొడి వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదుముతూ కల పాలి. బాగా కలిసిన తరవాత జీడిపప్పు పలుకులను వేసి పెద్ద నిమ్మకాయంత సైజులో లడ్డులు చేయాలి. వేయించి పక్కన తీసి పెట్టిన నువ్వులను ఒక ప్లేట్లో పలుచగా వేయాలి. లడ్డును ఆ నువ్వుల మీద పెట్టి రోల్ చేయాలి. లడ్డుకు అంటుకున్న నువ్వులు రాలిపోకుండా ఉండడానికి రెండు అర చేతుల్లో పెట్టి గట్టిగా అదమాలి. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి. ఓట్స్ సెసెమీ లడ్డు కావలసినవి: ఓట్స్ – పావు కేజీ; నువ్వులు – పావు కేజీ; యాలకులు – 4; బెల్లం తురుము – ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు – 20తయారీ: ∙మంద పాటి పాత్రలో ఓట్స్ వేసి మీడియం మంట మీద వేయించాలి (నూనె లేకుండా). చిటపటలాడుతుంటే సమంగా వేగినట్లు గుర్తు. చిటపటలాడేటప్పుడు ఒకసారి గరిటెతో కలియతిప్పి దించేయాలి. వేగిన ఓట్స్‌ను ఒక ప్లేట్లోకి మార్చి అదే పాత్రలో నువ్వులను వేయించాలి. నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఓట్స్, నువ్వులు, యాలకులను కలిపి మిక్సీలో పొడి చేయాలి. అందులో బెల్లంపొడి వేసి మరోసారి తిప్పాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పోసి చేత్తో చిదిమినట్లు కలిపి, జీడిపప్పు పలుకులు కలిపి పెద్ద నిమ్మకాయంత లడ్డులు చేయాలి. ఇవి వారం రోజులు తాజాగా ఉంటాయి.నువ్వుల రైస్కావలసినవి: నువ్వులు – వంద గ్రాములు; బియ్యం – పావు కేజీ; ఎండుమిర్చి – 6; మినప్పప్పు – టీ స్పూన్ ; నువ్వుల నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు.తయారీ: ∙బియ్యం కడిగి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి. వెడల్పు పాత్రలోకి మార్చి చల్లారనివ్వాలి. అందులో ఉప్పు, టీ స్పూన్ నువ్వుల నూనె వేసి గరిటెతో జాగ్రత్తగా కల పాలి మిగిలిన నూనె బాణలిలో చేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేయించాలి. అవి వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చిట్లుతున్న శబ్దం వచ్చిన తర్వాత ఒక అరనిమిషం పాటు బాగా కలియబెట్టి స్టవ్ ఆపేయాలి నువ్వులు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో ముందుగా ఎండుమిర్చి వేసి పొడి చేయాలి. అవి గరుకుగా మెదిగిన తర్వాత బాణలిలో ఉన్న అన్నింటినీ వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని అన్నం మీద పలుచగా చల్లాలి అదే బాణలిలో పోపు కోసం తీసుకున్న నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించాలి. ఈ పోపును అన్నంలో వేయాలి. నువ్వుల పొడి, పోపు సమంగా కలిసే వరకు గరిటెతో కలపాలి. రుచి చూసుకుని అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. -
ఈ సీజన్లో స్పెషల్ లడ్డూ : రోజుకొకటి తింటే లాభాలెన్నో!
పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం. నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.నువ్వుల లడ్డూ తయారీకావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. తయారీముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.నువ్వులను ఇలా పలురకాలుగా నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. -
బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్.. ఏ దేశం వంటకం అంటే..
ప్రతి దేశం ఒక్కో రకమైన వంటకంలో ఫేమస్ అవుతుంది. ఆ వంటకం పేరు వినగానే వెంటనే ఆ దేశం లేదా ప్రాంతం పేరు మనకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా కొన్ని రకాల వంటకాలు మన మనసులో స్థానం దక్కించుకుంటాయి. అలానే ఇక్కడొక వంటకం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వంటకం మన భారతీయ వంటకానికి దగ్గర పోలిక ఉన్న రెసిపీలానే ఉంటుంది. కానీ వాళ్లు తయారీ చేసిన విధానం మాత్రం వావ్ అనాల్సిందే. ఇంతకీ ఏంటా వంటకం, ఏ దేశానికి సంబంధించింది అంటే..జపాన్ పాకశాస్త్ర నిపుణులు బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేశారు. అది ఎక్కడ వంకర లేకుండా..గుండ్రటి బంతి ఆకారంలో ఉంది. పైగా ప్లేటంతా ఆక్రమించేసింది. దీన్ని ఎలా చేస్తారంటే..మైదాపిండికి కొద్ది మోతాదు బొంబాయిరవ్వను కలిపి పులియబెట్టేలా కొద్దిగా ఈస్ట్ జోడించి చపాతి పిండి మాదిరిగా నీళ్లతో కలిపి ఒక పక్కన ఉంచాలి. తర్వాత చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలిన. కానీ వేయించేటప్పుడూ బంతి షేపులోకి పొంగేలా జాగ్రత్తగా వేయించాలి. అంతేగాదు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానిస్తే అంతలా అవి డీప్ ఫ్రై చేసేటప్పుడూ కచ్చితమైన చందామామ లాంటి ఆకృతికి వస్తాయి. మన ఇండియన వంటకమైన భాతురా రెసిపీకి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. ఇది పంజాబీ వంటకం. ఇది కూడా ఒక విధమైన పులియబెట్టిన బన్ లేదా పూరీ మాదిరిగా ఉండే వంటకం. మనం ఎలా అయితే పూరీలను సెనగలు ఆలు కర్రీ లేదా కుర్మాతో తింటామో అలానే ఈ జపాన్ రెసీపీని కూడా ఇంచుమించుగా అదే మాదిరి స్పైసీ కర్రీతో తింటారట అక్కడ ప్రజలు. దీన్ని వాళ్లు "జెయింట్ సెసేమ్ బాల్" అని పిలుస్తారట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెసిపీని కాస్మిక్ భాతురా, బంతి ఆకారపు పూరీ అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by むにぐるめ(唯一無二の絶品グルメ) (@muni_gurume_japan) (చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
నువ్వుల నూనెతో మాయ చేద్దాం రండి!
వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్ మొదలవుతుంది. పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు, ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు, బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయింటే నువ్వుల నూనెతో నలుగులు, మసాజ్‌లు ఆ సందడే వేరుగా ఉండేది. వేల ఏళ్లుగా మన సంస్కృతిలో, మన ఆహార పదార్థాల్లో కీలకమైనవి నువ్వులు. నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదాహరణకు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.ఫైబర్ ఎక్కువనువ్వుల గింజలలో పైబర్ ఎక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు. రక్తపోటును తగ్గించడంలోనువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు , స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకం. అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలకు మంచి శక్తినిస్తుంది. సౌందర్య పోషణలోనువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో మాడును మసాజ్ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి. రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది. -
క్రంచీ..క్రంచీ ఎల్లు చిక్కీ: చాలా సింపుల్‌గా, చక చకా !
సంక్రాంతి అంటేనే స్వీట్ల పండుగ. అరిసెలు, పూతరేకులు, కొబ్బరి బూరెలు, కరకజ్జ, జంతికలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే వీటికి సమయంతోపాటు, నైపుణ్యం కూడా కావాలి. అందుకే చాలా తేలిగ్గా, తక్కువ సమయంలో, చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే స్వీట్ గురించి తెలుసుకుందాం. ఎల్లు చిక్కీ. అంటే నువ్వులు ( తెల్లవి, నల్లవి) బెల్లంతో కలిపి తయారుచేసుకునే రుచికరమైన , క్రిస్పీ స్వీట్. ఎల్లు అంటే తమిళంలో నువ్వులు అని అర్థం. నువ్వుల చిక్కిని ఎల్లు మిట్టై, నువ్వుల బర్ఫీ,టిల్ చిక్కి అని కూడా అంటారు. ఇందులో జీరో షుగర్ , జీరో ఆయిల్ అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్గా హ్యాపీగా తినవచ్చు ముఖ్యంగా నువ్వులు పెరుగుతున్న పిల్లలకు మంచి శక్తిని ఇస్తాయి. వృద్ధులు, మహిళల ఆరోగ్యం కోసం ఎల్లు చిక్కీని నెలకోసారి చేసుకుని రోజూ కనీసం ఒక్క పట్టీ అయినా తినాలి. కావలసిన పదార్థాలు నువ్వులు – పావు కేజీ; బెల్లం – పావు కేజీ; నెయ్యి –కొంచెం ఎలా చేసుకోవాలి? నువ్వులను మందపాటి పెనంలో వేసి సన్నమంట మీద వేయించాలి. చిటపట పేలడం మొదలు పెట్టిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అపుడు స్టవ్ ఆపేసి పెనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మరొక పాత్రలో బెల్లంతోపాటు, కొద్దిగి నీళ్లు వేసుకుని, మరిగేవరకు మీడియం మంట మీద ఉంచాలి. కరిగిన తర్వాత మంట తగ్గించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో నువ్వులు, నెయ్యి వేసి కలపాలి. ఒక వెడల్పాటి ప్లేట్‌కు నెయ్యి రాసి బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని వేసి పూరీల కర్రతో అంతటా ఒకేమందం వచ్చేటట్లు వత్తాలి. వేడి తగ్గిన తర్వాత చాకుతో ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి వేరు చేసి గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు వారాల పాటు నిల్వ ఉంటాయి. వేరుశెనగలను కూడా కలుపుకొని కూడా కావాలంటే లడ్డూల్లా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్దగా నెయ్యి అవసరం పడదు. ఎల్లు చిక్కీ లాభాలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ మలబద్దకాన్ని నివారిస్తుంది, వాపులను తగ్గిస్తుంది పొత్తికడుపు కొవ్వును కరిగిస్తుంది. ఎనర్జీ బూస్టర్, జీర్ణ ఆరోగ్యం -
Health: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల
Health Tips In Telugu: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. దానికి పిల్లలు, పెద్దలు అనేం లేదు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలలో మానసికంగా చురుగ్గా ఉంచే కొన్ని కారకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు గుర్తించారు. వాటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండగలం. అవేమిటో చూద్దాం. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్.. పేరు ఏదైనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలు తీసుకోండి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండండి. పొద్దుతిరుగుడు గింజలు... వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. వెల్లుల్లి... వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణ ఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. గుడ్లు... గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సంతృప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థం గా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. నువ్వులు... నువ్వులతో తయారుచేసే పదార్థాలలో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల ఉండలను తినిపించి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. నువ్వులతో రకరకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా పదార్థాన్ని రుచిగా ఉండేలా తయారు చేసుకోవడం వల్ల వాటిని తినే విధంగా మెదడు కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
Recipe: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా
ఈ కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంచుమించు ప్రతి ఒక్కరినీ తరచు జలుబు పీడిస్తుంటుంది. పిల్లలకు ఇష్టమైనవి వండినా సరే... నాలుకకు రుచి తెలియక మారాం చేస్తారు. రుచిగా... ఆరోగ్యంగా ఇలా వండి చూడండి.. పిల్లలలే కాదు, పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. నువ్వుల అన్నం కావలసినవి: ►బియ్యం – 2 కప్పులు (అన్నం పలుకుగా వండాలి) ►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు ►ఎండు మిర్చి– 4 ►మినప్పప్పు – టీ స్పూన్ ►పచ్చి శనగ పప్పు – టేబుల్ స్పూన్ ►ఆవాలు– అర టీ స్పూన్ ►పసుపు – అర టీ స్పూన్ ►వేరుశనగపప్పు – 2 టీ స్పూన్లు ►వెల్లుల్లి – 4 రేకలు ►ఇంగువ– చిటికెడు ►కరివేపాకు – రెండు రెమ్మలు ►నువ్వుల నూనె లేదా సాధారణ వంట నూనె– రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి తగినంత. తయారీ: మందపాటి పెనంలో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, నువ్వులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తరవాత మెత్తగా పొడి చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచాలి మరొక వెడల్పాటి పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత వేరుశనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి కలిపి దించేయాలి. ఇందులో అన్నం, ఉప్పు, నువ్వుల మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇవి కూడా ట్రై చేయండి: Green Amla Juice: డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గ్రీన్ ఆమ్ల జ్యూస్.. బీపీ క్రమబద్ధం చేసే డ్రింక్! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ -
Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్!
చికెన్, కోడిగుడ్లు, మొక్కజొన్న పిండి, నువ్వులు సెసెమీ క్రస్టెడ్ చికెన్ ఇలా తయారు చేసుకోండి! కావలసినవి: ►బోన్‌లెస్ చికెన్ – ఒక కేజీ (ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి) మారినేషన్ కోసం: ►పెరుగు – కప్పు ►నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు ►పచ్చి బొప్పాయి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్ ►గరం మసాలా పొడి– ఒక టీస్పూన్ ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►నూనె – 3 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినంత) కోటింగ్ కోసం: ►కోడిగుడ్లు – 3 ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – అర టీ స్పూన్ ►నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి – 6 (సన్నగా తరగాలి) ►వెల్లుల్లి పేస్ట్– టీస్పూన్ ►మిరప్పొడి – టీ స్పూన్ ►వెనిగర్ – టేబుల్ స్పూన్ ►బెల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్.. తయారీ: ►చికెన్‌ను శుభ్రం చేసి, మారినేషన్ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ►కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక పాత్రలో వేసి కలపాలి. ►మారినేట్ చేసిన చికెన్ ముక్కలను కోటింగ్ మిశ్రమంలో వేసి తీసి నువ్వులలో వేసి (చికెన్ ముక్కల మసాలాలకు నువ్వులు అంటుకునేటట్లు) కలపాలి. ►అవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నిమిషాల పాటు బేక్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Til Ki Barfi And Sesame Veg Salad: నువ్వులతో ఆరోగ్యం.. తిల్ కీ బర్ఫీ, సెసెమీ వెజ్ సలాడ్ తయారీ ఇలా! Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్‌పటే కోకోనట్, బటాడా వడ తయారీ -
Sesame Recipes: నువ్వుల వంటలు.. తిల్ కీ బర్ఫీ, సెసెమీ వెజ్ సలాడ్ తయారీ ఇలా!
Til Ki Barfi And Sesame Veg Salad Recipes: వర్షం... పడిశం కలిసి వస్తాయి. చలి... కీళ్ల నొప్పులు ఒకదాని వెంట మరొకటి వస్తాయి. వర్షాకాలం... చలికాలాల్లో... ఆహారంలో ‘నువ్వు’ ఉంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. అందుకే... మన ‘వంటిల్లు’లో ‘నువ్వుల వంటలు’.. తిల్ కీ బర్ఫీ కావలసినవి: ►నువ్వులు– ఒక కప్పు ►నెయ్యి – రెండు టేబుల్ స్పూన్ ►కోవా– అర కప్పు ►చక్కెర – కప్పు ►నీరు – కప్పు. తయారీ: ►మందపాటి బాణలిలో నువ్వులను సన్నమంట మీద చిటపటలాడే వరకు వేయించి బాణలిని స్టవ్ మీద నుంచి దించాలి. ►స్టవ్ మీద మరొక బాణలి పెట్టి అందులో నెయ్యి, కోవా వేసి బాగా కలుపుతూ సన్నమంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. ►ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి వెంటనే వేయించిన నువ్వులను వేసి కలిపి వేడి తగ్గేవరకు పక్కన ఉంచాలి. ►మరొక పాత్రలో చక్కెర, నీరు కలిపి చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు గరిటతో కలుపుతూ మరిగించాలి. ►తీగపాకం రాగానే ముందుగా సిద్ధం చేసిన నువ్వులు, కోవా మిశ్రమాన్ని వేసి కలపాలి. ►ఒక ప్లేటుకు నెయ్యి రాసి అందులో పై మిశ్రమాన్ని వేసి సమంగా సర్దాలి. ►కొద్దిగా వేడి తగ్గిన తర్వాత నచ్చిన ఆకారంలో కట్ చేసి చల్లారే వరకు పక్కన ఉంచాలి. ►చల్లారిన తర్వాత బర్ఫీలను గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం– పది రోజుల వరకు తాజాగా ఉంటాయి. ►భోజనం తరవాత ఒక బర్ఫీ తింటే దేహానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. ఏషియన్ సెసెమీ వెజ్ సలాడ్ కావలసినవి: ►నువ్వులు – ఒక టేబుల్ స్పూన్ (దోరగా వేయించాలి) ►లెట్యూస్ లేదా క్యాబేజీ ఆకులు – ఒక కప్పు ►సన్నగా నిలువుగా తరిగిన బాదం పప్పు – ఒక టీస్పూన్ ►తోటకూర లేదా చుక్కకూర – అరకప్పు. డ్రెసింగ్ కోసం: ►ఆలివ్ ఆయిల్ – ఒక టీ స్పూన్ ►సోయాసాస్ – ఒక టీ స్పూన్ ►నువ్వు పప్పు నూనె – పావు టీ స్పూన్ ►ఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంత. తయారీ: ►ఒక పాత్రలో నువ్వులు, లెట్యూస్, బాదం పప్పు, ఆకుకూరలను వేసి కలపాలి. ►మరొక పాత్రలో డ్రెసింగ్ కోసం తీసుకున్నవన్నీ వేసి చిలికి పైమిశ్రమంలో వేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి! Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి -
దిల్ ‘మ్యాంగో’మోర్... సమ్మర్ ఎండ్ పికిల్స్ ట్రెండ్
వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు... ► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది. ► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని విషయం. ► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. ► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్ . ► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్‌లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి మరింతగా నిల్వ ఉంటుంది. ► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. ► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా. భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్‌డ్రాప్ డైరెక్టర్ మితేష్ లోహియా గుర్తు చేసుకున్నారు. -
Healthy Recipes: నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.. కాబట్టి
కొత్త క్యాలెండర్ వచ్చింది. సంక్రాంతి తేదీని తెచ్చింది. నాన్న కొత్త దుస్తులు తెచ్చాడు. అమ్మ పిండివంటలకు సిద్ధమవుతోంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడూ చేసే అరిశెలేనా! మరి... అరిశె బదులు మరేం చేసినా... సంక్రాంతి... పండుగ కళ తప్పుతుంది. అందుకే ఆరోగ్యాన్ని పెంచే అరిశెలనే చేద్దాం. అరిశెలతోపాటు మరికొన్నింటినీ చేద్దాం. ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదిద్దాం. సంక్రాంతి పిండివంటల్లో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యకరమైనవే. బెల్లంలో ఐరన్ ఉంటుంది. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేస్తుంది. జంక్ ఫుడ్ మాదిరిగా వీటిని తినగానే ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం జరగదు. నెమ్మదిగా డెవలప్ అవుతాయి. వీటిలో పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పండుగలకే కాకుండా రోజూ స్నాక్స్‌గా తీసుకుంటే మంచిది. ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు ఒంట్లోకి ఎక్కువ కేలరీలు చేరిపోవడంతో అధిక బరువు సమస్య వస్తుంటుంది. చక్కటి డైట్ ప్లాన్‌తో వీటిని రోజుకు ఒకటి తింటే మంచిది. పిల్లలకు స్కూల్‌కి ఇతర స్నాక్స్‌కు బదులుగా వీటిని అలవాటు చేయవచ్చు. సహజంగా పోషకాలు, కేలరీలు అందుతాయి. వీటిని తిన్న తరువాత పిల్లలకు కాని పెద్దవాళ్లకు కాని చిప్స్ వంటి ఇతర జంక్‌ఫుడ్ మీదకు మనసు పోదు. అయితే వీటిని తయారు చేయడానికి మంచినెయ్యి వాడాలి. అరిశెలు కావలసినవి: బియ్యం – ఒక కిలో బెల్లం – 800 గ్రా., నువ్వులు, గసగసాలు– కొద్దిగా నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత (సుమారుగా ఒక కేజీ తీసుకుంటే చివరగా బాణలిలో పావుకేజీ మిగులుతుంది) తయారీ: అరిశెలు చేయడానికి ముందు రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి ∙జల్లించేటప్పుడు పిండి ఆరిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి ∙పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి పెద్దపాత్రలో ఒక గ్లాసు నీరు, పొడి వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి ∙పాకంపిండిని చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి ∙అప్పుడు పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నూనెలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి ∙అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి ∙వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు. గమనిక:– అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్ వాడవచ్చు ∙అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకం ముదరనివ్వాలి. ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. జారి పోకుండా రౌండ్ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్ ఉంటే అందులో కూడా వేడి చేసుకోవచ్చు. సకినాలు కావలసినవి: కొత్త బియ్యం– అరకిలో, వాము– ఒక టేబుల్ స్పూన్, నువ్వులు– పావు కప్పు, ఉప్పు– రుచికి తగినంత, నూనె– వేయించడానికి తగినంత. తయారీ: బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని వంపేసి మెత్తగా పిండి పట్టాలి. పిండిని జల్లించిన తర్వాత ఆ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. ఈ పొడి మిశ్రమంలో తగినంత నీటిని పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. కాటన్ క్లాత్‌ను తడిపి పలుచగా పరిచి దాని మీద పిండిని సకినాల ఆకారంలో చేత్తో చుట్టూ అల్లాలి. పది నిమిషాల సేపు ఆరనివ్వాలి. ఈ లోపు బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆరిన సకినాన్ని నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలనిచ్చి తీసేయాలి. పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో సన్నని తాడుగా వలయాకారంగా చేయడానికి నైపుణ్యం ఉండాలి సకినాలు చేయడంలో అసలైన మెలకువ అదే. చదవండి: Radish Health Benefits: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. -
Health Tips: తిలలు తింటే ఎంతో మేలు.. అయితే, అలర్జీలు రావచ్చు అతి వద్దు!
Sesame Seeds Benefits: నవధాన్యాలలో నువ్వులు ఒకటి. సంస్కృతంలో తిలలు అంటారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ►ముఖ్యంగా ఊరగాయ పచ్చళ్లలో నువ్వుపప్పునూనె వాడటం వల్ల అవి చాలా కాలం నిల్వ ఉండటమేగాక రుచికరంగా కూడా ఉంటాయి. దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు. నువ్వులను దంచి చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు. ►బ్రెడ్‌లోనూ, బర్గర్లలోనూ, వివిధ రకాల వంటకాలలో, కూరలలోనూ వేస్తారు. వేయించి, పొడికొడతారు. పచ్చడి కూడా చేస్తారు. ►నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులోని జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ►నువ్వులు ఒమేగా–3, ఒమేగా –6, ఒమేగా– 9 ఆమ్లాలను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలకు దోహద పడతాయి. ►గ్లాసు పాలలో కన్నా, చెంచా నువ్వులలో ఎక్కువ క్యాల్షియం ఉంటుందని రుజువైంది. నువ్వులు రుచిగా ఉంటాయి కానీ, వీటివల్ల కొందరిలో అలర్జీ కలగవచ్చు. ►అలాగే, ఇవి అమితంగా వేడి చేసే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వేసవిలో ఎక్కువ తినరాదు. ►అయితే శీతాకాలంలో నువ్వులను వాడటం వల్ల శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందుతుంది. అందుకే శీతాకాలంలో సంక్రాంతి పండుగకు నువ్వుల ఉండలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం, ఈ పండుగ ప్రత్యేకమైన అరిశలకు నువ్వులను అద్దడం ఆచారంగా మారింది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
మైమిర్చి తినండి
వంటలో ఈ మంట లేకపోతే రుచి ఉండదు. ఘాటు నషాళానికి అంటితే తప్ప తృప్తి కలగదు. కారం భోజనానికి అలంకారం. పచ్చి మిర్చిది అందులో ప్రథమ భాగం. సాధారణంగా మిరపకాయను ఒక కాయగూరగా చూడరు. చూస్తే ఇన్ని వండచ్చు. మైమిరిచి తినొచ్చు. షాహీ హరీ మిర్చి కావలసినవి: పచ్చి మిర్చి – 8 (పెద్దవి); వేయించిన పల్లీలు – అర కప్పు; వేయించిన నువ్వులు – పావు కప్పు; వేయించిన కొబ్బరి ముక్కలు – అర కప్పు; నూనె – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 3; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం ముద్ద – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పెరుగు – ఒక కప్పు; చింత పండు గుజ్జు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట. తయారీ: ►పచ్చి మిర్చిని మధ్యకు చీల్చి పక్కన ఉంచాలి ►వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, వేయించిన కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక మిరప కాయలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద మరొక బాణలిలో పావు కప్పు నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాక, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి, తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని జత చేసి కలియబెట్టాలి ►ఉప్పు, మూడు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి ఉడికించాలి ►కొద్దిగా చిక్కబడిన తరవాత, కప్పు పెరుగు జత చేసి రెండు నిమిషాల పాటు మూత ఉంచి ఉడికించాలి ►చింతపండు గుజ్జు, బెల్లం పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►మిశ్రమం చిక్కబడుతుండగా, వేయించి పెట్టుకున్న మిర్చి జత చేసి, కలియబెట్టి మరోమారు మూత ఉంచాలి ►సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఒక ప్లేటులోకి తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ వెజిటబుల్ రెసిపీ కావలసినవి: పచ్చి మిర్చి – 200 గ్రా.; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – అర టేబుల్ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టేబుల్ స్పూను; ధనియాల పొడి – అర టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర టీ స్పూను తయారీ: ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►పచ్చి మిర్చి తరుగు జత చేసి వేయించాలి ►పసుపు, ఉప్పు, మిరప కారం, సోంపు పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిందనిపించాక నిమ్మ రసం, పంచదార జత చేసి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించి, దింపేయాలి ►వేడి వేడి చపాతీలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మిర్చి – సెనగ పిండి కూర కావలసినవి: లేత పసుపు రంగులో ఉండే పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; ముదురు ఆకు పచ్చ రంగు పచ్చి మిర్చి తరుగు – పావు కప్పు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన అల్లం ముక్కలు – అలంకరించడానికి తగినన్ని. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి తరుగులు జత చేసి బాగా వేయించాలి ►లేత రంగు పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలియబెట్టాక, ముదురు రంగు పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి ►సోయా గ్రాన్యూల్స్, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ►మిగిలిన నూనె, సెనగ పిండి వేసి బాగా కలిపాక, ఆమ్చూర్ పొడి వేసి కలిపి, మూత ఉంచాలి ►సెనగ పిండి గోధుమరంగులోకి వచ్చిన తరువాత దింపేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, అల్లం ముక్కలతో అలంకరించాలి ►అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ పచ్చిమిర్చి కూర కావలసినవి: పచ్చిమిర్చి – 7 (పెద్దవి); జీలకర్ర – 4 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి ►మిరప కారం, ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు జత చేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి ప్లేటులోకి తీసుకోవాలి ►పచ్చిమిర్చికి ఒక వైపు గాట్లు పెట్టాలి ∙గింజలు వేరు చేయాలి ►తయారుచేసి ఉంచుకున్న పొడిని అందులో స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారు చేసి ఉంచుకున్న పచ్చి మిర్చిని అందులో వేసి వేయించి, మూత ఉంచాలి ►కాయలు బాగా మెత్తగా వడలినట్లు అయ్యేవరకు నూనెలో వేయించాలి ►నిమ్మ రసం జ చేసి దింపేయాలి ►రోటీలలోకి, అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. రాజస్థానీ మలై మిర్చి కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; నూనె – 2 టేబుల్ స్పూన్లు; తాజా క్రీమ్ – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను. తయారీ: ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, తడి ఆరాక, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, ఉప్పు, పసుపు, వేసి దోరగా వేయించాలి ►తరిగిన పచ్చి మిర్చి ముక్కలు జత చేసి బాగా వేయించి, మూత పెట్టాలి ►క్రీమ్ వేసి బాగా కలియబెట్టి, బాగా ఉడికిన తరవాత దింపేయాలి ►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది. గ్రీన్ చిల్లీ సాస్ కావలసినవి: పచ్చి మిర్చి – 100 గ్రా.; అల్లం తరుగు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – చిటికెడు; అజినమోటో – 2 టీ స్పూన్లు; వైట్ వెనిగర్ – 4 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – 2 టీ స్పూన్లు. తయారీ: ►పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో... వెల్లుల్లి తరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినన్ని నీరు పోసి మెత్తగా చేసి, ఒక కుకర్లోకి తీసుకుని, స్టౌ మీద ఉంచి, ఈ మిశ్రమానికి చిటికెడు ఉప్పు జతచేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉంచి, రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►విజిల్ తీసి పచ్చిమిర్చిని చల్లారబెట్టాలి ∙రెండు చిటికెల అజినమోటో జత చేయాలి ►4 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ జత చేయాలి ►మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకుని, నీళ్లలో కలిపి, ఉడుకుతున్న సాస్‌లో వేయాలి ∙బాగా ఉడికిన తరవాత, స్టౌ మీద నుంచి దింపేసి చల్లారనివ్వాలి ►బాగా చల్లారాక ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. పచ్చి మిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి – అర కేజీ; మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – 100 గ్రా.; ఇంగువ – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ►తొడిమలు వేరు చేసి, పచ్చి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఆవాలు, మెంతులు వేసి సన్నని మంట మీద దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారబెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో మిరప కారం, మెత్తగా చేసిన ఆవపొడి, మెంతి పొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ►తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసి కలియబెట్టాలి ►కాచి చల్లారబెట్టిన నూనె, నిమ్మరసం రెండూ ఒకదాని తరవాత ఒకటి ఇందులో పోస్తూ, కలుపుతుండాలి ►ఒక గంట తరవాత ఈ మిశ్రమాన్ని గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి ►ఈ ఊరగాయ సుమారు పదిరోజుల వరకు నిల్వ ఉంటుంది. (నూనె పైకి తేలుతూంటే, ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది). -
ఆరోగ్య కారకం
వాతావరణం చల్లబడినట్లే ఉంది. పొడిగా ఉండడం అవసరం. పొడులు తినడమూ అవసరం.వర్షాలు వెళ్లే వరకూరోజూ ఒక ముద్ద కారప్పొడితో తింటే..అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పేరుకు కారాలే గానీ..రుచికరమైన ఆరోగ్య కారకాలే ఇవన్నీ! కాకరకాయ కారం కావలసినవి: కాకరకాయలు ఒక కిలో; ఎండు మిర్చి: 100 గ్రా‘‘; చింతపండు: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను; ఉప్పు,నూనె: తగినంత తయారి: దీనికి రెండు రోజులు పని చేయాలి. ముందు రోజు కాకరకాయలను చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలి. మరుసటి రోజు నూనెలో వేయించి పొడి చేయాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమంలో కాకరకాయ ముక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ. కరివేపాకు కారం కావలసినవి: కరివేపాకు: పావుకిలో; ఎండు మిర్చి: 100గ్రా‘‘; చింతపండు: 50గ్రా‘‘; వెల్లుల్లి: 50గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ధనియాలు: 100గ్రా‘‘; పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు; మినప్పప్పు: రెండు స్పూన్లు; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి. దానిని పక్కన ఉంచి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది. అన్నం లో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత పొందిన వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోయి హితవు పుడుతుంది. త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివేపాకులో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది. కంది కారం కావలసినవి: కందిపప్పు: 100గ్రా‘‘; ఎండు మిరపకాయలు: 50గ్రా‘‘; శనగపప్పు: ఒక స్పూను; పెసరపప్పు: ఒక స్పూను; ఇంగువపొడి: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: తగినంత. తయారి: కందిపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకుని పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే ఆ రుచే వేరు. నల్ల కారం కావలసినవి: ఎండుమిరపకాయలు: 100 గ్రా; చింతపండు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా; ధనియాలు: 50 గ్రా; పచ్చిశనగపప్పు: ఒక స్పూన్; మినప్పప్పు: ఒక స్పూన్; కరివేపాకు: కొద్దిగా; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ విడివిడిగా వేయించాలి. వేడి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. కొబ్బరి కారం కావలసినవి: పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది; ఎండు మిర్చి: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగపప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె: తగినంత. తయారి: పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత కొబ్బరి తురుమును వేయించాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు. ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్. ఇడ్లీ కారం కావలసినవి: వేయించిన శనగపప్పు(పుట్నాలు): 100 గ్రా‘‘; ఎండు కొబ్బరి: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ఎండు మిర్చి: 50గ్రా‘‘; ఉప్పు: రుచికి తగినంత; నూనె: వేయించడానికి సరిపడినంత. తయారి: నూనె వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని శనగపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత మరొకటి వేయించాలి. ముందుగా మిరపకాయలను గ్రైండ్ చేసి దానిలో పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. పేరుకి ఇది ఇడ్లీకారమే అయినా వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కారం కలిపి తింటే ఇక వేరే కూరలేవీ రుచించవు. కూర కారాలు కూర కారం కావలసినవి:ఎండు మిర్చి: ఒక కిలో; ధనియాలు: పావు కిలో వెల్లుల్లి: పావుకిలో; జీలకర్ర: 150గ్రా‘‘ మెంతులు: 50గ్రా‘‘; ఉప్పు: పావుకిలో తయారి: కూరకారానికి ఎండుమిర్చి వేయించకూడదు. ధనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు చేర్చుకోవాలి. దీనిని పులుసుల్లో వేసుకుంటే రుచి పెరగడమే కాక, ఘుమఘుమలాడుతుంది. కూరకారం, ఇగురుకారం ఆరు నెలల పాటు నిలవ ఉంటాయి నువ్వుల పొడి కావలసినవి: తెల్ల నువ్వులు: 100గ్రా‘‘; చింతపండు : 50గ్రా‘‘; ధనియాలు : 50గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగ పప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె : తగినంత. తయారి: నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రలను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషధాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత. ఇగురుకారం కావలసినవి: ఎండుమిర్చి: ఒక కిలో జీలకర్ర: పావుకిలో వెల్లుల్లి: పావుకిలో నూనె: వేయించడానికి కావలసినంత తయారి: మిరపకాయలను నూనెలో వేయించి చల్లారిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి. దీనిని కూరలు, వేపుళ్లలో వేసుకుంటే వంటల రుచి మరింత ఇనుమడిస్తుంది. నాన్ వెజ్ రొయ్యల కారం కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పుఎండు రొయ్యలు– అర కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుఅల్లం తరుగు – ఒక టీ స్పూనుకరివేపాకు – మూడురెమ్మలుఎండు మిరపకాయలు– ఆరునల్ల మిరియాలు– 15చింతపండు– పెద్ద ఉసిరికాయంతఉప్పు– రుచికి తగినంత తయారి: ఎండు రొయ్యలను పెనంలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో కొబ్బరి తురుమును, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో చింతపండు, ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పల్లీ కారం పల్లీకారం: కొబ్బరికారంలో వేసిన దినుసులన్నీ వేసుకుని కొబ్బరికి బదులుగా వందగ్రాముల వేరుశనగ పప్పు వాడాలి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం అన్నింటిలోకి మంచి ఆధరువు. కరివేపాకు కారానికి వాడిన దినుసులన్నీ వేసుకుంటూ కరివేపాకు బదులుగా పుదీనా వాడాలి. కొత్తిమీర పొడికి కూడ ఇదే పద్ధతి. -
ఉపవాస భుక్తి
ఆదిశేషుడిని విష్ణువు తల్పంగా చేసుకున్నాడు.శివుడు ఆభరణంగా మలుచుకున్నాడు.నాగభక్తి తెలుగువారి అనాది ఆచారం.నాగుల చవితికి ఉపవాసం మన ఆరాధన విధానం.ఉపవాసం అనంతరం తేలిగ్గా సింపుల్‌గా ఆహారం తీసుకుంటే భక్తి భుక్తి సమతులం అవుతాయి. పర్వదినం ఫలవంతం అవుతుంది. చిమ్మిలి కావలసినవి: వేయించిన నువ్వులు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; వేయించిన ఓట్స్ – అర కప్పు; వేయించిన బాదం పప్పులు – 10; వేయించిన జీడి పప్పులు – 10; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; పాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙నువ్వులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో నువ్వుల పొడి, బాదంపప్పుల మిశ్రమం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి వేసి బాగా కలిపి ఉండలు చేయాలి. సాబుదానా ఇడ్లీ కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్ సోడా – చిటికెడు ; జీడి పప్పులు – 20; నూనె – ఇడ్లీ రేకులకు పూయడానికి తగినంత తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో సగ్గు బియ్యం, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలపాలి ∙రెండు కప్పుల పెరుగు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, సుమారు 8 గంటలసేపు పక్కన ఉంచాక, గరిటెతో బాగా కలపాలి. (సగ్గుబియ్యం మెత్తగా అయ్యేలా మెదపకూడదు). అవసరాన్ని బట్టి నీరు జతచేసుకోవాలి ∙ఉప్పు జత చేయాలి ∙ఇడ్లీలు వేసే ముందు పిండిలో కొద్దిగా తినే సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దికొద్దిగా నూనె పూయాలి ∙ ఒక్కో గుంటలోనూ జీడిపప్పు ఉంచి, ఆ పైన గరిటెడు ఇడ్లీ పిండి వేయాలి ∙ అన్నీ వేసిన తరవాత ఇడ్లీ రేకులను కుకర్‌లో ఉంచి స్టౌ మీద పది నిమిషాలు ఉంచి దింపేయాలి (విజిల్ పెట్టకూడదు). చలిమిడి కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; పాలు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లన్నీ ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ∙బియ్యంలోని తడి ఆరిపోగానే, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టాలి. (జల్లెడ పట్టి మెత్తటి పిండితో మాత్రమే చలిమిడి చేయాలి) ∙ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపితే చలిమిడి సిద్ధమైనట్లే. ముర్మురా చాట్ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – పావు కప్పు; వేయించిన సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; మరమరాలు – 3 కప్పులు; పంచదార పొడి ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడయ్యాక çనూనె వేసి బాగా కాగాక, పల్లీలు వేసి సన్న మంట మీద క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి ∙పుట్నాల పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ∙మరమరాలు జత చేసి జాగ్రత్తగా పెద్ద గరిటెతో రెండు మూడు నిమిషాలు కలిపి దింపేయాలి ∙పంచదార పొడి, ఉప్పు జత చేసి కలిపి, ప్లేట్లలో వేసి వేడివేడిగా అందించాలి. కొసాంబరి సలాడ్ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు (నీళ్లలో రెండు గంటలపాటు నానబెట్టాలి); పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత తయారీ: ∙పెసర పప్పులోని నీళ్లు ఒంపేసి, నీళ్లు పూర్తిగా పోయేవరకు వడకట్టాలి ∙ పెద్ద పాత్రలో పెసర పప్పు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, సగం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙ ఇంగువ, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పెసర పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙చివరగా ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. అటుకుల పులావ్ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత కాయగూరలు... క్యారట్ తురుము – పావు కప్పు; బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బీన్స్ – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); క్యాబేజీ తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను; క్యాలీఫ్లవర్ తరుగు – ఒక టేబుల్ స్పూను వేయించడానికి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2 తయారీ: ∙అటుకులను ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చిమిర్చి జత చేసి మరోమారు కలపాలి ∙తరిగి ఉంచుకున్న కూరగాయల తురుము, ముక్కలు వేసి మెత్తబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙అటుకులు, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. సాబుదానా ఉప్మా కావలసినవి: సగ్గు బియ్యం – 2 కప్పులు; పల్లీలు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (మధ్యకు నిలువుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె / నెయ్యి – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను బాగా వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు సుమారు మూడు నిమిషాల పాటు వేయించుతుండాలి ∙సగ్గుబియ్యంలో నీళ్లు పూర్తిగా ఒంపేయాలి ∙పల్లీలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి ∙వేగుతున్న పోపులో సగ్గు బియ్యం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి బాగా కలిపి, కొద్ది సేపు ఉంచి దింపేయాలి. -
వెరీ గూడ్
సంస్కృతంలో బెల్లాన్ని ‘గుడము’ అంటారు.హిందీలో ‘గూడ్’ అంటారు.ఆరోగ్యకరమైన తీపి అంటే బెల్లమే...ఆయుర్వేద గుణాలు ఉన్నది బెల్లానికే...దీపావళి పండుగను స్వచ్ఛమైన బెల్లంతో జరుపుకోండి... ముఖంలో కాంతులు నింపుకోండి... తియ్యటి వేడుకలతో వెలిగిపొండి... అనరస కావలసినవి: బెల్లం పొడి – ఒక కప్పు – (100 గ్రా.); బియ్యప్పిండి – 150 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి మూడు రోజుల పాటు నానబెట్టాలి (ప్రతిరోజూ రెండు సార్లు నీళ్లు మార్చాలి) ∙నాలుగో రోజు నీళ్లన్నీ శుభ్రంగా ఒంపేసి, ఒక పొడి వస్త్రం మీద బియ్యాన్ని నాలుగు గంటలసేపు ఆరబోయాలి ∙ఆరబోసిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙మిక్సీ పట్టిన పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, బెల్లం పొడి జత చేసి చలిమిడిలా అయ్యేలా బాగా కలిపి, మూత పెట్టి 12 గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో అరిసె మాదిరిగా ఒత్తాలి ∙పైన గసగసాలు కాని నువ్వులు కాని ఒత్తాలి ∙ఇలా అన్నిటినీ ఒత్తుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగిన తరవాత ఒత్తి ఉంచుకున్న అనరసలను వేసి వేయించి తీసేయాలి ∙వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. కంచ గోలా కావలసినవి: పనీర్ – ఒక కప్పు; బెల్లం పొడి – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీస్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పిస్తా తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా పాలను విరగ్గొట్టి, గట్టి పనీర్ తయారుచేసుకోవాలి (ఒక్క చుక్క నీరు కూడా లేకుండా గట్టిగా పిండి తీసేయాలి) ∙పనీర్‌ను ఒక పాత్రలోకి తీసుకుని చేతితో సుమారు పావు గంట సేపు బాగా కలపాలి ∙(కొద్దిగా తడి ఉందనిపిస్తే, స్టౌ మీద బాణలిలో వేసి కొద్దిసేపు ఉంచితే తడి పోతుంది) ∙పనీర్ బాగా చల్లారాక రోజ్ వాటర్, ఏలకుల పొడి, కుంకుమపువ్వు, బెల్లం పొడి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు పన్నెండు సమాన భాగాలుగా చేసి, చేతితో ఒత్తాలి ∙పగుళ్లు లేకుండా చూసుకోవాలి ∙ప్రతి గోలాను పిస్తా తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో సుమారు నాలుగు గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి. పటిషప్త కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పాలు – 2 కప్పులు ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా తురుము / కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను ఫిల్లింగ్ తయారీ: ∙ఒక పాత్రలో కొబ్బరి తురుము/పచ్చి కోవా తురుము, బెల్లం పొడి వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచాలి ∙(పచ్చి కోవాతో చేస్తుంటే కొద్దిగా పాలు జత చేయాలి) ∙కొద్దిగా ఉడికిన తరవాత ఏలకుల పొడి జత చేయాలి ∙ తీగలా సాగే వరకు సుమారు 20 నిమిషాల పాటు బాగా కలిపి దింపి, చల్లారనివ్వాలి. పటిషప్త తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙పాలు జత చేసి ఉండలు లేకుండా కలిపి, ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి పల్చగా పరవాలి ∙వెంటనే దాని మీద ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి, రోల్ చేయాలి ∙లేత గోధుమరంగులోకి వచ్చేవరకు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి ∙వీటిని వేడిగా కాని, చల్లగా కాని అందించవచ్చు ∙కండెన్స్డ్ మిల్క్ పోసి అందిస్తే, అందంగాను, రుచిగాను ఉంటుంది. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు (పావు కేజీ); పచ్చి సెనగ పప్పు – అర కప్పు (నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – వేయించడానికి తగినంత తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ∙ఒక విజిల్ రాగానే మంట తగ్గించి మరో రెండు విజిల్స్ వచ్చాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙బాదం పప్పులు, జీడి పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పూరీల పిండి మాదిరిగా కలిపి, పైన వస్త్రంతో కప్పి, సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి ∙ఉడికించిన సెనగ పప్పులో నీళ్లు ఉంటే వాటిని వడకట్టి తీసేయాలి ∙సెనగ పప్పును మిక్సీలో వేసి కొంచెం పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టి బయటకు తీసేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద పెట్టి వేడయ్యాక ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగ పప్పు పొడి వేసి దోరగా వేయించాక, ఒక పాత్రలోకి తీసుకుని, బాగా చల్లారాక, బెల్లం జత చేసి కలియబెట్టాలి ∙ఆ తరవాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙మైదా పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని పూరీలా ఒత్తి, మధ్యలోకి కట్‌చేయాలి ∙ఒక్కో భాగాన్ని తీసుకుని కోన్ ఆకారంలో చేతితో చేసి, అందులో పచ్చి సెనగ పప్పు మిశ్రమం ఉంచి, సమోసాలాగ మూసేసి పక్కన ఉంచుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ సమోసాలను వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. ఉన్ని యాప్పమ్ కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; కొబ్బరి వేయించడానికి; నూనె – అర టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు ఉన్నియాçప్పమ్ కోసం: అరటి పండ్లు – 2 ; నల్ల నువ్వులు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – ఒక టీ స్పూను (ఒక్కో గుంటలో) తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి ∙ముప్పావు కప్పు అరటి పండు గుజ్జు, అర కప్పు బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు తిప్పాలి. (అవసరమనుకుంటే ముప్పావు కప్పు నీళ్లు జత చేయాలి) ∙రవ్వలా వచ్చేవరకు గ్రైండ్ చేయాలి (మరీ మెత్తటి పిండిలా రాకూడదు) ∙పిండిని మరో పాత్రలోకి తీసుకోవాలి. కొబ్బరి వేయించడానికి: బాణలిని స్టౌ మీద ఉంచి, కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.ఉన్నియాప్పమ్ పిండి తయారీపిండిలో మిగిలిన నూనె, వేయించిన కొబ్బరి ముక్కలు జత చేసి కలపాలి. నల్ల నువ్వులు, జీలకర్ర పొడి, శొంఠి పొడి, బేకింగ్ సోడా జత చేసి మరోమారు బాగా కలపాలి.ఉన్నియాప్పమ్ తయారీఅప్పమ్ వేసే చట్టీ పాన్ (పొంగడం మౌల్డ్లా ఉంటుంది) స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. ఒక్కో గుంటలోను ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి, మంట బాగా తగ్గించాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్‌తో పిండి మిశ్రమం ఒక్కో గుంటలో మూడు వంతుల వరకు వేసి, సన్నటి మంట మీద ఉన్నియప్పమ్ బంగారు రంగులోకి వచ్చేవరకు ఉడికించాలి. రెండో వైపు తిప్పి మరి కాస్త నెయ్యి వేసి ఉడికించి దింపేయాలి. వీటిని వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల దాకా ఉంటాయి. గూడ్ కీ రోటీ కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – అర కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – చిటికెడు తయారీ: ∙ఒకపాత్రలో అర కప్పు పాలు, బెల్లం పొడి వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి ∙పాలు + బెల్లం మిశ్రమం జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి (అవసరమనుకుంటే మరి కొన్ని పాలు జత చేయాలి) ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి ∙ఒక్కో ఉండను పావు అంగుళం మందంగా చపాతీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి, తయారుచేసి ఉంచుకున్న గుర్ కీ రోటీ వేసి, సన్నని మంట మీద బాగా కాల్చాలి ∙ రోటీ చుట్టూ నెయ్యి వేయాలి ∙రోటీ మీద కొద్దిగా నెయ్యి పూసి, రోటీని తిరగేసి మళ్లీ నెయ్యి వేసి బాగా కాలాక తీసేయాలి ∙ఈ రోటీలను వేడివేడిగా కాని చల్లగా కాని అందించాలి. గూడ్ కీ కుల్ఫీ కావలసినవి: జీడి పప్పులు – 50 గ్రా. (చిన్న చిన్న ముక్కలు చేయాలి); చిక్కటి పాలు – ఒక లీటరు; మిల్క్ మెయిడ్ – ఒక క్యాన్ (410 గ్రా.); ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 100 గ్రా.; పంచదార పొడి – 50 గ్రా; ఉప్పు – చిటికెడు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి చల్లారనివ్వాలి ∙ఒక పెద్ద పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్క్, ఏలకుల పొడి వేసి, మీడియం మంట మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిపేయ్యాక మంట సిమ్ చేసి, సుమారు గంటన్నర సేపు అలానే ఉంచాలి ∙మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బెల్లం పొడి వేసి కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి, సుమారు పది నిమిషాలు ఉంచాలి ∙అడుగు అంటకుండా జాగ్రత్తపడాలి ∙జీడిపప్పు పలుకులు వేసి మరోమారు కలిపి దింపేయాలి ∙బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్‌లో మూడు వంతుల వరకు పోసి, ఫ్రిజ్‌లో ఒక రోజు రాత్రంతా ఉంచాలి ∙ సర్వ్ చేయడానికి ఐదు నిమిషాల ముందర ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి పైన మరికొన్ని జీడిపప్పు పలుకులు వేసి అందించాలి. -
భకర్వాడి
కావలసినవి: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు ; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు + డీప్ ఫ్రైకి సరిపడా; ధనియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; లవంగాలు – 2; నువ్వులు – ఒక టీ స్పూను ; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – చిటికెడు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఆమ్ చూర్ – అర టీ స్పూను; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పంచదార – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి పావు గంట సేపు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి వేయించాలి. జల్లెడ పట్టిన సెనగ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఆ పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. నూనె లేకుండా స్టౌ మీద బాణలి ఉంచి, అందులో ధనియాలు వేసి వేగాక, జీలకర్ర, సోంపు, లవంగాలు జత చేసి మరోమారు వేయించాలి. బాగా వేగిన తరవాత నువ్వులు జత చేసి వేయించి దింపి చల్లారాక, మిక్సీలో వేసి పొడి చేయాలి. మిరప కారం, పసుపు, గరం మసాలా, ఆమ్ చూర్, జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి. ఈ పొడిని సెనగ పిండిలో వేసి, కొద్దిగా ఉప్పు, పంచదార పొడి కూడా జత చేసి బాగా కలపాలి. పక్కన ఉంచిన మైదా పిండిని ఒక ఉండ పరిమాణంలో తీసుకుని చపాతీలా ఒత్తి, దాని మీద కొద్దిగా నూనె పూయాలి. సెనగ పిండి మిశ్రమాన్ని పైనంతా ఒక పొరలా పూయాలి. ఒత్తి ఉంచుకున్న చపాతీని కొద్దికొద్దిగా మడుస్తూ గట్టిగా దగ్గరగా ఉండేలా రోల్ చేయాలి. ఆఖరి మడత దగ్గర మరి కాస్త నూనె పూసి చుట్టి రోల్ చేయాలి. చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చేతికి కొద్దిగా తడి చేసుకుని కట్ చేసిన ముక్కల అంచులకు తడి పూయాలి. బాణలిలో నూనె కాగిన తరవాత వీటిని అందులో వేసి రంగు మారేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. -
నువ్వుల్ నవ్వుల్
ఇది హేమంత ఋతువు... ఆకలి, జీర్ణశక్తి ఎక్కువగా ఉండే ఋతువు... శరీరానికి జీర్ణశక్తి అధికంగా ఉన్నప్పుడు తక్కువ శక్తినిచ్చే పదార్థాలు సరిపోవు. అధిక జీర్ణశక్తికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. నూనెపదార్థాలు కలిగిన ఆహారం అందించాలి. అలాగని నూనె నేరుగా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు... అధికంగా నూనె ఉండే నువ్వులను నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బావుంటుంది. పోషకాలు, ఖనిజాలు అధికంగా అందుతాయి. నువ్వులుంటే ఆనందాల పువ్వులు... ఆరోగ్యాల నవ్వులు... నువ్వుల అన్నం కావలసినవి: బియ్యం – అర కేజీ; నువ్వులు – 100 గ్రా.; జీడి పప్పులు – కొద్దిగా; కిస్మిస్ – కొద్దిగా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 2 రేకలు; పోపు కోసం: పచ్చి మిర్చి – 4; పచ్చి సెనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 4; నెయ్యి – తగినంత; ఉప్పు – తగినంత. తయారి: ∙ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక ఉల్లి తరుగు జత చేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో అన్నం వేసి పొడిపొడిగా చేయాలి ∙నువ్వుల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, వేయించిన పోపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙టొమాటో పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది. నువ్వుల చపాతీ కావలసినవి: గోధుమ పిండి – కప్పు; క్రీమ్ – కప్పు; గోరువెచ్చటి పాలు – 4 టేబుల్ స్పూన్లు; తెల్ల నువ్వులు – టేబుల్ స్పూను (నూనె లేకుండా బాణలిలో వేయించాలి); నల్ల నువ్వులు – టేబుల్ స్పూను; నెయ్యి – టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ∙ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, క్రీమ్, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పాలు జత చేస్తూ, చపాతీ పిండిలా కలిపి అర గంటసేపు పక్కన ఉంచాలి. (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయొచ్చు) ∙పిండిని ఉండలుగా చేసుకుని, నెయ్యి అద్దుతూ చపాతీలా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక ఒక్కో చపాతీని వేసి నేతితో కాల్చాలి ∙క్యాలీఫ్లవర్ కూరతో తింటే రుచిగా ఉంటాయి. నువ్వుల పులుసు కావలసినవి: నువ్వులు – 100 గ్రా. (బాణలిలో నూనె లేకుండా వేయించాలి); ఉల్లికాడలు – 2 (సన్నగా తరగాలి); చింతపండు – కొద్దిగా (నీళ్లలో నానబెట్టి, చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; బెల్లం పొడి – టేబుల్ స్పూను; బియ్యప్పిండి – టేబుల్ స్పూను; పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా తయారి: ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙ఉల్లికాడలు జత చేసి కొద్దిగా వేయించాలి ∙చింతపండు పులుసు జత చేసి బాగా కలపాలి ∙రెండు గ్లాసుల నీరు, ఉప్పు, పసుపు, నువ్వుల పొడి వేసి ఉడికించాలి ∙బియ్యప్పిండిని చిన్న గ్లాసుడు నీళ్లలో ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు ఉడికించి దింపేయాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల స్వీట్ చట్నీ కావలసినవి: నువ్వులు – 100 గ్రా.; చింతపండు – 100 గ్రా.; బెల్లం పొడి – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పోపు కోసం: ఎండు మిర్చి – 20; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారి: ∙ముందుగా బాణలిలో నూనె లేకుండా నువ్వులను దోరగా వేయించి తీసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి ఉడికించి, చల్లారాక చేతితో మెత్తగా చేసి, గింజలు, ఈనెలు పక్కకు తీసేయాలి ∙ఒక పాత్రలో ఈ పదార్థాలన్నిటినీ వేసి బాగా కలిపాక, మిక్సీలో మరోమారు వేసి అన్నీ కలిసేవరకు మిక్సీ పట్టి తీసేయాలి ∙బాణలిలో నువ్వుల నూనె వేసి గోరు వెచ్చనయ్యాక ఇంగువ వేసి కొద్దిగా వేడి చేసి, దింపేసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి దోసెలు, ఇడ్లీలు, గారెలలో చాలా రుచిగా ఉంటుంది. సెసేమ్ క్రిస్ప్స్ కావలసినవి: కోడి గుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే); పంచదార – 30 గ్రా.; మైదా పిండి – 30 గ్రా.; బటర్ – 20 గ్రా. (ఉప్పు లేని బటర్); నువ్వులు – 90 గ్రా. (దోరగా వేయించాలి); నెయ్యి – కొద్దిగా. తయారి: ∙ఒక పాత్రలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా గిలకొట్టాలి ∙పంచదార జత చేసి, కరిగే వరకు మరోమారు గిలకొట్టాలి ∙కరిగించిన బటర్ జత చేయాలి జల్లించిన మైదా పిండి జత చేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ∙వేయించిన నువ్వులు జత చేయాలి బేకింగ్ ట్రేకి నెయ్యి పూయాలి ∙కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని స్పూనుతో కొద్దికొద్దిగా దూరం దూరంగా పరచాలి ∙ఫోర్క్ సహాయంతో గుండ్రంగా వచ్చేలా సరిచేయాలి ∙170 డిగ్రీల దగ్గర వేడి చేసి ఉంచుకున్న అవెన్‌లో ఉంచి సుమారు 10 నిమిషాల తరవాత తీసేయాలి ∙మరో రెండు నిమిషాలు ఉందనగా సెసేమ్ క్రిస్ప్స్ను తిరగేయాలి ∙రెండు నిమిషాలయ్యాక బయటకు తీసేయాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి. నువ్వులలో ఔషధ గుణాలు... సూర్యుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశించే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ మాసంలో చలి వెనుకబడి నెమ్మదిగా వే పెరుగుతూ వస్తుంది. ఈ సమయంలో నువ్వులు తినడం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. మహారాష్ట్రలో ‘తిల్ గుడ్’ పేరుతో అందరూ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటారు. నువ్వులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ∙నువ్వుల ద్వారా లభించే క్యాల్షియమ్ పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలో 20 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. నువ్వుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. ∙నువ్వులు జీర్ణశక్తిని పెంచడంలోను, రక్తపోటును తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. ∙నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. అవన్నీ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. ∙నువ్వులు ఎముకలను పటిష్టం చేయడం ద్వారా ఎముకలను గుల్లబరిచే ఆస్టియో పోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి. కీళ్లను, రక్తనాళాలను శక్తివంతం చేసే లక్షణం నువ్వుల్లో ఎక్కువగా ఉంది. ∙కాలేయపు పనితనాన్ని మెరుగుపరుస్తాయి. -
ఆరోగ్యానికి అండ... నువ్వుండ
గుడ్ ఫుడ్ చిన్నప్పుడు నువ్వుల ఉండలు, నూజీడీలు తినకుండా పెరిగి పెద్దయిన వారు ఉండరు. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఫైబర్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్, ట్రిప్టోఫాన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారికి బెల్లం–నువ్వులతో చేసిన ఉండలు తినమని నిపుణులు ఇప్పటికీ చెబుతుంటారు. ఆహారంలో నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియమ్ వ్యాసోడయలేటర్గా (రక్తనాళాలను విప్పార్చడం) పనిచేయడం వల్ల ఈ ప్రయోజనం చేకూరుతుంది. అన్ని రకాల ఖనిజాలు (మినరల్స్)తో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఫైటేట్ పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు శక్తిమంతమైన క్యాన్సర్ నిరోధకాలు. నువ్వుల్లో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. అందుకే అవి ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి. నువ్వుల్లో పీచు చాలా ఎక్కువ కాబట్టి కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో వాటి పాత్ర ఎంతో ఎక్కువ. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. రోజూ గుప్పెడు నువ్వులు తినేవారిలో నోటి ఆరోగ్యం బాగుంటుంది. పళ్లు, చిగుర్ల వ్యాధులు తగ్గుతాయి. నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో చర్మం మిలమిల మెరుస్తుంది. నువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉండడం వల్ల అవి వాపు, మంట నొప్పిని తగ్గిస్తాయి. -
ఆరోగ్యం నవ్వాలంటే.. నువ్వులు
గుడ్‌ఫుడ్ ఇప్పుడంటే మనం వంటకు రకరకాల నూనెలు ఉపయోగిస్తున్నాం. కానీ ఒకప్పుడు వంట నూనె అంటే నువ్వులనూనే. అంటే... తిలల నుంచి తీసిందే ‘తైలం’ అన్నమాట. మన భారతీయ సంస్కృతిలో నువ్వులు అంతగా ఇమిడిపోయాయి. నువ్వులలో ఉన్న మంచి ఆరోగ్యకరమైన పోషకాల జాబితాకు అంతే లేదంటే అతిశయోక్తి కాదు. గుండెజబ్బుల నిరోధానికి నువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువ. ఇందులో విటమిన్–ఇ, క్యాల్షియమ్‌లు కూడా ఎక్కువ. కాబట్టి శరీరంలో అయ్యే గాయాల రిపేర్‌కు ఇది బాగా తోడ్పడుతుంది. నువ్వుల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతుస్రావం అయ్యే మహిళలు నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా వాటివల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.నువ్వులలో విటమిన్–బి కాంప్లెక్స్‌లోని పోషకాలైన నియాసిస్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటివి మరింత ఎక్కువ. నువ్వుగింజల్లోని బరువులో 50 శాతం మేరకు నూనె పదార్థమే ఉంటుంది. అందులో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యానికి, మేని ఛాయ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. -
నువ్వులను ఎగుమతి చేస్తున్నది మన దేశమే!
తిండి గోల అత్యంత ప్రాచీనమైన పంటగా పేరున్నది నువ్వులకే. అడవిజాతి మొక్కగా పేరున్న నువ్వు మొక్క మూలం ఆఫ్రికా దేశంలో ఉన్నట్టు చారిత్రక కథనాలు ఉన్నాయి. ఇది సాగుపంటగా రూపుదాల్చింది మాత్రం మన భారత్‌లోనే. మన దేశానికి ఎలా వచ్చిందనే లెక్కలు మాత్రం ఎక్కడా లేవు. పురాతత్వ లెక్కల ప్రకారం క్రీ.పూ 3500 - 3050లో మన దేశంలో ఉన్నట్టు గుర్తించగా, క్రీ.పూ 2000ల కాలంలో మెసొపొటమియాలో మెరిసినట్టు ఆ తర్వాత కాలంలో ఈజిప్టులో సాగుపంటగా మారినట్టు లెక్కలున్నాయి. బాబిలోనియాలోనూ నువ్వుల ఆనవాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న, ఇసుకనేలలైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితులలైనా తట్టుకునే నిలిచే గుణం ఉన్నందునే ఇది ప్రపంచమంతా పాకింది. గ్లోబల్ వంటకాలలో విరివిగా వాడే వాటిలో ఏకైక దినుసుగా పేరొందినవి నువ్వులే. అందుకేనేమో నువ్వులు ప్రపంచమార్కెట్లో బిలియన్ డాలర్లను డిమాండ్ చేస్తున్నాయి. నువ్వుల దిగుమతిలో ప్రధమస్థానం జపాన్‌ది కాగా ఆ తర్వాతి స్థానం చైనా కొట్టేసింది. ఉత్పత్తిలోనూ, వాడకంలోనూ, ఎగుమతిలోనూ నువ్వులు భారతీయుల జీవనశైలిలో భాగమయ్యాయి. అందుకే ఈ మూడింటి లోనూ ఇండియాదే ప్రధమ స్థానం.