నువ్వుల నూనెతో మాయ చేద్దాం రండి! | Sesame Seeds Health and Nutrition Benefits | Sakshi
Sakshi News home page

నువ్వుల నూనెతో మాయ చేద్దాం రండి!

Published Fri, May 17 2024 1:35 PM | Last Updated on Fri, May 17 2024 1:35 PM

Sesame Seeds Health and Nutrition Benefits

వేసవి వచ్చిందంటే పచ్చళ్ల  సీజన్‌ మొదలవుతుంది.  పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు,  ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో  ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు,  బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు  నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయింటే నువ్వుల నూనెతో  నలుగులు, మసాజ్‌లు ఆ సందడే  వేరుగా ఉండేది. 

వేల ఏళ్లుగా మన సంస్కృతిలో, మన  ఆహార పదార్థాల్లో కీలకమైనవి నువ్వులు. నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదాహరణకు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి  రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.

ఫైబర్‌ ఎక్కువ
నువ్వుల గింజలలో పైబర్‌ ఎక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది.   కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు.  

రక్తపోటును తగ్గించడంలో
నువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు , స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకం.  అలాగే  కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలకు మంచి శక్తినిస్తుంది.  

సౌందర్య పోషణలో
నువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 

నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. 

నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల  చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. 

నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల  జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో  మాడును మసాజ్‌ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి.   రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement