sesame oil
-
నువ్వుల నూనెతో మాయ చేద్దాం రండి!
వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్ మొదలవుతుంది. పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు, ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు, బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయింటే నువ్వుల నూనెతో నలుగులు, మసాజ్‌లు ఆ సందడే వేరుగా ఉండేది. వేల ఏళ్లుగా మన సంస్కృతిలో, మన ఆహార పదార్థాల్లో కీలకమైనవి నువ్వులు. నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదాహరణకు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.ఫైబర్ ఎక్కువనువ్వుల గింజలలో పైబర్ ఎక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు. రక్తపోటును తగ్గించడంలోనువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు , స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకం. అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలకు మంచి శక్తినిస్తుంది. సౌందర్య పోషణలోనువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో మాడును మసాజ్ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి. రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది. -
నువ్వుల నూనె.. నైవేద్యంగా
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో తొడసం వంశస్తుల ఆరాధ్య దైవం ఖందేవ్ జాతర వైభవంగా జరుగుతోంది. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఏటా తొడసం వంశస్తులు ఖందేవ్ జాతర నిర్వహిస్తారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో సోమవారం మహాపూజ నిర్వహించారు. నిష్టగా ఇళ్లలోనే తయారుచేసిన నువ్వుల నూనెను రెండో రోజైన మంగళవారం ఆలయానికి తీసుకువచ్చి ఖందేవ్‌కు నైవేద్యంగా సమర్పించారు. తర్వాత పూజలు నిర్వహించారు. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు ఈ నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన మాడవి యోత్మాబాయి వరుసగా మూడోసారి రెండు కిలోల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కు చెల్లించుకోవడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఖందేవ్ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు. -
ఇలా తలస్నానం చేయండి!
నూనెతో మర్దన: గోరువెచ్చని కొబ్బరినూనె లేదా నువ్వులనూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత జుట్టుకంతా నూనె రాయాలి. ఆవిరితో మెరుగు: టర్కీ టవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టాలి. దీంతో రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు చురుకు అవుతాయి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి. దీని వల్ల వెంట్రుకల రాలడం సమస్య తగ్గుతుంది. ఆరబెట్టేదిలా: జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. మెత్తటి కాటన్ లేదా టర్కీ టవల్ని ఉపయోగించడమే మంచి మార్గం. తలకు టవల్ చుట్టి కాసేపు వదిలేయాలి. తడిని టవల్ పీల్చుకుని, జుట్టు పొడిగా అవుతుంది. ►జుట్టు మెరవాలని హెయిర్ స్ప్రేలు వాడకూడదు. వీటి వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి, మరింత పొడిబారుతాయి. వెంట్రుకలు చిట్లే సమస్య కూడా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. బ్యూటిప్స్ -
‘కల్తీ’ గుట్టురట్టు
నువ్వుల నూనె, ఆవు నెయ్యి పేరిట పామాయిల్ అమ్మకాలు విజయవాడ పాత ఆర్ఆర్పేటలో తయారీ కేంద్రం స్థానికుల సమాచారంతో రంగంలోకి అధికారులు సరుకు, గోడౌన్ సీజ్ విజయవాడ : భక్తులు దీపారాధనకు వినియోగించే ఆవునెయ్యి, నూనెను కల్తీ చేసి వాటిని మార్కెట్లో అమ్ముతూ అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ వ్యవహారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పాత రాజరాజేశ్వరిపేటలోని కొత్త మసీదు వీధిలో శ్రీలక్ష్మీసాయి అయిల్ ట్రేడర్స్ పేరిట అమరా రామసుధాకర్రావు మూడేళ్లగా దీపారాధన నూనెల వ్యాపారం చేస్తున్నారు. డాల్డా, పామాయిల్‌తోపాటు కొన్ని రసాయనాలు, రంగులను కలిసి ఆవునెయ్యి పేరుతో 50, 100, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో నింపుతున్నాడు. నూనె చిక్కబడేందుకు కొన్ని రసాయనాలతో కొవ్వును సైతం కలుపుతున్నట్లు సమాచారం. నువ్వుల నూనె పేరిట రైస్ బ్రాన్ ఆయిల్‌తో పాటు ఎందుకూ పనికిరాని వైట్ ఆయిల్లో సుగంధ ద్రవ్యాలను కలిపించి ప్యాకింగ్ చేయిస్తున్నాడు. డాల్డా, పామాయిల్‌తో నెయ్యి తయారీ సందర్భంలో పలు రసాయనాలను వినియోగిస్తునట్లు తెలిసింది. వాటిని వేడి చేసేందుకు గ్యాస్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. నెయ్యి విక్రయాలలో పేరుపొందిన నందిని పేరును అనుకరిస్తూ శ్రీనందిని, సత్యభామ, ఎస్ఎల్ఎస్ ఆయిల్ పేరిట దీపారాధన నూనెలను మార్కెట్లోకి సంస్థ నిర్వాహకుడు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ప్యాకింగ్ జరిగే భవనం ఎదురుగా ఎవరు వచ్చినా తమకు కనిపించేలా సీసీ కెమెరాలను సంస్థ నిర్వాహకుడు ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నిఘా ఉంచి, సరుకు కల్తీ గుట్టు రట్టవకుండా సంస్థ నిర్వాహకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారమే బట్టబయలు మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం రాబోతుండటంతో రేయింబవళ్లు పెద్దఎత్తున కల్తీ ఆవునెయ్యి, నువ్వుల నూనెలను ఈ సంస్థలో ప్యాకింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం పోలీసులకు విషయం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. శనివారం రాత్రి కొత్తపేట పోలీసులు మచిలీపట్నంలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు అన్నపురెడ్డి సుందరరామరెడ్డి, ఎం.శ్రీనివాసరావులకు సమాచారం అందించారు. కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు శనివారం రాత్రి నూనె గోడౌన్‌ను పరిశీలించారు. ఆదివారం పంచనామా నిర్వహించాలని భావించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా రెండు శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుడ్ ఇన్స్పెక్టర్లు మధ్యాహ్నం గోడౌన్ నుంచి ఆయిల్ శాంపిల్స్‌ను తీసుకుని హైదరాబాద్‌కు పంపారు. వీటి పరీక్షలకు సంబంధించి రిపోర్టు వచ్చే వరకు గోడౌన్‌తో పాటు స్టాక్‌ను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. కల్తీ జరిగిందని తెలిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రాష్ర్టవ్యాప్తంగా విక్రయాలు డాల్డా, పామాయిల్‌తో తయారు చేసిన ఆవునెయ్యి, నువ్వుల నూనె రాష్ర్టంలోని అన్ని ప్రముఖ దేవాలయాలతో పాటు ప్రముఖ నగరాలలో విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. భారీఎత్తున జరుగుతున్న ఈ వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా పలువురు అధికారులకు, స్థానిక నేతలకు సంస్థనుంచి నెలనెలా మామూళ్లు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆవునెయ్యి, నువ్వుల నూనెలను కల్తీ చేస్తున్న వ్యాపారులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కార్పొరేషన్లో సేల్స్ టాక్స్, పుడ్ ఇన్స్పెక్టర్లకు మేనేజ్ చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని ఈ సంస్థ నిర్వాహకుడు చెబుతున్నట్లు తెలిసింది. మరో 10 రోజులలో తమ స్టాక్‌ని రిలీజ్ చేయించుకోగలమని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తీసుకున్న ట్రేడ్ లెసైన్స్‌తో లక్షల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతున్నా తమ దృష్టికి రాలేదని సేల్స్ టాక్స్ అధికారులు చెప్పడం శోచనీయం. -
మర్దనకు మేలైనది...
చర్మ సౌందర్యం అందం, ఆరోగ్యాన్ని ఏకకాలంలో ప్రాప్తింపజేసే సుగుణాల గని నువ్వులు. నువ్వుల నుంచి తీసిన తైలాన్ని రోజువారీ వాడుకలో భాగం చేసు కుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వుల నూనెను మనవాళ్లు ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనెలో ఎన్నో విటమిన్లు, మినరల్స్, కొవ్వు పదార్థాలు.. ఉంటాయి. మర్దన తైలంగా కూడా ఈ నూనె ప్రసిద్ధి. బరువు తగ్గచ్చు... నువ్వుల నూనెకు బరువు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. కేలరీలు ఈ నూనెలో సమృద్ధిగా ఉంటాయి. వంటలలోనూ, సలాడ్లలోనూ ఈ నూనెను వాడటం వల్ల ఇతర ఆహారపదార్థాలను తక్కువ తీసుకుంటాం. ఫలితంగా తీసుకునే ఆహారంపై నియంత్రణ ఉండి, బరువు తగ్గవచ్చు. రోజూ 15-30 నిమిషాల సేపు నువ్వుల నూనెతో ఒంటికి మసాజ్ చేసుకొని, వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. చెమట రూపంలో మలినాలు బయటకు వెళ్లిపోయి మేనికాంతి పెరుగుతుంది. చర్మకాంతికి... నువ్వుల నూనె శరీర మర్దనకు మేలైనది. స్వేదరంధ్రాలు తెరుచుకొని మలినాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. బిగువు కోల్పోదు. కురులకు నిగారింపు... మాడు పొడిబారితే శిరోజాల కుదుళ్లు నిర్జీవంగా తయారవుతాయి. ఫలితంగా జుట్టు ఎండిపోయి పీచులా కనిపిస్తుంది. గోరువెచ్చని నువ్వుల నూనెతో మాడుకు మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది. నువ్వుల నూనెలోని చలువదనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, వెంట్రుక వృద్ధి అవుతుంది. మాడు మీద చుండ్రు వంటి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా నువ్వుల నూనెలోని ఔషధాలు వాటితో పోరాడి సమస్యను నివారిస్తాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను అడ్డుకొని జుట్టురాలుడు సమస్యను తగ్గిస్తుంది. నువ్వుల నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు మసాజ్ చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నూనెను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకొని, వేడి నీటిలో ముంచి, గట్టిగా పిండిన టవల్‌ను తలకు చుట్టాలి. 15 నిమిషాలు తలకు ఇలా ఆవిరిపట్టాక వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఆరోగ్యానికి మేలు... నువ్వుల నూనెలో మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తాయి. దానిలోని యాంటీ ఆక్సిడెంట్లవల్ల మంచి కొలెస్ట్రాల్ వృద్ధి అవుతుంది.