ఇలా తలస్నానం చేయండి! | Beauty Tips For Head Bath | Sakshi
Sakshi News home page

ఇలా తలస్నానం చేయండి!

Published Wed, Nov 20 2019 2:07 AM | Last Updated on Wed, Nov 20 2019 2:07 AM

Beauty Tips For Head Bath - Sakshi

నూనెతో మర్దన: గోరువెచ్చని కొబ్బరినూనె లేదా నువ్వులనూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత జుట్టుకంతా నూనె రాయాలి.

ఆవిరితో మెరుగు: టర్కీ టవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టాలి. దీంతో రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు చురుకు అవుతాయి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి. దీని వల్ల వెంట్రుకల రాలడం సమస్య తగ్గుతుంది.

ఆరబెట్టేదిలా: జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. మెత్తటి కాటన్‌ లేదా టర్కీ టవల్‌ని ఉపయోగించడమే మంచి మార్గం. తలకు టవల్‌ చుట్టి కాసేపు వదిలేయాలి. తడిని టవల్‌ పీల్చుకుని, జుట్టు పొడిగా అవుతుంది.

►జుట్టు మెరవాలని హెయిర్‌ స్ప్రేలు వాడకూడదు. వీటి వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి, మరింత పొడిబారుతాయి. వెంట్రుకలు చిట్లే సమస్య కూడా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి.

బ్యూటిప్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement