కలబంద ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ చాలా విన్నాం. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోవలోకి ఇపుడు మరో కొత్త రకం కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. ముదురు ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఈ రకంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ కలబంద ప్రయోజనాలు:
ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబంద ఎక్కువ ఔషధ గుణాలు, ప్రయోజనాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పోషకాలు: రెడ్ కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదట.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: ఎరుపు కలబంద ఆంథోసైనిన్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాని రంగు ఎర్రగా ఉంటుందని ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా భాటియా సారిన్ చెప్పారు. పర్యావరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి ఎరుపు కలబంద ఫేస్ సీరం ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ చర్మం యవ్వనాన్ని కాపాడుతుంది. ఈ సమ్మేళనాలు కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని. ఎర్ర కలబంద యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ మూలకాల శక్తివంతమైన మిశ్రమమని ఆమె తెలిపారు.
రోగనిరోధక శక్తికి: ఎర్ర కలబంద రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.
మేనికి మెరుపు : విటమిన్లు A, C , E చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా మారుస్తుంది. దీని ఆధారిత మాయిశ్చరైజర్ చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రెడ్ కలడంద జ్యూస్‌తో శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలిన గాయాలు, గాయాలు, సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది.
గుండెకు మేలు : ఎర్ర కలబంద జ్యూస్‌తో గుండె ఆరోగ్యం బలపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా మారడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment