దసరా సంబరాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకలకు అందరూ సిద్ధమైపోతున్నారు కూడా ముఖ్యంగా రకారకాల పిండివంటలు, తీపి వంటకాల తయారీలో బిజీగా ఉంటారు. ప్రతీదీ కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అందులోనూ ఈజీగా తయారు చేసుకొనేవైతే ఇంకా మంచిది. మరి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి!
దసరా,దీపావళి, సంక్రాంతి పండగులకు తయారు చేసుకునే వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా కజ్జికాయలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అటు హాట్ లాగా ఉంటుంది, ఇటు స్వీట్‌లాగా కూడా ఉంటుంది.
కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:
మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, నెయ్యి, పుట్నాలు, ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనె
కజ్జికాయల తయారీ
మైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
స్టఫింగ్ తయారీ
కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు.
లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు. (బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?)
ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్‌తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది.
ఇపుడు స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి.
ఇదీ చదవండి: World Tourism Day 2024: ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
Comments
Please login to add a commentAdd a comment