Kajjikayalu
-
Dussehra 2024 : కజ్జికాయలు.. ఈజీగా, హెల్దీగా!
దసరా సంబరాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకలకు అందరూ సిద్ధమైపోతున్నారు కూడా ముఖ్యంగా రకారకాల పిండివంటలు, తీపి వంటకాల తయారీలో బిజీగా ఉంటారు. ప్రతీదీ కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అందులోనూ ఈజీగా తయారు చేసుకొనేవైతే ఇంకా మంచిది. మరి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! దసరా,దీపావళి, సంక్రాంతి పండగులకు తయారు చేసుకునే వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా కజ్జికాయలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అటు హాట్ లాగా ఉంటుంది, ఇటు స్వీట్లాగా కూడా ఉంటుంది. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, నెయ్యి, పుట్నాలు, ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనెకజ్జికాయల తయారీమైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారీ కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు. (బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?)ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్‌తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది.ఇపుడు స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇదీ చదవండి: World Tourism Day 2024: ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి! -
బనానా – ఓట్స్‌తో వెరైటీగా కజ్జికాయలు.. ఓసారి ట్రై చేయండి
బనానా – ఓట్స్ కజ్జికాయలు తయారీకి కావల్సినవి: అరటిపండు గుజ్జు – 1 కప్పు ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – పావు కప్పు పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు సోయా పాలు – పావు కప్పు నూనె – 4 టేబుల్ స్పూన్లు మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించి.. అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. -
Recipe: బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా!
ఎప్పటిలా రొటీన్ కజ్జికాయలు కాకుండా వెరైటీగా ఈసారి బనానా – ఓట్స్‌తో ట్రై చేసి చూడండి. బనానా – ఓట్స్ కజ్జికాయలు కావలసినవి: ►అరటిపండు గుజ్జు – 1 కప్పు ►ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) ►కొబ్బరి కోరు – పావు కప్పు ►పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు ►సోయా పాలు – పావు కప్పు ►నూనె – 4 టేబుల్ స్పూన్లు ►మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ: ►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ►అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించాలి. ►అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. ►చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ►ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ►మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. చదవండి: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారీ ఇలా తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా.. -
Ganesh Chaturthi Recipes: కజ్జికాయలు తయారీ విధానం
కావలసినవి: నూనె – వేయించడానికి తగినంత మైదా – 500 గ్రా. నెయ్యి – ఆరు టేబుల్ స్పూన్లు ఫిల్లింగ్ కోసం... కోవా – 500 గ్రా. ఏలకుల పొడి – అర టీ స్పూన్ బాదంపప్పు – 25 గ్రా. కిస్మిస్ – 25 గ్రా ఎండు కొబ్బరి తురుము – 25 గ్రా పంచదార పొడి – 350 గ్రా. తయారుచేసే విధానం : ►మైదాలో నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి, ముద్ద చేయాలి. ►పలచని తడి క్లాత్‌లో చుట్టి ఉంచాలి. కోవాను చిదిమి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ►కోవా మిశ్రమంలో పంచదార, ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురుము వేసి, కలిపి, రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, చల్లారనివ్వాలి. ►మైదాపిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పూరీలా ఒత్తుకొని, అందులో కోవా మిశ్రమం ఉంచి, చివరలు మూసేయాలి. ►ఇలా గుజియాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత గుజియాలను వేసి, రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. నోట్: గుజియాలను తయారు చేయడానికి మార్కెట్లో మౌల్డ్‌లు లభిస్తాయి. -
Sankranthi: సున్నుండలు, పూతరేకులు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
Sankranti Special Food Items In Andhra: సంక్రాంతి... పండుగ సమీపిస్తోంది. అమ్మ పిండివంటలు చేసేందుకు సిద్ధమవుతోంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే వంటకాలను మనకోసం తయారు చేస్తుంది. మరి ఆ పనిలో మనం కూడా మనకు తోచిన సాయం చేయాలి కదా! ఎందుకు ఆలస్యం! ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదించాలనుకునే వారు సున్నండలు, కజ్జికాయలు, పూతరేకులను ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. సున్నుండలు కావలసినవి: మినప్పప్పు– పావు కేజీ, పెసరపప్పు– పావుకేజీ, బెల్లం– 400గ్రా., ఏలకుల పొడి– ఒక టీ స్పూను, నెయ్యి– 200గ్రా. తయారీ: మందపాటి బాణలిలో నూనె లేకుండా మినప్పప్పు, పెసరపప్పులను దోరగా వేయించుకుని పొడి చేయాలి ∙ఆ పొడిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి ∙అన్నీ సమంగా కలిసిన తరువాత కావలసిన సైజులో ఉండలు చేయాలి ∙నెయ్యి వాడకాన్ని తగ్గించాలనుకుంటే నేతిని పిండిలో కలపకుండా చేతికి కాస్త రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. గమనిక: మినప్పప్పు, పెసరపప్పులను విడిగా వేయించుకుంటే మంచిది లేదా ముందుగా మినప్పప్పు వేసి ఒక మోస్తరుగా వేగిన తరువాత పెసరపప్పును వేయాలి. కజ్జికాయలు కావలసినవి: మైదా పిండి లేదా గోధుమ పిండి – ఒక కేజి, నువ్వులు – ఒక కేజి, బెల్లం – 800గ్రా., ఏలకులు– 10 గ్రా., జీడిపప్పు– వందగ్రాములు నెయ్యి లేదా నూనె– వేయించడానికి కావలసినంత. తయారీ: ∙పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. మిగిలినవి సిద్ధం చేసుకునే లోపుగా ఇది బాగా నానుతుంది నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని చిన్న చిన్న రౌండ్లు చేసుకోవాలి. ఒక్కొక్క రౌండును ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచిలో పరిచి అందులో ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచిని మూత వేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది సాంచిలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి ‘సాంచి’ అంటే చెక్కతో చేసిన మౌల్డ్. ఇందులో పూరీని పెట్టి మడత వేస్తే అంచులు నొక్కుకుని పిండి అతుక్కుపోతుంది ∙లోపల పెట్టిన మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది ∙దీనికి బదులుగా వెనుక చక్రం ఉండే స్పూనులు కూడా ఉంటాయి ∙వాటిని కూడా వాడవచ్చు. గమనిక: కజ్జికాయలను నేతిలో వేయిస్తే రుచి పెరుగుతుంది కాని, కజ్జికాయలు త్వరగా మెత్తబడతాయి ∙ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నూనెతో చేసుకోవడం మంచిది. పూతరేకులు కావలసినవి: చక్కెర లేదా బెల్లం– ఒక కేజి, సగ్గుబియ్యం– ముప్పావు కేజి, జీడిపప్పు– పావుకేజి, బాదంపొడి–100 గ్రా, ఏలకులు– 50గ్రా., నెయ్యి– 100 గ్రా. తయారీ: తెల్లగా, మెత్తగా చూడగానే నోరూరుతూ పూతరేకులు చుట్టడం సులభమే కాని అందుకోసం రేకులను తయారు చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఇందుకు ప్రత్యేకంగా కుండలు దొరుకుతాయి ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాల ∙కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత సగ్గుబియ్యం గంజిలో ముంచిన క్లాత్‌ను పరిచి తీసేయాలి ∙గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది ఆ పొర విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్ చేసుకోవాలి ∙ఇందుకు కాటన్ క్లాత్‌ను వాడాలి ∙చక్కెర, జీడిపప్పు, ఏలకులను పొడి చేసి కలుపుకోవాలి ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యిరాసి ఆ పైన చక్కెర లేదా బెల్లం పొడి, జీడిపప్పు, బాదం పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి ఎక్కువ మోతాదులో రేకులను తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర లేదా బెల్లంపొడి మిశ్రమాన్ని వేసి తాజాగా రేకులను చుట్టుకోవచ్చు. -
యమ డిమాండ్.. ఓ సారి టేస్ట్ చూడండి
పెనుగొండ పేరు చెబితే వెంటనే గుర్తొకొచ్చేది వాసవీమాత ఆలయం. దాంతోపాటే ఈ ఊరుకు మరో ‘తీపి గుర్తు’ ఉంది. అదే నోరూరించే కమ్మని కజ్జికాయ. ఇక్కడ తయారయ్యే ఈ స్వీటుకు ఖండాంతరఖ్యాతి దక్కింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కజ్జికాయను మళ్లీమళ్లీ తినాలని తపించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. పెనుగొండ: బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూత రేకులు.. వీటి కోవలోకే వెళ్తుంది పెనుగొండ కజ్జికాయ కూడా. కొబ్బరి కోరుతో తయారయ్యే ఈ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. తొలుత ఓ సామాన్య వ్యాపారి తయారు చేసిన ఈ తీపి పదార్థం ఇప్పుడు గొప్పింటి వివాహ వేడుకల్లో సందడి చేస్తోంది. రాజకీయ పారీ్టల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు సంపాదించి ఔరా అనిపిస్తోంది. విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. ఈ ప్రాంత వాసులు బంధువులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. అంతలా జనజీవితంలో భాగమైపోయింది ఈ స్వీటు. దీనిని చూడగానే హహ్హహ్హ కజ్జికాయ.. నాకే ముందు అంటూ ఎగబడని భోజనప్రియులు ఉండరు. (చదవండి: కడలిపై.. హాయి హాయిగా..) ఇతర ప్రాంతాలకూ విస్తరణ ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లోనూ పెనుగొండ వారి కజ్జికాయ అంటూ స్వీటు దుకాణాలు విరివిగా వెలుస్తున్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తణుకు లాంటి ప్రాంతాల్లో సంప్రదాయ స్వీటు దుకాణాల్లో పెనుగొండ వారి కజ్జికాయ అంటూ ప్రతేక ఆకర్షణతో అమ్మకాలు సాగిస్తున్నారు. వీరిలో కొంతమంది నిత్యం పెనుగొండ నుంచే తీసుకొని వెళ్లి అమ్ముతున్నారు. 45 ఏళ్లకు పైగా.. పెనుగొండ కజ్జికాయకు నలభై ఐదేళ్లకుపైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీటు పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేకంగా తయారు చేసి పేరు సంపాదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు తర్వాత ఆయన కుమారులు కజ్జికాయకు మరింత వన్నె తెచ్చారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే చేసే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రైఫ్రూట్స్‌ను మిళితం చేసి మరింత రుచిగా, సుచిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కజ్జికాయను కనీసం కేజీ తీసుకోవాలన్నా ముందుగా ఆర్డరు చేసుకోవలసిందే. అంతటి యమ డిమాండ్ మరి..! మీరూ ఓ సారి టేస్ట్ చూడండి.. -
నువ్వుల్.. నవ్వుల్
‘పండుగ రోజు నువ్వులుండాలి!’ ‘అదేంటండీ! పండుగ రోజు ఉండాల్సింది నవ్వులు కదండీ!’ ‘అరే! నువ్వులుంటే... నవ్వులుంటాయ్రా భాయ్’ ‘చెవిలో పువ్వులుండవా?’ ‘ద్వారానికి పువ్వులు... ఇంట్లో పిండి వంటలు... వాటిలో నువ్వులు... ఇంటిల్లపాదీ ఆరోగ్యాల నవ్వులు...’ ‘భలేగా పిండికొట్టి మరీ చెప్పావోయ్! పిండివంటల్లో నువ్వులుంటే... ఆరోగ్యాల నవ్వులన్నమాట!’ నువ్వుల కజ్జికాయలు కావల్సినవి: మైదా/గోధుమపిండి – కేజీ, నువ్వులు – కేజీ, బెల్లం – 800 గ్రాములు, ఏలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – వంద గ్రాములు, నెయ్యి/నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా పిండిని మెత్తగా చపాతీలకు కలుపుకున్నట్టు కలుపుకొని, పక్కన ఉంచాలి. నువ్వులను దోరగా వేయించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. ∙పిండిని పూరీ చేయడానికి తగినంత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక్కొక్క ఉండను ఒత్తాలి. దానిని మౌల్డ్‌లో లేదా చేతి మీద వేసుకొని నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని పెట్టాలి. తర్వాత చివర్లను మూసివేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది. ఇలా చేసుకున్న అన్ని కజ్జికాయలను కాగుతున్న నూనెలో వేసి, దోరగా వేగనివ్వాలి. కజ్జికాయలు చేయడానికి మౌల్డ్, వెనుక చక్రం ఉండే స్పూనులను వాడచ్చు. సకినాలు కావల్సినవి: బియ్యం– కప్పు, వాము – టీ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత తయారీ: రాత్రిపూట బియ్యం కడిగి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే నీళ్లు వంపేసి, బియ్యాన్ని పిండి చేయాలి. ఈ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. అలాగే దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా చేయాలి. ఈ పిండి చేత్తో పట్టుకుంటే మృదువుగా ఉండాలి. శుభ్రమైన కాటన్ క్లాత్‌ని పరిచి, పిండి తీసుకొని చేత్తోనే చక్రాల్లా చుట్టాలి. పది, పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించి, తీయాలి. నువ్వుల ఉండలు కావల్సినవి: నువ్వులు – అర కిలో, బెల్లం – 400 గ్రాములు, ఏలకుల పొడి – టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ: తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ నువ్వుల ఉండలకు వాడచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు పోయేటట్లు చేసుకోవాలి. లేదంటే అలాగే కూడా వాడుకోవచ్చు. నువ్వులను వేయించి పొడి చేయాలి. కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి. లేదా కాస్త పలుకుగా ఉండేట్లు దంచాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి – రెండూ కలిసే వరకు రోట్లో దంచాలి. చేతికి నెయ్యి రాసుకుని కావల్సిన సైజులో ఉండలు చేయాలి. కావాలంటే నువ్వులలో వేరుసెనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని విడిగా వేయించి, పొడి చేసి కలపాలి. అరిసెలు కావల్సినవి: బియ్యం– కేజీ, బెల్లం – 800 గ్రాములు, నువ్వులు – తగినన్ని, నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత తయారి: ∙అరిసెలు చేయడానికి ముందు రోజు నుంచే కావల్సినవి సిద్ధం చేసుకోవాలి. బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను ఒంపేసి, తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. ఈ పిండి ఆరిపోకుండా, గాలి తగలకుండా ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్ద పాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాక మరగనిచ్చి, బియ్యప్పిండి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ∙బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకం పిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్టు నిమ్మకాయంత ముద్దలు తీసుకొని నువ్వులలో అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. అప్పుడు పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి దోరగా రెండువైపులా వేయించాలి. తర్వాత తీసి అరిసెల పీట మీద వేసి, నూనె కారిపోయేటట్లు ఒత్తాలి. అరిసెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు ఒత్తేయవచ్చు. అరిసె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడు బియ్యప్పిండి కలుపుకోవాలి.గట్టిగా, ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకాన్ని ముదరనివ్వాలి. ∙ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూన్‌తో కొద్దిగా తీసుకొని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. ఆ రౌండ్‌ని పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ రౌండ్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చేదాకా మరగనివ్వాలి. ఇలా చేసుకున్న అరిసెలు 15 రోజుల వరకు ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్నని సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిసెలాగ వేడిగా, మెత్తగా వస్తాయి. జంతికలు, కారప్పలు కావల్సినవి: బియ్యప్పిండి – 3 కప్పులు, సెనగపిండి – కప్పు, పుట్నాల పప్పు∙– పావు కప్పు, వెన్న – పావు కప్పు (కరిగించాలి), కారం – టీ స్పూన్, ఉప్పు – తగినంత, నువ్వులు– 2 టీ స్పూన్లు, జీలకర్ర– టీ స్పూన్, నూనె – తగినంత తయారీ: ∙పుట్నాల పప్పు వేయించి, పొడి చేయాలి. బియ్యప్పిండి, సెనగపిండి, పుట్నాల పప్పు పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, పిండి ముద్ద చేయాలి. పిండి మృదువుగా అయ్యేంత వరకు కలపాలి. ∙జంతికల అచ్చులో పిండి పెట్టి, పేపర్ మీద మురుకులు ఒత్తి, నూనెలో వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. (పైవన్నీ కలిపి, పూరీలా చేసి, నూనెలో రెండువైపులా కాల్చి తీస్తే కారప్పలు సిద్ధం.)