Best Oats Recipes: How To Prepare Banana Oats Kajjikayalu Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Banana Oats Kajjikayalu: బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా!

Published Mon, Feb 6 2023 3:12 PM | Last Updated on Mon, Feb 6 2023 5:28 PM

Banana Oats Kajjikayalu Recipe In Telugu - Sakshi

ఎప్పటిలా రొటీన్‌ కజ్జికాయలు కాకుండా వెరైటీగా ఈసారి బనానా – ఓట్స్‌తో ట్రై చేసి చూడండి.
బనానా – ఓట్స్‌ కజ్జికాయలు
కావలసినవి:  
►అరటిపండు గుజ్జు – 1 కప్పు
►ఓట్స్‌ పౌడర్‌ – అర కప్పు (1 టేబుల్‌ స్పూన్‌  నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి)
►కొబ్బరి కోరు – పావు కప్పు

►పంచదార పొడి  2 టేబుల్‌ స్పూన్లు
►సోయా పాలు – పావు కప్పు
►నూనె – 4 టేబుల్‌ స్పూన్లు
►మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా

తయారీ:
►ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి.
►అందులో కొబ్బరికోరు, ఓట్స్‌ పౌడర్‌ వేసుకుని దోరగా వేయించాలి.
►అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి.

►చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి.
►ఈలోపు మైదాపిండిలో  2 టేబుల్‌ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి.
►మధ్యలో బనానా–ఓట్స్‌ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. 

చదవండి: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్‌ తయారీ ఇలా
 తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement